• facebook
  • whatsapp
  • telegram

జెనెటిక్స్‌

1. లైంగిక క్రోమోజోమ్‌లపై ఉండే జన్యువుల ద్వారా అనువంశికత లక్షణాలను నిర్ధారిస్తారు. దీన్ని ఏమంటారు?

1) లింగ సంలగ్న అనువంశికత

2) లింగ సహలగ్న అనువంశికత

3) లింగ వికల్ప అనువంశికత

4) లింగ సంకలిత అనువంశికత 

జ: లింగ సహలగ్న అనువంశికత

2. కిందివాటిలో సరైనవి ఏవి?

i) ఆటోజోమ్‌ల ద్వారా సంక్రమించే లక్షణాలు స్త్రీ, పురుష జీవుల్లో దాదాపు ఒకే విధంగా వ్యక్తీకరించి ఉంటాయి. 

ii) లింగ సహలగ్న అనువంశిక లక్షణాలు స్త్రీ, పురుష జీవుల్లో లైంగిక క్రోమోజోమ్‌లను బట్టి వివిధ స్థాయుల్లో తెలుస్తాయి.

iii) లింగ సహలగ్నతను థామస్‌హంట్‌ మోర్గాన్‌ అనే శాస్త్రవేత్త గుర్తించారు. 

జ: i, ii, iii    

3. లింగ సహలగ్నతను మొదటిసారి ఏ జీవిలో కనుక్కున్నారు? 

జ:  డ్రోసోఫిలా మెలనోగాస్టర్‌  

4. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

జ: థామస్‌ హంట్‌ మోర్గాన్‌ 

5. X- క్రోమోజోమ్‌పై ఉండే జన్యువుల ఆధారంగా పండ్ల ఈగల కళ్లు తెలుపు రంగులో ఉంటాయి. ఇలాంటి అనువంశికతా విధానానికి ఉన్న పేరు......

జ: లింగ సహలగ్న అనువంశికత 

6. మానవుడిలో లింగ సహలగ్న జన్యువులు వేటిపై అమరి ఉంటాయి? 

జ: X, Y క్రోమోజోమ్‌ రెండిటిపై

7. పురుషులు అర్ధయుగ్మజ స్థితిలో, స్త్రీలు సమయుగ్మజాలుగా లేదా విషమయుగ్మజాలుగా ఉండే స్థితిని ఏ లింగ సహలగ్న జన్యువుల్లో గమనించవచ్చు?

జ:  X-సహలగ్న జన్యువులు 

8. హోలాండ్రిక్‌ జన్యువులు అంటే?

జ: Y-సహలగ్న జన్యువులు   

9. అసంపూర్ణ లింగ సహలగ్న జన్యువులు..... 

జ:  XY- సహలగ్న జన్యువులు   

10. మానవుడిలో ప్రధానంగా కనిపించే లింగ సహలగ్న జన్యువుల అనువంశికత...

జ: X- సహలగ్న అనువంశికత    

11. మానవుడిలో X-క్రోమోజోమ్‌ సంబంధ లింగ సహలగ్నతకు ఉదాహరణలు.....

i) హీమోఫీలియా     ii) వర్ణాంధత్వం    iii) డుచెన్నకండర క్షీణత

జ: i, ii, iii 

12. వర్ణాంధత్వం మానవుల్లో ఎలా సంభవిస్తుంది?

జ: X-సహలగ్న అంతర్గత అపస్థితి వల్ల

13. మనిషి కళ్లలో ఎరుపు, ఆకుపచ్చ రంగులను గుర్తించే భాగం ఏది?

జ: రెటీనాలో ఉండే శంకు కణాలు

14. ఎరుపు, ఆకుపచ్చ లేదా నీలి వర్ణాల్లో ఏదో ఒక రంగును లేదా మూడు రంగులను గుర్తించలేని స్థితిని ఏమంటారు?

జ: కలర్‌ బ్లైండ్‌నెస్‌ 

15. కింది అంశాలను జతపరచండి.

