మాదిరి సమస్యలు
1. ఒక ఈతగాడు నదీ ప్రవాహానికి అభిముఖంగా 8 కి.మీ./గం. వేగంతో, ప్రవాహానికి వాలుగా 10 కి.మీ./గం. వేగంతో ఈదుతాడు. అయితే నిశ్చల నీటిలో అతడి వేగం ఎంత? (కి.మీ./గం.లలో)
1) 10 2) 6 3) 12 4) 9
సాధన:
సమాధానం: 4
2. ఒక మోటారు పడవ నదీ ప్రవాహానికి అభిముఖంగా 24 కి.మీ./గం. వేగంతో, ప్రవాహానికి వాలుగా 30 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తుంది. అయితే నీటిప్రవాహ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)
1) 4 2) 3 3) 2 4) 2.5
సాధన:
సమాధానం: 2
3. ఒక మోటారు పడవ ఒక ఓడరేవు నుంచి మరొక ఓడరేవుకు ప్రవాహానికి వాలుగా ప్రయాణించడానికి 4 గంటల సమయం పట్టింది. అంతే దూరాన్ని ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించడానికి 5 గంటల సమయం పట్టింది. నీటి ప్రవాహ వేగం 2 కి.మీ./గం. అయితే ఆ రెండు ఓడరేవుల మధ్య దూరం ఎంత? (కి.మీ.లలో)
1) 80 2) 75 3) 60 4) 65
సాధన:
సమాధానం: 1
4. నిశ్చల నీటిలో ఒక పడవ వేగం 15 కి.మీ./గం. ఆ పడవ ప్రవాహానికి అభిముఖంగా ఒక స్థానం నుంచి 30 కి.మీ. దూరానికి వెళ్లి, తిరిగి అంతే దూరాన్ని ప్రవాహానికి వాలుగా ప్రయాణించింది. బయలుదేరిన చోటికి చేరడానికి పడవకు 4 గం. 30 ని. సమయం పడితే, ఆ నదీ ప్రవాహ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)
1) 4 2) 5 3) 6 4) 3
సాధన:
సమాధానం: 2
5. ఒక పడవ వేగానికి, నదీ ప్రవాహ వేగానికి మధ్య నిష్పత్తి 36 : 5. ఆ పడవ నదీ ప్రవాహానికి వాలుగా కొంత దూరం ప్రయాణించడానికి 5 గం. 10 ని. సమయం పట్టింది. అయితే తిరిగి ప్రవాహానికి అభిముఖంగా అంతేదూరం ప్రయాణించడానికి పట్టే సమయం ఎంత?
1) 6 గం. 10 ని. 2) 6 గం. 30 ని.
3) 6 గం. 45 ని. 4) 6 గం. 50 ని.
సాధన:
సమాధానం: 4
6. ఒక ఈతగాడు నదిలో కి.మీ. దూరాన్ని ప్రవాహానికి అభిముఖంగా ఈదడానికి నిమిషాల సమయం పట్టింది. అంతే దూరాన్ని ప్రవాహానికి వాలుగా ఈదడానికి నిమిషాల సమయం పట్టింది. అయితే నిలకడ నీటిలో ఆ ఈతగాడి వేగం ఎంత? (కి.మీ./గం.లలో)
1) 7 2) 8 3) 5 4) 6
సాధన:
సమాధానం: 3
7. ఒక పడవ కొంతదూరాన్ని ప్రవాహానికి వాలుగా ప్రయాణించడానికి పట్టిన సమయం, అంతే దూరాన్ని ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించడానికి పట్టిన సమయంలో సగం ఉంది. అయితే నిశ్చల నీటిలో పడవ వేగానికి, నదీ ప్రవాహ వేగానికి మధ్య ఉన్న నిష్పత్తి...
1) 3 : 1 2) 3 : 2 3) 2 : 3 4) 1 : 3
సాధన:
సమాధానం: 1
8. ఒక పడవ నదీ ప్రవాహానికి వాలుగా ప్రయాణించేటప్పుడు దాని వేగం, ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించేటప్పుడు ఉన్న వేగానికి రెట్లు ఉంది. ఆ పడవ నదీ ప్రవాహానికి వాలుగా 3 గంటల్లో 38.4 కి.మీ. దూరం ప్రయాణించింది. అయితే నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)
1) 10 2) 12 3) 14 4) 15
సాధన:
సమాధానం: 1
అభ్యాస ప్రశ్నలు
1. ఒక పడవ నదీ ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించేటప్పుడు 24 కి.మీ. దూరాన్ని 6 గంటల్లో చేరుకుంది. నదీ ప్రవాహానికి వాలుగా ప్రయాణించేటప్పుడు 20 కి.మీ. దూరాన్ని 4 గంటల్లో చేరింది. అయితే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)
1) 5.5 2) 4.5 3) 6.5 4) 3.5
2. ఒక నదీ ప్రవాహ వేగం 5 కి.మీ./గం. ఒక మోటారు పడవ నదీ ప్రవాహానికి ఎదురుగా 10 కి.మీ. దూరం ప్రయాణించి, తిరిగి బయలుదేరిన స్థానానికి చేరడానికి 50 ని. సమయం పట్టింది. అయితే నిలకడ నీటిలో మోటారు పడవ వేగం ఎంత? (కి.మీ./గం.లలో)
1) 20 2) 26 3) 25 4) 27
సమాధానాలు: 1 - 2 2 - 3