• facebook
  • whatsapp
  • telegram

భిన్న పరీక్ష - ఆల్ఫాబెట్‌లు

 ఇచ్చిన పదాలు లేదా అక్షరాల్లో ఒకటి మాత్రమే భిన్నంగా ఉంటుంది. అదే కావాల్సిన సమాధానం.
1. ఎ) ZW బి) TQ సి) SP డి) NL
జ: NL
వివరణ:
ఆల్ఫాబెటిక్ అక్షరాల విలువలను నేర్చుకుంటే, ఈ విభాగంలోని ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు.
 
దీంట్లో ముందు అక్షరం విలువ నుంచి 3 తీసేస్తే తర్వాత అక్షరం వస్తుంది. కానీ, NL లో భేదం 2 (14-12) గా ఉంది. కాబట్టి ఇది భిన్నమైంది.

2. ఎ) CFD బి) GJH సి) KNM డి) JNK
జ: KNM
వివరణ: దీంట్లో ముందు అక్షరం విలువకు 3 కలిపితే రెండో అక్షరం, రెండో అక్షరం నుంచి 2 తీసేస్తే తర్వాత అక్షరం వస్తాయి. కానీ, KNM ఈవిధంగా లేదు. కాబట్టి ఇది భిన్నమైంది.

3. ఎ) KLM బి) ABC సి) DEF డి) RST
జ: RST
వివరణ: ముందు అక్షరం విలువకు 1 కలిపితే తర్వాత అక్షరం వస్తుంది.
 అన్ని అక్షరాలూ ఇదేవిధంగా అమరి ఉన్నాయి. కానీ, పైన ఇచ్చిన టేబుల్‌ను గమనిస్తే RST అనే అక్షరాలు రెండో సగభాగంలో ఉన్నాయి.

4. ఎ) BD బి) CI సి) DP డి) EV
జ: EV
వివరణ: ఈ అమరికలో ముందు అక్షరం విలువను వర్గం చేస్తే రెండో అక్షరం వస్తుంది. కానీ, 
EV లో E  5   5 × 5 = 25 = Y . రెండో అక్షరం Y ఉండాలి.
కాబట్టి ఇది భిన్నమైంది.

5.  ఎ) AA బి) BB సి) EEEEE డి) DDDD
జ: AA
వివరణ: వీటిలో AA కాకుండా మిగిలినవాటిలో అక్షరం విలువ ఎంత ఉందో ఆ అక్షరాన్ని అన్నిసార్లు రాశారు.

6. ఎ) BO బి) AN సి) DW డి) CP
జ: DW
వివరణ: మొదటి, రెండో అక్షరాల మధ్య వ్యత్యాసం 13 ఉంది. కానీ, DW లో భేదం 19 (23 - 4) ఉంది. కాబట్టి DW భిన్నమైంది.

7.  ఎ) ABC        బి) BCD          సి) CDE       డి) DEF
జ: BCD
వివరణ: అన్ని అమరికల్లోని అక్షరాల విలువలు క్రమంగా పెరిగాయి. Vowles ఆధారంగా చూస్తే 
BCD లో vowel లేదు. కాబట్టి ఇది భిన్నమైంది.

8.   ఎ) PRT     బి) MOQ       సి) GEC       డి) TVX
జ: GEC
వివరణ: ఈ అమరికలో ప్రతి ముందు అక్షరానికి 2 కలిపితే తర్వాత అక్షరం వస్తుంది. కానీ, GEC లో 2 తీసేశారు. కాబట్టి భిన్నమైంది GEC .

9. ఎ) LO బి) MN సి) GT డి) FV
జ: FV
వివరణ: టేబుల్‌ను గమనిస్తే, ప్రతి జత అక్షరాల్లో మొదటిదానికి రెండోది వ్యతిరేక స్థానం ఉంది.
వ్యతిరేకంగా 
L  O 
M  N 
G  T 
F  U కానీ, దీని స్థానంలో V ఉంది. కాబట్టి ఇది భిన్నమైంది.

10.  ఎ) QT : RS      బి) LP : MO      సి) BG : CF     డి) VZ : XY
జ: VZ : XY
వివరణ: మొదటి అక్షరాల జతలోని ముందు అక్షరానికి 1 కలిపి, రెండో అక్షరం నుంచి 1 తీసేస్తే రెండో జత వస్తుంది. కానీ, VZ : YZ లో ఈవిధంగా లేదు.
    కాబట్టి ఇది భిన్నమైంది. 
                     

