• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఆర్థికాభివృద్ధి సూచికలు - స్థానాలు

1. ప్రపంచ సంతోష సూచికను(World Happiness Index)ఎవరు ప్రకటిస్తారు?

1) డబ్ల్యూహెచ్‌ఓ   2) యూఎన్‌ఓ    3) వరల్డ్ ఎకనమిక్‌ ఫోరమ్‌     4) ఐఎంఎఫ్‌ (IMF)

జ:యూఎన్‌ఓ

2. ప్రపంచ సంతోష సూచిక - 2022 నివేదిక  ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం ?  (146 దేశాల పరంగా) 

1) 136      2) 137         3) 138         4) 139

జ: 136


3. మానవాభివృద్ధి సూచిక - 2022 నివేదిక ప్రకారం 191 దేశాల్లో భారత్‌ స్థానం?

1) 131        2) 132        3) 133        4) 134

జ:132


4. మానవాభివృద్ధి సూచికను (Human Development Index) ఎవరు ప్రకటిస్తారు?

1) యూఎన్‌డీపీ      2) ఓపీహెచ్‌ఐ     3) ఐఎంఎఫ్‌       4) ఐబీఆర్‌డీ 

జ:యూఎన్‌డీపీ


5. మానవాభివృద్ధి సూచిక రూపకర్త ఎవరు?

1) మహబూబ్‌-ఉల్‌-హక్‌      2) అమర్త్యసేన్‌         3) దండేకర్‌           4) డా.సి.రంగరాజన్‌

జ: మహబూబ్‌-ఉల్‌-హక్‌ 


6. మానవాభివృద్ధి సూచికను తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రకటించారు?

1) 1990           2) 1991    3) 1992       4) 1993

జ:1990 


7. ప్రపంచ పోటీతత్వ సూచికను(World Competitiveness Index)ఎవరు ప్రకటిస్తారు?

1) వరల్డ్ ఎకనమిక్‌ ఫోరమ్‌     2) యూఎన్‌డీపీ    

3) ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ (IMD)      4) యూఎన్‌ఓ

జ:ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ (IMD)


8. ప్రపంచ ఆకలి సూచికను(Global Hunger Index) ఎవరు ప్రకటిస్తారు?

1) యూఎన్‌డీపీ       2) యూఎన్‌ఓ     

3) ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌        4) డబ్ల్యూటీఓ

జ: ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌


9. ప్రపంచ ఆకలి సూచిక - 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆకలితో ఉన్న దేశాల జాబితాలో భారత్‌ స్థానం?

1) 105     2) 106     3) 107     4) 108

జ:107


10. యూఎన్‌ఓ ప్రపంచ సంతోష సూచిక - 2022 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం?

1) ఐస్‌లాండ్‌         2) ఇంగ్లండ్‌      3) ఐర్లాండ్‌       4) ఫిన్లాండ్‌

జ:ఫిన్లాండ్‌


11.'Transparency International' అవినీతి అవగాహన సూచిక - 2022 నివేదిక ప్రకారం ప్రపంచం పరంగా అవినీతిలో భారత్‌ స్థానం?  (180 దేశాలతో పోల్చగా) 

1) 82     2) 83     3) 84     4) 85

జ:85


12. అవినీతి అవగాహన సూచిక - 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో అవినీతి లేని దేశం?

1) డెన్మార్క్‌       2) దక్షిణ సూడాన్‌       3) ఆఫ్గనిస్థాన్‌      4) ఫిన్లాండ్‌

జ:డెన్మార్క్‌


13. అంతర్జాతీయ లింగ వ్యత్యాస సూచికను (Global Gender Gap Index) ఎవరు ప్రకటిస్తారు?

1) యూఎన్‌ఓ      2) యూఎన్‌డీపీ      3) డబ్ల్యూటీఓ      4) వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌

జ:వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌


14. అంతర్జాతీయ లింగ వ్యత్యాస సూచిక - 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం ? (46 దేశాలతో పోల్చగా)

1) 135         2) 136    3) 137    4) 138

జ: 135


15. ప్రపంచ ఆవిష్కరణ సూచికను(Global Innovation Index) ఎవరు ప్రకటిస్తారు?

1) వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌

2) ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ 

3) వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ 

4) యూఎన్‌ఓ

జ:వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌


16. ప్రపంచ ఆవిష్కరణ సూచిక - 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం? (132 దేశాల పరంగా)

1) 40         2) 41          3) 42       4) 43

జ:40


17. యూఎన్‌డీపీ లింగ అసమానత సూచిక (Gender Inequality Index - GII) - 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం? (191 దేశాల పరంగా)

1) 122           2) 123        3) 124       4) 125

జ:122   


18. ప్రపంచ ప్రమాద సూచికను(World Risk Index) ఎవరు ప్రకటిస్తారు?

1) ఐఎంఎఫ్‌     2) ఐబీఆర్‌డీ    3) వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌     4) గీవిదిగితిదీ

జ: వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌


19. ప్రపంచ ప్రమాద సూచిక - 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం ? (192 దేశాల పరంగా)

1) రెండు    2) మూడు         3) నాలుగు    4) అయిదు

జ:రెండు 


20. ప్రపంచ ఉగ్రవాద సూచికను(Global Terrorism Index)ఎవరు ప్రకటిస్తారు?

1) ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పీస్‌ 

2) ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌

3) యూఎన్‌ఓ    4) యూఎన్‌డీపీ

జ:ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పీస్‌

21. ప్రపంచ ఉగ్రవాద సూచిక - 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలº భారత్‌ స్థానం? ్బ163 దేశాల పరంగా)

1) 12      2) 13         3) 14     4) 15

జ:12   


22. ప్రపంచ ఉగ్రవాద సూచిక - 2022 ప్రకారం ఉగ్రవాదం కారణంగా ప్రపంచంలోనే ఎక్కువగా ప్రభావితమైన దేశం?

1) ఆఫ్గనిస్థాన్‌       2) నైజీరియా    3) ఇరాక్‌     4) ఇరాన్‌

జ:ఆఫ్గనిస్థాన్‌


23. మానవ స్వేచ్ఛా సూచికను(Human Freedom Index) ఎవరు ప్రకటిస్తారు?

1) CATO ఇన్‌స్టిట్యూట్‌       2) FRASER ఇన్‌స్టిట్యూట్‌       

3) 1, 2                   4) ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌

జ: 1, 2 


24. మానవ స్వేచ్ఛా సూచిక - 2021 నివేదిక ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం? (165 దేశాల పరంగా)

1) 119    2) 120     3) 121      4) 122

జ:119


25. ప్రపంచ డిజిటల్‌ పోటీతత్వ సూచిక (Global Digital Competitive Index) - 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం ఎంత? (63 దేశాల పరంగా)

1) 41      2) 42      3) 43     4) 44

జ: 44


26. ప్రపంచ డిజిటల్‌ పోటీతత్వ సూచికను ఎవరు ప్రకటిస్తారు?

1) ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌

2) యూఎన్‌డీపీ      3) డబ్ల్యూహెచ్‌ఓ         4) ఐబీఆర్‌డీ

జ:ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌


27. వ్యాపార సౌలభ్య సూచికను(Ease of Doing Business-EODB) ఎవరు ప్రకటిస్తారు?

1) ప్రపంచ బ్యాంక్‌ గ్రూపు        2) ఐఎంఎఫ్‌     

3) డబ్ల్యూటీఓ             4) యూఎన్‌డీపీ

జ:యూఎన్‌డీపీ


28. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సూచిక - 2020 నివేదిక ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం? (190 దేశాల పరంగా)

1) 63     2) 64        3) 65      4) 66

జ:63 



మరికొన్ని..

1. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సూచిక - 2020 నివేదిక ప్రకారం మొదటి స్థానంలోని దేశం?

1) న్యూజిలాండ్‌       2) ఐర్లాండ్‌     3) ఇంగ్లండ్‌     4) ఐస్‌లాండ్‌

జ:న్యూజిలాండ్‌

2. నైపుణ్య నగర సూచిక - 2022 (Smart City Index) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తీసుకున్న మొత్తం నగరాల సంఖ్య 102. ఈ నివేదిక ప్రకారం భారత్‌లోని ముంబయి స్థానం ఎంత?

