ప్రాథమిక విధులు రాజ్యం, సమాజం, ఇతర వ్యక్తుల పట్ల వ్యక్తికి ఉండే బాధ్యతలను తెలియజేస్తాయి. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-A నిబంధనలో వీటిని చేర్చారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 42 వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను చేర్చారు. 86 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా మరో ప్రాథమిక విధిని చేర్చడంతో, వీటి సంఖ్య 11 కు చేరింది. జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ (1998) సిఫారసుల మేరకు 'జనవరి 3 ను ప్రాథమిక విధుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* 51-(A) (a): రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి. రాజ్యాంగ సంస్థలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
(b): స్వాతంత్య్రోద్యమాన్ని ఉత్తేజపరచిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి, అనుసరించాలి.
(c): దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను గౌరవించాలి, కాపాడాలి.
(d): దేశ రక్షణకు, జాతీయ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
(e): భారత ప్రజల మధ్య సోదరభావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలి. మతం, భాష, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా ఉండాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను విడనాడాలి.
(f): మన వారసత్వ సమష్టి సంస్కృతి (భిన్నత్వంలో ఏకత్వం) గొప్పతనాన్ని గౌరవించాలి, కాపాడాలి.
(g): అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులను కాపాడాలి, ఇతర జీవుల పట్ల దయ ఉండాలి.
(h): శాస్త్రీయ, మానవతా దృక్పథం, పరిశీలనా దృక్పథం, సంస్కరణ దృక్పథల పట్ల సానుకూలతను పెంపొందించుకోవాలి.
(i): ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి, హింసను విడనాడాలి.
(j): అన్ని రంగాలలో వ్యక్తిగత, సమష్టి కార్యకలాపాల ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి.
(k): 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల విద్యార్జనకు తగిన అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉంటుంది.
* అయితే ప్రాథమిక విధులు న్యాయ అర్హమైనవి కావు. అందువల్ల వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* క్లుప్తంగా చెప్పాలంటే... ఆదేశ సూత్రాలు ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు, ప్రాథమిక విధులు ప్రజలకు నిర్దేశించిన బాధ్యతలు.
ప్రాథమిక విధులు
Posted Date : 11-11-2020
కానిస్టేబుల్స్ : మెయిన్స్
పాత ప్రశ్నపత్రాలు
- తెలంగాణ కానిస్టేబుల్స్ మెయిన్స్ 2023 ప్రశ్నపత్రం, కీ
- టీఎస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - 28-08-2022
- టీఎస్ పోలీసు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష
- టీఎస్ పోలీసు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష
- టీఎస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - 28-08-2022
విద్యా ఉద్యోగ సమాచారం
- APPSC: డీవైఈవో పరీక్ష వాయిదా
- DSC Book Fund: డీఎస్సీ అభ్యర్థులకు బుక్ ఫండ్
- Latest Current Affairs: 27-03-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 27-03-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- TS Tenth: ‘ఈనాడు-ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచే పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నలు!
- Latest Govt Jobs : తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు
నమూనా ప్రశ్నపత్రాలు
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ 2 - 2022
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ 3 - 2022
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 1 2022
- ఎస్సై మోడల్ పేపర్ 1 - 2022
- ఎస్సై మోడల్ పేపర్ 2 - 2022