* ఇవి మొనీరా రాజ్యానికి చెందిన సూక్ష్మజీవులు.
* సాధారణంగా ఏకకణ నిర్మితమై ఉంటాయి.
*బ్యాక్టీరియాను మొదటిసారిగా ఆంటొనివాన్ ల్యూవెన్హక్ ఏకకటక సూక్ష్మదర్శిని ద్వారా కనుక్కున్నారు.
* బ్యాక్టీరియం అనే పదాన్ని పరిచయం చేసిన శాస్త్రవేత్త ఎర్హెన్ బర్గ్.
* బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు.
* బ్యాక్టీరియా కణం కేంద్రక పూర్వ కణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
* బ్యాక్టీరియా కణం చుట్టూ స్పష్టమైన కణకవచం ఉంటుంది. అదే విధంగా కణకవచం చుట్టూ క్యాప్సూల్, జిగురు పొర కలిగి ఉండొచ్చు.
* వీటి కణకవచం పెప్టిడో గ్లైకాన్లు, ప్రోటీన్లు, లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది.
* ఈ కణ నిర్మాణంలో త్రిస్తరిత ప్లాస్మాత్వచ నిర్మాణం గమనించవచ్చు.
* ప్లాస్మా త్వచం బ్యాక్టీరియా కణాల్లో కొన్ని ప్రత్యేక స్థానాల్లో లోపలికి ముడతలుగా ముడుచుకుని ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలను మీసోజోమ్‌లు అంటారు. వీటిలో కణశ్వాసక్రియ జరగడానికి కావలసిన ఎంజైమ్‌లు ఉంటాయి.
* కొన్ని బ్యాక్టీరియాలు కశాభాలను చలనాంగాలుగా కలిగి ఉంటాయి. కశాభాలు ఫ్లాజెల్లిన్ అనే ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటాయి.
* చిన్న కేశాల లాంటి నిర్మాణం బ్యాక్టీరియాపై బాహ్య పెరుగుదలగా కనిపిస్తాయి. వీటిని పిలై అంటారు. ఇది పిలిన్ అనే ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటుంది. ఈ పిలై ప్రధానంగా బ్యాక్టీరియాల సంయుగ్మంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
* బ్యాక్టీరియాలను అభిరంజనం చేసే విధానాన్ని గ్రామ్ అభిరంజన విధానం అంటారు. గ్రామ్ అభిరంజన విధానంలో ఉపయోగించే అభిరంజనం పేరు క్రిస్టల్ వయొలెట్. బ్యాక్టీరియాను అవి కనిపించే వర్ణాల ఆధారంగా గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగెటివ్‌గా విభజించారు.
* బ్యాక్టీరియాలలో నిర్దిష్టమైన కేంద్రకం ఉండదు. జన్యుపదార్థం చుట్టూ కేంద్రక త్వచ నిర్మాణం ఉండదు. కాబట్టి ఇవి కేంద్రక పూర్వజీవులు. జన్యుపదార్థం నగ్నంగా ఉండటం వల్ల న్యూక్లియాయిడ్ లేదా జీనోఫోర్గా పిలుస్తారు. జన్యుపదార్థంగా వృత్తాకార ద్వికుండలిని నిర్మాణంలో దీవితి ఉంటుంది.
* బ్యాక్టీరియాలలో కేంద్రక దీవితితో పాటుగా కేంద్రకేతర లేదా కేంద్రక బాహ్య దీవితి కూడా వ్యవస్థితమై ఉంటుంది. దీన్నే ప్లాస్మిడ్ అంటారు. ప్లాస్మిడ్లు సూక్ష్మమైన, వృత్తాకార ద్విపోచయుత దీవితి అణువులు. ప్లాస్మిడ్ అనే పదాన్ని లెడర్బర్గ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ప్లాస్మిడ్లు ఫలన సామర్థ్యానికి, సూక్ష్మజీవనాశకాల నిరోధకత్వానికి, సంబంధించిన జన్యువులను కలిగి ఉంటాయి.
