• facebook
  • whatsapp
  • telegram

క.సా.గు

కనిష్ఠ గుణిజం.. కచ్చితమైన భాజ్యం!

ఉత్సవాల సందర్భంగా లైట్లతో అలంకరణలు చేస్తుంటారు. అవి వెలుగుతూ, ఆరిపోతూ ఉంటాయి. అవన్నీ ఒకేసారి ఎప్పుడు వెలుగుతాయి, మళ్లీ ఒకేసారి ఎప్పుడు ఆరిపోతాయో కసాగు కట్టి చెప్పేయవచ్చు. ఇలా నిత్య జీవితంలోనూ, ఇతర శాస్త్రాల్లోనూ ఈ గణిత ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. కసాగు చేసినప్పుడు వచ్చే ఫలితం గుణిజం (మల్టిపుల్‌) గా చిన్నదైనా... కచ్చితమైన భాజ్యం (డివిడెండ్‌) అవుతుంది. దీన్ని నేర్చుకుంటే పరీక్షల్లో లెక్కలు వేగంగా చేయవచ్చు.  
 

రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల కారణాంకాల్లో మిక్కిలి చిన్నదాన్ని క.సా.గు (కనిష్ఠ సామాన్య గుణిజం) అంటారు.

మాదిరి ప్రశ్నలు

1.   ల కసాగు ఎంత? 

జవాబు: 1

సాధన: దత్తాంశం ప్రకారం లవాల కసాగు 

లవాల కసాగు = 2 x 2 x 5 = 20

హారాల గసాభా = 3   (3, 6, 9 ల ఉమ్మ‌డి కార‌ణాంకం 3 కాబ‌ట్టి గ‌సాభా 3)

కసాగు = 

2. 25, 30, 45లతో భాగించబడే కనిష్ఠ సంఖ్య ఏది?

1) 5   2) 450   3) 900   4) 2250

జవాబు: 2

సాధన: కసాగును లెక్కించేటప్పుడు ప్రధాన సంఖ్యలను ఉపయోగిస్తే కచ్చితమైన జవాబు వస్తుంది.

దత్తాంశం ప్రకారం

కసాగు = 5 x 3 x 5 x 2 x 3 = 450

3. 12, 15, 20, 25లతో భాగించబడుతూ ప్రతిదానిలో 7 శేషంగా వచ్చే కనిష్ఠ సంఖ్య ఏది?

1) 300   2) 293   3) 307   4) 600

జవాబు: 3

సాధన: ప్రశ్నలో కనిష్ఠ సంఖ్య అంటే కసాగు చేయాలి.

కసాగు = 5 x 3 x 2 x 2 x 5 = 300

ప్రతిదానిలో శేషం 7 అంటే కసాగుకు 7 కలపాలి

అప్పుడు మనకు కావాల్సిన సంఖ్య = 300 + 7 = 307

4. కిందివాటిలో 4, 5, 8, 9లతో భాగించబడుతూ వరుసగా 3, 4, 7, 8 శేషాలు ఇచ్చే కనిష్ఠ సంఖ్య ఏది?

1) 119   2) 319   3) 359   4) 719

జవాబు: 3

సాధన: లెక్కలో కనిష్ఠ సంఖ్య అని ఉంది కాబట్టి కసాగు చేయాలి.

కసాగు = 2 x 2 3 x 5 x 2 x 3 = 360

కావాల్సిన సంఖ్య = 360 - 1 = 359

5. కింది ఏ కనిష్ఠ సంఖ్యకు 5 కలిపితే 4, 5, 6, 7లతో నిశ్శేషంగా భాగించబడుతుంది?

1) 415    2) 425    3) 420    4) 845

జవాబు: 1

సాధన: కనిష్ఠ అంటే కసాగు చేయాలి

కసాగు = 2 x 2 x 5 x 3 x 7 = 420

కావాల్సిన సంఖ్య = 420 - 5 = 415

కలపాలన్నా లేదా పెంచాలన్నా తీసివేత (-) చేయాలి.

6. కింది ఏ కనిష్ఠ సంఖ్య నుంచి 7 తీసివేస్తే 12, 16, 18, 21, 28లు కారణాంకాలు అవుతాయి?

1) 1008   2) 1015   3) 1022   4) 1032 

జవాబు: 2

సాధన: ప్రశ్నలో కనిష్ఠ సంఖ్య అని ఉంది కాబట్టి ముందుగా కసాగు చేయాలి.

