• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం భౌగోళిక స్వరూపాలు

1. భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో నూతనమైంది?

1) హిమాలయ పర్వతాలు    

2) థార్‌ ఎడారి    

3) ద్వీపకల్ప పీఠభూమి

4) గంగాసింధూ మైదానం


2. కింది వాటిని జతపరచండి.

ఎ) ధౌల్‌దార్‌ శ్రేణి                   i) భూటాన్‌

బి) ముస్సోరి శ్రేణి                  ii) నేపాల్‌

సి) మహాభారత శ్రేణి               iii) హిమాచల్‌ప్రదేశ్‌

డి) బ్లాక్‌మౌంటెయిన్‌ శ్రేణి       iv) ఉత్తరాఖండ్‌

1) ఎ-iii,  బి-i,  సి-ii,   డి- iv)   

2) ఎ-i,   బి-iii,   సి - iv,   డి-ii 

3) ఎ-iii,   బి- iv,   సి-ii, డి-i    

4) ఎ-i,   బి-ii,   సి-iii,   డి - iv

3. కింది వాటిలో సరికానిదేది?

ఎ) ఉన్నత హిమాలయాలు, పీర్‌పంజాల్‌ శ్రేణులకు మధ్యలో కశ్మీర్‌ లోయ ఉంది.

బి) పీర్‌పంజాల్‌ శ్రేణి, ధౌల్‌దార్‌ శ్రేణికి మధ్యలో చంబలోయ ఉంది.

సి) హిమాచల్‌ శ్రేణులు, శివాలిక్‌ శ్రేణులకు మధ్య ఉన్న U ఆకారపు లోయలను డూన్స్‌ అంటారు.

1) ఎ, బి       2) బి, సి    

3) ఎ, సి       4) పైవన్నీ


4. కింది వాటిని జతపరచండి.

ఎ) బొమ్మిడాల కనుమ      i) సిక్కిం

బి) నాథులా కనుమ         ii) జమ్మూకశ్మీర్‌

సి) షిప్‌కిలా కనుమ          iii) అరుణాచల్‌ప్రదేశ్‌

డి) జోజిలా కనుమ             iv) హిమాచల్‌ప్రదేశ్‌

1) ఎ-i,  బి- iv  సి-ii,  డి-iii

2) ఎ-iii,  బి-i,  సి-iv   డి-ii

3) ఎ-iv,   బి-iii,  సి-i,  డి-ii        

4) ఎ-iii,   బి-iv,  సి-ii,   డి-i


5. హిమాచల్‌ పర్వతాల్లోని వేసవి విడుదులకు సంబంధించి సరికానిది?

1) ధర్మశాల, ముస్సోరి, కౌసాని ప్రాంతాలు జమ్మూకశ్మీర్‌లో ఉన్నాయి.

2) సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ ప్రాంతాలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.

3) రాణికేట్, చక్రటా, ఆల్మోరా ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.

4) డార్జిలింగ్‌ వేసవి విడిది పశ్చిమ్‌బంగాలో ఉంది.


6. ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది?

1) ధూప్‌గర్‌            2) గురుశిఖర్‌    

3) మౌంట్‌ అబూ    4) పచ్‌మరి


7. వింద్యా పర్వతాల తూర్పు భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు?

1) మైకాల్‌ శ్రేణి      2) దేసురి శ్రేణి    

3) కైమూర్‌ శ్రేణి      4) బాలాఘాట్‌ శ్రేణి


8. భారతదేశ భౌగోళిక స్వరూపాల విస్తీర్ణం ఆధారంగా వరుస క్రమాన్ని గుర్తించండి.

1) హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, గంగాసింధూ మైదానం, థార్‌ ఎడారి

2) ద్వీపకల్ప పీఠభూమి, గంగాసింధూ మైదానం, హిమాలయాలు, థార్‌ ఎడారి

3) గంగాసింధూ మైదానం, హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, థార్‌ ఎడారి

4) హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, థార్‌ ఎడారి, గంగాసింధూ మైదానం


9. భారతదేశ విభజన సమయంలో వలసొచ్చిన వారికోసం ఏ ప్రాంతంలోని అడవులను తొలగించి వ్యవసాయ భూములుగా మార్చారు?

1) భాబర్‌       2) టెరాయ్‌    

3) భంగర్‌      4) ఖాదర్‌


10. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

1) బుందేల్‌ఖండ్‌ పీఠభూమి - మధ్యప్రదేశ్‌    

2) చోటానాగపూర్‌ పీఠభూమి - ఝార్ఖండ్‌

3) కథియావార్‌ పీఠభూమి - మధ్యప్రదేశ్‌    

4) మాళ్వా పీఠభూమి - మధ్యప్రదేశ్‌


11. నర్మదా, తపతి నదుల మధ్య ఉన్న పర్వతశ్రేణి ఏది?

