మాదిరి ప్రశ్నలు
1. ద్వీపకల్ప నదుల్లో అతి పెద్దది?
జ: గోదావరి
2. గోదావరి ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది?
జ: పోలవరం
3. కృష్ణానది ఉపనదుల్లో అతి పెద్దది?
జ: తుంగభద్ర
4. కిందివాటిలో మహానది ఉపనదులు కానివి ఏవి?
1) ఇబ్, మాండ్ 2) డాంగ్, టెల్ 3) సోమ్, కోయనా 4) హస్డో, ఓంగ్
జ: 3(సోమ్, కోయనా)
5. ఏ నదిని 'ముచికుంద' అని పిలుస్తారు?
జ: మూసీ
6. కిందివాటిలో పగులులోయ మీదుగా ప్రవహించే నది?
1) గోదావరి 2) నర్మద 3) కావేరి 4) పెన్నా
జ: 2(నర్మద)
7. తూర్పు కనుమల్లో పుట్టి తూర్పు వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్ద నది ఏది?
జ: వంశధార