11.  ఎ) LMN      బి) LKJ    సి) UTS     డి) FED
జ: LMN
వివరణ: LMN లో అక్షరాల విలువలు పెరిగే క్రమంలో ఉండగా, LKJ, UTS, FED ల్లో తగ్గే క్రమంలో ఉన్నాయి. కాబట్టి భిన్నమైంది LMN.

12.  ఎ) Shirt - Dress     బి) Boy - Girl      సి) Mango - Fruit     డి) Table - furniture
జ: Boy - Girl
వివరణ: ఇచ్చిన పదాల జతల్లో రెండోది, మొదటి పదంలో భాగంగా ఉంది. 
Shirt అనేది Dress లో భాగం. 
Mango అనేది Fruit లో భాగం. 
Table  అనేది Furniture లో భాగం.
Boy, Girl అనేవి రెండూ భిన్నమైన పదాలు. 

13. ఎ) SORE      బి) SOTLU      సి) NORGAE     డి) MEJNIAS
జ: NORGAE
వివరణ: ప్రతి పదంలోని అక్షరాలను ఒక క్రమంలో రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి.
Sore   Rose
Sotlu  Lotus
Norgae  Orange
Mejnias  

 Jasmine
Orange తప్ప మిగిలినవన్నీ పుష్పాలు. కాబట్టి భిన్నమైంది Orange.

14.  ఎ) JOT   బి) OUT    సి) FED    డి) DIN
జ: OUT
వివరణ: అన్ని పదాల్లో ఒక Vowel మాత్రమే ఉంది. కానీ, Out లో రెండు vowles ఉన్నాయి. కాబట్టి భిన్నమైంది ఇదే అవుతుంది.

15. ఎ) PUT    బి) END     సి) OWL    డి) ARM
జ: PUT
వివరణ: ఆప్షన్లలో ఇచ్చిన ప్రతి పదం Vowlelతో ప్రారంభమైంది. Put మాత్రమే ఈవిధంగా లేదు. కాబట్టి భిన్నమైంది ఇదే.

16. ఎ) EBD బి) IFH  సి) QNO డి) YVX
జ: QNO
వివరణ: ఇచ్చిన ప‌దాల్లోని మొద‌టి, చివ‌రి స్థానాల్లో వ‌రుస అక్షరాలు ఉన్నాయి.
EBD  D,E
IFH   H,I
QNO   O,Q
YVX  XY
QNO లో O తర్వాత P ఉండాలి. కానీ, Q ఉంది. కాబట్టి ఇది భిన్నమైంది.

17. ఎ) RNJ బి) XTP  సి) MIE డి) ZWR
జ: ZWR
వివరణ: దీంట్లో ప్రతి పదంలోని ముందు అక్షరం విలువ నుంచి 4 తీసేస్తే తర్వాత అక్షరాలు వస్తాయి.
18 14 10       -4  -4
R N J  R N J
24 20 16       -4  -4
X T P  X T P
13  9 5            -4 -4
M I E  M I E
26 23 18         -3    -5
Z W R  Z W R
ZWR లో ఈవిధంగా లేదు. కాబట్టి ఇది భిన్నమైంది.

18.  ఎ) ABCD  బి) EGIK  సి) ACDF  డి) CFIL
జ: ACDF
వివరణ: ఇచ్చిన ఆప్షన్లలో ప్రతి అమరికలోని ముందు పదాల విలువకు ఒక స్థిర సంఖ్యను కలిపితే తర్వాత అక్షరాలు వస్తున్నాయి. కానీ, ACDF ఈ క్రమంలో లేదు. కాబట్టి ఇది భిన్నమైంది.
     +1  +1  +1       +2  +2  +2
   A  B  C  D ; E  G  I  K ;
     +2 +1   +2       +3  +3 +3
   A  C  D  F ;  C  F  I  L

