• facebook
  • whatsapp
  • telegram

రాజకీయ పార్టీలు

1. ‘‘రాజకీయ పార్టీలు అనివార్యమైనవి. ఎంత స్వతంత్ర, పెద్ద దేశమైనా అవి లేకుండా ఉండలేవు. వాటి ఉనికి లేకుండా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఎవరూ చూపలేకపోయారు’’ అని పేర్కొన్నది ఎవరు?

1) లార్డ్‌ బ్రైస్‌          2) గేబ్రియల్‌ ఆల్మండ్‌    3) ఆడం స్మిత్‌       4) డీన్‌బోడిన్‌

జ: లార్డ్‌ బ్రైస్‌


2. కింది వాటిలో రాజకీయ పార్టీ లక్షణాన్ని గుర్తించండి.

ఎ) రాజకీయ పార్టీ తన స్వీయ రాజకీయ భావజాలాన్ని, కార్యక్రమాన్ని కలిగి ఉంటుంది.

బి) జాతీయ ప్రయోజనాలను, జాతీయ సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది.

సి) రాజ్యాంగ సాధనాలతో ఎన్నికల ద్వారా మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

డి) ఉమ్మడి ప్రయోజనాలు, ఒకే రకమైన విలువలు ఉండే వ్యక్తుల సమూహంగా ఉంటుంది.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి      3) ఎ, సి, డి     4) పైవన్నీ

జ:పైవన్నీ


3. దేశంలో ఒక గుర్తించదగిన రాజకీయ కేంద్రకం నుంచి పార్టీ వ్యవస్థ పరిణామం చెందిందని ‘Politics in India’  అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

1) పాల్‌ ఆపిల్‌బీ       2) నానీపాల్కీవాలా     3) రజనీ కొఠారీ       4) దీన్‌దయాళ్‌ అంజుమన్‌

జ:రజనీ కొఠారీ

4. కింది వాటిలో సరైంది ఏది? 

ఎ) ఇంగ్లండ్‌లో లేబర్, కన్జర్వేటివ్‌ పార్టీలు ఉన్నాయి.

బి) ఫ్రాన్స్‌లో డెమొక్రటిక్, లేబర్‌ పార్టీలు ఉన్నాయి.

సి) అమెరికాలో రిపబ్లికన్, డెమొక్రటిక్‌ పార్టీలు ఉన్నాయి

డి) ప్రతిపక్ష పార్టీలను ప్రజాస్వామ్యానికి ‘‘వాచ్‌డాగ్స్‌’’గా  అభివర్ణిస్తారు.

1) ఎ, సి, డి    2) ఎ, బి, డి      3) ఎ, బి, సి     4) పైవన్నీ

జ:ఇంగ్లండ్‌లో లేబర్, కన్జర్వేటివ్‌ పార్టీలు ఉన్నాయి.

5. అసోసియేషన్లు/ సంఘాల ఏర్పాటు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని మనదేశంలో రాజకీయ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?

1) ఆర్టికల్‌ 19 (1)(b)        2)ఆర్టికల్‌ 19 (1)(c)     3) ఆర్టికల్‌ 19 (1)(d)      4) ఆర్టికల్‌ 19 (1)(e)

జ: ఆర్టికల్‌ 19 (1)(c) 

6. కింది వాటిలో రాజకీయ పార్టీ - ఎన్నికల గుర్తుకు సంబంధించి సరైనది ఏది? 

ఎ) జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ - నాగలి 

బి) పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ - సిరాబుడ్డి 

సి) నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ - పుస్తకం 

డి) ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం - రెండు ఆకులు 

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ:  పైవన్నీ


7. వివిధ రాజకీయ పార్టీల స్థాపనకు సంబంధించి సరికానిది?

1) భారత జాతీయ కాంగ్రెస్‌ - 1885     2) గదర్‌ పార్టీ - 1913     3) భారత కమ్యూనిస్టు పార్టీ - 1925      4) స్వరాజ్య పార్టీ - 1931

జ: స్వరాజ్య పార్టీ - 1931


8. రాజకీయ పార్టీల స్థాపకులకు సంబంధించి సరికానిది?

1) గదర్‌ పార్టీ - లాలా హరదయాళ్‌     2) భారత జాతీయ కాంగ్రెస్‌ - ఎ.ఓ.హ్యూమ్‌     

3) ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ - పి.ఎ. సంగ్మా     4) బహుజన సమాజ్‌ పార్టీ - కాన్షీరాం

జ: ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ - పి.ఎ. సంగ్మా


9. ‘‘సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తమ ప్రభుత్వ లక్ష్యం’’ అని ఏ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌ (INC) ప్రకటించింది?