జాబితా - ‘ఎ’ జాబితా - ‘బి’
i) ప్రోటనోపియా a) నీల వర్ణాంధత్వం
ii) డ్యుటెరనోపియా b) హరిత వర్ణాంధత్వం
iii) ట్రైటనోపియా c) అరుణ వర్ణాంధత్వం

జ: i-c, ii-b, iii-a 

16. వర్ణాంధత్వాన్ని గుర్తించే పరీక్ష ఏది?

జ: ఇషిహర వర్ణపరీక్ష 

17. వర్ణాంధత్వ స్థితి అనువంశికత దేన్ని ప్రదర్శిస్తుంది?

i. క్రిస్‌ - క్రాస్‌ అనువంశికత  

ii. తరం - దాటివేత అనువంశికత

iii. అడ్డదిడ్డ అనువంశికత

జ: i, ii, iii

18. మానవుల్లో రక్త స్కందనం ఆలస్యంగా జరగడానికి లేదా రక్తం గడ్డ కట్టకపోవడానికి కింది ఏ పరిస్థితి కారణం?

జ:  హీమోఫీలియా   

19. హోలాండ్రిక్‌ అనువంశికతను ప్రదర్శించే లక్షణాలు ఏవి?

i. హైపర్‌ ట్రైకాసిస్‌ లక్షణం 

ii. పార్కుపైన్‌ పురుషుల లక్షణం

iii. కాలి వేళ్ల మధ్య అంగుళ్యాంతర కణజాలం ఉండటం

జ: i, ii, iii

20. లింగ పరిమితి జన్యువులు స్త్రీ, పురుష జీవుల్లో వేటిపై ఉంటాయి?

జ: దైహిక క్రోమోజోమ్‌లు

21. కిందివాటిలో లింగ పరిమితి లక్షణాలు ఏవి?

i. పురుషుల్లో గడ్డం పెరగడం

ii. స్త్రీలలో స్తనాలు అభివృద్ధి చెôదడం 

iii. క్షీరం ఉత్పత్తి అవ్వడం

iv ద్వితీయ లైంగిక లక్షణాలు ప్రదర్శించడం

జ: i, ii, iii, iv

22. ఆడ, మగ జీవుల్లో కొన్ని జన్యువులు దైహిక క్రోమోజోమ్‌లపై ఉంటాయి. అవి వేర్వేరు లింగాలతో భిన్న దృశ్యరూప వ్యక్తీకరణలను కలిగి ఉండి, ఒక లింగానికి చెందిన జీవులతో బహిర్గతంగానూ, మరొక లింగానికి చెందిన జీవులలో అంతర్గతంగానూ సంక్రమిస్తాయి. ఈ జన్యువులను ఏమంటారు?

జ: లింగ ప్రభావిత జన్యువులు

23. మానవుడిలో కనిపించే మెండీలియన్‌ అపస్థితులకు ఉదాహరణలు ఏవి?

i) థలస్సీమియా      ii) హీమోఫీలియా  

iii) కొడవలి - కణ రక్తహీనత 

iv) ఫినైల్‌ కీటోనూరియా 

జ: i, ii, iii, iv    

24. క్రోమోజోమ్‌ల అవియోజనం వల్ల ఏం జరుగుతుంది?

జ: క్రోమోజోమ్‌ల అపస్థితులు

25. ఒక క్రోమోజోమ్‌ సమూహం నుంచి ఒకటి లేదా అనేక క్రోమోజోమ్‌లు కోల్పోతే  ఆ లక్షణాన్ని ఏమంటారు?

జ: ఎన్యూప్లాయిడీ     

26. మోనోజోమీని సూచించే ఫార్ములా.....

జ: 2n - 1     

27. ట్రైసోమీ స్థితిని ఏవిధంగా సూచిస్తారు?

జ: 2n + 1

28. 23వ క్రోమోజోమ్‌ ట్రైసోమి వల్ల మానవుల్లో సంభవించే జన్యు అపస్థితి.....

జ:  క్లైనిఫెల్టర్‌ సిండ్రోమ్‌  

29. టర్నర్‌ సిండ్రోమ్‌ వ్యక్తుల్లో ఉండే మొత్తం క్రోమోజోమ్‌ల సంఖ్య.....

జ:  45    

30. (44 + XO) స్థితిలో ఏ జన్యు అపస్థితి ప్రధాన లక్షణం వల్ల  స్త్రీలు అసంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లు కనిపిస్తారు?

