మోడల్ - 1
* వృత్తాకార అమరికకు సంబంధించి
i) వ్యక్తులు వృత్త కేంద్రం వైపు కూర్చుంటే
ii) వ్యక్తులు వృత్త కేంద్రానికి అభిముఖంగా కూర్చుంటే
1. ఆరుగురు మిత్రులు M, N, O, P, Q, R లు ఒక వృత్తంపై వృత్త కేంద్రం వైపు కింది విధంగా ఉన్నారు.
i) O, P ల మధ్య N నిల్చున్నాడు ii) O, Q ల మధ్య M నిల్చున్నాడు iii) R, P లు పక్కపక్కన నిల్చున్నారు
అయితే M, R ల మధ్య ఎవరు నిల్చున్నారు?
వివరణ: పై దత్తాంశాన్ని అనుసరించి
పై పటం ఆధారంగా M, R ల మధ్య Q నిల్చున్నాడు.
2. P, Q, R, S, T లు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. R అనే వ్యక్తి P కు కుడివైపున ఉన్నాడు, S కు ఎడమ నుంచి రెండో వ్యక్తి. T అనే వ్యక్తి P, S ల మధ్య కూర్చోలేదు. R కు ఎడమవైపున కూర్చున్న రెండో వ్యక్తి ఎవరు?
వివరణ: పై దత్తాంశాన్ని చిత్రీకరించగా

పటం ఆధారంగా,
∴ R కు ఎడమ వైపు నుంచి రెండో వ్యక్తి Q.
మోడల్ - 2
* చతురస్ర అమరికకు సంబంధించి
i) వ్యక్తులు చతురస్ర కేంద్రం వైపు కూర్చుంటే
ii) చతురస్ర కేంద్రానికి అభిముఖంగా కూర్చుంటే
1. K, L, M, P, Q, R, S, T లు ఒక చతురస్రాకార బల్ల చుట్టూ కింది విధంగా కూర్చున్నారు.
i) చతురస్ర మూలల వద్ద ఉన్న వ్యక్తులు చతురస్ర కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నారు.
ii) చతురస్ర భుజాల మధ్య ఉన్న వ్యక్తులు చతురస్ర కేంద్రం వైపు కూర్చున్నారు.
iii) P అనే వ్యక్తి S కు కుడివైపు నుంచి మూడో వ్యక్తి, చతురస్ర కేంద్రానికి అభిముఖంగా కూర్చున్నాడు.
iv) Q అనే వ్యక్తి M కు ఎడమవైపు నుంచి మూడో వ్యక్తి. M చతురస్ర భుజం మధ్యలో కూర్చోలేదు.
v) Q, R ల మధ్య ఒక వ్యక్తి కూర్చున్నాడు. R అనే వ్యక్తి M పక్కన కూర్చోలేదు.
vi) T అనే వ్యక్తి చతురస్ర కేంద్రం వైపు కూర్చున్నాడు.
vii) K అనే వ్యక్తి R పక్కన కూర్చోలేదు. అయితే Q, R ల మధ్య ఎవరు కూర్చున్నారు?
వివరణ: ఇచ్చిన దత్తాంశాన్ని చిత్రీకరించగా
పై పటం నుంచి P అనే వ్యక్తి Q, R ల మధ్య కూర్చున్నాడు.
మోడల్ - 3
* ఒక వరుస ఆధారిత అమరిక ప్రశ్నలు
1. ఒక గ్రూప్ ఫొటోలో కుమారుడి తండ్రి అతడికి ఎడమవైపు; కుమారుడి తాతకు కుడివైపున కూర్చున్నాడు. కుమారుడి తల్లి, ఆమె కుమార్తెకు కుడివైపున; అతడి తాతకు ఎడమవైపున కూర్చున్నారు. అయితే ఆ ఫొటో మధ్యలో కూర్చున్న వారెవరు?
వివరణ: ఇచ్చిన దత్తాంశాన్ని చిత్రీకరించగా
పటం ఆధారంగా ఫొటోలో మధ్యలో కూర్చున్నవారు తాత.
మోడల్ - 4
* రెండు వరుసల ఆధారిత అమరికకు సంబంధించిన ప్రశ్నలు.
1. P, Q, R, S, T, U లు రెండు వరుసల్లో కూర్చున్నారు. వారిలో కొందరు ఉత్తర దిక్కుకు, మరికొందరు దక్షిణ దిక్కుకు అభిముఖంగా కింది విధంగా కూర్చున్నారు.
i) Q అనే వ్యక్తి ఉత్తరం వైపు కూర్చున్నాడు. కానీ S పక్కన కూర్చోలేదు.
ii) S, U లు కర్ణాలకు అభిముఖంగా కూర్చున్నారు.
iii) R అనే వ్యక్తి U పక్కన దక్షిణం వైపు కూర్చున్నాడు.
iv) T అనే వ్యక్తి ఉత్తరం వైపు కూర్చున్నాడు. అయితే P, U ల మధ్య ఎవరు కూర్చున్నారు?
వివరణ: పై దత్తాంశాన్ని చిత్రీకరించగా
∴ P, U ల మధ్య R అనే వ్యక్తి కూర్చున్నాడు.
రచయిత: జేవీఎస్ రావు