ఫ్లోరిన్ వాయువు
* ఫ్లోరిన్ వాయువు రసాయన ఫార్ములా: F2
* ఇది పసుపు రంగులో ఉంటుంది.
*ఇది నీటిలో కరుగుతుంది.
* ఫ్లోరిన్ వాయువు గాలి కంటే బరువైంది. ఇది విష స్వభావం కలిగి ఉంటుంది.
* నీటిలో ఫ్లోరిన్ చురుగ్గా చర్య జరిపి హైడ్రోజన్ ఫ్లోరైడ్ (HF), ఆక్సిజన్ (O2), ఓజోన్ (O3) మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది.
* ఇతర హాలోజన్లతో పోలిస్తే ఫ్లోరిన్ అనేక ధర్మాలలో అసంగత ప్రవర్తనను ప్రదర్శిస్తుంది.
ఉదా: 1) ఇతర హాలోజన్లు ప్రదర్శించే విలువల కంటే అయనీకరణ ఎంథాల్పీ, రుణవిద్యుదాత్మక విలువలు ఫ్లోరిన్‌కు ఎక్కువగా ఉంటాయి.
2) సంయోజనీయ వ్యాసార్ధాలు, ద్రవీభవన స్థానం, బాష్పీభవన స్థానం, బంధ విఘటన ఎంథాల్పీ విలువలు ఫ్లోరిన్‌కు తక్కువగా ఉంటాయి.
ఫ్లోరిన్ అసంగత ప్రవర్తనకు కారణాలు
*చిన్న పరిమాణం
* అత్యధిక రుణవిద్యుదాత్మకత
* కనిష్ఠ F-F బంధ విఘటన ఎంథాల్పీ.
* బాహ్య కర్పరంలో d - ఆర్బిటాళ్లు లేకపోవడం
* ఫ్లోరిన్ వాయువు హైడ్రోజన్‌తో చర్య జరిపి హైడ్రోజన్ ఫ్లోరైడ్‌ను ఏర్పరుస్తుంది.
* పొటాషియం హైడ్రోజన్ ఫ్లోరైడ్ (KHF2)ని విద్యుద్విశ్లేషణ చెందించి ఫ్లోరిన్‌ను తయారు చేస్తారు.
క్లోరిన్ వాయువు
* క్లోరిన్ వాయువు రసాయన ఫార్ములా: Cl2
*క్లోరిన్ పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
* ఇది ఘాటైన వాసన గల వాయువు. దీనికి విష స్వభావం ఉంటుంది.
* బ్రైన్ ద్రావణాన్ని(Brine solution)విద్యుద్విశ్లేషణ చేసి క్లోరిన్ వాయువును తయారు చేయవచ్చు.
* క్లోరిన్ నీటిలో సులభంగా కరిగి ‘క్లోరిన్ జలం’ అనే ద్రావణాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడే తయారు చేసిన క్లోరిన్ జలంలో ‘హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl),హైపోక్లోరస్ ఆమ్లం(HOCl) ఉంటాయి.
* క్లోరిన్ హైడ్రోజన్ ఉన్న సమ్మేళనాలతో చర్య జరిపి HCl ను ఏర్పరుస్తుంది.
* కోర్లిన్ చల్లటి, విలీన క్షార ద్రావణాలతో చర్య జరిపి క్లోరైడ్, హైపోక్లోరైట్ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది.
* క్లోరిన్ వేడి, గాఢ క్షార ద్రావణాలతో చర్య జరిపి క్లోరైడ్, క్లోరేట్ల మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది.
* క్లోరిన్ బలమైన విరంజనకారి(Bleaching agent). తేమ ఉన్న వృక్ష జనిత వర్ణ పదార్థాలను ఆక్సీకరణం చేసి విరంజనం చేస్తుంది. క్లోరిన్ విరంజన ప్రభావం శాశ్వతంగా ఉంటుంది.
* కలప గుజ్జు, రేయాన్, నూలు, లెనిన్ మొదలైన వాటిని విరంజనం చేయడానికి క్లోరిన్‌ను ఉపయోగిస్తారు.
* క్లోరిన్‌ను స్లేక్డ్లైమ్తో చర్య జరిపి విరంజన చూర్ణం తయారు చేస్తారు.
* క్లోరిన్ నీటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అందుకే దీన్ని నీటిని శుద్ధి చేయడానికి వాడతారు. ఈ ప్రక్రియను ‘క్లోరినేషన్’ అంటారు.
* ఫాస్జీన్, బాష్పవాయువు, మస్టర్డ్ వాయువు లాంటి విష వాయువుల తయారీలో క్లోరిన్‌ను ఉపయోగిస్తారు.
