• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష విజ్ఞానశాస్త్రం

1. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అంతరిక్ష వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?(మానవుడు కృత్రిమంగా  తయారు చేసిన ఉపగ్రహం ‘స్పుత్నిక్‌ వన్‌’ విజయానికి గుర్తుగా జరుపుకుంటారు)

1) అక్టోబరు 4 నుంచి 10 వరకు    

2) అక్టోబరు 10 నుంచి 16 వరకు

3) అక్టోబరు 17 నుంచి 23 వరకు

4) అక్టోబరు 24 నుంచి 30 వరకు    

2. అంతరిక్షంలో భూదిగువ కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) ఆగస్టు 15, 1962 

2) అక్టోబరు 4, 1957

3) జులై 20, 1969 

4) నవంబరు 20, 1998

3. యూఎస్‌ఎస్‌ఆర్‌ సహకారంతో ఏప్రిల్‌ 19, 1975లో భారత్‌ నుంచి పంపించిన మొదటి స్వదేశీ ఉపగ్రహం ఏది?

1) రోహిణి        2) భాస్కర      3) ఆర్యభట్ట        4) స్పుత్నిక్‌

4. ఇన్‌శాట్‌ శ్రేణి ఉపగ్రహాలను ఎప్పటి నుంచి ప్రారంభించారు?

1) 1982    2) 1988    3) 1998      4) 1992

5. అంతరిక్షంలోకి పంపే రాకెట్‌ లాంచ్‌ నౌకలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి?

1) న్యూటన్‌ ప్రథమ నియమం

2) న్యూటన్‌ ద్వితీయ నియమం

3) న్యూటన్‌ తృతీయ నియమం

4) పైవన్నీ

6. భారత అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో అత్యంత నమ్మకం కలిగిన వాహకనౌక పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌కు ఉన్న మరోపేరు ఏమిటి?

1) వర్క్‌ హార్స్‌ ఆఫ్‌ ఇస్రో

2) రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌

3) అవతార్‌    

4) స్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌


7. కింది వాటిలో సరైంది?

1) ఐఆర్‌ఎస్‌ ఉపగ్రహాలు రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ఆధారంగా భూగర్భ జలాలు, ఫారెస్ట్‌ మ్యాపింగ్, వరద ప్రభావిత ప్రాంతాలు, చిత్తడి నేలలు, సహజ వనరులను గుర్తించటానికి ఉపయోగపడతాయి.

2) ఇన్‌శాట్‌ శ్రేణి ఉపగ్రహాలు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే అత్యంత పెద్ద కమ్యూనికేషన్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ ఉపగ్రహాల ద్వారా ఉపగ్రహ ఆధారిత సమాచార వ్యవస్థ, డైరెక్ట్‌ టు హోం సేవలు, డిజిటల్‌ శాటిలైట్‌ న్యూస్‌ గాథరింగ్,  మొబైల్‌ శాటిలైట్‌ సేవలు, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్‌ మొదలైనవి అందుతున్నాయి.

3) నావిగేషన్‌ ఉపగ్రహాలు జియో స్పేషియల్‌ పొజిషనింగ్‌ రియల్‌ టైం మానిటరింగ్‌ సేవలను అందిస్తాయి.

4) పైవన్నీ


8. భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రభుత్వ సేవలతో పాటు ప్రైవేట్‌ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన సంస్థ, దాని ముఖ్య కేంద్రం?

1) ఆంట్రిక్స్‌ కార్పొరేషన్, బెంగళూరు

2) న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్, బెంగళూరు

3) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్, శ్రీహరికోట

4) ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథ]రైజేషన్‌ సెంటర్, అహ్మదాబాద్‌


9. కింది వాటిలో సరైంది?