1) 78        2) 79     3) 80        4) 81

జ: 78  


3. నైపుణ్య నగర సూచిక - 2022 నివేదిక ప్రకారం బెంగళూరు స్థానం?

1) 79      2) 80       3) 81     4) 82

జ:79 


4. ప్రపంచ బ్యాంకు 2022, జులై 1న ప్రకటించిన నివేదిక ప్రకారం 2021లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న మొదటి పది దేశాల్లో భారత్‌ స్థానం?

1) అయిదు       2) ఆరు    3) ఏడు    4) మూడు

జ:ఆరు  


5. ఎఫ్‌బీఐ రిసెర్చ్‌ డెస్క్‌ - 2022 నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న మొదటి పది దేశాల్లో భారత్‌ స్థానం?

1) అయిదు        2) ఏడు    3) ఆరు         4) నాలుగు

జ:అయిదు


6. ప్రపంచ బ్యాంకు 2022 నివేదిక ప్రకారం 2021లో స్థూల జాతీయ తలసరి ఆదాయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశాలు వరుసగా..

1) బెర్ముడా, స్విట్జర్లాండ్, నార్వే

2) ఆస్ట్రేలియా, సింగపూర్, నెదర్లాండ్‌

3) ఐస్‌లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్‌

4) డెన్మార్క్, న్యూజిలాండ్, ఐర్లాండ్‌

జ:బెర్ముడా, స్విట్జర్లాండ్, నార్వే


7. ‘ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి శాతం తగ్గుతూ, సేవల రంగంపై ఆధారపడే వారి శాతం పెరగడం అభివృద్ధికి సూచిక’ అని ఎవరు పేర్కొన్నారు?

1) ఆడమ్‌స్మిత్‌        2) జె.ఎం.కీన్స్‌        3) సైమన్‌ కుజ్నెట్స్‌        4) మార్షల్‌

జ: సైమన్‌ కుజ్నెట్స్‌


8. ఆర్థికాభివృద్ధి ఎలాంటి సందర్భాల్లో సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు భావించారు?

1) పేదరికం తగ్గినప్పుడు      2) నిరుద్యోగం తగ్గినప్పుడు     

3) ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడు      4) పైవన్నీ

జ:పైవన్నీ


9. తలసరి ఆదాయం పెరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్బంధ పొదుపు విధిస్తుంటుంది. అప్పుడు ప్రజల వినియోగం...

1) పెరగదు     2) పెరుగుతుంది      3) తగ్గదు      4) స్థిరంగా ఉంటుంది

జ: పెరగదు


10. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికను ఎవరు ప్రకటిస్తారు? 

1) ఐఎంఎఫ్‌     2) ఐబీఆర్‌డీ     3) యూఎన్‌ఓ         4) డబ్ల్యూటీఓ

జ:యూఎన్‌ఓ

సామాజిక ప్రగతి సూచిక - 2022 ప్రకారం దేశంలో సామాజిక పురోగతిలో మొదటి స్థానంలో ఉన్న ప్రాంతాలు?     

1) పుదుచ్చేరి, లక్షద్వీప్, గోవా

2) సిక్కిం, మిజోరం, తమిళనాడు

3) హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, కేరళ

4) పైవన్నీ           

జవాబు: 4

సామాజిక ప్రగతి సూచిక - 2022 ప్రకారం దేశంలో చాలా తక్కువ సామాజిక ప్రగతి సూచిక ఉన్న రాష్ట్రాలు వరుసగా.....

1) ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌

2) అసోం, బిహార్, ఝార్ఖండ్‌

3) ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌

4) త్రిపుర, మిజోరం, బిహార్‌      

జవాబు: 2 


* సామాజిక ప్రగతి సూచిక - 2022 ప్రకారం ప్రపంచంలో భారత్‌ స్థానం? ్బ169 దేశాల పరంగా)

1) 110          2) 111       3) 112      4) 113

జవాబు: 1

Posted Date : 13-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