జ:  టర్నర్‌ సిండ్రోమ్‌ 

31. ట్రైసోమి 21 వల్ల మానవుల్లో కలిగే స్థితి...

జ: డౌన్‌సిండ్రోమ్‌

32. ఒక జీవికి చెందిన మొత్తం జన్యు సమాచారాన్ని కలిగిన డీఎన్‌ఏను ఏమంటారు?

జ: జీనోమ్‌   

33. కిందివాటిలో మానవ జీనోమ్‌ ప్రాజెక్ట్‌ ముఖ్య లక్ష్యాలను గుర్తించండి.

i) మానవుడి జీనోమ్‌లోని సుమారు 20,000 - 25,000 జన్యువులను గుర్తించడం.

ii) మానవుడి జీనోమ్‌లోని 3 బిలియన్ల నత్రజని క్షారాల వరుస క్రమాన్ని  నిర్ధారించడం.

iii) జీవశాస్త్ర దత్తాంశ విశ్లేషణకు ఉపకరణాలను మెరుగుపరచడం.

iv) ఈ ప్రాజెక్ట్‌ వల్ల ఉద్భవించే నైతిక, న్యాయ, సాంఘిక అంశాలకు పరిష్కారమార్గాలను తెలపడం.

జ: i, ii, iii, iv

34. కిందివాటిలో సరైనవి ఏవి?

i) 18వ క్రోమోజోమ్‌ అదనపు ప్రతి ఉండటం వల్ల మానవుల్లో ఎడ్వర్డ్‌ సిండ్రోమ్‌ కలుగుతుంది.

ii) ఎడ్వర్డ్‌ సిండ్రోమ్‌ను స్త్రీ, పురుషులు ఇద్దరిలో గమనించొచ్చు.

iii) ఎడ్వర్డ్‌ సిండ్రోమ్‌కు గురైన శిశువులు ఎక్కువగా గర్భస్థ దశలోనే మరణిస్తారు.

iv) ఎడ్వర్డ్‌ సిండ్రోమ్‌ కారియోటైప్‌ 47, XX, +18

జ: i, ii, iii, iv

35. ఏటేసిండ్రోమ్‌ కలిగిన వ్యక్తుల కారియోటైప్‌..

జ: 47, XX, +13

36. షాట్‌గన్‌ సీక్వెన్సింగ్‌ దేనికి సంబంధించిన అధునాతన పద్ధతి?

జ: ఎక్కువ పొడవున్న డీఎన్‌ఏ ఖండాల వరుసక్రమాన్ని గుర్తించడం

37. మానవ జీనోమ్‌ ప్రాజెక్ట్‌ ప్రకారం కింది వాటిలో సరైనవి ఏవి?

i) మానవ జీనోమ్‌లో 3,164.7 మిలియన్ల నత్రజని క్షార జంటలు ఉంటాయి.

ii) మానవుడిలో అతిపొడవైన జన్యువు డిస్ట్రోఫిన్‌ అనే కండర ప్రోటీన్‌ను సంకేతించే జన్యువు.

iii) మొత్తం జన్యువుల్లో 2% కంటే తక్కువ జన్యువులు ప్రోటీన్‌లను సంకేతిస్తాయి.

iv) డీఎన్‌ఏ వరుసక్రమం మానవులందరిలో 99.9% ఒకే విధంగా ఉంటుంది.

జ: i, ii, iii, iv

38. మానవుడిలో అధిక సంఖ్యలో, అంటే సుమారు 2,968 జన్యువులను కలిగి ఉండే క్రోమోజోమ్‌ వరుస సంఖ్య?

జ: 1వ క్రోమోజోమ్‌ 

39. మానవుడిలో అతి తక్కువ సంఖ్యలో, అంటే సుమారు 231 జన్యువులను మాత్రమే కలిగి ఉండే క్రోమోజోమ్‌.....

జ: Y క్రోమోజోమ్‌

40. డ్రోసోఫిలాలో సహలగ్నతను వివరించిన శాస్త్రవేత్త?

జ: మోర్గాన్‌ 

Posted Date : 05-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