1. ముడి ఖనిజంతో కలిసిపోయి ఉన్న మలినాలను ఏమంటారు?
జ: గాంగ్
2. కిందివాటిలో కార్బొనేట్ ధాతువు ఏది?
ఎ) మాగ్నసైట్ బి) బాక్సైట్ సి) జిప్సం డి) గెలీనా
జ: ఎ (మాగ్నసైట్)
3. కిందివాటిలో జిప్సం ఫార్ములా ఏది?
ఎ) CuSO4 . 2 H2O బి) CaSO4 . 1/2 H2O సి) CuSO4 . 5 H2O డి) CaSO4 . 2 H2O
జ: డి (CaSO4 . 2 H2O)
4. కిందివాటిలో లోహశుద్ధికి వాడే పద్ధతి ఏది?
ఎ) స్వేదనం బి) పోలింగ్ సి) గలనిక పృథక్కరణం డి) అన్నీ సరైనవి
జ: డి (అన్నీ సరైనవి)
5. ప్లవన ప్రక్రియను ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు?
జ: సల్ఫైడ్
6. గెలీనా దేని ధాతువు?
జ: Pb
7. ప్రకృతిలో సహజసిద్ధంగా లభ్యమయ్యే లోహం ఏది?
జ: Au
8. భూపటలంలో సమృద్ధిగా లభించే లోహం ఏది?
జ: అల్యూమినియం
9. థర్మైట్ విధానంలో క్షయకరణ కారకం ఏది?
జ: Al
10. ప్రగలనంలో ధాతువును ......... చేస్తారు.
జ: క్షయకరణం
11. ప్లవన ప్రక్రియలో కిందివాటిలో ఏది కలుపుతారు?
ఎ) పైన్ ఆయిల్ బి) కిరోసిన్ సి) కొబ్బరినూనె డి) ఏదీకాదు
జ: ఎ (పైన్ ఆయిల్)