కసాగు = 2 x 2 x 3 x 7 x 4 x 3 = 1008

తీసివేయాలన్నా లేదా తగ్గించాలన్నా సంకలనం (+) చేయాలి

కాబట్టి కావాల్సిన సంఖ్య = 1008 + 7 = 1015

7. కింది సంఖ్యల్లో కచ్చితమైన వర్గం అవుతూ 16, 20, 24లలో ప్రతిదీ కారణాంకం అయ్యే కనిష్ఠ సంఖ్య?

1) 1600   2) 3600   3) 6400   4) 14400

జవాబు: 2

సాధన: కనిష్ఠ అంటే కసాగు చేయాలి.

కసాగు = 2 x 2 x 2 x 2 x 5 x 3 = 240

కనిష్ఠ వర్గం అంటే కసాగు తర్వాత జతలు లేని గుణిజాలను కసాగుకు గుణించాలి.

అప్పుడు కావాల్సిన సంఖ్య = 240 x 5 x 3 = 3600

8. కింది ఏ కనిష్ఠ సంఖ్యను రెట్టింపు చేస్తే 12, 18, 21, 30లతో కచ్చితంగా భాగించబడుతుంది?

1) 196   2) 630   3) 1260   4) 2520

జవాబు: 2

సాధన: కనిష్ఠ అంటే కసాగు చేయాలి.

కసాగు = 2 x 3 x 2 x 3 x 7 x 5 = 1260

రెట్టింపు అంటే వచ్చిన కసాగును 2తో భాగించాలి.

కావాల్సిన సంఖ్య =    = 630

9. మూడు విభిన్న రోడ్ల కూడళ్లలో ట్రాఫిక్‌ లైట్లు ప్రతి 48 సెకన్లు, 72 సెకన్లు, 108 సెకన్లకు వరుసగా మారుతూ ఉంటాయి. 8:20:00 గంటలకు అవన్నీ ఒకేసారి మారితే, మళ్లీ అవి ఏ సమయానికి ఒకేసారి మారుతాయి?

1) 8 గంటల 27 నిమిషాల 12 సెకన్లు

2) 8 గంటల 46 నిమిషాల 12 సెకన్లు

3) 8 గంటల 23 నిమిషాల 10 సెకన్లు

4) 8 గంటల 42 నిమిషాల 10 సెకన్లు

జవాబు: 1

సాధన: ముందుగా కసాగు చేయాలి.

కసాగు = 2 x 2 x 3 x 3 x 2 x 2 x 3 = 432 సెకన్లు

432 సెకన్లను నిమిషాల్లోకి మారిస్తే 7 నిమిషాల 12 సెకన్లు అవుతుంది. అంటే ప్రతి 7 నిమిషాల 12 సెకన్లకు అన్ని లైట్లు ఒకేసారి మారుతాయి. తర్వాత లైట్లు ఒకేసారి మారే సమయం 8 గంటల 27 నిమిషాల 12 సెకన్లు.

10. రెండు సంఖ్యల కసాగు 48, సంఖ్యల నిష్పత్తి 2 : 3 అయితే ఆ సంఖ్యల మొత్తం?

1) 28    2) 32    3) 40    4) 64

జవాబు: 3

సాధన: ముందుగా ఇచ్చిన నిష్పత్తి కసాగు కనుక్కోవాలి

2, 3ల కసాగు 6 అవుతుంది.

ప్రశ్నలో ఇచ్చిన కసాగు 48 ని మనకు వచ్చిన కసాగు 6తో భాగించాలి. అప్పుడు  = 8

కావాల్సిన సంఖ్యలు:

మొదటి సంఖ్య = 2 x 8 = 16

రెండో సంఖ్య = 3 x 8 = 24

సంఖ్యల మొత్తం 16 + 24 = 40 అవుతుంది.

11. A, B, C అనే ముగ్గురు వ్యక్తులు ఒక  వృత్తాకార బాట చుట్టూ తిరిగిరావడానికి వరుసగా 30, 45, 60 సెకన్లు పడుతుంది. వారందరూ P బిందువు నుంచి ఒకే సమయం, ఒకే మార్గంలో బయలుదేరారు. మళ్లీ ఆ ముగ్గురూ P  బిందువు వద్ద కలవాలంటే ఒక్కొక్కరు ఎన్నిసార్లు వృత్తాకార బాటను చుట్టిరావాలి? 

కిందివాటిని జతపరచండి.

జవాబు: 2

సాధన: ముందుగా 30, 45, 60 ల కసాగు చేయాలి.

కసాగు = 5 x 3 x 2 x 3 x 2 = 180

A, B, C లు కావాలి అంటే కసాగును వారి కాలాలతో భాగించాలి.

రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌

‣  దిశ నిర్దేశ పరీక్ష

‣ ఆల్ఫా న్యూమరిక్‌ సీక్వెన్స్‌ పజిల్‌

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