1) సాత్పురా కొండలు      2) వింద్యా పర్వతాలు     

3) అజంతా కొండలు      4) రాజ్‌పిప్లా కొండలు


12. కింది వాటిలో పశ్చిమ కనుమలకు సంబంధించి సరికానిది?

1) మహారాష్ట్రలోని ఖాందేష్‌ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి

2) ఈ కనుమల పొడవు 1600 కి.మీ.

3) పశ్చిమ కనుమలను భారతదేశ సతత హరితారణ్యాలుగా పిలుస్తారు.

4) ఇవి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఒకే ఎత్తులో ఉన్నాయి.


13. కింది వాటిని జతపరచండి.

ఎ) బాబాబుడాన్‌ కొండలు      i) గోవా 

బి) ధర్‌ సింఘా కొండలు       ii) తమిళనాడు

సి) కార్డమం కొండలు           iii) కేరళ

డి) నీలగిరి కొండలు            iv) కర్ణాటక

1 ఎ-iv,    బి-i,    సి-iii,   డి-ii        

2) ఎ-iv,   బి-ii,   సి-iii,   డి-i

3) ఎ-i,   బి-iv,    సి-ii,   డి-iii        

4) ఎ-ii,   బి-iv,   సి-iii,   డి-i


14. దక్షిణ భారత్‌లో ఎత్తయిన శిఖరం ఏది?

1) అనైముడి           2) దొడబెట్ట    

3) అరోమా కొండ    4) ధూప్‌గర్‌


15. పళని కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) కేరళ        2) తమిళనాడు    

3) కర్ణాటక    4) ఒడిశా


16. ఏడుకొండలు (సెవెన్‌హిల్స్‌) అని శేషాచల కొండలను పిలుస్తారు. అయితే ఏడు పర్వతాలు (సెవెన్‌ మౌంటెయిన్‌) అని వేటిని పిలుస్తారు?

1) హిమాలయాలు      2) ఆరావళి పర్వతాలు

3) సాత్పురా పర్వతాలు    4) వింద్యా పర్వతాలు


17. భారతదేశ మొదటి ఆదిమ మానవులైన ‘రామాపిథికస్‌’ జాతి ఏ పర్వతాల్లో నివసించినట్లు ఆధారాలు లభించాయి?

1) శివాలిక్‌ పర్వతాలు      2) పశ్చిమ కనుమలు   

3) ఆరావళి పర్వతాలు     4) మధ్య హిమాలయాలు


18. కింది వాటిని జతపరచండి. 

ఎ) గారో కొండలు           i) అసోం

బి) మిష్మి కొండలు        ii) మిజోరం

సి) లుషాయి కొండలు    iii) మేఘాలయ 

డి) కచార్‌ కొండలు        iv)అరుణాచల్‌ప్రదేశ్‌

1) ఎ-i,   బి-iv,    సి-ii,    డి-iii        

2) ఎ-ii,   బి-iii,   సి-iv,    డి-i

3) ఎ-iii,   బి-iv,    సి-ii,    డి-i

4) ఎ-iv,    బి-i,    సి-iii,    డి-ii


19. ఖనిజాల నెలవంక అని ఏ పీఠభూమిని పిలుస్తారు?

1) దక్కన్‌ పీఠభూమి    2) మాళ్వా పీఠభూమి

3) చోటానాగపూర్‌ పీఠభూమి        

4) టిబెట్‌ పీఠభూమి 


20. ట్రాన్స్‌ హిమాలయ ప్రాంతంలో ఉత్తరం నుంచి దక్షిణానికి కనిపించే పర్వత శ్రేణుల వరుస క్రమం?

1) కారకోరం, లడఖ్, కైలాస్, జస్కర్‌

2) కారకోరం, కైలాస్, లడఖ్, జస్కర్‌

3) లడఖ్, జస్కర్, కారకోరం, కైలాస్‌

4) లడఖ్, కారకోరం, జస్కర్, కైలాస్‌


21. హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడ్డాయి?

1) అవక్షేప శిలలు      2) అగ్ని శిలలు

3) ప్లుటోనిక్‌ శిలలు     4) రూపాంతర శిలలు


22. జియో సింక్లైన్‌ అంటే ఏమిటి?

