• facebook
  • whatsapp
  • telegram

ఇనుము - ఉక్కు పరిశ్రమ

స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పడిన ఇనుము - ఉక్కు కర్మాగారాలు:

* భారతదేశంలో మొట్టమొదటి ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని 1830లో తమిళనాడులోని ‘‘పోర్టనోవా’’లో స్థాపించారు. కానీ ఇది విఫలమైంది.

* బారకర్‌ నది ఒడ్డున ఉన్న కుల్టీ (పశ్చిమ్‌ బంగ)లో ‘‘బెంగాల్‌ ఐరన్‌ వర్క్స్‌’’ ప్లాంట్‌ను 1864లో ఏర్పాటు చేశారు.

* 1907లో వందేమాతర ఉద్యమ కాలంనాటి స్ఫూర్తితో అప్పటి బిహార్‌ రాష్ట్రంలోని సక్చీలో జంషెడ్‌ జీ టాటా మొదటిసారి ప్రైవేట్‌ రంగంలో ‘‘TISCO’’ను (టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ) స్థాపించారు. ఇది దేశంలోని అతి పురాతన, ప్రైవేట్‌ రంగంలో అతి పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం. ఇది ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది.

* ప్రస్తుతం సక్చీ ప్రాంతాన్ని జంషెడ్‌పూర్‌గా పిలుస్తున్నారు.

* జంషెడ్‌ జీ టాటాను ‘‘భారత ఉక్కు పరిశ్రమ పితామహుడి’’గా (Father of Iron and Stell Industry in India) పేర్కొంటారు.

* టిస్కో సువర్ణరేఖ నది ఒడ్డున ఉంది.

ఈ పరిశ్రమకు కావాల్సిన ముడి పదార్థాలు:

1) ఇనుప ధాతువు (Iron Ore)   

2) కోకింగ్‌ బొగ్గు 

3) సున్నపురాయి (Lime Stone)  

4) మాంగనీస్‌  

5) క్రోమైట్‌  

6) డోలమైట్‌  

7) కాల్చిన బంకమట్టి.

* ఇనుము, కోకింగ్‌ బొగ్గు, సున్నపురాయిని  4 : 2 : 1 నిష్పత్తిలో వినియోగిస్తారు.

* ఇనుము, ఉక్కు పరిశ్రమ భార నష్టం ఉన్న పరిశ్రమ కాబట్టి ఇనుము లేదా బొగ్గు లభించే ప్రదేశాల్లో ఈ పరిశ్రమను నెలకొల్పుతారు.

ఉక్కు పోత పోసే విధానం (Steel making process) :

* ఆధునికమైన ఉక్కు పోత పోసే విధానాన్ని హెన్రీ బెస్సెమర్‌ కనుక్కున్నారు.

* ముడి ఇనుమును కరిగించి సున్నపురాయిని కలిపి మలినాలను తొలగిస్తారు. మాంగనీస్‌ కలపడం వల్ల వాయువులు విడుదలవుతాయి. ఇంకా అదనంగా మాంగనీస్‌ను కలిపితే గట్టిదనంతో కూడిన ఉక్కు వస్తుంది.

* ఈ పరిశ్రమ సుమారు 2.6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.

TISCO - ముడి పదార్థాల సరఫరా 

* ముడి ఇనుము- నౌముండి (ఝార్ఖండ్‌), గురుమహిసాని, బాదమ్‌ పహార్‌ (ఒడిశా).

* బొగ్గు - ఝరియా (ఝార్ఖండ్‌), రాణిగంజ్‌ (పశ్చిమ్‌ బంగ).

* మాంగనీస్‌ - జోధామైన్స్‌ (ఒడిశా), నీరు - సువర్ణరేఖ నది, బారకర్‌ నది.

* 1908లో పశ్చిమ్‌ బంగలోని కుల్టీ సమీపంలోని హీరాకుడ్‌ ప్రాంతంలో మరో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు.

ఇండియన్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (IISCO):

* దీన్ని 1918లో పశ్చిమ్‌ బంగలోని అసన్‌సోల్‌లో ఏర్పాటు చేశారు.

* బర్నాపూర్‌ ఇనుము ఉక్కు కర్మాగారం, హీరాకుడ్, కుల్టీల్లోని మూడు కర్మాగారాలను IISCO లో భాగం చేసిన భారత ప్రభుత్వం 1972లో దాన్ని జాతీయం చేసింది.

