• facebook
  • whatsapp
  • telegram

నూతన పారిశ్రామిక  విధానం - 1991

1. పారిశ్రామిక విధానం మొట్టమొదటిసారి ఎప్పుడు ఏర్పాటైంది?

1) 1946    2) 1947     3) 1948    4) 1949


2. మనదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక విధాన తీర్మానం?

1) 1948   2) 1949   3) 1950    4) 1951


3. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు చేశారు??

1) 1953    2) 1954   3) 1955   4) 1956


4. నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు ఏర్పాటైంది?

1) జులై 24, 1991   2) జులై 25, 1991    3) జులై 26, 1991    4) జులై 27, 1993


5. అతిచిన్న పరిశ్రమలు అనే భావన ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం?

1) 1977    2) 1978     3) 1979    4) 1980


6. పరిశ్రమల (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) చట్టాన్ని (ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ - ఐడీఆర్‌ఏ) ఎప్పుడు చేశారు?

1) 1951    2) 1952    3) 1953    4) 1954


7. జిల్లా పారిశ్రామిక కేంద్రాలు (డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ సెంటర్స్‌ - డీఐసి) ఎప్పుడు ఏర్పాటయ్యాయి?

1) 1978    2) 1979      3) 1980     4) 1981


8. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలోని పరిశ్రమలు ఎన్ని? 

1) 4    2) 3    3) 2    4) 1


9. రెండో పారిశ్రామిక విధాన తీర్మానంలోని పరిశ్రమలు ఎన్ని? 

1) 1    2) 2       3) 3    4) 4


10. రెండో పారిశ్రామిక విధానంలో మూడు జాబితాలు ఉంటాయి. వాటిలో పరిశ్రమల వర్గీకరణ, పరిశ్రమల సంఖ్య ఆధారంగా సరైన జతను గుర్తించండి.

1) ఎ. జాబితా - 17 పరిశ్రమలు    2) బి. జాబితా - 12 పరిశ్రమలు    

3) సి. జాబితా - ఎ, బిలో లేని ఇతర పరిశ్రమలు    4) పైవన్నీ


11. 1991 నూతన పారిశ్రామిక విధాన పితామహుడు?

1) పి.వి.నరసింహారావు     2) మొరార్జీ దేశాయ్‌   3) రాజీవ్‌ గాంధీ     4) ఎవరూకాదు


12. 1991 నూతన పారిశ్రామిక విధాన రూపకర్త?

1)డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌   2) పి.వి.నరసింహారావు   3) రాజీవ్‌ గాంధీ    4) ఇందిరా గాంధీ


13. భారత ప్రభుత్వం ప్రణాళిక, అభివృద్ధి విభాగాన్ని (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్శ్‌ ఎప్పుడు ఏర్పాటు చేసింది?

1) 1944    2) 1945   3) 1946    4) 1947


14. పారిశ్రామిక విధాన ప్రకటనను ప్రభుత్వం ఎప్పుడు చేసింది?

1) 1945, ఏప్రిల్‌ 21     2) 1946, ఏప్రిల్‌ 22   3) 1947, ఏప్రిల్‌ 23    4)1948, ఏప్రిల్‌ 24


15. భారత ప్రభుత్వంలో మొదటి కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు?

1) శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ    2) జవహర్‌లాల్‌ నెహ్రూ   3) టి.టి.కృష్ణామాచారి   4) మొరార్జీ దేశాయ్‌


16. 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం, తప్పనిసరిగా లైసెన్స్‌ తీసుకోవాల్సిన పరిశ్రమల సంఖ్య?

1) 18    2) 19    3) 20    4) 21


17. 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం, ప్రభుత్వ రంగానికి రిజర్వు చేసిన పరిశ్రమల సంఖ్య?

1) 8     2) 9    3) 10   4) 11


18. పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానాన్ని రద్దుచేసిన పారిశ్రామిక విధాన తీర్మానం?

1) 1991 నూతన పారిశ్రామిక విధానం   2) మొదటి పారిశ్రామిక విధానం 

3) రెండో పారిశ్రామిక విధానం   4) 1977 పారిశ్రామిక విధానం 


19. 1970 పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానం ప్రకారం పరిశ్రమలను కింది ఏ విధంగా వర్గీకరించారు?

1) కోర్‌ రంగం, అధిక పెట్టుబడి రంగం       2) మధ్య పెట్టుబడి రంగం     

3) రిజర్వు చేసిన చిన్నపరిశ్రమల రంగం     4) పైవన్నీ


20. ఏకస్వామ్య, అక్రమ వ్యాపార నియంత్రణ చట్టం (మోనోపొలీస్‌ అండ్‌ రిస్ట్రిక్టివ్‌ ట్రేడ్‌ ప్రాక్టీసెస్‌ - ఎంఆర్‌టీప్శీ ఏ సంవత్సరంలో  చేశారు?  

1) 1967  2) 1968     3) 1969   4) ఏదీకాదు


21. ఎంఆర్‌టీపీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 

1) 1970    2) 1971     3) 1972      4) 1973


22. ఎంఆర్‌టీపీ చట్టం ముఖ్య ఉద్దేశం?

1) ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగించే ఆర్థికశక్తి కేంద్రీకరణను నిరోధించడం.

2) ఏకస్వామ్య సంస్థల కార్యకలాపాలను, వాటి వ్యాపార విధానాలను నియంత్రించడం.

