• facebook
  • whatsapp
  • telegram

షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాల పరిపాలన  

1. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో ఏ రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్డ్‌ ప్రాంతాలు, తెగల పరిపాలన గురించి వివరించారు?

1) అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర     2) మణిపూర్, మేఘాలయ, త్రిపుర

3 ) అసోం, మణిపూర్, త్రిపుర       4)  అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర



2. మన దేశంలో 2022 నాటికి ఎన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలున్నాయి?

1) 6      2) 8       3) 9     4) 10



3. కింది వాటిలో షెడ్యూల్డ్‌ ప్రాంతాలున్న రాష్ట్రాలను గుర్తించండి.

1) ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒడిశా     2) ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర       

3) రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌        4) పైవన్నీ



4. షెడ్యూల్డ్‌ ప్రాంతాలను ప్రకటించడానికి కింది వాటిలో దేన్ని ఆధారంగా తీసుకుంటారు?

ఎ) గిరిజన జనాభా ప్రాబల్యం        బి) ప్రజల ఆర్థిక ప్రమాణాల్లో అసమానత

సి) అభివృద్ధి చెందని స్వభావం       డి) చారిత్రక, భౌగోళిక అంశాలు

1) ఎ, బి, డి         2) ఎ, సి, డి      3) ఎ, బి, సి       4) పైవన్నీ



5. ఒక రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతాన్ని గవర్నర్‌తో సంప్రదించిన అనంతరం ‘‘షెడ్యూల్డ్‌ ప్రాంతం’’గా ఎవరు ప్రకటిస్తారు?

1) సుప్రీంకోర్టు      2) కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ     

3) జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌     4) రాష్ట్రపతి



6. షెడ్యూల్డ్‌ ప్రాంతాల సంక్షేమంపై అధ్యయనానికి 1960లో ఎవరి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేశారు?

1) రాగ్యానాయక్‌      2) బిర్సాముండా   3) ధేబార్‌      4) సచిన్‌ సన్యాల్‌



7. షెడ్యూల్డ్‌ ప్రాంతాల సంక్షేమంపై అధ్యయనానికి 2002లో ఎవరి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేశారు?

1) దిలీప్‌సింగ్‌ భూరియా    2) వీరప్ప మొయిలీ      3) రంగనాథ్‌ మిశ్రా     4) జయంతి పట్నాయక్‌



8. కింది వాటిలో తెగల సలహా మండలికి (tribal advisory council) సంబంధించి సరైంది? 

ఎ) ఇందులో 20 మంది సభ్యులు ఉంటారు.

బి) షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం, అభివృద్ధిపై సలహా ఇస్తుంది.

సి) దీన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తుంది.

డి) ఇందులోని 3/4 వంతు ప్రతినిధులు రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా ఉంటారు

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి   3) ఎ, బి, సి    4) పైవన్నీ



9. ప్రస్తుతం మనదేశంలో 6వ షెడ్యూల్‌లో పేర్కొన్న 4 రాష్ట్రాల్లో ఎన్ని గిరిజన ప్రాంతాలు ఉన్నాయి? (ఈ గిరిజన ప్రాంతాలు స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలుగా ఉంటాయ్శి

1) 4     2) 6     3) 8     4) 10



10. కింది వాటిలో గిరిజన ప్రాంతాలకి (స్వయం ప్రతిపత్తి జిల్లాల్శు సంబంధించి సరైంది?

ఎ) ప్రతి గిరిజన ప్రాంత పరిపాలనకు 30 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ప్రాంతీయ మండలి ఉంటుంది

బి) ప్రత్యేక ప్రాంతీయ మండలిలో 26 మంది సభ్యులు వయోజన ఓటింగ్‌ ద్వారా ఎన్నికవుతారు.

సి) ఎన్నికైన సభ్యుల పదవీ కాలం - ఆరేళ్లు

డి) గవర్నర్‌ ఈ మండలికి నలుగురిని నామినేట్‌ చేస్తారు.

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి     3) ఎ, సి, డి     4) పైవన్నీ



11. కింది వాటిలో అసోం రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలను గుర్తించండి.

1) ఉత్తర కాచార్‌ హిల్స్‌ జిల్లా     2) కార్బీ అంగ్‌లాంగ్‌ జిల్లా     

3) బోడోలాండ్‌ టెరిటోరియల్‌ ఏరియా జిల్లా     4) పైవన్నీ



12. కింది వాటిలో మిజోరం రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకి సంబంధించి సరికానిదేది?

1) చక్మా జిల్లా     2) మారా జిల్లా    3) బాగీ జిల్లా     4) లాయి జిల్లా



13. కింది వాటిలో మేఘాలయ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకి సంబంధించి సరికానిదేది?

1) గారోహిల్స్‌ జిల్లా      2) జయంతియా హిల్స్‌ జిల్లా     3) ఖాసి (Khasi) హిల్స్‌ జిల్లా       4)  క్లీచింగ్‌ హిల్స్‌ జిల్లా



14. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన ప్రాంతాల పాలనకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో విస్తరించాయి.     

బి) గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తారు.

సి) గిరిజన సలహా మండలిలో ఇరవై మంది సభ్యులు ఉంటారు.       

డి) ఈ మండలిని రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేస్తుంది.

