• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యా పరీక్ష

1. కింది శ్రేణిలో మధ్యలో ఉన్న సంఖ్యకి ఎడమ వైపు ఉన్న మూడో అంకె ఏది? 


1 2 3 4 5 6 7 8 9 2 4 6 8 9 7 5 3 1 9 8 7 6 5 4 3 2 1


1 ) 4      2 ) 5      3 ) 9      4 ) ఏదీకాదు


సాధన: 1 2 3 4 5 6 7 8 9 2 4 6 8 9 7 5 3 1 9 8 7 6 5 4 3 2 1


పై శ్రేణిలో 27 సంఖ్యలు ఉన్నాయి. మధ్య సంఖ్య (14వ సంఖ్య) = 9.


9కి ఎడమ వైపు మూడో సంఖ్య = 4


సమాధానం: 1


2. కింది శ్రేణిలో 5 కి ముందు 7, తర్వాత 6 వచ్చేవి ఎన్ని ఉన్నాయి?


7 5 5 9 4 5 7 6 5 9 8 7 5 6 7 6 4 3 2 5 6 7 8 


1) 2        2 ) 4        3 ) 3        4 ) 1


సాధన: 7 5 5 9 4 5 7 6 5 9 8 7 5 6 7 6 4 3 2 5 6 7 8 


సమాధానం: 4


3. కింది సంఖ్యా శ్రేణిలో 4 కి ముందు 7 వచ్చి, తర్వాత 3 రాకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయి?


5 9 3 2 1 7 4 2 6 9 7 4 6 1 3 2 8 7 4 1 3 8 3 2 5 6 7 4 3 9 5 8 2 0 1 8 7 4 6 3 


1 ) 5        2 ) 6        3 ) 7        4 ) 4


సాధన: 5 9 3 2 1 7 4 2 6 9 7 4 6 1 3 2 8 7 4 1 3 8 3 2 5 6 7 4 3 9 5 8 2 0 1 8 7 4 6 3


సమాధానం: 4


4. కింది శ్రేణిలో 7 కి ముందు 6 ఉండి, తర్వాత వెంటనే 4 లేని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?


7 4 2 7 6 4 3 6 7 5 3 5 7 8 4 3 7 6 7 2 0 6 7 4 3 


1 ) 4       2 ) 6       3 ) 2       4 ) 1 


సాధన: 7 4 2 7 6 4 3 6 7 5 3 5 7 8 4 3 7 6 7 2 0 6 7 4 3 


సమాధానం: 3


5. కింది శ్రేణిలో 6 కు ముందు 7 వచ్చి, తర్వాత 9 రానివి ఎన్ని ఉన్నాయి?


6 7 9 5 6 9 7 6 8 7 6 7 8 6 9 4 6 7 7 6 9 5 7 6 3 


1 ) 2    2 ) 3    3 ) 1    4 ) 4


సాధన: 6 7 9 5 6 9 7 6 8 7 6 7 8 6 9 4 6 7 7 6 9 5 7 6 3 


సమాధానం: 2


సూచనలు (ప్ర. 6 - 7): కింది సంఖ్యా శ్రేణి ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


738 429 156 273 894 


6. ప్రతి సంఖ్యలోని అంకెలను వ్యతిరేక క్రమంలో రాస్తే, రెండో అతి పెద్ద సంఖ్యలోని చివరి అంకె ఏమిటి? 


1 ) 4       2 ) 8       3 ) 2       4 ) 7 


సాధన: 738 429 156 273 894 


మార్చిన సంఖ్యలు = 837, 924, 651, 372, 498 


రెండో పెద్ద సంఖ్య = 837. 


దీనిలో చివరి అంకె = 7 


సమాధానం: 4


7. ప్రతి సంఖ్యలోని మొదటి అంకెను దాని తర్వాత పెద్ద అంకెతో మార్చి, వాటిని అవరోహణక్రమంలో అమర్చండి. అయితే వాటిలో మూడో సంఖ్యలోని రెండో అంకె ఏమిటి?


1 ) 4    2 ) 6    3 ) 2    4 ) 5


సాధన: 738 429 156 273 894 


కొత్త సంఖ్యలు = 838, 529, 256, 373, 994


అవరోహణ క్రమం 


= 994, 838, 529, 373, 256


మూడో సంఖ్య = 529. 


ఇందులో రెండో అంకె = 2


సమాధానం: 3


8. 857423 సంఖ్యలో బేసి సంఖ్యల మొత్తం, సరి సంఖ్యల మొత్తం మధ్య వ్యత్యాసం (భేదం) ఎంత?


1 ) 1       2 ) 2       3 ) 4       4 ) 0


సాధన: కావాల్సిన భేదం 


= (5 + 7 + 3) − (8 + 4 + 2) = 15 − 14 = 1


సమాధానం: 1


9. కింది శ్రేణిలో 7 కి ముందు లేదా తర్వాత 3 రాకుండా, 8 వచ్చేవి ఎన్ని ఉన్నాయి?


