• facebook
  • whatsapp
  • telegram

 భారత ద్రవ్య వ్యవస్థ - కరెన్సీ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 1977, ఏప్రిల్‌ నుంచి నాలుగు రకాల ద్రవ్య భావనలను ప్రవేశపెట్టింది. వీటిని ద్రవ్య సమిష్టులు అని కూడా అంటారు.

1. M   2.  M2  3. M3     4. M4

M1: దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవి: 

i. ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు (C)

ii. సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల డిమాండ్‌ డిపాజిట్లు  (DD) 

iii. కేంద్ర బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు   (OD) 

దీన్నే సంకుచిత ద్రవ్యం (Narrow Money) అంటారు. సంప్రదాయవాదులు దీన్ని ద్రవ్య సరఫరాగా పేర్కొన్నారు.

M2: ఇందులో Mతో పాటు అదనంగా తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాల్లో ఉన్న డిపాజిట్‌ మొత్తాలు కూడా కలుస్తాయి.

M3: ఇందులో Mతో పాటు వివిధ సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల్లో ఉండే కాలపరిమితి డిపాజిట్లు కూడా కలుస్తాయి. దీన్ని విశాల ద్రవ్యం (Broad Money) అంటారు.

M4: ఇందులో Mతో పాటు తపాలా కార్యాలయాల్లోని అన్ని రకాల డిపాజిట్లు కలిపి ఉంటాయి.


ప్రస్తుతం అనుసరిస్తున్న సమిష్టులు కింది విధంగా ఉన్నాయి.

M1  కరెన్సీ  డిమాండ్‌ డిపాజిట్లు  ఇతర డిపాజిట్లు (మార్పు లేదు)

M2 = M1  బ్యాంకుల కాలపరిమితి డిపాజిట్లు 

బ్యాంకులు జారీచేసే డిపాజిట్లు

 M3 =  M ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న డిపాజిట్లు  స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు  M4ను తొలగించారు.


ద్రవ్యత్వ వనరులు (Liquidity Resources)

ద్రవ్యత్వ వనరులను ఆర్‌బీఐ వర్కింగ్‌ కమిటీ ప్రవేశపెట్టింది. ఇవి కింది విధంగా ఉంటాయి.

L1 = సవరించిన లీ3 ్ఘ జాతీయ పొదుపు పత్రాలతో సహా తపాలా కార్యాలయాల్లో ఉండే అన్ని రకాల డిపాజిట్లు.

L2 = L1 + దీర్ఘకాలిక రుణాలు, విత్త సంస్థల కాలపరిమితి రుణాలు  విత్త సంస్థలు జారీచేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్లు.

L3 = L2 + బ్యాంకేతర విత్త సంస్థల ప్రజా డిపాజిట్లు.


స్మారక నాణేలు

 ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో వీటిని విడుదల చేస్తారు.

సాధారణ కరెన్సీ నోట్లు, నాణేల మాదిరి స్మారక నాణేలు వినియోగం కోసం జారీ చేసేవికాదు. వీటిని బంగారం, వెండి తదితర లోహాలతో తయారుచేస్తారు. వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని కేవలం సేకరించడానికి తప్ప, వినియోగానికి ఉపయోగించరు. 

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాల్లోని ముద్రణాలయాల్లో స్మారక నాణేలను రూపొందిస్తారు. 

నాణేల సేకరణపై ఆసక్తి ఉన్నవారు దేశంలోని ముద్రణాలయాల ద్వారా వీటిని పొందవచ్చు.


ద్రవ్యరాశి సిద్ధాంతాలు


ద్రవ్య పరిమాణంలో వచ్చే మార్పులకు ద్రవ్యం విలువ ఎలా మారుతుందో ద్రవ్యరాశి సిద్ధాంతాలు తెలుపుతాయి.

ద్రవ్య విలువ: వస్తుసేవలను కొనుగోలు చేయడానికి ఉండే శక్తిని ద్రవ్య విలువ అంటారు.

ద్రవ్య చలామణి వేగం: ఒక యూనిట్‌ మారక ప్రక్రియలో లేదా వ్యవహారాల్లో ద్రవ్యాన్ని ఎన్నిసార్లు ఉపయోగిస్తారో అదే ద్రవ్య చలామణి వేగం.

పరిణామ క్రమం: ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని మొదటిసారి క్రీ.శ.1558లో ఇటాలియన్‌ ఆర్థికవేత్త దావన్‌ జెట్టి ప్రతిపాదించారు.


ప్రముఖుల అభిప్రాయాలు


 ‘‘యూరప్‌ ఖండంలో బంగారు నిక్షేపాలు ఎక్కువగా లభ్యమయ్యాయి. ఇది ధరల స్థాయుల్లో పెరుగుదలకు కారణమైంది’’ - కోపర్నికస్, జీన్‌ బోడిన్‌.

 ద్రవ్య సప్లయ్‌ ద్రవ్య వ్యవహారం మధ్య ఉండే సంబంధాన్ని డేవిడ్‌ హ్యూమ్‌ (1752) ప్రతిపాదించాడు. దీన్నే జె.ఎస్‌.మిల్‌ తన వినిమయ సమీకరణంలో ప్రస్తావించాడు.

