• facebook
  • whatsapp
  • telegram

పోషణ - విటమిన్లు

పోషణ - విటమిన్లు

1. రక్తం గడ్డకట్టడానికి ఏ విటమిన్‌ సహాయపడుతుంది?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-సి      

3) విటమిన్‌-డి     4) విటమిన్‌-కె

2. ఏ విటమిన్‌ను సాధారణంగా ‘సన్‌షైన్‌ విటమిన్‌ అని పిలుస్తారు?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి

3) విటమిన్‌-సి     4) విటమిన్‌-డి

3. కింది వాటిలో రోగనిరోధక వ్యవస్థకు సహకరించే ముఖ్యమైన విటమిన్‌?

1) విటమిన్‌-ఎ    2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి    4) విటమిన్‌-ఇ

4. ఎముకల పెరుగుదల, అభివృద్ధికి అవసరమయ్యే విటమిన్‌ ఏది?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి     4) విటమిన్‌-కె

5. కింది వాటిలో ఏ విటమిన్‌ కంటి ఆరోగ్యానికి  అవసరం?

1)విటమిన్‌-ఎ     2) విటమిన్‌-సి

3)విటమిన్‌-డి     4) విటమిన్‌-ఇ

6. చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్‌ ఏది?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి      4) విటమిన్‌-ఇ

7. కొల్లాజెన్‌ ఉత్పత్తికి కింది వాటిలో ఏ విటమిన్‌ కావాలి?

1) విటమిన్‌-ఎ    2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి     4) విటమిన్‌-ఇ

8. నాడీవ్యవస్థ ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్‌ ఏది?

1) విటమిన్‌-ఎ    2) విటమిన్‌-బి

3) విటమిన్‌-సి    4) విటమిన్‌-డి

9. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కింది వాటిలో అవసరమైన విటమిన్‌?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి

3) విటమిన్‌-సి     4) విటమిన్‌-కె

10. కాల్షియం శోషణకు ముఖ్యమైన విటమిన్‌ ఏది?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి

3) విటమిన్‌-సి    4) విటమిన్‌-డి

11. విటమిన్‌-సి శాస్త్రీయ నామం ఏమిటి?

1) సన్‌షైన్‌ విటమిన్‌  2) నియాసిన్‌

3) రెటినాల్‌       4) ఆస్కార్బిక్‌ ఆమ్లం

12. శరీరంలో విటమిన్‌-డి ప్రధాన విధి ఏమిటి?

1) శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది, ఇది బలమైన ఎముకలకు అవసరం.

2) రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైంది

3) ఇది యాంటీఆక్సిడెంట్‌. కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

4) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్‌

13. కింది వాటిలో టోకోఫెరోల్‌ దేని రసాయన నామం?

1) విటమిన్‌-ఇ    2) విటమిన్‌-బి

3) విటమిన్‌-సి     4) విటమిన్‌-డి

14. శరీరంలో విటమిన్‌-ఎ ముఖ్య విధి ఏమిటి?

1) దృష్టి, రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

2) యాంటీఆక్సిడెంట్‌ కావడంతో ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

3) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్‌

4) పైవన్నీ

15. శరీరంలో విటమిన్‌-ఇ చేసే ప్రధాన పని? 

1) దృష్టి, రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైంది

2) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్‌

3) ఇది యాంటీఆక్సిడెంట్‌. కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది

4) పైవన్నీ 

16.విటమిన్‌-బి3 శాస్త్రీయ నామం ఏమిటి?

1)నియాసిన్‌    2) పాంటోథెనిక్‌ ఆమ్లం

3) రెటినాల్‌     4) ఆస్కార్బిక్‌ ఆమ్లం

17. చర్మం, ఎముకలు, ఇతర కణజాలాల నిర్మాణానికి తోడ్పడే ప్రోటీన్‌ అయిన కొల్లాజెన్‌ ఉత్పత్తికి ఏ విటమిన్‌ అవసరం?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి

3) విటమిన్‌-సి    4) విటమిన్‌-డి

18. కింది వాటిలో ఏ విటమిన్‌ నీటిలో కరుగుతుంది?

1) విటమిన్‌-ఎ    2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి     4) విటమిన్‌-ఇ

19. నాడీవ్యవస్థ సరైన పనితీరుకు ఏ విటమిన్‌ సహాయపడుతుంది?

1) విటమిన్‌-ఎ       2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి    4) విటమిన్‌-బి12

20. కింది వాటిలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్‌ ఏది?

1) విటమిన్‌-ఎ     2)విటమిన్‌-సి

3) విటమిన్‌-డి       4) విటమిన్‌-బి12

21. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియకు తోడ్పడే విటమిన్‌?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి      4) విటమిన్‌-బి6

22. కింది వాటిలో ఏ విటమిన్‌ నీటిలో కరుగుతుంది?

