• facebook
  • whatsapp
  • telegram

పంచాయతీరాజ్ వ్యవస్థ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో..... విద్యుక్త అంశాలు ఉన్నాయి.
జవాబు: 29
 

2. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎక్కడ స్థాపించారు?
జవాబు: మద్రాసు
 

3. భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలు?
జవాబు: 18
 

4. 1992లో 73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన కొత్త భాగం?
జవాబు: 9
 

5. రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిటన్ ప్రదేశంలో ఎంత జనాభా ఉండాలి?
జవాబు: 10 లక్షల పైన
 

6. రాష్ట్రంలో పల్లె ప్రాంతాన్ని నగర ప్రాంతంగా మార్చేది...
జవాబు: నగర పంచాయత్
 

7. మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేది?
జవాబు: రాష్ట్ర ఎన్నికల సంఘం
 

8. మున్సిపాలిటీలో ప్రతి వార్డు జనాభా .... ఉండాలి.
జవాబు: 3 లక్షలు ఆపైన
 

9. గ్రామ పంచాయతీలోని పల్లెల్లో ఎలక్ట్రోరల్ రోల్స్‌లో ఉండేవారిని ఏమంటారు?
జవాబు: గ్రామ సభ
 

10. భారతదేశ స్థానిక స్వపరిపాలనా పితామహుడిగా పేరుగాంచింది ఎవరు?
జవాబు: లార్డ్ రిప్పన్
 

11. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన షెడ్యూల్ ఏది?
జవాబు: షెడ్యూల్ XII
 

12. పంచాయతీ వ్యవస్థాపనకు సంబంధించిన అధికరణ ఏది?
జవాబు: ఆర్టికల్ 243 B
 

13. రాజ్యాంగంలోని అధికరణ 243 D పంచాయతీలకు కల్పించేది...
జవాబు: సీట్ల రిజర్వేషన్
 

14. పంచాయతీ మెంబర్లను అనర్హులుగా ప్రకటించే అధికరణం ఏది?
జవాబు: ఆర్టికల్ 243 F
 

15. రాజ్యాంగంలోని 73వ సవరణ‌ను ఏ విభాగంలో పొందుప‌రిచారు?
జవాబు: IXవ భాగం
 

16. పంచాయతీలు అమలు పరచాల్సిన అధికారాలు ఏ షెడ్యూల్‌లో ఉన్నాయి?
జవాబు: XI
 

17. పంచాయతీలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించే అధికరణం ఏది?
జవాబు: ఆర్టికల్ 243 H
 

18. రాజ్యాంగంలో విభాగం IXA ని పొందుపరిచిన రాజ్యాంగ సవరణ ఏది?
జవాబు: 74వ సవరణ
 

19. మున్సిపాలిటీలో వార్డు కమిటీ ఏర్పాటును సూచించే అధికరణ ఏది?
జవాబు: ఆర్టికల్ 243 S
 

20. కిందివాటిలో ఏ నిబంధన దేశ రాజధాని ఢిల్లీకి వర్తించదు?
1) ఆర్టికల్ 243 ZD     2) ఆర్టికల్ 243 ZC        3) ఆర్టికల్ 243 ZB     4) ఆర్టికల్ 243 ZA
జవాబు: ఆర్టికల్ 243 ZD
 

21. 74వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు?
జవాబు: 1992
 

22. స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన VII షెడ్యూల్‌లోని ఏ జాబితా కిందికి వస్తుంది?
జవాబు: జాబితా II
 

23. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రథమంగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జవాబు: రాజస్థాన్
 

24. కిందివాటిలో గ్రామ పంచాయతీ ఏర్పాటును తెలిపే అధికరణం ఏది?
1) ఆర్టికల్ 39 A          2) ఆర్టికల్ 40          3) ఆర్టికల్ 41         4) ఆర్టికల్ 42
జవాబు: ఆర్టికల్ 40
 

