• facebook
  • whatsapp
  • telegram

లాభనష్టాలు

కొన్నధరకే అమ్మినా కచ్చితంగా లాభం!

వ్యక్తుల మధ్య, వ్యాపారంలో ఎలాంటి లావాదేవీలు జరిగినా లాభనష్టాల ప్రస్తావన ఉంటుంది. ఒక వస్తువును కొనాలన్నా, అమ్మాలన్నా ఒక ధరను నిర్ణయిస్తారు. అది కొన్న లేదా ఉత్పత్తి చేసిన విలువ కంటే ఎక్కువైతే లాభం, తక్కువైతే నష్టం. మౌలికంగా అంతవరకే కనిపించినప్పటికీ, అంకగణితానికి వచ్చేసరికి అందులో అదనంగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు తూకంలో లేదా కొలతలో మోసం చేస్తే కొన్న ధరకే అమ్మినా కచ్చితంగా లాభం వస్తుంది. ఇలాంటి మెలికలు రకరకాల ప్రశ్నల రూపంలో పోటీ పరీక్షల్లో అడుగుతుంటారు. అభ్యర్థులు వాటిని తెలుసుకోవాలి.

కొన్నవెల కంటే అమ్మిన వెల ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. 

  లాభం = అమ్మిన వెల -  కొన్నవెల

కొన్నవెల కంటే అమ్మిన వెల తక్కువగా ఉంటే నష్టం వస్తుంది.

  నష్టం = కొన్నవెల - అమ్మిన వెల

లాభశాతం లేదా నష్టశాతాన్ని ఎల్లప్పుడూ కొన్నవెల మీద లెక్కిస్తారు.

లాభశాతం లేదా నష్టశాతం, కొన్నవెల తెలిసినప్పుడు 

* లాభశాతం లేదా నష్టశాతం, అమ్మిన వెల తెలిసినప్పుడు 

ఒక వ్యాపారి రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మడం వల్ల మొదటి వస్తువుపై x% లాభం లేదా నష్టం, రెండో వస్తువుపై x% నష్టం లేదా లాభం వస్తే 

 అతడికి ఎల్లప్పుడూ 

 నష్టం వస్తుంది. 

ఒక వ్యాపారి రెండు వస్తువులను ఒకే ధరకు కొని అమ్మడం వల్ల మొదటి వస్తువుపై x% లాభం/నష్టం, రెండో వస్తువుపై x% నష్టం/లాభం వస్తే అతడికి ఎల్లప్పుడూ లాభం లేదా నష్టం ఉండదు.

* ముద్రించిన ధర = అసలు ధర + పెంచిన ధర

మాదిరి ప్రశ్నలు

1. 11 వస్తువులను రూ.10 చొప్పున కొని 10 వస్తువులను రూ.11కు అమ్మితే లాభమా, నష్టమా? ఎంతశాతం?

1) 10%     2) 11%     3) 20%     4) 21%

జవాబు: 4

సాధన: ఒక్కోటి రూ.10 చొప్పున కొంటే 11 x 10 = 110 వస్తువులు

2. ఒక బాక్స్‌ నిండా పెన్సిళ్లు ఉన్నాయి. వాటిని రూ.4కు 7 చొప్పున కొని, రూ.5కు 8 చొప్పున అమ్మితే రూ.30 లాభం వచ్చింది. అయితే ఆ బాక్స్‌లో  ఎన్ని పెన్సిళ్లు ఉన్నాయి?

1) 360    2) 460    3) 560    4) 660

జవాబు: 3

సాధన: 

3. ఒక పండ్ల వ్యాపారి  కొన్ని ఆరెంజ్‌లను రూ.10కి 4 చొప్పున, అదే సంఖ్యలో రూ.10కి 5 చొప్పున కొన్నాడు. వాటన్నింటినీ కలిపి రూ.20కి 9 చొప్పున అమ్మితే అతడికి లాభమా, నష్టమా? ఎంతశాతం?

జవాబు: 1

సాధన: వ్యాపారి ఒక్కో రకపు ఆరెంజ్‌లను 18 చొప్పున కొన్నాడు అనుకుంటే (9 గుణిజం అని 18 అనుకున్నాం. ఏ సంఖ్య అయినా తీసుకోవచ్చు.)

4. 18 వస్తువుల కొన్నవెల 15 వస్తువుల అమ్మిన వెలకు సమానం. అయితే లాభమా, నష్టమా? ఎంతశాతం?

1) 5%      2) 10%     3) 15%     4) 20%

జవాబు: 4

సాధన: ఒక్కో వస్తువును రూ.10 కు కొంటే 

కొన్నధర = 18 x 10 = 180

దత్తాంశం ప్రకారం 15 వస్తువులు అమ్మితే రూ.180 వస్తాయి 

5. ఒక మోసపూరిత వ్యాపారి తాను అమ్మే వస్తువులను కొన్న ధరకే అమ్ముతానని చెప్పాడు. ఒక కిలో బరువుకు బదులు 800 గ్రాముల బరువును ఉపయోగిస్తే లాభశాతం ఎంత?

1) 15%     2) 20%     3) 25%     4) 30% 

జవాబు: 3

సాధన: 

6. ఒక గడియారాన్ని రూ.24కి అమ్మడం వల్ల ఆ గడియారం యొక్క లాభశాతం, కొన్నవెల సంఖ్యాపరంగా సమానం. అయితే ఆ గడియారం కొన్నవెల ఎంత?

1) రూ.12     2) రూ.20     3) రూ.16     4) రూ.18

జవాబు: 2

సాధన: కొన్న ధర = x లాభశాతం = x% అమ్మినవెల = 24

7. ఒక వస్తువు ప్రకటన ధరపై మొదట 20% డిస్కౌంట్‌ ఇచ్చి, తర్వాత 12% డిస్కౌంట్‌ అదనంగా ఇచ్చాడు. దాన్ని రూ.704కు అమ్మితే ప్రకటన ధర ఎంత?

1) రూ.844.80    2) రూ.929.28    3) రూ.1000    4) రూ.1044.80

జవాబు: 3

సాధన: ఒక వస్తువు ప్రకటన ధర x అనుకుందాం

8. ఒక ఫ్యాన్‌ ప్రకటన ధర రూ.1500. దానిపై 20% డిస్కౌంట్‌ ప్రతిపాదన ఇచ్చారు. దాన్ని అమ్మిన ధర రూ.1104. దానిపై రెండో రాయితీ ఎంత?

1) 8%   2) 10%   3) 12%  4) 15%

జవాబు: 1

సాధన: దత్తాంశం ప్రకారం

9. రూ.80 ప్రకటన ధర గల సంచిని రూ.68లకు అమ్మారు. అయితే డిస్కౌంట్‌ రేటు ఎంత?

1) 12%     2) 15%     3)

     4) 20%

జవాబు: 2

సాధన: డిస్కౌంట్‌ = 80 - 68 = 12

         

రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్‌ రెడ్డి 

 

 

Posted Date : 16-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