• facebook
  • whatsapp
  • telegram

ఖనిజ ఆధారిత పరిశ్రమలు

జింక్, లెడ్‌ పరిశ్రమ

* దేశంలో మొదటి లెడ్‌ పరిశ్రమను ఝార్ఖండ్‌లోని తాండు వద్ద స్థాపించారు. ఇది ప్రస్తుతం హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ ఆధీనంలో ఉంది.

* హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (HZL)ని 1966, జనవరి 10న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో స్థాపించారు. ప్రస్తుతం ఇది వేదాంత కంపెనీ ఆధీనంలో ఉంది. 

* HZL దేశంలోనే అతిపెద్ద ఏకైక సమీకృత కర్మాగారం. జింక్, లెడ్‌ ఉత్పత్తిలో ఇది  ప్రపంచంలోనే రెండో పెద్ద కర్మాగారంగా ఉంది.

* రాజస్థాన్‌లోని రామ్‌పుర అగుచా, కాయడ్‌ దీని ఆధీనంలోని ప్రధాన గనులు.

సిమెంటు పరిశ్రమ

* భారతదేశంలో మొదటి సిమెంటు పరిశ్రమను 1904లో చైన్నైలో స్థాపించారు. ప్రస్తుతం ఇది మూతపడింది.

* 191213లో గుజరాత్‌లోని పోరుబందరు వద్ద సిమెంటు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు.

* 1934 నాటికి మొత్తం 11 సిమెంట్‌ కర్మాగారాలు ఉండగా, వాటిలో పదింటిని ACC Ltd (Assocation Cement Company)లో విలీనం చేశారు. 

* ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022, ఫిబ్రవరి నాటికి మనదేశంలో 210 పెద్ద, 350 చిన్న సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి.

* ప్రపంచంలో సిమెంటు ఉత్పత్తిలో చైనా, భారత్‌లు వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి.

* మనదేశంలో సిమెంట్‌ ఉత్పత్తిలో  ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో సిమెంటు కర్మాగారాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం రాజస్థాన్‌.

సిమెంట్‌ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు:

1. సున్నపురాయి      2. బంకమట్టి 

3. సిలికా      4. అల్యూమినియం  

5. జిప్సం 

6. స్వల్ప మొత్తంలో ఇనుపధాతువు

* సముద్ర గవ్వలపై ఆధారపడిన (Plants based on sea shell) సిమెంట్‌ పరిశ్రమలు చైన్నై, త్రివేండ్రం, పోరుబందరులో ఉన్నాయి.

* తుక్కు మీద ఆధారపడిన సిమెంటు పరిశ్రమలు (Plants based on slag) దుర్గాపూర్, రూర్కెలా, విశాఖ, చైబాస (ఝార్ఖండ్‌); దుర్గ్‌ (ఛత్తీస్‌గఢ్‌)లో ఉన్నాయి.

* బురదపై ఆధారపడిన (Plants based on sludge) సిమెంట్, ఎరువు పరిశ్రమలు సింధ్రి (ఝార్ఖండ్‌)లో ఉన్నాయి.

గాజు పరిశ్రమ 

కావాల్సిన  ముడిపదార్థాలు: సున్నపురాయి,  సిలికా, సోడాయాష్, ఇసుక.

* దేశంలో మొదటి గాజు ఉత్పత్తి కేంద్రాన్ని   బాలగంగాధర తిలక్‌ స్థాపించారు. దీన్ని 1908లో మహారాష్ట్రలోని తాలెగాన్‌ వద్ద  ఏర్పాటు చేశారు. రెండో పరిశ్రమను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజ్‌బాద్‌ వద్ద  నెలకొల్పారు.

* ఫిరోజ్‌బాద్‌ను గ్లాస్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు.

ఇంజినీరింగ్‌ పరిశ్రమలు

భారతదేశంలో ఈ పరిశ్రమలు ప్రధానంగా ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చెందాయి.

హిందుస్థాన్‌ మెషీన్‌ టూల్స్‌ (HMT):

* 1953లో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన యూనిట్లు:

* బెంగళూరు  HMT వాచ్‌ల తయారీ

* హైదరాబాద్‌  HMT ఎలక్ట్రికల్‌ బల్బ్‌ల తయారీ (1981లో ఏర్పాటు)

* కాలమస్సెరి (కేరళ) - గ్రైండర్లు, గేర్ల తయారీ

* పింజోర్‌ (హరియాణా) - ట్రాక్టర్ల తయారీ

* జైపూర్‌ (రాజస్థాన్‌) - గ్రైండర్లు, గేర్ల తయారీ

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (BHEL):

* దీన్ని  1964లో దిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

* ఇది ప్రధానంగా విద్యుత్తు ఉత్పత్తి పరికరాలను తయారు చేస్తుంది.

* భారతీయ రైల్వేకు ఎలక్ట్రిక్‌ ఇంజిన్లను అందిస్తుంది.