1) దేశంలో మొదటి మల్టీవేవ్‌ లెంత్‌ స్పేస్‌ అబ్జర్వేటరీ ఉపగ్రహమైన ఆస్ట్రో శాటిలైట్‌ను పీఎస్‌ఎల్‌వీ సీ-30 మిషన్‌ ద్వారా 28 సెప్టెంబరు 2015లో ప్రయోగించారు.

2) నవంబరు 5, 2013లో భారత్‌ తన మొదటి ప్రయత్నంలోనే మార్స్‌పైకి పీఎస్‌ఎల్‌వీ సీ-25 మిషన్‌ ద్వారా ఉపగ్రహాన్ని పంపింది.

3) జులై 1, 2013లో స్వదేశీ నావిగేషన్‌ శ్రేణి ఉపగ్రహాలను ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 1A ప్రయోగంతో ప్రారంభించింది. వాహకనౌక పేరు పీఎస్‌ఎల్‌వీ సీ-22

4) పైవన్నీ 


10. జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌లో క్రయోజెనిక్‌ ఇంధనాన్ని ఏ దశలో ఉపయోగిస్తారు?

1) మొదటి     2) రెండు 

3)మూడు       4)నాలుగు


11. కింది వాటిలో స్మాల్‌ శాటిలైట్‌ వాహకనౌక సాంకేతికత గురించి సరైంది?

1) ఇవి అతి తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్యలోకి 500 కేజీల వరకు తీసుకువెళ్తాయి.

2) సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి 300 కేజీల వరకు తీసుకువెళ్తాయి.

3) నానో, మైక్రో, చిన్న ఉపగ్రహాలను తీసుకువెళ్లే సామర్థ్యం ఉండటంతో వీటిని మినీ రాకెట్స్‌గా పిలుస్తారు.

4) పైవన్నీ 

12. కింది వాటిలో సరైంది?

1) నవంబరు 26, 2022న భారత్‌ పీఎస్‌ఎల్‌వీ సీ-54 మిషన్‌ ద్వారా నివీళీ  6, ఎనిమిది నానో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది.

2) ఈ మిషన్‌లోనే భారత్, భూటాన్‌ సంయుక్తంగా ఖివిళీ  2తీ ఉపగ్రహాన్ని కూడా పంపించాయి.

3) పీఎస్‌ఎల్‌వీ సీ-54 వాహకనౌకను 321 టన్నుల బరువుతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.

4) పైవన్నీ

13. LVM-3 ఉపగ్రహం గురించి కింది వాటిలో సరైంది?

1) ఇస్రో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 ఉపగ్రహ వాహకనౌకను రీడిజైన్‌ చేసి లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3గా నామకరణం చేసింది.

2) LVM-3 మిషిన్‌ 36 ఉపగ్రహ సమూహాలతో నిర్మితమై ఉంటుంది. ఇది బ్రాడ్‌బాండ్‌ సేవలను అందిస్తుంది.

3) ఈ వాహక నౌకను అక్టోబరు 22న సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా ప్రయోగించిన మొదటి ఉపగ్రహం.

4) పైవన్నీ

14. కింది వాటిలో పీఎస్‌ఎల్‌వీ సీ-54 వాహకనౌక ద్వారా ప్రయోగించిన EOS - 6 ఉపగ్రహ విశేషాలను గుర్తించండి?

1) ఇది సముద్ర శాస్త్ర అధ్యయనం కోసం పంపిన మూడో తరం ఉపగ్రహం. ఓషన్‌ శాట్‌ శ్రేణి ఉపగ్రహాల స్థానంలో EOS ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపిస్తుంది.

2) ఈ ఉపగ్రహం ఓషన్‌ కలర్‌ మానిటర్‌ (OCM), సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత (SST), విండ్‌ వెక్టార్‌ డేటా లాంటి సముద్ర ప్రమాణాలను అత్యంత నిశితంగా పరిశీలించగలదు.

3) శీతోష్ణస్థితి, వాతావరణ సంబంధిత అనువర్తనాలపై విశిష్ట సేవలు అందించనుంది.        

