1. భారత ప్రభుత్వ వాతావరణ శాఖ (IMD) ప్రకారం భారతదేశంలో ఎన్ని రుతువులు ఉన్నాయి?
జ: 4
2. నైరుతి రుతుపవనాల ఆఖర్లో ఏర్పడే వేడిని ఏమని పిలుస్తారు?
జ: అక్టోబరు హీట్
3. నైరుతి రుతుపవన కాలం ఏది?
జ: జూన్ - సెప్టెంబరు
4. తెలంగాణ అంతటా రుతుపవనాలు ఎప్పటి వరకు విస్తరిస్తాయి?
జ: జూన్ నెలాఖరు వరకు
5. తెలంగాణ శీతోష్ణస్థితిని ఏమంటారు?
జ: ఉష్ణమండల వర్షఛాయ శీతోష్ణస్థితి
6. ఒక ప్రాంతం ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతం, వర్షపాతం మొదలైన అంశాల దీర్ఘకాల సగటును ఏమంటారు?
జ: శీతోష్ణస్థితి
7. సముద్ర ప్రభావం లేని కారణంతో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో అధిక చలి ఉండటాన్ని ఏమంటారు?
జ: ఖండాతర్గత శీతోష్ణస్థితి
8. తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం ఉన్న ప్రదేశం?
జ: ఉత్తర తెలంగాణ
9. హైదరాబాద్ సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
జ: 600 మీటర్లు
10. తెలంగాణలో వర్షపాతం తక్కువగా ఉండటానికి కారణం?
జ: వర్షఛాయ ప్రాంతం కావడం.