1. గోదావరి నదికి అతి ముఖ్యమైన కుడి ఉపనదిగా దేన్ని పేర్కొంటారు?
జ: మంజీర
2. మంజీరా నది మీద కట్టిన ముఖ్యమైన ప్రాజెక్టు ఏది?
జ: నిజాంసాగర్
3. గోదావరి నది ఆదిలాబాద్‌లోని ఏ ప్రాంతం నుంచి తెలంగాణలోనికి ప్రవేశిస్తుంది?
జ: బాసర
4. గోదావరి నది మొత్తం పొడవు ఎంత?
జ:1465 కి.మీ.
5. ద్వీపకల్ప నదుల్లో అతి పొడవైన నది ఏది?
జ: గోదావరి
6. Bison Gorge లోయ ఏ నదీ ప్రవాహం వల్ల ఏర్పడింది?
జ: గోదావరి
7. కృష్ణానది ఏ ప్రాంతం నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
జ: తంగడి
8. డిండి నది ఏ నదికి ఉపనది?
జ: కృష్ణా
9. డిండి నది ఏ పర్వతాల్లో జన్మిస్తుంది?
జ: షాబాద్ కొండలు
10. ప్రాణహిత నది గోదావరి నదిలో కలిసే ప్రాంతం?
జ: చెన్నూర్
11. మంజీరా నది ఏ జిల్లా నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
జ: మెదక్
12. కృష్ణా నది మొత్తం పొడవు సుమారుగా ఎంత?
జ: 1400 కి.మీ.
13. మూసీ నది ఒడ్డున వెలసిన మహానగరం ఏది?
జ: హైదరాబాద్
14. మూసీ నది ఏ నదికి ఉపనది?
జ: కృష్ణా
15. తుంగభద్ర నదికి ముఖ్య ఉపనది ఏది?
జ: హగరి
16. మూసీ నది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది?
జ: వజీరాబాద్
17. మూసీ నది పొడవు సుమారుగా ఎంత?
జ: 250 కి.మీ.
18. డిండి నది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది?
జ: ఏలేశ్వరం
19. మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
జ: డిండి
20. ఆలేరు ఏ నదికి ముఖ్య ఉపనది?
జ: మూసీ