ముడిపదార్థాల సరఫరా:

* ఇనుప ఖనిజం - దామోదర్‌ లోయ

* బొగ్గు -  రాణిగంజ్, ఝరియా

* నీరు - బారకర్‌ నది

* విద్యుత్‌ - దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌


VISCO/MISCO:  కర్ణాటకలోని భద్రావతి వద్ద యూఎస్‌ఏకి చెందిన ‘పెరి, మార్షల్‌ కంపెనీ’ ఆర్థిక సహకారంతో 1923లో స్థాపించారు. 

* మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఐరన్‌ కంపెనీ (VISCO)ని 1962లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది.

* దీన్నే మైసూర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (MISCO) అని కూడా పిలుస్తారు.

ముడిపదార్థాల సరఫరా:

* ఇనుము - కెమ్మనగండి  

* సున్నపురాయి - బుందిగూడ

* మాంగనీస్‌ - షిమోగ, చిత్రదుర్గ్‌

* నీరు - భద్రావతి నది

* విద్యుత్‌ - శరావతి పవర్‌ ప్లాంట్‌.

స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ఇనుము - ఉక్కు కర్మాగారాలు:

* భారతదేశంలో స్వాతంత్య్రానంతరం సత్వర అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేశారు.

* మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వగా, రెండో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా మూడు ఇనుము, ఉక్కు పరిశ్రమలు స్థాపించారు. అవి :

1) భిలాయ్‌ ఉక్కు కర్మాగారం:

* మధ్యప్రదేశ్‌లో అప్పటి సోవియట్ యూనియన్‌ (USSR) సహకారంతో 1959లో ప్రభుత్వ రంగ సంస్థగా దీన్ని ఏర్పాటు చేశారు.

* ప్రస్తుతం ఇది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఉంది.

* ఇది కోల్‌కతా - నాగ్‌పుర్‌ రైలు మార్గంలో ఉంది.

* ఈ కర్మాగారానికి ముడి ఇనుము దాలి రాజహర గనుల (ఛత్తీస్‌గఢ్‌) నుంచి లభిస్తుంది.

దీనికి అనుకూల ఓడరేవు విశాఖపట్నం  ముడి పదార్థాల సరఫరా:

* ముడి ఇనుము - దాలి రాజహారా                   (ఛత్తీస్‌గఢ్‌) 

* బొగ్గు - కోర్బా (ఛత్తీస్‌గఢ్‌), ఝరియా 

* మాంగనీస్‌ - బాలాఘాట్, భంగ్రా గనులు (మహారాష్ట్ర)

* సున్నపురాయి - నందిని గనులు (ఛత్తీస్‌గఢ్‌)

* విద్యుత్‌ - కోర్బా థర్మల్‌ ప్లాంట్‌ (ఛత్తీస్‌గఢ్‌)

2) దుర్గాపూర్‌ ఇనుము-ఉక్కు కర్మాగారం:

* బ్రిటన్‌ ఆర్థిక సహకారంతో పశ్చిమ్‌ బంగలోని దుర్గాపూర్‌ ప్రాంతంలో 1959లో ప్రభుత్వ రంగంలో నెలకొల్పిన కర్మాగారం.

* ఇది కలకత్తా - అసన్‌సోల్‌ రైలు మార్గంలో ఉంది.

* ఈ కర్మాగారంలో ఉత్పత్తి ప్రక్రియ 1962లో ప్రారంభమైంది.

* దీనికి అనుకూలమైన ఓడరేవు - కలకత్తా 

ముడిపదార్థాల సరఫరా:

* బొగ్గు - ఝరియా, రాణిగంజ్‌ 

* ఇనుప ఖనిజం - బొలాని మైన్స్‌ (ఒడిశా) 

* సున్నపురాయి - బర్మిత్రాపుర్‌ (ఒడిశా) 

* మాంగనీస్‌ - కియోంజహర్‌ (ఒడిశా)

* విద్యుత్‌ - దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టు


3) రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారం: 

* జర్మనీ ఆర్థిక సహకారంతో 1959లో ఈ కర్మాగారాన్ని ఒడిశా రాష్ట్రంలో స్థాపించారు

* ఇది కలకత్తా - నాగ్‌పుర్‌ రైలు మార్గంలో ఉంది.