* దేశవ్యాప్తంగా 12 ప్రదేశాల్లో 16 తయారీ కేంద్రాలు ఉన్నాయి. అవి: బెంగళూరు  3, తిరుచినాపల్లి (తమిళనాడు)  2, హరిద్వార్‌  2, రాణిపేట్‌ (తమిళనాడు), జగదీష్‌పూర్‌ (యూపీ), తిరుమయం (తమిళనాడు), వైజాగ్, గోయిండ్వాల్‌ (పంజాబ్‌), భోపాల్, ఝాన్సీ (యూపీ), రుద్రాపూర్‌ (ఉత్తరాఖండ్‌), హైదరాబాద్‌.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL):

* దీన్ని 1954లో బెంగళూరు సమీపంలోని జలహల్లి వద్ద స్థాపించారు.

* ఇక్కడ కమ్యూనికేషన్‌ పరికరాలు, రాడార్లు, ప్రసార ట్రాన్స్‌మీటర్లు, గన్‌ కంట్రోల్‌ పరికరాలను తయారవుతాయి.

హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌:

* దీన్ని 1958లో ‘రాంచీ’లో ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటుతో దేశంలో ఇంజినీరింగ్‌ పరిశ్రమ వేగవంతమైంది.

రైల్వే పరిశ్రమ 

రైల్వేకు చెందిన మొదటి పరిశ్రమ పెనిన్సులార్‌ లోకోమోటివ్‌ కంపెనీ. దీన్ని ఝార్ఖండ్‌లోని సింగ్భమ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.

* 1921లో దీన్ని ‘టాటా ఇంజినీరింగ్, లోకోమోటివ్‌’గా మార్చారు.

* పంజాబ్‌లోని పటియాలా వద్ద విడిభాగాల తయారీ కర్మాగారం ఉంది.

రైల్వేవీల్స్‌/ వీల్‌ ఏక్సిల్స్‌ ఫ్యాక్టరీ:

* దుర్గాపూర్‌ (పశ్చిమ్‌ బంగా), యలహంక (కర్ణాటక)లో  చక్రాల, ఇరుసులు ్బత్లిః’(్శ తయారు చేస్తారు.

భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (BEL):

* 1964లో బెంగళూరులో ఏర్పాటు చేశారు. 

* ఇది దిల్లీ, కోల్‌కతా, ముంబయి మెట్రో ట్రైన్‌ కార్పొరేషన్‌ కోసం కోచ్‌లను తయారు చేస్తుంది.

* ఇది ప్రైవేట్‌ కంపెనీ.

ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ: 

* దీన్ని తమిళనాడులోని పెరంబదూర్‌ వద్ద 1955లో ఏర్పాటు చేశారు.

* బ్రాడ్‌గేజ్, మీటర్‌గేజ్‌ బోగీలు, ఎయిర్‌ కండిషనర్‌ బోగీలు ఇక్కడ తయరవుతాయి.

రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ:

* దీన్ని పంజాబ్‌లోని కపుర్తలా వద్ద 1986లో ఏర్పాటు చేశారు.

* ఇక్కడ ప్రయాణికుల బోగీలను తయారు చేస్తారు.

దేశంలో సిమెంట్‌ ఉత్పత్తి కేంద్రాలు 

ఆంధ్రప్రదేశ్‌: కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, కడప

రాజస్థాన్‌: సవాయ్‌ మాధోపూర్, లఖేరి, చిత్తోర్‌గఢ్, ఉదయ్‌పూర్‌

కర్ణాటక: చిట్టనాడ్, కబార్, కేషన్‌

మధ్యప్రదేశ్‌: సాత్నా, కట్ని, బాన్‌మోర్‌

తమిళనాడు: దాల్మియాపురం, అలంగులం, మధురై, తలైముత్తు, సంకర్‌దుర్గ్‌

గుజరాత్‌: సిక్కా, అహ్మదాబాద్, ద్వారకా, పోరుబందరు

అల్యూమినియం శుద్ధి పరిశ్రమ

* భారతదేశ లోహ పరిశ్రమల్లో అల్యూమినియం శుద్ధి పరిశ్రమ రెండో స్థానంలో ఉంది. 

* దేశంలో  మొదటి అల్యూమినియం పరిశ్రమను బ్రిటిష్‌ వారు 1937లో పశ్చిమ్‌ బంగాలోని జయక్‌నగర్‌ వద్ద ఏర్పాటు చేశారు.  ఇది 1938 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. 1944లో దీన్ని ప్రభుత్వరంగ సంస్థగా మార్చారు.

* Indian Alluminium (INDAL) అనే కంపెనీ పేరుతో బ్రిటిష్‌ వారు కేరళలోని అల్లుపురం, ఒడిశాలోని హీరాకుడ్‌ వద్ద మరో రెండు అల్యూమినియం ప్లాంట్‌లను స్థాపించారు.