4) పైవన్నీ 

15. భారత్‌లో రైలు ప్రమాదాలను తగ్గించడానికి స్వదేశీ నిర్మితమైన ట్రైన్‌ కొలిషన్‌ అవాయిడెన్స్‌ సిస్టంను (TCAS)  ఏ మార్గంలో మొదటిసారిగా వినియోగించారు? (దీన్ని రిసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ లఖ్‌నవూ రూపొందించింది)

1) ముంబయి - దిల్లీ - హౌరా మార్గం    

2) కోల్‌కతా - చెన్నై మార్గం

3) చెన్నై- కన్యాకుమారి మార్గం        

4) సికింద్రాబాద్‌ - భువనేశ్వర్‌ మార్గం

మరికొన్ని

1. హైడ్రోజన్‌తో పనిచేసే రైలును మొదటిసారిగా ఏ దేశం ఆవిష్కరించింది?

1 ఇంగ్లండ్‌        2) అమెరికా    

3) రష్యా            4) జర్మనీ

2. ఆసియాలోనే పెద్దదైన ఇంటర్నేషనల్‌ లిక్విడ్‌ మిర్రర్‌ టెలిస్కోప్‌ను (ఐఎల్‌ఎంటీ) ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) నైనిటాల్, ఉత్తరాఖండ్‌        

2) బెంగళూరు, కర్ణాటక

3) చెన్నై, తమిళనాడు        

4) హైదరాబాద్, తెలంగాణ

3. ఫిబ్రవరి 14, 2022లో జరిగిన పీఎస్‌ఎల్‌వీ సీ-52 ఉపగ్రహ ప్రయోగం గురించి కింది వాటిలో సరైంది?

1) ఈ మిషన్‌లో ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (EOS-4) ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు.

2) EOS-4 ఉపగ్రహ బరువు 1710 కిలోలు. ఈ ఉపగ్రహం వాతావరణం, వ్యవసాయం, అడవి వృక్ష సంపద తదితర వాటిపై పరిశోధనలు చేస్తుంది.

3) ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహాన్ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ టెక్నాలజీ, లాబొరేటరీ ఆఫ్‌ అట్మాస్ఫిరిక్‌ అండ్‌ స్పేస్‌ ఫిజిక్స్, యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో సంస్థలు కలిసి నిర్మించాయి.

4) పైవన్నీ

4. స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన మొదటి సూపర్‌ కంప్యూటర్‌ ఏది?

1) పరం శివాయ్‌        2) పరం గంగా

3) పరం ప్రవేగా        4) పరం అనంత


5. భారత్‌లో మొదటిసారిగా త్రీడీ ప్రింటెడ్‌ రాకెట్‌ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) చెన్నై    2) హైదరాబాద్‌     3)ముంబయి     4) దిల్లీ


6. ఫిబ్రవరి 2022 వరకు దేశంలో అతివేగంగా పనిచేసిన సూపర్‌ కంప్యూటర్‌ను గుర్తించండి?

1) పరం శివాయ్‌     2) పరం ప్రవేగా    

3) ప్రత్యూష్‌            4) మిహిర్‌


7. ఏ రాష్ట్రం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే డిజిటల్‌ లోక్‌అదాలత్‌ను ఉపయోగించుకొని 75 లక్షల వివాదాలను పరిష్కరించింది?

1) రాజస్థాన్‌    2) మహారాష్ట్ర    3) కర్ణాటక    4) అసోం


8. నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటా బేస్‌ ఆన్‌ అరెస్టెడ్‌ నార్కో అఫెండర్స్‌ పోర్టల్‌ సంక్షిప్త రూపం.......

1) NAMASTE        2) NIDAAN

3) UMANG            4) SAAKAR


9. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ నేషనల్‌ సూపర్‌ కంప్యూటర్‌ మిషన్‌ను ఎప్పుడు ప్రారంభించింది?

1) 2014    2) 2015      3) 2016     4) 2017

Posted Date : 16-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