1) రెండు నదుల మధ్య ఉన్న లోతైన నిమ్నతి 

2) రెండు నదులను వేరు చేసే ఉన్నతి

3) లోతైన అవక్షేపాలతో ఉన్న పల్లపు ప్రాంతం 

4) రెండు పర్వతాల మధ్య ఉన్న ప్రాంతం


23. టెరాయ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నేషనల్‌ పార్కులు, అవి ఉన్న రాష్ట్రాలతో జతపరచండి.

ఎ) జిమ్‌కార్బెట్‌         i) ఉత్తర్‌ప్రదేశ్‌ నేషనల్‌ పార్క్‌

బి) దుధ్వా నేషనల్‌     ii) బిహార్‌ పార్క్‌   

సి) జలదపారా             iii) ఉత్తరాఖండ్‌ నేషనల్‌ పార్క్‌

డి) వాల్మీకి టైగర్‌          iv) పశ్చిమ్‌బంగా రిజర్వ్‌             

1) ఎ-iii,   బి-i,   సి-iv,   డి-ii

2) ఎ-i,   బి-iii,   సి-ii,   డి-iv

3) ఎ-iii,   బి-i,   సి-ii,   డి-iv

4) ఎ-ii,   బి-i,   సి-iii,   డి-iv

మరికొన్ని....

1. కింది వాటిలో సరైంది?

ఎ) శివాలిక్‌ పర్వత పాదాల వద్ద విసనకర్ర ఆకారంలో రాళ్లు, గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర మండలాన్ని ‘భాబర్‌’ అంటారు.

బి) దీని వెడల్పు 8 నుంచి 16 కి.మీ.లు

సి) భాబర్‌ అంటే పొడవైన గడ్డి అని అర్థం

డి) విసనకర్ర ఆకారంలో ఉన్న ఈ స్వరూ పాలను ‘ఘర్‌’ అని కూడా పిలుస్తారు.

1) ఎ మాత్రమే    2) ఎ, బి 

3) ఎ, బి, డి       4) పైవన్నీ


2. భారతదేశ భూభాగం మధ్యలో వింద్యా పర్వత శ్రేణి విస్తరించి ఉంది. సంస్కృతంలో వింద్యా అంటే అర్థం ఏమిటి?

1) మధ్య ప్రాంతం      2) ఆహ్లాదం   

3) వేటగాడు            4) వన్యప్రాణి


3. మాళ్వా పీఠభూమికి సంబంధించి సరికానిదేది?

1) ఇది పర్వత పాద పీఠభూమి         

2) మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉంది

3) ఈ పీఠభూమిలో చంబల్‌ నది ఏర్పర్చిన కంచర భూములు ఉన్నాయి

4) ఈ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా  సాత్పురా పర్వతాలు ఉన్నాయి


4. కింది ఏ పీఠభూమిలో ‘ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా’ ఉంది?

1) మాళ్వా పీఠభూమి 

2) భోరట్‌ పీఠభూమి

3) చోటానాగపూర్‌ పీఠభూమి     

4) హజారీబాగ్‌ పీఠభూమి


5. యమునా నదికి దక్షిణాన, మాళ్వా పీఠభూమికి తూర్పున ఉన్న మెట్ట ప్రాంతం?

1) బుందేల్‌ ఖండ్‌       2) బుండి కొండలు 

3) పూర్వాంచల్‌ కొండలు    4) రాజ్‌ఘర్‌ కొండ


6. థార్‌ ఎడారికి సంబంధించి సరైంది?

ఎ) ఇది ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉంది

బి) ఏడాది వర్షపాతం 100 - 150 మి.మీ.

సి) ఈ ఎడారి మీదుగా ప్రవహించే ఏకైక నది లూని.

డి) ఇది ఒక హముడా స్థలాకృతి.

1) ఎ, బి, డి       2) ఎ, బి 


3) ఎ, బి, సి     4) పైవన్నీ


7. శిఖరాల పేర్లు - వాటి ఎత్తు ఆధారంగా కింది వాటిని జతపరచండి.

ఎ) గురుశిఖర్‌       i) 2637 మీటర్లు

బి) దొడబెట్ట          ii) 1680 మీటర్లు

సి) అనైముడి        iii) 2695 మీటర్లు

డి) అరోమా కొండ    iv) 1722 మీటర్లు


1) ఎ-iv,   బి-i,  సి-iii,   డి-ii    

2) ఎ-i,    బి-ii,    సి-iii,   డి-iv

3) ఎ-iv,   బి-iii,    సి-ii,    డి-i

4) ఎ-iii,   బి-ii,    సి-iv,    డి-i

Posted Date : 26-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