1) మద్రాసు - ఆవడి     2) బెంగళూరు - బెల్గాం    3) బొంబాయి - థానే      4) కలకత్తా - హుగ్లీ 

జ:మద్రాసు - ఆవడి


10. మనదేశ రాజకీయ వ్యవస్ధ ఏ దేశ రాజకీయ వ్యవస్థలా ‘బహుళ పార్టీ’ వ్యవస్థను పోలి ఉంటుంది? 

1) కెనడా      2) బ్రిటన్‌     3) అమెరికా     4) ఫ్రాన్స్‌ 

జ:ఫ్రాన్స్‌ 


11. కింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి సరైంది?  

ఎ) 1969లో కొత్త కాంగ్రెస్, వ్యవస్థా కాంగ్రెస్‌గా చీలిపోయింది 

బి) 1978లో ఇందిరా కాంగ్రెస్, కేబీఆర్‌ కాంగ్రెస్‌గా విడిపోయింది.

సి) 1977లో తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. 

డి) 1967లో జరిగిన ఎన్నికల అనంతరం అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది.

1) ఎ, బి, సి        2) ఎ, బి, డి      3) ఎ, సి, డి       4) పైవన్నీ

జ:పైవన్నీ


12. ఏ సంవత్సరంలో జరిగిన తొలి మధ్యంతర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ‘గరీబీ హఠావో’ (పేదరికాన్ని నిర్మూలించడం) అనే నినాదం ఇచ్చింది?

1) 1967      2) 1971     3) 1977       4) 1984

జ:1971 


13. 1980లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలో ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ ఏ నినాదంతో అధికారాన్ని చేపట్టింది?

1) అన్యాయ్‌ హఠావో    2) ఇందిరా కో బులావో, దేశ్‌ కో బచావో    3) గరీబీ హఠావో     4) ఇందిరా కో కమాల్‌ కో

జ:ఇందిరా కో బులావో, దేశ్‌ కో బచావో 


14. భారతీయ జనతా పార్టీ (BJP) ఎప్పుడు ఏర్పడింది?

1) 1980, ఏప్రిల్‌ 6        2) 1982, ఏప్రిల్‌ 6      3) 1951, ఏప్రిల్‌ 6        4) 1984, ఏప్రిల్‌ 6

జ:1980, ఏప్రిల్‌ 6 

15. రామ్, రోటీ, ఇన్సాఫ్‌ (భయం, ఆకలి, వివక్షత)ల నుంచి ప్రజలను రక్షిస్తామని 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది?

1) భారత జాతీయ కాంగ్రెస్‌ (INC)     2) నేషనల్‌ కాన్ఫరెన్స్‌(NC)     3) బీజేపీ        4) బిజూ జనతాదళ్‌ (BJD)

జ: బీజేపీ 


16. భారతీయ జనతా పార్టీకి సంబంధించి సరైంది ఏది? 

ఎ) 1984లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం పొందింది.

బి) 2009లో 249 స్థానాలు గెలుపొందింది.

సి) 2014లో 282 స్థానాలు సాధించింది.

డి) 2019లో 303 స్థానాలు గెలుపొందింది

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి      3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ:ఎ, సి, డి 


17. భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) కి సంబంధించి కింది వాటిలో సరికానిది?

1) 1957లో కేరళ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. 

2) కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనే ఓట్ల ద్వారా అధికారాన్ని చేపట్టింది కేరళలోనే.

3) 1989లో ఏర్పాటైన ‘నేషనల్‌ ఫ్రంట్‌’ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది

4) 2004లో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది.

జ: 2004లో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది.

18. భారత కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన విభేదాల ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎంగా ఎప్పుడు చీలిపోయింది? 

1) 1962       2) 1963       3) 1964         4) 1966

జ: 1964   

19. జనతా పార్టీకి సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) 1977, మార్చి 23న ఏర్పడింది

బి) ఈ పార్టీలో అంతర్భాగంగా భారతీయ లోక్‌దళ్, జనసంఘ్, సోషలిస్ట్‌ పార్టీ, కాంగ్రెస్‌ (ఓ) విలీనమయ్యాయి.

సి) 1977లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది.

డి) 2013లో బీజేపీలో విలీనమైంది

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి      3) ఎ, బి, డి        4) పైవన్నీ

జ:పైవన్నీ


20. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కి సంబంధించి సరికానిది? 

1) 1949, సెప్టెంబరు 17న అన్నాదురై స్థాపించారు. 

2) ఇది భారత్‌లోని ప్రాంతీయ పార్టీలన్నింటిలోకెల్లా పురాతనమైంది.