* అల్యూమినియం తేలిగ్గా ఉంటుంది, తుప్పు పట్టదు, వేడిని బాగా ప్రసరింపజేస్తుంది. దీన్ని కావాల్సిన విధంగా మలచుకోవచ్చు.

* అల్యూమినియం ఇతర లోహాలతో కలిసినప్పుడు బాగా దృఢంగా అవుతుంది. దీన్ని విమానాలు, పాత్రలు, విద్యుత్‌ తీగల తయారీలో ఉపయోగిస్తారు.

* అనేక పరిశ్రమల్లో ఉక్కు, రాగి, జింక్, సీసం మొదలైన వాటికి ప్రత్యామ్నాయంగా  అల్యూమినియాన్ని వాడుతున్నారు.

* భారతదేశంలో  ఎనిమిది అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. అవి: ఒడిశా, పశ్చిమ్‌ బంగా, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఉన్నాయి.

* 2004లో భారత్‌ 600 మిలియన్‌ టన్నులకు పైగా అల్యూమినియంను ఉత్పత్తి చేసింది.

* అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో ఉపయోగించే బాక్సైట్‌ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది.

* మనదేశంలో అల్యూమినియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే సంస్థలు NALCO (National Alluminium Company), Hindalco Industries.

* NALCOలో తక్కువ ఖర్చుతో అల్యూమినియం తయారు చేస్తారు.

* ప్రపంచంలో అత్యధికంగా అల్యూమినియంను ఉత్పత్తి చేసే దేశాలు- చైనా, భారత్, రష్యా, కెనడా, యూఏఈ

రాగి పరిశ్రమ (Copper Industry)

 * హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌: 1967, నవంబరు 9న కలకత్తా కేంద్రంగా స్థాపించారు. దీని ఆధీనంలో కింది కర్మాగారాలు పనిచేస్తున్నాయి.

1. ఇండియన్‌ కాపర్‌ కాంప్లెక్స్‌ - ఘట్‌సిలా (ఝార్ఖండ్‌)

2. ఖేత్రీ కాపర్‌ కాంప్లెక్స్‌ - ఖేత్రీ నగర్‌ (రాజస్థాన్‌)

3. గుజరాత్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ - జగాడియా (గుజరాత్‌)

4. తలోజ కాపర్‌ ప్రాజెక్ట్‌ - తలోజ (మహారాష్ట్ర)

5. ములంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ - ములంజ్‌ఖండ్‌ (మధ్యప్రదేశ్‌)

* హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (బిర్లా కాపర్‌): ఇది దేశంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తి కర్మాగారం. గుజరాత్‌లోని దహేజ్‌లో ఉంది.

ఎరువుల పరిశ్రమ (Fertilisers Industry)

* 1906లో చైన్నై సమీపంలోని రాణిపేట వద్ద మొదటి ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు   చేశారు.

* ఇది సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ ్బళీళీశ్శి ఉత్పత్తి చేసే కర్మాగారం.

* మొట్టమొదటి భారీ ఎరువుల కర్మాగారాన్ని 1943లో కేరళలోని  ఉద్యోగమండల్‌ వద్ద స్థాపించారు. దీని పేరు న్చీ‘్మ ్బ్మ్త’ నీ’౯్మiఃi(’౯( ్చ-్ట ‘్త’్ఝi‘్చః( ్మ౯్చ్ర్చ-‘్న౯’ ఃi్ఝi్మ’్ట్శ. 

* స్వాతంత్య్రానంతరం మరొక  ఎరువుల కర్మాగారాన్ని  1951లో  ఝార్ఖండ్‌లోని సింధ్రీ వద్ద ఏర్పాటు చేశారు. హరిత విప్లవం తర్వాత ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందింది.

* రసాయన ఎరువుల పరిశ్రమలు నత్రజని ఎరువులు ప్రధానంగా యూరియా, భాస్వరం ఎరువులు, అమ్మోనియం ఫాస్ఫేట్‌ ్బదీతిశ్శి, నత్రజని ్బవ్శి, భాస్వరం ్బశ్శి, పొటాష్‌ ్బర్శీలు ఉండే మిశ్రమ ఎరువుల చూట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి.

* భారతదేశంలో వాణిజ్యపరంగా ఉపయోగించే పొటాష్‌ నిల్వలు లేవు. దీని కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.

* నత్రజని ఎరువుల  ఉత్పత్తిలో  కెనడా, అమెరికాల తర్వాత  భారత్‌ మూడో స్థానంలో ఉంది. అలాగే ఫాస్ఫేట్‌ ఎరువుల ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉంది.

* ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వరంగంలో 10 ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి.

* గుజరాత్‌లోని పాజీరా వద్ద  ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సహకారరంగంలో ఒక ఎరువుల కర్మాగారం ఉంది.

Posted Date : 18-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