* DDT లాంటి కీటక నాశినులు, క్లోరోఫాం లాంటి మత్తుమందుల తయారీలో క్లోరిన్‌ను ఉపయోగిస్తారు.
ఉత్కృష్ట వాయువులు
* హీలియం (He) నియాన్ (Ne) ఆర్గాన్ (Ar)క్రిప్టాన్ (Kr), గ్జినాన్ (Xe) రేడాన్ (Rn)మొదలైనవి ఉత్కృష్ట వాయువులు.
*వాతావరణంలో అత్యధికంగా లభించే జడవాయువు - ఆర్గాన్. హీలియం మినహా మిగిలిన ఉత్కృష్ట వాయువుల బాహ్య కర్పర ఎలక్ట్రాన్ విన్యాసం - ns2np6
* స్థిరమైన అష్టక విన్యాసాన్ని కలిగి ఉండటం వల్ల జడవాయువులు రసాయనిక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి.
* హైడ్రోజన్ తర్వాత అత్యంత తేలికైన వాయువు హీలియం.
* సూర్యగోళంలో కేంద్రక సంలీన చర్య (Nuclear fusion) ద్వారా హీలియం ఏర్పడుతుంది.
* హీలియం మండే స్వభావం లేని వాయువు. అందుకే దీన్ని వాతావరణ పరిశోధనలకు ఉపయోగించే బెలూన్లను నింపడానికి వాడతారు.
*హీలియం గాలి కంటే తేలికైనది కావడంతో దీన్ని విమానాల టైర్లు, ఎయిర్షిప్ల్లో (Airship) వాడతారు.
* హీలియం (He), ఆక్సిజన్ (O2) వాయువుల మిశ్రమాన్ని హీలియోక్స్ (Heliox)అంటారు. గజ ఈతగాళ్లు కృత్రిమ శ్వాస కోసం హీలియోక్స్‌ను ఉపయోగిస్తారు.
* ఆస్తమా బాధితులు ఉపశమనం కోసం హీలియం, ఆక్సిజన్ మిశ్రమాన్ని వాడతారు.
* ద్రవ హీలియంను అల్ప ఉష్ణోగ్రతలను సాధించే క్రయోజనిక్ (Cryogenic) కారకంగా ఉపయోగిస్తారు.
*ద్రవ హీలియంను అణురియాక్టర్‌లో శీతలీకరణిగా వాడతారు.
* MRI స్కానింగ్ వ్యవస్థలో కూడా ద్రవ హీలియాన్ని ఉపయోగిస్తారు.
* లోహ సంగ్రహణంలో జడ వాతావరణాన్ని కల్పించేందుకు హీలియంను ఉపయోగిస్తారు.
* నియాన్ బల్బులు నారింజ - ఎరుపు రంగు కాంతిని ఇస్తాయి. నియాన్ బల్బులను ప్రకటన దీపాలుగా, సిగ్నల్ లైట్లలో, ఓడరేవులు, విమానాశ్రయాల్లో దారి చూపే దీపాలుగా వాడతారు.
* సాధారణ టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బుల్లో జడవాతావరణం కోసం ఆర్గాన్ వాయువును ఉపయోగిస్తారు.
* గనుల్లో పనిచేసే కార్మికులు క్రిప్టాన్ టోపీ లైట్లను వాడతారు. క్రిప్టాన్ లైట్లు తెలుపు రంగు కాంతిని ఇస్తాయి.
* గ్జినాన్ వాయువును ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్‌లైట్లలో ఉపయోగిస్తారు.
* ఉత్కృష్ట వాయువులు కనిష్ఠ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలను కలిగి ఉంటాయి. తెలిసిన పదార్థాలన్నింటిలో హీలియంకు కనిష్ఠ బాష్పీభవన స్థానం ఉంది. ఉత్కృష్ట వాయువుల పరమాణుల మధ్య చాలా బలహీనమైన విక్షేపణ బలాలు (Dispersion forces) తప్ప ఏ ఇతర అంతరపరమాణుక బలాలు ఉండవు.
హైడ్రోజన్ క్లోరైడ్
* హైడ్రోజన్ క్లోరైడ్ ఫార్ములా:HCl
* ఇది రంగులేని ఘాటైన వాసన గల వాయువు.
* ఇది నీటిలో సులభంగా కరిగి, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది.
*ఎముకల బొగ్గును శుద్ధి చేయడానికి HCl ను ఉపయోగిస్తారు.
* ఔషధాల్లో, ప్రయోగశాలల్లో హైడ్రోజన్ క్లోరైడ్‌ను కారకంగా వాడతారు.