ఒక ఉమ్మడి బిందువు నుంచి ప్రారంభమైన రెండు విభిన్న కిరణాలు కోణాన్ని ఏర్పరుస్తాయి. ఆ ఉమ్మడి బిందువును ‘కోణశీర్షం’ అంటారు.
పై పటంలో
కోణాన్ని సాధారణంగా

మాదిరి సమస్యలు
1. 67o కి పూరక కోణం విలువ ఎంత?
1) 13o 2) 27o 3) 23o 4) 33o
సాధన:

సమాధానం: 3
2. 99o కి సంపూరక కోణం విలువ ఎంత?
1) 81o 2) 71o 3) 91o 4) 87o
సాధన:
సమాధానం: 1
3. ఒక కోణం సంపూరక కోణం విలువ దాని పూరక కోణానికి 3 రెట్లు ఉంటే ఆ కోణం విలువ?
1) 30o 2) 45o 3) 50o 4) 60o
సాధన:
సమాధానం: 2
4. ఒక కోణం విలువ దాని పూరక కోణంలో సగం ఉంటే,ఆ కోణం విలువ.....
1) 25o 2) 30o 3) 40o 4) 45o
సాధన:
సమాధానం: 2
5. 70o సంపూరక కోణానికి సంయుగ్మ కోణం విలువ?
1) 270o 2) 260o 3) 240o 4) 250o
సాధన:

సమాధానం: 4
6. ఒక కోణానికి సంయుగ్మ కోణం విలువ దాని విలువకు రెట్టింపు ఉంటే ఆ కోణం విలువ?
1) 75o 2) 90o 3) 120o 4) 105o
సాధన:
సమాధానం: 3
7. ఒక కోణం విలువ దాని సంపూరక కోణంలో 80% ఉంటే ఆ కోణం విలువ ఎంత?
1) 75o 2) 80o 3) 90o 4) 100o
సాధన:
సమాధానం: 2
8. ఒక కోణం విలువ, దాని పూరక కోణానికి

1) 54o 2) 45o 3) 36o 4) 27o
సాధన:
సమాధానం: 1
అభ్యాస ప్రశ్నలు
1. కిందివాటిలో అధిక కోణం ఏది?
1) 70o 2) 90o 3) 170o 4) 180o
2. లంబ కోణంలో శాతానికి సమానమైన కోణం విలువ?
1) 12o 2) 15o 3) 18o 4) 20o
3. ఒక కోణం విలువ దాని పూరక కోణంలో

1) 36o 2) 45o 3) 54o 4) 27o
4. రెండు సంపూరక కోణాలు 7 : 8 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాల్లో అతిపెద్ద కోణం విలువ ఎంత?
1) 84o 2) 120o 3) 92o 4) 96o
సమాధానాలు: 1 - 3 2 - 2 3 - 1 4 - 4
కోణం - రకాలు
శూన్య కోణం (Zero anfle):
కోణం విలువ 0o అయితే ఆ కోణాన్ని శూన్య కోణం అంటారు.
అల్ప కోణం/ లఘు కోణం (Acute angle):
కోణం విలువ 0ా, 90ా ల మధ్య ఉంటే ఆ కోణాన్ని ‘అల్పకోణం’ అంటారు.
అల్ప కోణం అయితే
ఉదా: 10o, 15o, 25o, 75o, 89 మొదలైనవి.
లంబ కోణం (Right angle):
కోణం విలువ 90ా అయితే ఆ కోణాన్ని ‘లంబ కోణం’ అంటారు.
అధిక కోణం/ గురుకోణం (Obtuse angle):
కోణం విలువ 90o, 180o మధ్య ఉంటే ఆ కోణాన్ని అధిక కోణం అంటారు.
అధిక కోణం అయితే 90o <
< 180o
ఉదా: 91o, 98o, 125o, 145o, 179o మొదలైనవి.
సరళ కోణం (Straight angle):
కోణం విలువ 180o అయితే ఆ కోణాన్ని సరళ కోణం అంటారు.
పరావర్తన కోణం (Reflex angle):
కోణం విలువ 180o, 360o మధ్య ఉంటే ఆ కోణాన్ని ‘పరావర్తన కోణం’ అంటారు.
పరావర్తన కోణం అయితే 180o <
< 360o
ఉదా: 190o, 250o, 275o, 315o, 345o మొదలైనవి
సంపూర్ణ కోణం (Complete angle):
కోణం విలువ 360o అయితే ఆ కోణాన్ని సంపూర్ణ కోణం అంటారు.
పూరక కోణాలు (Complementary angle):
ఏవైనా రెండు కోణాల మొత్తం విలువ 90o అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు.
ఉదా: 30o, 60o; 40o, 50o; 70o, 20o మొదలైనవి

ఏవైనా రెండు కోణాల మొత్తం విలువ 180ా అయితే ఆ కోణాలను ‘సంపూరక కోణాలు’ అంటారు.
ఉదా: 30o, 150o; 45o, 315o ; 60o, 120o మొదలైనవి.
సంయుగ్మ కోణాలు (Conjugate angle):
ఏవైనా రెండు కోణాల మొత్తం విలువ 360ా అయితే ఆ రెండు కోణాలను ‘సంయుగ్మ కోణాలు’ అంటారు.
ఉదా: 30o, 330o ; 45o, 315o ; 60o, 300o మొదలైనవి.
ఆసన్న కోణాలు (Adjacent angle):
ఉమ్మడి శీర్షం కలిగి, ఉమ్మడి భుజానికి రెండు వైపులా ఉన్న కోణాలను ‘ఆసన్న కోణాలు’ అంటారు.
ఒక జత ఆసన్న కోణాల మొత్తం విలువ 180ా అయితే ఆ కోణాలను ‘రేఖీయ జత’ లేదా ‘రేఖీయ ద్వయం’ అంటారు.

రచయిత
సీహెచ్. రాధాకృష్ణ
విషయ నిపుణులు