* బ్యాక్టీరియాలు 70ళీ రకానికి చెందిన రైబోజోమ్లను కలిగి ఉంటాయి. 50ళీ, 30ళీ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటాయి. ఇవి ౯ళివితి, ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. ప్రోటీన్ల జీవసంశ్లేషణకు ఇవి ఉపకరిస్తాయి.
* బ్యాక్టీరియాలు శక్తి ఉత్పాదన కోసం వాయు, అవాయు శ్వాసక్రియ పద్ధతులను అవలంబిస్తాయి.
* బ్యాక్టీరియాలు సాధారణంగా స్వయం పోషితాలు, పరపోషితాలుగా పేర్కొనవచ్చు. స్వయం పోషక బ్యాక్టీరియాలు కిరణజన్య సంయోగక్రియ వర్ణక పదార్థాలైన బ్యాక్టీరియో క్లోరోఫిల్, బ్యాక్టీరియో ఫియోఫైటిన్లను కలిగి ఉంటాయి. వీటి కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడదు. కాబట్టి దీన్ని ఆక్సిజన్ ఉత్పాదనరహిత కిరణజన్యసంయోగక్రియ అంటారు.
* పరపోషిత బ్యాక్టీరియాలు పూతికాహార పోషణను లేదా పరాన్న జీవనాన్ని ప్రదర్శిస్తుంటాయి.
* బ్యాక్టీరియాలు సిద్ధబీజాల ఏర్పాటు, ద్విధావిచ్ఛిత్తి పద్ధతుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
* బ్యాక్టీరియాలలో సాధారణంగా లైంగిక ప్రత్యుత్పత్తి మూడు విధాలుగా జరగవచ్చు అవి: i్శ జన్యు పరివర్తనం ii్శ సంయుగ్మం iii్శ జన్యువహనం.
* బ్యాక్టీరియాను పోలి ఉన్న శైవల జాతులు నీలిఆకుపచ్చ శైవలాలు. వీటిని సయనో బ్యాక్టీరియా అంటారు. వీటిలో మొక్కల్లో జరిగే విధంగానే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. నాస్టాక్, అనబీనా, సైటోనిమా, రివ్యులేరియా లాంటివి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.
బాక్టీరియా వల్ల కలిగే ప్రయోజనాలు
* బ్యాక్టీరియాలు మనిషికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి.
* బ్యాక్టీరియాలను యాంటీ బయాటిక్స్ (సూక్ష్మజీవ నాశకాలు) తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఉదా: నేలలో పెరిగే బేసిల్లస్ బ్రెవిస్ అనే బ్యాక్టీరియా జాతి నుంచి గ్రామిసిడిన్ అనే యాంటీబయాటిక్ తయారు చేస్తారు. బ్యాక్టీరియాలలో అత్యధికంగా సూక్ష్మజీవ నాశకాలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియం ప్రజాతి స్ట్రెప్టోమైసిస్. సహజంగా ఉత్పత్తి చేసే, వైద్య శాస్త్రపరంగా ఉపయోగిస్తున్న సూక్ష్మజీవ నాశకాల్లో సుమారు 2/3 వంతు వీటి నుంచే ఉత్పత్తి అవుతున్నాయి.
