మాదిరి ప్రశ్నలు
1. దేశంలోనే అతిపెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?
జ: టాటా ఇనుము - ఉక్కు కర్మాగారం
2. విశాఖపట్నం ఇనుము - ఉక్కు కర్మాగారం ఏ గనుల్లో ఉత్పత్తవుతున్న ఇనుప ధాతువును వినియోగించుకుంటోంది?
జ: బైలదిల్లా
3. దేశంలో అత్యధిక సంఖ్యలో సిమెంట్ కర్మాగారాలు ఉన్న రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్
4. 'అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ: 1938
5. ఏ నగరాన్ని 'ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు?
జ: బెంగళూరు
6. దేశంలో మొదటి బీహెచ్ఈఎల్ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: భోపాల్
7. కింది ఏ ప్రాంతంలో హెచ్ఎంటీ కర్మాగారం లేదు?
1) శ్రీనగర్ 2) ముంబయి 3) పింజోర్ 4) జయపుర (జైపూర్)
జ: ముంబయి
8. దేశంలో మిగ్ విమానాల అసెంబ్లింగ్ ఏ ప్రాంతంలో జరుగుతుంది?
జ: బెంగళూరు
9. దేశంలో మొదటి నౌకా నిర్మాణ కేంద్రం ఏది?
జ: హిందుస్థాన్
10. కింది ఏ ప్రాంతంలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఉంది?
1) కపుర్తలా 2) జంషెడ్పూర్ 3) ఎలహంక 4) వారణాసి
జ: కపుర్తలా