1. పొడవుగా, గొలుసులా ఉండే దీవుల సముదాయాన్ని ఏమంటారు?
జ: ఆర్చిపెలాగో
2. భూగోళంపై జలభాగం శాతం ఎంత?
జ: 71%
3. అన్నివైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగం ఏది?
జ: ద్వీపం
4. తూర్పు-పశ్చిమ దిశలను సూచించే గుర్తులు లేని రేఖాంశం ఏది?
జ: గ్రీనిచ్
5. వృత్తాన్ని 360ºగా విభజించిన వ్యక్తి ఎవరు?
జ: హిప్పార్కస్
6. మెరీడియన్స్ అంటే ఏమిటి?
జ: మధ్యాహ్న రేఖలు
7. అంతర్జాతీయ దినరేఖ ఏది?
జ: 180º పశ్చిమ, తూర్పు రేఖాంశం
8. గ్లోబుపై ఉన్న గళ్లను ఏమంటారు?
జ: గ్రిడ్
9. ఆసియా ఖండంలో ఎత్తయిన శిఖరం ఏది?
జ: ఎవరెస్ట్
10. ప్రపంచంలో అతి లోతైన ప్రాంతం ఏది?
జ: మెరియానా ట్రెంచ్