25. గ్రామ పంచాయతీ ఏర్పాటు ఒక ఆదేశ సూత్రం. దీనికి సంబంధించి కిందివాటిలో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ ఏది?
1) 73, 74 రాజ్యాంగ సవరణలు                2) 62, 64 రాజ్యాంగ సవరణలు
3) 60, 61 రాజ్యాంగ సవరణలు                4) పైవన్నీ
జవాబు: 73, 74 రాజ్యాంగ సవరణలు
 

26. పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణంలో పొందుపరిచారు?
జవాబు: 243వ అధికరణ
 

27. 73వ రాజ్యాంగ సవరణ ఎన్ని అంచెల పంచాయతీ విధాన ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది?
జవాబు: 3
 

28. కంటోన్మెంట్ బోర్డు కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు?
జవాబు: భారత రాష్ట్రపతి
 

29. జిల్లా ప్రణాళికా కమిటీలు మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీల నియామకానికి సంబంధించిన అధికారం వరుసగా కింది ఏ రాజ్యాంగ ప్రకరణల్లో ఉంది?
1) 243 ZA ప్రకరణం, 243 ZC ప్రకరణం           2) 243 ZD ప్రకరణం, 243 ZE ప్రకరణం
3) 243 ZA ప్రకరణం, 243 K ప్రకరణం             4) 243 ZG ప్రకరణం, 243 ZC ప్రకరణం
జవాబు: 243 ZD ప్రకరణం, 243 ZE ప్రకరణం

30. 1996 పెసా (PESA) చట్టం ఏర్పాటును సిఫారసు చేసిన కమిషన్ ఛైర్మన్ ఎవరు?
జవాబు: దిలీప్‌సింగ్ బూరియా
 

31. పంచాయతీ ఖాతాల నిర్వహణ తనిఖీలకు సంబంధించిన నిబంధనలను రూపొందించేది ఏది?
జవాబు: రాష్ట్ర శాసనసభ
 

32. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణలో ఏ స్థానిక సంస్థకు పార్టీరహితంగా ఎన్నికలు నిర్వహిస్తారు?
జవాబు: గ్రామ పంచాయతీ
 

33. చట్ట ప్రకారం క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీల ఆడిట్ నిర్వహించేది ఎవరు?
జవాబు: స్టేట్ ఆడిట్ సంచాలకులు
 

34. కిందివాటిలో పంచాయతీరాజ్ సంస్థ కానిదేది?
1) గ్రామసభ        2) గ్రామ పంచాయతీ       3) జిల్లాపరిషత్        4) గ్రామ సహకారసంస్థ
జవాబు: గ్రామ సహకారసంస్థ
 

35. గ్రామ పంచాయతీలు విధించే, వసూలు చేసే పన్ను ఏది?
జవాబు: ఇంటి పన్ను
 

36. కిందివాటిలో గ్రామ పంచాయతీల ప్రధాన విధుల్లో లేనిది ఏది?
1) తాగునీటి సరఫరా                  2) పారిశుద్ధ్య నిర్వహణ
3) తక్కువ వడ్డీకి రుణాలు         4) వీధి దీపాల నిర్వహణ
జవాబు: తక్కువ వడ్డీకి రుణాలు
 

37. గ్రామసభ నిర్వహించాలంటే కోరం ఎంత ఉండాలి?
జవాబు: కోరం నిర్దేశించలేదు
 

38. గ్రామంలో వీధికుక్కలను నివారించే బాధ్యత ఎవరిది?
జవాబు: గ్రామ పంచాయతీ
 

39. పంచాయతీరాజ్ ప్రధాన లక్ష్యం ఏమిటి?
జవాబు: ప్రజలను అభివృద్ధి పాలనలో భాగస్వాములను చేయడం
 

40. పంచాయతీరాజ్ సంస్థల ఉనికి లేని రాష్ట్రం ఏది?
జవాబు: నాగాలాండ్

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