19.  ఎ) xXYA  బి) iLMP  సి) hHIK  డి) bBCE
జ: iLMP
వివరణ: ప్రతి పదంలోని మొదటి అక్షరాన్ని చిన్నది (small letter)గా రాసి, తర్వాత వెంటనే అదే అక్షరాన్ని పెద్ద అక్షరం (capital letter)గా రాశారు. కానీ, iLMP లో ఈవిధంగా లేదు కాబట్టి ఇది భిన్నమైంది.
xXYA, iLMP, hHIK, bBCE
20. ఎ) PENAL బి) IDHNI  సి) RUUD డి) KRTSINSA
జ: PENAL
వివరణ: ప్రతి ఆప్షన్‌లోని అక్షరాలను ఒక క్రమంలో రాస్తే కొన్ని భాషల పేర్లు వస్తాయి. కానీ, PENAL లోని పదాలతో ఏ భాష పేరు రాదు. కాబట్టి ఇది భిన్నమైంది.
బి) IDHNI  HINDI
సి) RUUD
 URDU
డి) KRTSINSA  SANSKRIT
ఎ) PENAL   ?

21. ఎ) HSIRJ బి) FIGSH  సి) DWEVF డి) AZBYC
జ: FIGSH
వివరణ: ప్రతి పదంలోని మొదటి, మూడు, అయిదో అక్షరాలు వరుసగా వాటి విలువలు పెరిగే క్రమంలోనూ, రెండు, నాలుగో అక్షరాలు వాటి ముందు అక్షరానికి వ్యతిరేకంగానూ (బాక్సు ప్రకారం) ఉన్నాయి.
H S I R J  H, I, J  
H వ్యతిరేకం S; 
I వ్యతిరేకం R
F T G S H   F, G, H   
F వ్యతిరేకం U; 
G వ్యతిరేకం S 
D W E V F  D, E, F  
D వ్యతిరేకం W; 
E వ్యతిరేకం V
A Z B Y C  A, B, C  

A వ్యతిరేకం Z; 
B వ్యతిరేకం Y
FTGSH లో T స్థానంలో U ఉండాలి. కాబట్టి ఇది భిన్నమైంది.

22. ఎ) EFGIK  బి) CDFIM  సి) BCEHL  డి) ABDGK
జ: EFGIK
వివరణ: ప్రతి పదంలోని ముందు అక్షరం విలువకు వరుసగా 1, 2, 3, 4 లను కలిపితే తర్వాత అక్షరాలు వస్తాయి.
      + 1 +2 +3 +4 
బి) C D F I M
         + 1 +2 +3 +4
సి) B C E H L 
         + 1  +2 +3  +4
డి) A B D G K
        + 1 +1  +2 +2
ఎ) E F G I K  భిన్నమైంది.

23.   ఎ) H     బి) Q       సి) T     డి) Z
జ: Q
వివరణ: ప్రతి అక్షరాల విలువలను గమనిస్తే (బాక్సు ప్రకారం) H = 8; Q = 17; T = 20; Z = 26 వీటిలో Q తప్ప మిగిలిన అక్షరాల విలువలన్నీ సరి సంఖ్యలు. కాబట్టి భిన్నమైంది Q.  

24. ఎ) A బి) E  సి) I డి) U
జ: U
వివరణ: అన్నీ vowles ఇచ్చారు. కానీ U అనేది రెండో సగ భాగంలో (బాక్సును గమనించండి) ఉంది. కాబట్టి భిన్నమైంది U.

25. ఎ) RSDNM      బి) JIBWU      సి) QPBDE      డి) LKSZY
జ: JIBWU
వివరణ: ఇచ్చిన పదాల్లో మధ్య అక్షరాన్ని మినహాయిస్తే, మిగిలిన రెండు జతల్లో వరుస అక్షరాలు ఉన్నాయి.
ఎ) RSDNM  RS D NM
బి) JIBWC  JI B WC  వరుస అక్షరాలు కావు.
సి) QPBDE  QP B DE
డి) LKSZY  LK S ZY

26. ఎ) DGLS బి) WZEL  సి) JMRY డి) SUXB
జ: SUXB
వివరణ: ప్రతి పదంలో ముందు అక్షరం విలువలకు వరుసగా 3, 5, 7 కలిపితే తర్వాత అక్షరాలు వస్తున్నాయి.
   +3  +5 +7                     +3 +5 +7
 D G L S               W Z E L ;
   +3 +5 +7
 J M R Y
+2 +3 +5
S U X B (దీంట్లో X స్థానంలో Y ఉండాలి. కాబట్టి ఇది భిన్నమైంది).

Posted Date : 28-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