• facebook
  • whatsapp
  • telegram

వేములవాడ చాళుక్యుల కాలంనాటి సాంస్కృతిక పరిస్థితులు

నమూనా ప్రశ్నలు

1. 'ఉంచాలి' అంటే?
జ‌: పన్నులు లేని భూములు

 

2. తైర్థికులు అంటే?
జ‌: వర్తకులు

 

3. 'నకరములు' అంటే?
జ‌: వర్తక సంఘాలు

 

4. కిందివాటిలో జైన క్షేత్రం?
     ఎ) చెన్నూరు       బి) ఇందల్‌వాయి        సి) వేములవాడ      డి) వేల్పూరు
జ‌: సి(వేములవాడ)

 

5. వేములవాడ చాళుక్యుల రాజ భాష ఏది?
జ‌: కన్నడ

 

6. 'కవితాగుణార్ణవుడు' అనే బిరుదు ఎవరిది?
జ‌: పంప

 

7. చంపూ కావ్యమైన 'యశస్తిలక'ను రచించినవారు ఎవరు?
జ‌: సోమదేవసూరి

 

8. తెలుగు భాషలోని మొదటి కంద పద్యాలు కింది ఏ శాసనంలో ఉన్నాయి?
    ఎ) వేములవాడ శాసనం                           బి) కుర్క్యాల శాసనం
    సి) హనుమకొండ శాసనం                         డి) కురవగట్టు శాసనం
జ‌: బి(కుర్క్యాల శాసనం)

 

9. 'శ్యాద్వాదాచలసింహ' అనే బిరుదు ఎవరిది?
జ‌: సోమదేవసూరి

 

10. కాకతీయుల గురించి మొదటి ప్రస్తావన కింది ఏ శాసనంలో ఉంది?
      ఎ) హనుమకొండ శాసనం                             బి) మాగల్లు శాసనం
      సి) బీదర్ శాసనం                                          డి) వేంగి శాసనం
జ‌: బి(మాగల్లు శాసనం)

 

11. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?
జ‌: ప్రోలరాజు

 

12. రుద్రదేవుడిని వినయ విభూషణుడని తెలిపే శాసనం ఏది?
జ‌: ద్రాక్షారామ శాసనం

 

13. మోటుపల్లి అభయ శాసనాన్ని ఎప్పుడు వేయించారు?
జ‌: 1244

 

14. రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు?
జ‌: గణపతి దేవుడు

 

15. వెనిస్ యాత్రికుడు మార్కోపోలో కింది ఎవరి కాలంలో ఓరుగల్లును దర్శించాడు?
      ఎ) గణపతి దేవుడు         బి) రుద్రమదేవి        సి) ప్రతాపరుద్రుడు         డి) రుద్రదేవుడు
జ‌: బి(రుద్రమదేవి)

 

16. 'నీతిసారం' గ్రంథ రచయిత?
జ‌: రుద్రదేవుడు

 

17. ఓరుగల్లుకు 'సుల్తాన్‌పూర్' అని ఎవరు పేరు పెట్టారు?
జ‌: మహ్మద్‌బిన్ తుగ్లక్

 

18. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో వేయించిన శాసనం ఏది?
జ‌: కుర్క్యాల శాసనం

 

19. ముదిగొండ చాళుక్య వంశానికి మూల పురుషుడు?
జ‌: రణమర్థుడు

 

20. ముదికొండ చాళుక్య పాలకుల్లో చివరివాడు?
జ‌: నాగతిరాజు

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