8 9 8 7 6 2 2 6 3 2 6 9 7 3 2 8 7 2 7 7 8 7 3 7 7 


1 ) 3       2 ) 4       3 ) 6       4 ) 2


సాధన: 8 9 8 7 6 2 2 6 3 2 6 9 7 3 2 8 7 2 7 7 8 7 3 7 7 


సమాధానం: 1


10. కింది శ్రేణిలో ఎన్నిసార్లు వరుస సంఖ్యల మధ్య తేడా 2 గా ఉంది?


6 4 1 2 2 8 7 4 2 1 5 3 8 6 2 1 7 1 4 1 3 2 8 5


1 ) 2       2 ) 3       3 ) 5       4 ) 1


సాధన: 6 4 1 2 2 8 7 4 2 1 5 3 8 6 2 1 7 1 4 1 3 2 8 5


సమాధానం: 3


11. కింది శ్రేణిలో  N తర్వాత Xఉండి,  X తర్వాత T లేకుండా వచ్చేవి ఎన్ని ఉన్నాయి?

N X N T Q M N X T M X N X C N Q M N X Q N X T X N A M X N X M 


1) 4        2 ) 5        3 ) 7        4 ) 2


సాధన: N X N T Q M N X T M X N X C N Q M N X Q N X T X N A M X N X M 
 

సమాధానం: 1


12. 11 నుంచి 54 మధ్య ఉన్న సంఖ్యల్లో 7 తో భాగించగల, 2 తో భాగించలేని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?


1 ) 4       2 ) 3       3 ) 6       4 ) 2


సాధన: 11 నుంచి 54 మధ్యలో 7 తో భాగించగల, 2 తో భాగించలేని సంఖ్యలు 


= 21, 35, 49


సమాధానం: 2


13. 9 నుంచి 54 మధ్య ఉన్న సంఖ్యల్లో 9 తో భాగించగల, 3 తో భాగించలేని సంఖ్యలు ఎన్ని?


1 ) 6      2 ) 5      3 ) 8      4 ) ఏదీకాదు


సాధన: 9 నుంచి 54 మధ్యలో 9 తో భాగించగల, 3 తో భాగించలేని సంఖ్యలు ఏమీ ఉండవు.


సమాధానం: 4


14. 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యల్లో 4 తో భాగించగలిగి, 4 ను ఒక అంకెగా కలిగిన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?


1 ) 10      2 ) 7      3 ) 20      4 ) 21


సాధన: 4, 24, 40, 44, 48, 64, 84


సమాధానం: 2


15. కింద మూడు అంకెల సంఖ్యలు ఉన్నాయి. వాటిలో మధ్య అంకె నుంచి రెండు తీసేసి,  ఒకటి, మూడు స్థానాల్లోని అంకెను తారుమారు చేస్తే, ఏర్పడే వాటిలో రెండో అతిపెద్ద సంఖ్య ఏది?


368 489 974 853


1 ) 368    2 ) 489    3 ) 974    4 ) 853


సాధన: 368 489 974 853


కొత్త శ్రేణి: 843 964 459 338


అవరోహణ క్రమం: 964 843 459 338


∴  రెండో పెద్ద సంఖ్య = 843.


అసలు సంఖ్య = 368


సమాధానం: 1


16. కింది శ్రేణి నుంచి 8 ఉండే అంకెల సంఖ్యలను ఎన్ని రకాలుగా రాయొచ్చు?


8, 5, 2, 1, 7, 6


1 ) 10      2 ) 11      3 ) 12      4 ) 9


సాధన: రెండు అంకెల సంఖ్యలు


= 85, 82, 81, 87, 86, 58, 28, 18, 78, 68, 88


సమాధానం: 2


17. కార్తీక్‌ 32 అంకె నుంచి వెనక్కి లెక్కిస్తుంటే, వినేష్‌ 1 నుంచి లెక్కిస్తున్నాడు. వినేష్‌ బేసి సంఖ్యలను మాత్రమే బయటకు చెబుతున్నాడు. అయితే వారిద్దరూ ఒకే సమయంలో ఒకే వేగంతో ఏ ఉమ్మడి సంఖ్యను బయటకు చెబుతారు?


1 ) 20         2 ) 21 


3 ) వారిద్దరూ ఒకే సంఖ్యను చెప్పరు 


4 ) 18


సాధన:

 కార్తీక్‌: 32 31 30 29 28 27 26 25 24 23 ........ 


వినేష్‌: 1 3  5 7 9 11 13 15 17 19 21 23 25 ........ 


వీరిద్దరూ ఒకేసారి ఏ ఉమ్మడి సంఖ్యను చెప్పలేరు.


సమాధానం: 3


18. హరి L, M, N, O, P, Q, R, S, T అనే అక్షరాలను 1, 2, 3, ........ 9 వరకు ఉన్న అంకెలతో అదే క్రమంలో ప్రతిక్షేపించాడు. P కి 4 ను కేటాయించాడు. P, T ల మధ్య భేదం 5. N, T ల మధ్య భేదం 3. అయితే హరి N కి కేటాయించిన సంఖ్య ఏది?


1 ) 6       2 ) 7       3 ) 5       4 ) 4


సాధన:  P = 4, T − P = 5 

⇒ T − 4 = 5 ⇒ T = 9 

∴ T = 9 

T − N = 3 ⇒ 9 − N = 3 ⇒ N = 6 
 

సమాధానం: 1


 

Posted Date : 25-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