3) అక్రమ వర్తక విధానాలను నిరోధించడం.

4) పైవన్నీ


23. ఏ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు?

1)మొదటి పారిశ్రామిక (1948) విధానం    2) రెండో పారిశ్రామిక (1956) విధానం

3) 1977 పారిశ్రామిక విధానం    4) 1991 నూతన పారిశ్రామిక విధానం


24. ప్రభుత్వం అనుసరించాల్సిన సరైన పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీ, సంవత్సరాన్ని గుర్తించండి.

1) డాక్టర్‌ సి. రంగరాజన్‌ కమిటీ, 1992 నవంబరు.     2) జి.వి. రామకృష్ణ కమిటీ, 1993 నవంబరు

3) ఎం.నరసింహం కమిటీ, 1994 నవంబరు   4) హజారీ కమిటీ, 1995 నవంబరు


25. పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ ఎవరి అధ్యక్షతన, ఎప్పుడు ఏర్పాటైంది? (ప్రభుత్వరంగ సంస్థల్లో ఎంతవరకు, ఏ పద్ధతిలో వాటాలను విక్రయించాలో  సూచించడానికి దీన్ని ఏర్పాటు చేశారు? 

1) జి.వి.రామకృష్ణ, 1996   2) ఎం.నరసింహం, 1997    

3) రంగరాజన్, 1998    4) శివరామన్, 1999


26. ప్రభుత్వ సంస్థల షేర్లను సంపూర్ణంగా లేదా పాక్షికంగా విక్రయించడం ద్వారా పెట్టుబడిని వెనక్కి తీసుకోవడాన్ని ఏమంటారు?

1) పెట్టుబడుల ఉపసంహరణ    2) పారిశ్రామిక విధానం    3) పారిశ్రామికీకరణ   4) ఏదీకాదు


27. చిన్న పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించిన తీర్మానం?

1) 1977   2) 1948    3) 1980     4) 1991


28. జిల్లా పారిశ్రామిక కేంద్రాల (డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ సెంటర్స్శ్‌ను ప్రతిపాదించిన  పారిశ్రామిక విధాన తీర్మానం ఏది?

1) 1977 తీర్మానం   2) 1948 తీర్మానం    3) 1956 తీర్మానం    4) 1991 తీర్మానం


సమాధానాలు

1-3  2-1  3-4  4-1  5-1  6-1  7-1  8-1  9-3  10-4  11-1  12-1  13-1  14-1  15-1 16-1  17-1  18-1  19-4  20-3  21-1  22-4  23-2  24-1  25-1  26-1  27-1  28-1. 


మరికొన్ని..


1. చిన్నపరిశ్రమల రంగానికి 807 వస్తువులను కేటాయించిన తీర్మానం ఏది?

1) 1977 తీర్మానం    2) 1991 తీర్మానం    3) 1980 తీర్మానం    4) ఏదీకాదు


2. ఆర్థిక ఫెడరలిజం అనే భావనను ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం? 

1) 1977     2)1980     3) 1991   4)1956


3. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రెగ్యులేటింగ్‌ యాక్ట్‌- ఎఫ్‌ఈఆర్‌ఏ) ఎప్పుడు చేశారు?

1) 1971    2) 1972     3) 1973     4) 1974


4. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ - ఎఫ్‌ఈఎంఏ) ఎప్పుడు చేశారు?

1) 1999    2) 1994    3) 1995    4) 1996


5. ఫెమా చట్టం ఎప్పుడు పూర్తిగా అమల్లోకి వచ్చింది?

1)  2000    2) 2001    3) 2002    4) 2003


6. ప్రస్తుతం పారిశ్రామిక లైసెన్సింగ్‌ను తప్పనిసరిగా చేయాల్సిన పరిశ్రమల సంఖ్య?

1)  5     2) 6   3)7   4) 8


7. లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1981     2) 1982    3) 1983   4) 1984


8. ఎంఆర్‌టీపీ చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల గరిష్ఠ ఆస్తుల పరిమితిని ఎత్తివేసిన     తీర్మానం?

1) 1991    2) 1977     3) 1980    4)1956


9. పోటీ చట్టం ఎప్పుడు ఏర్పాటైంది?

1) 2000   2) 2001   3) 2002    4) 2003


10. పోటీ చట్టాన్ని సిఫార్సు చేసిన కమిటీ?

1) రంగరాజన్‌ కమిటీ     2) శివరామన్‌ కమిటీ    3) నరసింహం కమిటీ      4) రాఘవన్‌ కమిటీ


11. నూతన కంపెనీల చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 2011      2)  2012     3) 2013     4) 2014


 12. నూతన పోటీ చట్టం ఏర్పాటైన సంవత్సరం?

1) 2013   2) 2014      3) 2015    4) 2016


13. ఎంఆర్‌టీపీ చట్టం స్థానంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను (సీసీఐ) ఎప్పుడు    ఏర్పాటు చేశారు?

 1) 2001    2) 2002     3) 2003      4) 2004


14. జాతీయ తయారీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 2011, నవంబరు 4    2) 2011, నవంబరు 5        

3) 2011, నవంబరు 6     4) 2011, నవంబరు 7


సమాధానాలు

1-1  2-2  3-3  4-1  5-3  6-1  7-4  8-1  9-3  10-4  11-3  12-1  13-2  14-1.

Posted Date : 16-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