మాదిరి ప్రశ్నలు
1. దండాయస్కాంత కేంద్రం వద్ద అయస్కాంతత్వం
జ: శూన్యం
2. విద్యుదయస్కాంతం తయారీకి వాడేది-
జ: మెత్తటి ఇనుము
3. అయస్కాంత ససెఫ్టబిలిటీ ప్రమాణాలు
జ: ప్రమాణాలు లేవు
4. అల్యూమినియం ఏ రకమైన పదార్థం?
జ: పారా
5. అయస్కాంత బల రేఖలు-
జ: సంవృతాలు
6. విద్యుదయస్కాంతాలను దేనిలో ఉపయోగిస్తారు?
1) విద్యుత్ గంట 2) టెలిఫోన్ 3) డైనమో 4) అన్నీ
జ: 4(అన్నీ)
7. ధ్రువసత్వానికి ప్రమాణాలు-
జ: A.m
8. భారతదేశంలో అయస్కాంత భూమధ్యరేఖ కిందివాటిలో ఏ ప్రాంతానికి దగ్గరగా వెళుతుంది?
1) తిరువనంతపురం 2) శ్రీహరికోట 3) అలహాబాద్ 4) శ్రీనగర్
జ: 1(తిరువనంతపురం)
9. అయస్కాంతత్వానికి కచ్చితమైన పరీక్ష
జ: వికర్షణ
10. కిందివాటిలో ఏ రకమైన పదార్థాలు ఘనస్థితిలో లభిస్తాయి?
1) డయా 2) పారా 3) ఫెర్రో 4) అన్నీ
జ: 3(ఫెర్రో)
11. గుర్రపునాడ అయస్కాంతాన్ని ఏ పరికరంలో వాడతారు?
జ: టెలిగ్రాం
12. పాదరసం, నీరు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు?
జ: డయా
13. అయస్కాంత పదార్థాలను మొదట ఏ ప్రాంతంలో కనుక్కున్నారు?
జ: మెగ్నీషియా
14. 1 m పొడవు ఉన్న దండాయస్కాంతం మధ్య బిందువు వద్ద ఉన్న అయస్కాంత ధ్రువాల సంఖ్య-
జ: 0
15. అయస్కాంత సూచిని మొదటిసారి ఎవరు తయారుచేశారు?
జ: చైనీయులు
16. 'భూమి పెద్ద అయస్కాంత గోళం' అని ప్రతిపాదించినవారు-
జ: గిల్బర్ట్
17. అయస్కాంత పదార్థాలను కలిగి ఉండని పరికరం-
జ: ట్యూబ్‌లైట్
18. అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత సూచి అపవర్తనం చెందని బిందువులు-
జ: తటస్థ బిందువులు
19. అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం-
జ: త్రిమితీయం
20. అయస్కాంత ససెప్టెబిలిటి χ = .........
జ:
21. శూన్యంలో అయస్కాంత ప్రవేశ్యశీలత ఎంత?
జ: 4π × 10-7 H/m
22. కిందివాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం-
1) బంగారం 2) కోబాల్టు 3) రాగి
జ: కోబాల్టు
23. కింది ప్రవచనాలను పరిశీలించండి-
ఎ) భూ అయస్కాంత క్షేత్ర అక్షం, భూ భౌగోళిక అక్షానికి 231/2º లోపల ఉంటుంది
బి) ఉత్తరార్థ గోళంలో భూఅయస్కాంత ధ్రువం, ఉత్తర కెనడాలోని ద్వీపకల్పం మీద ఉంది
సి) భూఅయస్కాంత భూమధ్యరేఖ, దక్షిణ భారతదేశంలోని తుంబా మీదుగా పోతుంది
పై ప్రవచనాల్లో సరైంది/ సరైనవి?
జ: బి, సి
24. కిందివాటిలో అయస్కాంత పదార్థం ఏది?
1) కోబాల్టు 2) కాగితం 3) ఇత్తడి
జ: కోబాల్టు.