• facebook
  • whatsapp
  • telegram

భూగోళ‌శాస్త్రం

1. ప్రాచీనకాలంలో ఏర్పడిన ఒండలి మైదానాలను ఏమంటారు?
జ: భంగర్
 

2. 'రూర్ ఆఫ్ ఇండియా' అని ఏ పీఠభూమిని అంటారు?
జ: ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి
 

3. పశ్చిమ కనుమల ఉత్తర భాగంలో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం ఏది?
జ: ఖల్సూభాయ్
 

4. నర్మదా, తపతి నదుల మధ్య ప్రాంతం ద్వారా విస్తరించిన పర్వత శ్రేణులేవి?
జ: సాత్పుర పర్వతాలు
 

5. కిందివాటిలో ఏ రాష్ట్రానికి బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేదు?
     అసోం, మేఘాల‌య‌, మిజోరాం, మ‌ణిపూర్‌
జ: మణిపూర్
 

6. మయన్మార్ దేశ సరిహద్దులోని భారత రాష్ట్రాలు-
జ: అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం
 

7. భారతదేశ మొత్తం తీర ప్రాంతం పొడవు-
జ: 7516 కి.మీ
 

8. కిందివాటిలో నేపాల్ సరిహద్దులో లేని రాష్ట్రం-
     ఉత్తరాఖండ్‌, ఉత్తర‌ప్రదేశ్‌, బీహార్‌, హిమాచ‌ల‌ప్రదేశ్‌
జ: హిమాచల్‌ప్రదేశ్
 

9. పూర్వాచల్ పర్వతాలు ఏ దిశలో విస్తరించి ఉన్నాయి?
జ: ఉత్తర-దక్షిణాలుగా
 

10. మధ్య హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? 1
జ: కాళి-తీస్తా
 

11. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
జ: సెంట్రల్ హిమాలయాలు
 

12. భారత ప్రామాణిక కాలం ఏ రేఖాంశంపై ఆధారపడి ఉంది? 1
జ: 82 1/2 తూర్పు
 

13. భారతదేశంలోని అతి పురాతన పర్వత శ్రేణులేవి?
జ: ఆరావళి పర్వతాలు
 

14. కర్కాటక రేఖ భారతదేశంలో కింది ఏ రాష్ట్రాల ద్వారా పోవడం లేదు?
       ఒరిస్సా, గుజ‌రాత్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, రాజ‌స్థాన్‌
జ: ఒరిస్సా
 

15. హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడి ఉన్నాయి?
జ: అవక్షేప శిలలు
 

16. ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
జ: రాజస్థాన్
 

17. అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్న దీవుల ముఖ్య లక్షణం-
జ: ఇవి పగడపు దీవులు
 

18. ఎత్తును బ‌ట్టి హిమాల‌య శిఖరాల క్రమం- 
జ: ఎవరెస్టు, K2, కాంచన్‌జంగ, మకాలు
 

19. హిమాలయాలు ఏర్పడటానికి ఏది కారణమై ఉండవచ్చు?
జ: టెథీన్ అనే భూ అభినితి సంపీడన బలాల కారణంగా ముడతలు పడటం
 

20. ఏ పర్వతాలు ఒకదానికొకటి సమాంతరంగా ఏర్పడి ఉన్నాయి?
జ: వింధ్య - సాత్పుర
 

21. సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: కేరళ
 

22. ప్రఖ్యాత వేసవి విడిది కేంద్రాలైన సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, ఆల్మోరా, డార్జిలింగ్‌లు ఏ పర్వతాల్లో ఉన్నాయి? జ: నిమ్న హిమాలయాలు
 

23. జార్ఖండ్‌కు కింది ఏ రాష్ట్రంతో సరిహద్దు లేదు?
       ఉత్తర‌ప్రదేశ్‌, ఒరిస్సా, ప‌శ్చిమ‌బెంగాల్‌, మ‌ధ్యప్రదేశ్‌
జ: మధ్యప్రదేశ్
 

24. కాయల్స్ (పృష్ఠ జలాలు) ఏ తీర మైదానంలో విస్తరించి ఉన్నాయి?
జ: మలబార్ తీరం
 

25. కింది రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ సరిహద్దులో లేని రాష్ట్రం-
       మ‌ణిపూర్‌, మేఘాల‌య‌, అసోం, త్రిపుర‌
జ: మణిపూర్
 

26. జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్ని దేశాలతో సరిహద్దు ఉంది?
జ: 3
 

27. డంకన్ కనుమ వేటి మధ్య ఉంది?
జ: దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ దీవులు
 

28. మహానది డెల్టా ప్రాంతం ఏ తీర మైదానంలో విస్తరించి ఉంది?
జ: ఉత్కళ తీర మైదానం
 

29. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
జ: ఒరిస్సా
 

30. భారతదేశ మొత్తం సముద్రతీర ప్రాంతం (దీవులతో కలుపుకుని) ఎంత మేరకు విస్తరించి ఉంది?
జ: 7516.6 కి.మీ.
 

31. భారతదేశ రెండో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం కాంచనజంగ ఏ హిమాలయ శ్రేణుల్లో ఉంది?
జ: హిమాద్రి
 

32. భారత్‌లోని థార్ ఎడారి విస్తీర్ణం దాదాపు ఎంత?
జ: 2 లక్షల చ.కి.మీ.
 

33. గిర్నార్ పర్వత శిఖరం ఏ ప్రాంతంలో ఉంది?
జ: కథియవార్
 

34. చైనాతో అత్యధిక పొడవున సరిహద్దు ఉన్న రాష్ట్రం-
జ: జమ్ము-కాశ్మీర్
 

35. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్న దేశమేది?
జ: నేపాల్
 

36. అండమాన్, నికోబార్ దీవులను వేరుచేసే జల ప్రవాహం-
జ: 100 ఉత్తర ఛానల్
 

37. దొడబెట్ట పర్వత శిఖరం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
జ: నీలగిరి
 

38. లోక్‌టక్ సరస్సు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? 
జ: మణిపూర్
 

39. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో విస్తరించి ఉన్న పీఠభూములేవి?
జ: మాల్వా పీఠభూమి, హజారీబాగ్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి
 

40. పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో ఏమంటారు?
జ: సహ్యాద్రి
 

41. థార్ ఎడారి ద్వారా ప్రవహించే నది ఏది?
జ: లుని
 

42. భారతదేశంలో అత్యధిక ఖనిజ సంపద లభించే ప్రాంతం-
జ: ఛోటానాగ్‌పూర్ పీఠభూమి
 

43. లుషాయ్ పర్వత శ్రేణులను ఏ పేరుతో  పిలుస్తారు?
జ: మిజో శ్రేణులు
 

44. నామ్చా బార్వా పర్వత శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: అరుణాచల్‌ప్రదేశ్
 

45. దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంత రాజధాని-
జ: సిల్వస్సా
 

46. విస్తీర్ణపరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది?
జ: అండమాన్ నికోబార్ దీవులు
 

47. కింది ఏ రాష్ట్రం రాజస్థాన్ సరిహద్దులో లేదు?
       పంజాబ్‌, హ‌ర్యానా, ఉత్తర‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌
జ: ఉత్తరాఖండ్
 

48. అబూ పర్వత శిఖరం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
జ: ఆరావళి

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