మాదిరి సమస్యలు
1. ఒక క్రమవృత్తాకార శంకువు భూ వ్యాసార్ధం 7 సెం.మీ., ఏటవాలు ఎత్తు 25 సెం.మీ, అయితే ఆ శంకువు వక్రతల వైశాల్యం (curved surface area) ఎంత? (చ.సెం.మీ.లలో)
1) 450 2) 550 3) 650 4) 675
సాధన: క్రమవృత్తాకార శంకువు భూవ్యాసార్ధం (r) = 7 సెం.మీ.
ఏటవాలు ఎత్తు (l) = 25 సెం.మీ.
వక్రతల వైశాల్యం = πrl
= 22/7 × 7 × 25 = 22 × 25
= 550 సెం.మీ.2 = 550 చ.సెం.మీ.
సమాధానం: 2
2. ఒక శంకువు భూవ్యాసార్ధం, నిట్టనిలువు ఎత్తు (Vertical height) వరుసగా 5 సెం.మీ, 12 సెం.మీ, అయితే ఆ శంకువు వక్రతల వైశాల్యమెంత? (చ.సెం.మీ.లలో)
1) 204.28 2) 104.28 3) 208.24 4) 108.24
సాధన: శంకువు భూ వ్యాసార్ధం (r) = 5 సెం.మీ.
ఎత్తు (h) = 12 సెం.మీ.
సమాధానం: 1
3. 16 సెం.మీ. ఎత్తు ఉన్న శంకువు భూపరిధి 24π సెం.మీ. అయితే దాని వక్రతల వైశాల్యమెంత?
1) 854.82 చ.సెం.మీ. 2) 764.82 చ.సెం.మీ.
3) 784.28 చ.సెం.మీ. 4) 754.28 చ.సెం.మీ.
సమాధానం: 4
4. ఒక శంకువు ఉపరితల వైశాల్యం 4070 సెం.మీ.2, వ్యాసం 70 సెం.మీ. అయితే ఏటవాలు ఎత్తు ఎంత? (సెం.మీ.లలో)
1) 38 2) 39 3) 37 4) 36
సమాధానం: 3
5. ఒక శంకువు వ్యాసార్ధం, ఏటవాలు ఎత్తుల మధ్య నిష్పత్తి 4 : 7. ఆ శంకువు వక్రతల వైశాల్యం 792 చ.మీ. అయితే ఆ శంకువు భూవ్యాసార్ధమెంత? (మీటర్లలో)
1) 12 2) 13 3) 14 4) 16
సాధన: శంకువు వ్యాసార్ధం, ఏటవాలు ఎత్తుల మధ్య నిష్పత్తి = 4 : 7
x = √9 = 3 ∴ x = 3
శంకువు వ్యాసార్ధం (r) = 4x
= 4 × 3 = 12 మీటర్లు
సమాధానం: 1
6. 5 మీ. ఎత్తు, 12 మీ. భూ వ్యాసార్ధంతో ఒక శంకువు ఆకారంలో గుడారాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన కాన్వాస్ వస్త్రం (Canvas cloth) వైశాల్యమెంత?
సమాధానం: 2
7. రెండు శంకువుల వ్యాసాలు సమానం. వాటి ఏటవాలు ఎత్తుల నిష్పత్తి 5 : 4 అయితే వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత?
1) 4 : 5 2) 5 : 4 3) 15 : 14 4) 14 : 15
సాధన: మొదటి శంకువు వ్యాసం (d1) = రెండో శంకువు వ్యాసం (d2)
d1 = d2
2r1 = 2r2 ⇒ r1 = r2
శంకువుల ఏటవాలు ఎత్తుల నిష్పత్తి = 5 : 4
⇒ l1 : l2 = 5 : 4
శంకువుల వక్రతల వైశాల్యాల నిష్పత్తి = πr1l1 : πr2l2
= r1l1 : r2l2 = l1 : l2 ( r1 = r2) = 5 : 4
సమాధానం: 2
8. రెండు శంకువుల్లో మొదటిదాని వక్రతల వైశాల్యం, రెండోదాని వక్రతల వైశాల్యానికి రెట్టింపు ఉంది. రెండో శంకువు ఏటవాలు ఎత్తు, మొదటి శంకువు ఏటవాలు ఎత్తుకు రెట్టింపు ఉంది. అయితే వాటి వ్యాసార్ధాల నిష్పత్తి ఎంత?
1) 2 : 1 2) 1 : 2 3) 4 : 1 4) 1 : 4
సాధన: మొదటి శంకువు వ్యాసార్ధం, ఏటవాలు ఎత్తులు వరుసగా r1, l1
రెండో శంకువు వ్యాసార్ధం, ఏటవాలు ఎత్తులు వరుసగా r2, l2
సమాధానం: 3
9. శంకువు ఆకారంలో ఉన్న ఒక గుడారం భూవ్యాసార్ధం 16 మీ., దాని నిట్టనిలువు ఎత్తు 12 మీ. ఈ గుడారాన్ని ఏర్పాటు చేయడానికి 1.1 మీ. వెడల్పైన వస్త్రాన్ని ఉపయోగించారు. గుడారం తయారీలో వాడిన వస్త్రం ఖరీదు 1 మీటరుకు 14 రూపాయలు. అయితే మొత్తం ఖర్చు ఎంత? (రూపాయల్లో)
1) 11,800 2) 12,400 3) 12,800 4) 13,400
= 6400 × 2 = రూ.12800
సమాధానం: 3
10. ఒక జోకర్ టోపీ శంకువు ఆకారంలో ఉంది. ఆ టోపీ భూవ్యాసార్ధం 7 సెం.మీ. ఎత్తు 24 సెం.మీ. అలాంటి 10 టోపీలను తయారు చేయడానికి కావాల్సిన కాగితం వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)
1) 4800 2) 5500 3) 5800 4) 6500
10 టోపీలు తయారు చేసేందుకు కావాల్సిన కాగితం వైశాల్యం = 10 × 550 = 5500 సెం.మీ.2 = 5500 చ.సెం.మీ.
సమాధానం: 2