* దీనికి అనుకూలమైన ఓడరేవులు - కలకత్తా, పారదీప్‌.

* ఇది భారత్‌ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి స్టీల్‌ ప్లాంట్‌

ముడిపదార్థాల సరఫరా :

* ఇనుము - సుందర్‌గఢ్, కియోంజహార్‌ 

* బొగ్గు - ఝరియా, తాల్చేరు, బొకారో

* మాంగనీస్‌ - బరజందా (ఝార్ఖండ్‌)

* నీరు- సంఖ్‌ నది, కోయల్‌ నది

* విద్యుత్‌ - హీరాకుడ్, హైడ్రో పవర్‌ ప్లాంట్‌.

విజయనగర్‌ ఇనుము - ఉక్కు కర్మాగారం

* కర్ణాటకలోని హోస్పేటలో 1989లో దీన్ని  ఏర్పాటు చేశారు.

* ఏడో ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ

* పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు.

* దీనికి అనుకూలమైన ఓడరేవు న్యూమంగళూరు

ముడిసరుకుల సరఫరా:

* ఇనుము- బళ్లారి

* సున్నపురాయి- కర్ణాటక

* బొగ్గు - కన్హాలోయ, ఛత్తీస్‌గఢ్, సింగరేణి 

* మాంగనీస్‌ - కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ 

* నీరు, విద్యుత్తు - తుంగభద్ర రిజర్వాయర్‌

సేలం ఇనుము ఉక్కు కర్మాగారం

ఆరో పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1982లో సేలం (తమిళనాడు)లో స్థాపించారు.

* స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తయారీకి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

* భారత ప్రభుత్వానికి నాణేెల సరఫరా ఇక్కడ నుంచే జరుగుతుంది.

* దీనికి అనుకూల ఓడరేవు - చెన్నై

బొకారో ఇనుము - ఉక్కు కర్మాగారం

* ఇది మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటైంది.

* 1964లో రష్యా సహకారంతో బొకారో, దామోదర్‌ నదుల సంగమ ప్రాంతంలోని హజారీభాగ్‌ (ఝార్ఖండ్‌)లో ఏర్పాటు చేశారు.

* ఇది ప్రభుత్వ రంగ ఇనుము - ఉక్కు కర్మాగారాల్లో అతి పెద్దది.

* దీనికి అనుకూల ఓడరేవు - కలకత్తా 

ముడిపదార్థాల సరఫరా : 

* బొగ్గు - ఝరియా 

* ఇనుము - కిరిబురు, మేఘాపాటబురూ 

* సున్నపురాయి - భవనాథ్‌పుర్, పలమావ్‌

* మాంగనీస్‌ - బర్మిత్రాపూర్‌ 

* విద్యుత్తు- దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌

* 1973లో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAIL)ను ఏర్పాటు చేసి భిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా ఇతర కర్మాగారాలను దీని కిందకి తెచ్చారు.

విశాఖ ఇనుము - ఉక్కు కర్మాగారం

* ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరంలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RNIL) సహాయంతో 1972లో ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు.

* దీని నిర్మాణం 1982లో ప్రారంభించి 1992లో పూర్తిచేశారు.

* 1992, ఆగస్టు 1న నాటి ప్రధాని పీవీ నరసింహరావు దీన్ని ప్రారంభించారు.

* విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం కృషి చేసిన వ్యక్తి తెన్నేటి విశ్వనాథం.

* ఈయన నినాదం ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’’

* తీర ప్రాంతంలో స్థాపించిన మొదటి స్టీల్‌ ప్లాంట్‌ ఇది, రెండోది గోపాల్‌పుర్‌ స్టీల్‌ ప్లాంట్‌ - ఒడిశా.

* ఈ కర్మాగారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రష్యా ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు.

* విశాఖ ఇనుము-ఉక్కు కర్మాగారం అత్యంత  నాణ్యమైన ఇనుమును ఉత్పత్తి చేసే కర్మాగారంగా పేరొందింది.

ముడిపదార్థాల సరఫరా:

* బొగ్గు - తాల్చేర్, సింగరేణి 

* సున్నపురాయి - జగ్గయ్యపేట, బద్నాపుర్‌ 

* ఇనుము - బైలడిల్ల

* మాంగనీస్‌ - ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌


 

Posted Date : 03-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