1. ద్రవ్య ఆవిర్భావానికి పూర్వం ఆర్థిక వ్యవహారాలు అమల్లో ఉన్న పద్ధతి -
జ: వస్తు మార్పిడి పద్ధతి
2. 'ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం' అని అన్నదెవరు?
జ: వాకర్
3. కిందివాటిలో చట్టబద్ధ ద్రవ్యాన్ని జారీ చేసేది?
1) కేంద్ర బ్యాంకు 2) వాణిజ్య బ్యాంకు 3) విదేశీ బ్యాంకు 4) ఏదీకాదు
జ: 1 (కేంద్ర బ్యాంకు)
4. కిందివాటిలో ఐచ్ఛిక ద్రవ్యం ఏది?
1) బాండ్లు 2) సెక్యూరిటీలు 3) చెక్కులు 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
5. కిందివాటిలో అధిక ద్రవ్యత్వం ఉన్నదేది?
1) బంగారం 2) వెండి 3) షేర్లు 4) 1000 రూపాయల నగదు
జ: 4 (పైవన్నీ)
6. బ్యాంకులు సృష్టించే ద్రవ్యం -
జ: పరపతి ద్రవ్యం
7. కిందివాటిలో ఆర్థిక వ్యవహారాల అమలుకు సాధనమయ్యే ద్రవ్యం విధి?
1) వినిమయ మాధ్యమం 2) విలువల కొలమానం 3) విలువల నిధి 4) విలువల బదిలీ
జ: 1) వినిమయ మాధ్యమం
8. ద్రవ్య విధులను చలన, నిశ్చల విధులుగా ఎవరు వర్గీకరించారు?
జ: పాల్ ఐంజంగ్
9. M1లో లేని అంశాలు
1) కరెన్సీ 2) డిమాండ్ డిపాజిట్లు 3) ఆర్బీఐ వద్ద ఇతర డిపాజిట్లు 4) పోస్టాఫీసు డిపాజిట్లు
జ: 4) పోస్టాఫీసు డిపాజిట్లు
10. కిందివాటిలో అధిక ద్రవ్యత్వం ఉన్నది-
1) M1 2) M2 3) M3 4) M4
జ: 1 (M1)
11. నారోమనీ (సంకుచిత ద్రవ్యం) దేనికి చెందింది?
జ: M1
12. కిందివాటిలో దేన్ని 'విశాలద్రవ్య కొలమానం'గా పిలుస్తారు?
1) M1 2) M2 3) M3 4) M4
జ: 3 (M3)
13. కిందివాటిలో అతి తక్కువ ద్రవ్యత్వం ఉన్నదేది?
1) M1 2) M2 3) M4 4) M3
జ: 3 (M4)
14. కిందివాటిలో బ్రాడ్మనీ అని దేనికి పేరు?
1) M1 2) M2 3) M4 4) M3
జ: 3 (M4)
15. అధిక శక్తి ఉండే ద్రవ్యాన్ని జారీ చేసేది?
జ: ఆర్బీఐ