నమూనా ప్రశ్నలు
1. భారతదేశంలో ప్రజాధనానికి కాపలాదారుగా వ్యవహరించేవారు?
1) అటార్నీ జనరల్ 2) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
3) అడ్వకేట్ జనరల్ 4) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
2. మనదేశంలో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా తొలిసారిగా అకౌంటెంట్ జనరల్ పదవిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1858 2) 1861 3) 1866 4) 1878
3. ‘కాగ్ నిర్వహించే విధులు న్యాయాధికారి విధుల కంటే ముఖ్యమైనవి’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) నరహరిరావు 2) జవహర్లాల్ నెహ్రూ
3) డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 4) ఎ.కె.ఝూ
4. రాజ్యాంగ రూపకల్పన సమయంలో ‘కంప్ట్రోలర్’ అనే పదాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించినవారు?
1) కె.ఎం.మున్షీ 2) టి.టి.కృష్ణమాచారి
3) ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ 4) కె.టి. షా
5. comptroller accountant and auditor general నుంచి accounts విభాగాన్ని ఎప్పుడు వేరుచేశారు?
1) 1976 2) 1978 3) 1979 4) 1981
6. కాగ్‌ను ఎవరిని తొలగించే పద్ధతిలో తొలగిస్తారు?
1) లోక్‌సభ స్పీకర్ 2) రాజ్యసభ ఛైర్మన్
3) అటార్నీ జనరల్ 4) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
7. కాగ్ పదవీకాలం
1) 5 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు
2) 6 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు
3) 5 ఏళ్లు లేదా 70 ఏళ్ల వయసు వరకు
4) 6 ఏళ్లు లేదా 70 ఏళ్ల వయసు వరకు
8. కాగ్ అధికార విధులకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు రూపొందించింది?
1) 1971 2) 1973 3) 1975 4) 1978
సమాధానాలు
1-2; 2-1; 3-3; 4-2; 5-1; 6-4; 7-2; 8-1.