3) 1952లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలు గెలుపొందింది 

4) 1974లో పార్టీలో చీలికవచ్చి తిఖితిదీలీరీ (ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) ఏర్పడింది

జ: 1952లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలు గెలుపొందింది 

21. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సరైంది? 

ఎ) 1982, మార్చి 29న ఈ పార్టీ స్థాపించారు 

బి) ‘‘తెలుగు ప్రజల ఆత్మగౌరవం’’ అనే నినాదంతో ఎన్‌.టి.రామారావు స్థాపించారు. 

సి) 1983లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 

డి) 1984లో పార్టీలో చీలికవచ్చి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి      3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ: పైవన్నీ


22. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీని కె.చంద్రశేఖరరావు ఎప్పుడు స్థాపించారు?

1) 2001, ఏప్రిల్, 27     2) 2001, జూన్‌ 17     3) 2001, సెప్టెంబరు 17     4) 2001, నవంబరు 19 

జ: 2001, ఏప్రిల్, 27


23.YSR కాంగ్రెస్‌ పార్టీని ఎవరు స్థాపించారు? 

1) వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి     2) కొవిశెట్టి శివకుమార్‌ 

3) వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి       4) వై.ఎస్‌. వివేకానందరెడ్డి 

జ:కొవిశెట్టి శివకుమార్‌


24. కింది వాటిలో ‘‘శివసేన పార్టీ’’కి సంబంధించి సరైంది?

ఎ) 1966, జూన్‌ 19న ఏర్పాటు చేశారు.        బి) దీన్ని బాల్‌థాకరే స్థాపించారు.     

సి) మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే అనే వాదనను అనుసరించింది     డి) 2006లో ఈ పార్టీలో చీలికవచ్చి రాజ్‌థాకరే నేతృత్వంలో ‘‘మహారాష్ట్ర నవ నిర్మాణసేన’’ అనే పార్టీ అవతరించింది

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి      3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ:పైవన్నీ


25. ఆమ్‌ ఆద్మీ పార్టీకి సంబంధించి సరికానిది?

1) 2012, నవంబరు 26న స్థాపించారు      2) కేజ్రీవాల్‌ స్థాపించిన ఈ పార్టీ గుర్తు ‘చీపురు’

3) 2013లో దిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది     4) ‘అవినీతి రహిత సమాజం’ ఈ పార్టీ ప్రధాన లక్ష్యం.

జ:2013లో దిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది


26. ‘జనసేన పార్టీ’ని పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు స్థాపించారు? 

1) 2014, మార్చి 14       2) 2015, ఏప్రిల్‌ 16      3) 2016, నవంబరు 26      4) 2018, జూన్‌ 21

జ:2014, మార్చి 14 



గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కింది వాటిని జతపరచండి. (ఏపీ సబ్‌-ఇన్‌స్పెక్టర్స్, 2018)

a)బహుజన సమాజ్‌ పార్టీ      i) గడియారం     

b)నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ      ii) బాణం 

c) ద్రవిడ మున్నేట్ర కజగం     iii) ఏనుగు 

d) జనతా దళ్‌ (యునైటెడ్‌)    iv) ఉదయించే సూర్యుడు    

1) a-ii,   b-iv,   c-i,   d-iii

2) a-iii,  b-iv,  c-i,  d-ii

3) a-ii, b-i, c-iii, d-iv

4) a-iii, b-i, c-iv, d-ii

జ:a-iii, b-i, c-iv, d-ii


2. కింద పేర్కొన్న ఏ రాజకీయ పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్‌ కాదు? (ఏపీ కానిస్టేబుల్స్, 2018)

1) రాష్ట్రీయ జనతాదళ్‌       2) తెలుగుదేశం     3) జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ పాంథర్స్‌ పార్టీ     4) సమాజ్‌వాదీ పార్టీ

జ:రాష్ట్రీయ జనతాదళ్‌


3. ‘రాజకీయ పార్టీ’ అనే పదాన్ని రాజ్యాంగంలో పేర్కొన్న సవరణ ఏది? (ఏపీ కానిస్టేబుల్స్, 2018)

1) మొదటి రాజ్యాంగ సవరణ చట్టం, 1951     2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978          4) 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 

జ: 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 


4. కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌)ని దిశిఖ్బిల్శీ ఎప్పుడు స్థాపించారు? (సబ్‌-ఇన్‌స్పెక్టర్స్, 2012) 

1) 1960    2) 1961     3) 1962    4) 1964

జ: 1964


5. పార్టీ ఫిరాయింపుల నిషేధానికి సంబంధించిన 52వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు ఆమోదించారు? (ఏపీ కానిస్టేబుల్స్, 2018) 

1) 1980    2) 1985     3) 1989       4) 1991 

జ:  1985 

Posted Date : 17-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