• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం - సౌరకుటుంబం

1. జియోగ్రఫీ అనే పదాన్ని మొదట ఉపయోగించింది?
జ: ఎరతోస్తీన్స్

 

2. బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించిన వ్యక్తి?
జ: జార్జియస్ లెమెట్రీ

 

3. విశ్వం, మహావిస్ఫోటం వల్ల ఏర్పడిందని, అందుకే రేడియేషన్ ఉందని కనిపెట్టిన పెన్‌జియాస్, విల్సన్‌లకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పుడు ప్రకటించారు?
జ: 1964

 

4. నక్షత్రాలకు జన్మస్థానం ఏది?
జ: నిహారికలు

 

5. అవసాన దశకు చేరుకున్న నక్షత్రాలు అధిక కాంతిని, ఉష్ణశక్తిని విడుదల చేసి, విస్ఫోటానికి గురైతే వాటిని ఏమంటారు?
జ: సూపర్ నోవా

 

6. కృష్ణ బిలాలను కనిపెట్టిన శాస్త్రవేత్త?
జ: స్టీఫెన్ హాకిన్స్

 

7. సూర్యుడు ఇంకా ఎంతకాలం ప్రకాశమంతంగా ఉంటాడు?
జ: 50 బిలియన్ల సంవత్సరాలు

 

8. ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలిచే యూనిట్‌ను ఏమంటారు?
జ: కాంతి సంవత్సరం

 

9. 2012 లో కనుక్కున్న అతిదూరంలో ఉన్న గెలాక్సీకి నాసా పెట్టిన పేరు?
జ: MACS 0647 JD

 

10. కాస్మిక్ సంవత్సరం అంటే..?
జ: సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ పరిభ్రమించడం

 

11. సౌరకుటుంబం మొత్తం పరిమాణంలో సూర్యుడు వ్యాపించిన శాతం ఎంత?
జ: 99.8%

 

12. గ్రహాలను ఆయా అక్షాల మీద ఉంచే అంశాలు ఏవి?
జ: గురుత్వాకర్షణ బలం, అపకేంద్ర బలం

 

13. పడమరన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం ఏ గ్రహంలో చూడొచ్చు?
జ: శుక్రుడు

 

14. ప్లూటోను గ్రహస్థాయి నుంచి ఎప్పుడు తొలగించారు?
జ: 2006 అక్టోబరు 26

 

15. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల్లో ఎక్కువ సాంద్రత ఉన్నది?
జ: భూమి

 

16. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే నిర్దిష్ట మార్గాన్ని ఏమంటారు?
జ: భూకక్ష్య

 

17. ఆస్టరాయిడ్‌లు ఏర్పరచిన గోతిలో నీళ్లు చేరడం వల్ల రూపొందే సరస్సును ఏమంటారు?
జ: క్రేటర్ లేక్

 

18. 2013 ఫిబ్రవరి 15 న భూ వాతావరణంలోకి చొచ్చుకు వచ్చిన ఆస్టరాయిడ్‌కు ఏమని పేరు పెట్టారు?
జ: 2012 DA 14

 

19. ఇటీవల కనుక్కున్న వజ్రపు గ్రహం పేరేంటి?
జ: 55 Cancri e

 

20. 2013 ఫిబ్రవరి 15 న ఏ నగరంపై ఉల్కలు పడి ఇళ్లు ధ్వంసమయ్యాయి?
జ: చెల్యాబిన్స్క్ (Chelyabinsk)

Posted Date : 04-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