 ఆధునిక ద్రవ్య సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌.

 అమెరికా ఆర్థికవేత్త ఇర్వింగ్‌ ఫిషర్‌ (1911) తన  అనే పుస్తకంలో ద్రవ్య వ్యవహారాల సిద్ధాంతాన్ని వివరించాడు.

 జె.ఎం.కీన్స్‌ 1923లో  “A Tract on Monetary Reform’’ అనే పుస్తకంలో నూతన ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.


కొత్త పార్లమెంట్‌ స్మారక నాణెం 


కొత్త పార్లమెంట్‌ భవనాన్ని 2023, మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం రూ.75 నాణేన్ని విడుదల చేసింది. 

దీనిపై కొత్త పార్లమెంట్‌ భవన చిత్రం ఉంటుంది. దాని పైభాగంలో ‘సంసద్‌ సానుకూల్‌’ అని దేవనాగరి లిపిలో, దిగువ భాగంలో పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ అని ఇంగ్లిష్‌లో ముద్రించారు. 

ఈ నాణెం 44 మిల్లీ మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. దాని అంచుల వెంట 200 వంకీలు ఉంటాయి. దాదాపు 35 గ్రాముల బరువు ఉంటుంది. 

ఈ నాణేన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్‌ కలిపిన మిశ్రమంతో తయారు చేశారు. 

నాణేనికి మరోవైపు మూడు సింహాలతో ఉన్న అశోక స్తూపం, దాని కింద ‘సత్యమేవ జయతే’, రెండువైపులా ‘భారత్‌’ అని 

దేవనాగరి లిపిలో, ఇండియా అని ఇంగ్లిష్‌లో రాసి ఉంటుంది. 

మూడు సింహాల గుర్తు కింద రూపాయి గుర్తు, నాణెం విలువను సూచిస్తూ 75 సంఖ్య అడుగు భాగాన ముద్రించారు. 

ఇంతకుముందు కూడా రూ.75 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్రం ఈ నాణేన్ని రూపొందించింది.


ఎన్టీఆర్‌ స్మారక నాణెం


 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్‌.టి. రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ రూ.100 స్మారక నాణేన్ని ముద్రించింది. 

దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023, ఆగస్టు 28న విడుదల చేశారు. 

ఈ నాణేన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్‌తో రూపొందించారు. ఇది 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉంటుంది.


ద్రవ్యరాశి  సిద్ధాంతాన్ని  అభివృద్ధి చేసిన  వారిలో ముఖ్యులు


సైమన్‌ న్యూకాంబ్‌ (1886)

నట్‌ విక్సెల్‌ (1898)

ఇర్వింగ్‌ ఫిషర్‌ (1911)

ఆర్థర్‌ సెసిల్‌ పిగూ (1917)

ఆల్‌ఫ్రెÆడ్‌ మార్షల్‌ (1923)

జె.ఎం.కీన్స్‌ (1930 - 36)

పాటిన్‌కిన్‌  (1948)

మిల్టన్‌ ప్రైÆడ్‌మాన్‌ (1957)

జీన్‌ బోడిన్, డేవిడ్‌ హ్యూమ్‌ (1722)


మాదిరి ప్రశ్నలు


1. భారత పేపర్‌ కరెన్సీ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1860  2) 1861  3) 1862  4) 1863


2. కింది వాటిలో సమీప ద్రవ్యానికి  (Near Money) ఉదాహరణ?

1) ట్రెజరీ బిల్లులు, బాండ్లు

2) డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు

3) ప్రామిసరీ నోట్లు     

4) పైవన్నీ


3. ప్రజలు తమ వద్ద ఎక్కువగా ఉన్న ద్రవ్యాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే దాన్ని ఏమంటారు?

1) రిజర్వ్‌ ద్రవ్యం    2) సమీప ద్రవ్యం

3) టోకెన్‌ ద్రవ్యం    4) సామాన్య ద్రవ్యం


4. రిజర్వ్‌ ద్రవ్యాన్ని ఏమని పిలుస్తారు?

1) అధిక శక్తిమంతమైన ద్రవ్యం 

2) మూలాధార ద్రవ్యం

3) 1, 2         

4) ఆవర్జా ద్రవ్యం


5. మనదేశంలో నాణేల ముద్రణా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?

1) ముంబయి, కోల్‌కతా   

2) హైదరాబాద్‌

3) నోయిడా          

4) పైవన్నీ


6. క్రిప్టో కరెన్సీని ఏమని పిలుస్తారు?

1) డిజిటల్‌ కరెన్సీ 

2) ప్రత్యామ్నాయ కరెన్సీ

3) వర్చువల్‌ కరెన్సీ     

4) పైవన్నీ


సమాధానాలు 

1-2    2-4    -31    4-3    5-4    6-4


రచయిత బండారి ధనుంజయ

విషయ నిపుణులు 

Posted Date : 16-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