ప్రపంచంలో అతిపెద్ద పశు/ జీవ సంపద ఉన్న దేశం భారత్. దేశ వ్యవసాయ రంగంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర దీనిదే. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం. గేదెల ద్వారా 63%, ఆవుల ద్వారా 33%, మేకల ద్వారా 3%, ఇతరాల ద్వారా 1% ఉత్పత్తి చేస్తుంది. పాల ఉత్పత్తిలో ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి.
ప్రపంచంలో మన దేశానిది...
ఎ) మొత్తం జీవ సంపద పాల ఉత్పత్తిలో, గేదెలు, మేకల పాల ఉత్పత్తిలో, మొత్తం బొవైన్ సంపదలో మొదటి స్థానం
బి) మేకలు, చేపల ఉత్పత్తిలో, పందుల పరిశ్రమల్లో, పశు సంపదలో రెండో స్థానం
సి) గొర్రెల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం
డి) చికెన్ ఉత్పత్తిలో నాలుగో స్థానం
ఇ) పౌల్ట్రీ మీట్ ప్రొడక్షన్స్, పౌల్ట్రీ ఉత్పత్తిలో ఐదో స్థానం
ఎఫ్) బాతుల ఉత్పత్తిలో ఎనిమిదో స్థానం
జి) ఒంటెలు, ఉన్ని ఉత్పత్తిలో తొమ్మిదో స్థానం
పశు జాతులు - రకాలు
1. పాలిచ్చే జాతులు (Milk Bread): ఇందులో గిర్, గిర్‌సింధ్ జాతులు గుజరాత్, రాజస్థాన్, సాహివాల్ జాతులు పంజాబ్, హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్, దేవుని జాతి.. ఆంధ్రప్రదేశ్ మొదలైనవి.
2. వ్యవసాయ జాతులు (Drought Breed): ఇందులో నగోరి జాతులు రాజస్థాన్, హరియాణ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బచేరి జాతి బిహార్, మాల్వీ జాతి మధ్యప్రదేశ్, ఖిల్లారి మహారాష్ట్రలో ఉన్నాయి.
3. ఉభయ జాతులు (Dual Breed): ఇందులో కంక్రాజ్ జాతులు గుజరాత్, దాంగ్రి జాతులు మహారాష్ట్ర; ఒంగోలు జాతులు - ఆంధ్రప్రదేశ్; వెచూర్ జాతి కేరళ, కృష్ణలోయ జాతి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మేవతి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.
4. దిగుమతి జాతులు (Exotic Breed): వీటిని ఐరోపా దేశాల నుంచి, న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇవి రోజుకు 30-35 లీటర్ల పాలు ఇస్తాయి. మన దేశ జాతులు ఒక లీటర్ మాత్రమే ఇస్తున్నందున ‘టీ కప్ ఆఫ్ కౌ కంట్రీ’ అని పిలుస్తారు. ఇందులో ప్రధానంగా జెర్సీ, స్విస్, స్వీస్‌బ్రౌన్, ప్రైషియన్ మొదలైనవి ఉన్నాయి.
5. మేలైన జాతులు (Quality Breed): దేశంలో మేలైన జాతుల్లో ఒంగోలు - ఆంధ్రప్రదేశ్, దేవుని - ఆంధ్రప్రదేశ్, పుంగనూర్ - ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మైసూర్ - కర్ణాటక, ముర్రా - హరియాణ. ఒంగోలు జాతికి ప్రపంచంలోనే అత్యంత మేలైన జాతి అని పేరు.
పశుసంపద
Posted Date : 11-11-2020
మెయిన్స్
పాత ప్రశ్నపత్రాలు
- టీఎస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - 28-08-2022
- టీఎస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - 28-08-2022
- టీఎస్ పోలీసు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష
- టీఎస్ పోలీసు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష
- టీఎస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - 28-08-2022
విద్యా ఉద్యోగ సమాచారం
- PG Medical: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు
- SSC CHSLE 2022 Key: ఎస్ఎస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2022 కీ విడుదల
- Latest Current Affairs: 30-03-2023 Current Affairs (English)
- Latest Current Affairs: 30-03-2023 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- TS EAMCET: ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు
- TSPSC: పేపర్ లీకేజీ కేసు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ 2 - 2022
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ 3 - 2022
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 1 2022
- ఎస్సై మోడల్ పేపర్ 1 - 2022
- ఎస్సై మోడల్ పేపర్ 2 - 2022