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ


15. కింది వాటిలో రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన ప్రాంతాల పాలనకు సంబంధించి సరైంది?

ఎ) అసోం, మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించిన గిరిజన ప్రాంతాలను దీనిలో చేర్చారు.   

బి) రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిలో ఉంటాయి.

సి) నిర్దిష్ట శాసన, న్యాయ అధికారాలతో జిల్లా, ప్రాంతీయ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తారు.     

డి) కౌన్సిల్‌లోని మొత్తం సభ్యుల సంఖ్య 30

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి      3) ఎ, బి, సి    4) పైవన్నీ

16. రాష్ట్రపతి జారీచేసిన ‘షెడ్యూల్డ్‌ ప్రాంతాల ఆర్డర్, 1975’ ఏ రాష్ట్రానికి వర్తిస్తుంది?

1) హిమాచల్‌ప్రదేశ్‌     2) అరుణాచల్‌ప్రదేశ్‌    3) ఉత్తర్‌ప్రదేశ్‌   4) పంజాబ్, హరియాణా



17. కింది వాటిలో ‘షెడ్యూల్డ్‌ ప్రాంతాల ఆర్డర్, 1977’ ఏ రాష్ట్రానికి వర్తిస్తుంది?

1) పంజాబ్, హరియాణా, తమిళనాడు        2) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు

3) గుజరాత్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా      4) రాజస్థాన్, పంజాబ్, హరియాణా



18. ‘షెడ్యూల్డ్‌ ప్రాంతాల ఆర్డర్, 1981’ ఏ రాష్ట్రానికి వర్తిస్తుంది?

1) రాజస్థాన్‌     2) తమిళనాడు     3) కర్ణాటక        4) బిహార్‌



19. కింది వాటిలోని ఏ రాష్ట్రానికి ‘షెడ్యూల్డ్‌ ప్రాంతాల ఆర్డర్, 1985’ వర్తిస్తుంది?

1) ఆంధ్రప్రదేశ్‌     2) కేరళ      3) పశ్చిమ్‌బంగా     4) మహారాష్ట్ర



20. ‘షెడ్యూల్డ్‌ ప్రాంతాల ఆర్డర్, 2003’ ఏ రాష్ట్రానికి వర్తిస్తుంది?

1) ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌     2) ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌     3) పంజాబ్, హరియాణా     4) జమ్మూ-కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌



సమాధానాలు

 1-1  2-4   3-4   4-3    5-4     6-3     7-1    8-1    9-4    10-2    11-4    12-3   13-4    14-4     15-4     16-1     17-3    18-1      19-4      20-1



మరికొన్ని..


1. కింది వాటిలో ఏ రాష్ట్రానికి ‘షెడ్యూల్‌్్డ ప్రాంతాల ఆర్డర్, 2007’ వర్తిస్తుంది?

1) తమిళనాడు        2) కర్ణాటక     3) ఝార్ఖండ్‌    4) కేరళ



2. కింది వాటిలో షెడ్యూల్డ్‌ తెగల ఉప ప్రణాళికకు ్బళీగి ళీగీతీ శిలితివ్శి సంబంధించి సరైంది?

ఎ) 5వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభమైంది.

బి) ఇది 1974 నుంచి అమల్లోకి వచ్చింది.

సి) 21 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. 

డి) దీన్ని 2003లో రద్దు చేశారు.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి     3) ఎ, బి, డి    4) పైవన్నీ



3. జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థను  (National ST Finance & Development Corporation) ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1)  2001        2) 2003       3) 2005      4) 2007



4. గిరిజన ఉత్పత్తులను పెంచడం, వారిని దళారుల నుంచి కాపాడటం కోసం ‘ట్రైబల్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ను ఎప్పుడు నెలకొల్పారు?

1) 2005      2) 2007       3) 2009       4) 2012


5. ‘‘గిరిజన సంప్రదాయ హక్కుల చట్టం, 2006’’ ప్రకారం ఎన్ని తరాల నుంచి అడవుల్లో నివసిస్తున్న వ్యక్తులకు భూమిపై చట్టబద్ధమైన హక్కును కల్పించారు?

1) ఎనిమిది తరాలు      2) ఆరు తరాలు      3) నాలుగు తరాలు     4) మూడు తరాలు



6. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ లేదా అటవీ భూమిని మైనింగ్‌/పారిశ్రామిక కార్యకలాపాలకు లీజుకి ఇవ్వరాదని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?

1) దేవికారాణి జు( స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక, 1991        2) సమతా జు( స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, 1997       

3) విశాక జు( స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్, 1994          4) రాజ్‌నారాయణ్‌ జు( స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్, 1975



7. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖను ఎప్పుడు వేరుచేశారు?

1) 2002, ఫిబ్రవరి      2) 2003, ఫిబ్రవరి        3) 2004, ఫిబ్రవరి      4) 2005, ఫిబ్రవరి



8. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) ఆగస్టు, 9     2) జనవరి, 6    3) నవంబరు, 13     4) డిసెంబరు, 21


9. నక్సల్స్‌ ప్రభావం ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లోని గిరిజనుల సంక్షేమం కోసం 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం?

1) చైతన్యదీప్తి     2) రోష్ని     3) ఉషస్సు     4) కీర్తి


సమాధానాలు

1-3     2-1    3-1     4-1       5-4    6-2       7-3    8-1       9-2 

Posted Date : 03-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