1) విటమిన్‌-ఎ    2) విటమిన్‌-బి12

3) విటమిన్‌-డి      4) విటమిన్‌-ఇ

23. కాల్షియం, ఫాస్ఫరస్‌ శోషణలో ఏ విటమిన్‌ సహాయపడుతుంది?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి

3) విటమిన్‌-డి      4) విటమిన్‌-ఇ

24. సిట్రస్‌ పండ్లలో పుష్కలంగా లభించే విటమిన్‌ ఏది?

1) విటమిన్‌-ఎ    2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి     4) విటమిన్‌-ఇ

25. ఏ విటమిన్‌ లోపం కారణంగా స్కర్వీ వస్తుంది?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-సి

3) విటమిన్‌-డి    4) విటమిన్‌-ఇ

26. ఏ విటమిన్‌ లోపంతో రాత్రి అంధత్వం కలుగుతుంది?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి

3) విటమిన్‌-సి      4) విటమిన్‌-డి

27. ఏ విటమిన్‌ లోపం రికెట్స్‌కు కారణమవుతుంది?

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి

3) విటమిన్‌-డి       4) విటమిన్‌-ఇ

28. ఏ విటమిన్‌ లోపం పెల్లాగ్రాకు కారణం....

1) విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి3 (నియాసిన్‌)

3) విటమిన్‌-సి     4) విటమిన్‌-డి

29. ఏ విటమిన్‌ లోపంతో బెరిబెరి వ్యాధి వస్తుంది?

1) విటమిన్‌-ఎ   2) విటమిన్‌-బి1 (థయామిన్‌)

3) విటమిన్‌-సి     4) విటమిన్‌-డి

30. మెగాలోబ్లాస్టిక్‌ అనీమియాకు ఏ విటమిన్‌ లోపం కారణం?

1)విటమిన్‌-ఎ     2) విటమిన్‌-బి12

3) విటమిన్‌-సి      4) విటమిన్‌-డి

31. ఏ విటమిన్‌ లోపం గ్జిరాఫ్తాల్మియాకు కారణమవుతుంది?

1) విటమిన్‌-ఎ    2) విటమిన్‌-బి

3) విటమిన్‌-సి    4) విటమిన్‌-డి

32. కింది వాటిలో విటమిన్‌-ఇ ఎందులో ఎక్కువగా లభిస్తుంది?

1) బచ్చలికూర    2) గుడ్లు    

3) బాదం      4) అరటిపండ్లు

33. కింది వాటిలో విటమిన్‌-డి దేనిలో అధికంగా లభిస్తుంది?

1) సాల్మన్‌      2) పెరుగు        3) బీన్స్‌         4) ట్యూనా

34. కింది వాటిలో విటమిన్‌-బి12 దేనిలో ఎక్కువగా లభిస్తుంది?

1) పాలకూర    2) పాలు        

3) ద్రాక్ష     4) మొక్కజొన్న

35. విటమిన్‌-బి1 దేనిలో అధికంగా లభిస్తుంది?

1) వేరుశెనగలు    2) నారింజలు 

3) చికెన్‌     4) పాస్తా

36. కింది వాటిలో విటమిన్‌-బి2 ఎందులో అధికంగా లభిస్తుంది?

1) బఠానీలు      2) టమోటాలు  

3) పుట్టగొడుగులు     4) పాలు

37. కింది వాటిలో విటమిన్‌-బి3 దేనిలో ఎక్కువగా లభిస్తుంది?

1) గుడ్లు       2) బఠానీలు     

3) యాపిల్స్‌        4)ద్రాక్ష

38. విటమిన్‌-ఎ రసాయన ఫార్ములా ఏమిటి?

1) C6H8O6 2) C20H30O 3) C12H22O11 4) C27H44

39. విటమిన్‌-సి రసాయన ఫార్ములా?

1) C6H8O6 2) C20H30O 3) C12H22O11 4) C27H44

40. కింది వాటిలో విటమిన్‌-డి2 రసాయన ఫార్ములా ఏది?

1) C27H44O 2) C28H44O 3) C28H48O2 4) C30H48O2 

41. విటమిన్‌-ఇ రసాయన ఫార్ములా?

1) C27H44O 2) C28H44O 3) C29H50O4) C30H48O2

సమాధానాలు


1-4 2-4 3-2 4-3 5-1 6-4 7-2 8-2 9-2 10-4 11-4 12-1 13-1 14-1 15-3 16-1 17-3 18-2 19-4 20-4 21-4

22-2 23-3 24-2 25-2 26-1 27-3 28-2 29-2 30-2  31-1  32-3  33-1  34-2  35-1  36-4  37-1  38-4  39-1  40-3   41-3

Posted Date : 28-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