* చనిపోయిన జంతు, వృక్ష కళేబరాలను బ్యాక్టీరియా పూతికాహార భక్షణ ద్వారా విచ్ఛిన్నం చేసి, కర్బన పదార్థాలు (సేంద్రీయ), అకర్బన పదార్థాలుగా మార్చి తిరిగి మృత్తికలోకి చేరుస్తున్నాయి. ఈ విధంగా ఇవి జీవ భౌమ్య రసాయన వలయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
* రైజోబియం అనే బ్యాక్టీరియా వేరుశనగ, బఠానీ, చిక్కుడు లాంటి లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన ఆవృత బీజ మొక్కల్లోని వేరు భాగాలతో సహజీవనం చేస్తూ, వేరుబుడిపెలు ఏర్పరచడం ద్వారా వాటికి కావలసిన నత్రజని స్థాపన చేస్తాయి. అందుకే ఈ బ్యాక్టీరియాను జీవ ఎరువుగా పేర్కొంటారు. జీవ ఎరువులుగా ఉపయోగపడుతున్న ఇతర బ్యాక్టీరియా రోడోస్పైరిల్లం, అజోస్పైరిల్లం మొదలైనవి.
* లాక్టోబాసిల్లస్ ప్రభావం వల్ల పాలలో ఉండే చక్కెర లాక్టోజ్ విచ్ఛిత్తి పొంది, లాక్టిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. దీని వల్ల పాలు పెరుగుగా మారతాయి.
* కిణ్వన ప్రక్రియ ద్వారా పారిశ్రామికంగా అనేక బ్యాక్టీరియాల సహాయంతో లాక్టిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం లాంటి కర్బన ఆమ్లాలు; బి-కాంప్లెక్స్ లాంటి విటమిన్లు; గ్లుటామిక్ ఆమ్లం లాంటి అమైనో ఆమ్లాలు; ఆల్కహాల్స్ లాంటివి ఉత్పత్తి చేయడం సాధ్యపడుతుంది.
* ఎశ్చరీషియా కొలై లాంటి బ్యాక్టీరియాలను జెనెటిక్ ఇంజినీరింగ్ లాంటి అధునాతన జీవశాస్త్రాల పరిశోధనల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
* బాసిల్లస్ తురెంజియన్సిస్, సూడోమోనాస్ లాంటి బ్యాక్టీరియాలను జీవక్రిమి సంహారకాలుగా ఉపయోగించవచ్చు. వీటి వాడకం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించవచ్చు.
* రుమినోకోకస్ లాంటి బ్యాక్టీరియా శాకాహార జీవులైన పశువుల జీర్ణాశయంలో సెల్యులోజ్ జీర్ణక్రియకు సహకరిస్తాయి.
* మానవుల జీర్ణక్రియలో ఎశ్చరీషియా కొలై సాయపడుతుంది.
* బ్యాక్టీరియా జీవపరిహారాత్మక చర్య (బయోరెమిడియేషన్) ద్వారా మలినాలను విచ్ఛిన్నం చేయగలవు.
బ్యాక్టీరియా వల్ల కలిగే హానికర ప్రభావాలు
* మొక్కలు, జంతువుల్లోనే కాకుండా మానవుల్లో కూడా బ్యాక్టీరియా వల్ల అనేక వ్యాధులు కలుగుతున్నాయి. ఉదా: నిమ్మజాతి మొక్కల్లో జాంథోమోనాస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల సిట్రస్ కాంకర్ వస్తుంది. బాసిల్లై అనే బ్యాక్టీరియా గొర్రెల్లో ఆంథ్రాక్స్ వ్యాధిని కలిగిస్తుంది. మానవుల్లో కలరా వ్యాధిని విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా కలిగిస్తుంది.
* డీనైట్రిఫికేషన్ చర్యల ద్వారా బ్యాక్టీరియా వల్ల నేల తన సారాన్ని కోల్పోవచ్చు. బాసిల్లస్ సిరియస్, పారా కోకస్ డీనైట్రిఫికెన్స్ లాంటివి డీనైట్రిఫికేషన్ బ్యాక్టీరియాకు ఉదాహరణలు.
* కొన్ని రకాల స్ట్రెప్టోకోకస్ జాతులు, మైక్రోకోకస్ జాతులు ఆహారాన్ని పాడుచేసి, హానికర ప్రభావాన్ని చూపుతాయి. సాల్మొనెల్లా టైఫి (టైఫాయిడ్‌ను కలిగిస్తుంది), విబ్రియో కలరా, షైజిల్లా డిసింట్రియే (అతిసారం కలిగిస్తుంది) లాంటి బ్యాక్టీరియాలు నీటిని కలుషితం చేస్తాయి.
బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు:
బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ జీవుల నిర్మాణం ఉన్న ఏకకణ జీవులు. వీటిలో క్రోమోజోమ్‌లు (జన్యుపదార్థం) నగ్నంగా, కేంద్రకత్వచం లేకుండా ఉంటాయి. జన్యు పదార్థంతో పాటు కణద్రవ్యంలో ఉండే కేంద్రకేతర డీఎన్ఏ శకలాన్ని ప్లాస్మిడ్ అంటారు.
* బ్యాక్టీరియా అనే సూక్ష్మజీవుల వల్ల మానవుడిలో అనేక వ్యాధులు కలుగుతున్నాయి.
కలరా
* ఇది ఒక ఎపిడెమిక్ వ్యాధి
* విబ్రియో కలరా (Vibrio cholerae) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
* సుమారుగా వ్యాధి సంక్రమించిన 12 గంటల నుంచి 5 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు.
* వాంతులు, విరేచనాలు కావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
* కలరాతో బాధపడుతున్న మనిషి రోజుకు సుమారు ఇరవై లీటర్ల వరకూ ద్రవాలను కోల్పోతాడు. దీనివల్ల శరీరంలో నీరు, లవణాలు లోపిస్తాయి.
* నష్టపోయిన లవణాలను అందించడానికి ORS (Oral Rehydration Solution) ద్రావణాన్ని రోగికి ఇవ్వాలి.
* ఈ వ్యాధి కారక క్రిమి కలుషితమైన నీరు, ఆహార పదార్థాల ద్వారా ఆరోగ్యవంతుడైన మనిషిలోకి ప్రవేశిస్తుంది.
టైఫాయిడ్
* ఇది సాల్మోనెల్లా టైఫై (Salmonella typhi) అనే బ్యాక్టీరియం వల్ల సంక్రమిస్తుంది.
* కలుషితమైన ఆహారం, తాగునీరు ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. పరిశుభ్రత లేకపోవడం ఈ వ్యాధి కలగడానికి ప్రధాన కారణం.
* చికిత్స జరగక సుమారు 25 శాతం మంది వ్యాధిగ్రస్తులు మరణిస్తుంటారు. టైఫాయిడ్ చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్‌ను (సూక్ష్మ జీవనాశకాలు) వాడతారు.
* సాల్మోనెల్లా టైఫై సాధారణంగా మనిషి పేగుల్లో, రక్తప్రవాహంలో జీవిస్తుంది.
* ఏ జంతువూ ఈ వ్యాధి సంక్రమణకు వాహకంగా పనిచేయదు. ఈ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది.
* టైఫాయిడ్ పరాన్నజీవిని మనిషి రక్తం, మలం, మూత్రం, ఎముక మజ్జలో గమనించడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
* సాధారణంగా వ్యాధి సంక్రమించిన 6 నుంచి 30 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయట పడవచ్చు.
* ఈ వ్యాధి లక్షణాల్లో ప్రధానమైనవి సుమారు 104oF ఉష్ణోగ్రత తీవ్రతతో జ్వరం, వాంతులు, విరేచనాలు. కొందరిలో మెడ, ఉదర భాగాల్లో గులాబీ రంగు మచ్చలు కూడా కనిపించవచ్చు.
డిఫ్తీరియా
* ఇది కొరైనీ బ్యాక్టీరియం డిఫ్తీరియే (Corynebacterium diphtheriae) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
* మనిషికి మనిషికి మధ్య ప్రత్యక్ష తాకిడి ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
* వ్యాధికారక బ్యాక్టీరియం మానవుడి గొంతు, నాసికా కుహరాలను ప్రభావితం చేస్తుంది.
* జ్వరం, గొంతు నొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
* ఇది చలి కాలంలో వేగంగా వ్యాపిస్తుంది.
* ఇది ఇంక్యుబేషన్ సమయం సుమారు 2 నుంచి 5 రోజులు.
* ఇది ఇచ్చే వ్యాక్సిన్ పేరు డి.పి.టి.
* డి.పి.టి. అనేది ట్రిపుల్ ఏంటిజన్, దీనిలో డిఫ్తీరియా, పెర్టుసిస్ (కోరింత దగ్గు), టెటనస్ (ధనుర్వాతం) వ్యాధులు మూడింటినీ ఎదుర్కోగల వ్యాక్సిన్లు ఉంటాయి.
కోరింత దగ్గు (పెర్టుసిస్)
* బోర్డిటెల్లా పెర్టుసిస్ (Bordetella pertussis) అనేది కోరింత దగ్గు వ్యాధిని కలగజేస్తుంది.
* చిన్న పిల్లల్లో ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తుంది.
* ఈ వ్యాధి సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంటుంది.
* జ్వరం, వదలని దగ్గు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
* ఈ వ్యాధిని కట్కాయి వ్యాధి, ఊఫింగ్ కాఫ్ అని కూడా పిలుస్తారు.
* ఇది ఊపిరితిత్తుల సంబంధమైన శ్వాసకోశ వ్యాధిగా గుర్తింపు పొందింది.
ధనుర్వాతం (టెటనస్)
* ఈ వ్యాధి క్లాస్ట్రీడియమ్ టెటనై (Clostridium tetani) అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది.
* ఈ బ్యాక్టీరియం ఉత్పత్తి చేసిన విషపదార్థం మెదడు, నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది.
* కట్టుకట్టని గాయాలు, చీరుకుపోయిన చర్మ భాగాల ద్వారా ధనుర్వాతం సంక్రమిస్తుంది.
* రోగి మెడ, దవడ కండరాలు బిగుసుకుపోయి బాధపెడతాయి.
* రోగి శరీరం ధనస్సు ఆకారంలో వంచినట్లు తయారవుతుంది.
* ఈ వ్యాధి ఇంక్యుబేషన్ సమయం నాలుగు రోజుల నుంచి సుమారు మూడు వారాల వరకు ఉంటుంది.
* దీన్నే లాక్‌జా వ్యాధి అని కూడా అంటారు.
క్షయ (T.B.)
* ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యుబర్క్యులోసిస్ (Mycobacterium tuberculosis) అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది.
* అలసట, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి, బరువు తగ్గడం లాంటివి క్షయ వ్యాధి ప్రధాన లక్షణాలు.
* ఈ వ్యాధివల్ల ప్రధానంగా ప్రభావితమయ్యేవి ఊపిరితిత్తులు.
* క్షయను రికవరీ డిసీజ్ లేదా సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు.
* వ్యాధిగ్రస్తుల నుంచి గాలి ద్వారా ఈ బ్యాక్టీరియం వ్యాపిస్తుంది.
* ప్రపంచంలో అత్యధికంగా క్షయవ్యాధి ఉన్న దేశంగా మన భారతదేశం రికార్టుల్లో ఉంది.
* ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని ఏటా మార్చి 24న నిర్వహిస్తారు.
* 2018 సంవత్సరానికి 'క్షయ లేని ప్రపంచం కోసం నాయకులు కావాలి' అనే ముఖ్య ఉద్దేశంతో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహించారు.
* క్షయవ్యాధి నివారణకు ఉపయోగపడే ముఖ్యమైన సూక్ష్మ జీవ నాశకం 'స్ట్రెప్టోమైసిన్'.
* పసిపిల్లలకు క్షయవ్యాధి రాకుండా బి.సి.జి. టీకాలు ఇస్తారు. (BCG - Bacillus Calmette Guerin).
కుష్టు వ్యాధి (లెప్రసీ)
* ఈ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి మైకో బ్యాక్టీరియం లెప్రె.
* చర్మంపై మచ్చలు రావడం, స్పర్శ లేకపోవడం, చేతులు, కాలి వేళ్ల నుంచి రక్తస్రావం లాంటివి కుష్టువ్యాధి లక్షణాలు.
* ఈ వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియాను హన్సన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. కాబట్టి ఈ వ్యాధికి హన్సన్ వ్యాధి అనే పేరు కూడా ఉంది.
* 2018లో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవాన్ని జనవరి 28న నిర్వహించారు.
* World Leprosy Day 2018 సంవత్సరానికి బాల బాలికల్లో వైకల్య శూన్యత అనే ముఖ్య ఉద్దేశంతో జరిపారు.
* కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదు.
* ఇతర వ్యాధులతో పోలిస్తే ఇది చాలా నెమ్మదిగా వ్యాధిగ్రస్తుడి శరీరంలో అభివృద్ధి చెందుతుంది.
* జాతీయ కుష్టు వ్యాధి నియంత్రణా కార్యక్రమం 1955 లోనే ప్రారంభమైంది.
ప్లేగు వ్యాధి
* ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా పేరు యెర్సీనియా పెస్టిస్.
* ఈ బ్యాక్టీరియా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది.
* ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, వాంతులు, కండరాలు వంకరలు పోవడం మొదలైనవి.
* ఈ వ్యాధినే బ్లాక్‌డెత్ అని కూడా పిలుస్తారు.
* ఇది రక్తప్రసరణ వ్యవస్థకు, కండరాలకు సంబంధించిన వ్యాధి.
* ప్లేగు వ్యాధి నివారణకు ఉపయోగపడే ఔషధం టెట్రాసైక్లిన్.
* టెట్రాసైక్లిన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నారు. ఈయనకు అద్భుత ఔషధసృష్టికి మంత్రగాడు అనే పేరు ఉంది.
* ప్లేగువ్యాధి బ్యుబోనిక్, సెప్టెసెమిక్, న్యూమోనిక్ అని మూడు విధాలుగా ఉండవచ్చు.
ఆంథ్రాక్స్
* వ్యాధి కారక సూక్ష్మజీవి పేరు బాసిల్లస్ ఆంథ్రసిస్.
* ఇది పశువులు, గొర్రెల పాలు, మాంసం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది.
* ఈ వ్యాధి నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది.
మెనింజైటిస్
* మెనింజిస్ పొరల వాపు ఈ వ్యాధి ప్రధాన లక్షణం.
* మెనింజిస్ అంటే వెన్నుపాము, మెదడులను ఆవరించి ఉండే పొరలు.
* ఇది సాధారణంగా నిస్సెరా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది.
గనేరియా
* ఈ వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియం పేరు నిస్సీరియా గనేరియే (Neisseria gonorrhoea)
* ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది.
* ఇంక్యుబేషన్ కాలం సుమారు 2 నుంచి 10 రోజులు.
* మూత్ర జననేంద్రియ వాహికల వాపు ఈ వ్యాధి ప్రధాన లక్షణం.
* ఈ వ్యాధికారక బ్యాక్టీరియం పేరు ట్రిపోనిమా పేలిడమ్.
* ఈ వ్యాధి కూడా అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల సంక్రమిస్తుంది.
* మొదటి దశ వ్యాధి లక్షణాలు పది రోజుల నుంచి మూడు వారాల వ్యవధిలో కనిపిస్తాయి.
* లింఫ్ గ్రంథుల వాపు, ఫ్లూ జ్వరానికి ఉన్న కొన్ని లక్షణాలు, చర్మంపైన దురదలేని మచ్చలు, జననాంగాల ప్రాంతంలో చర్మం పెరుగుదల లాంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
బొటులిజం (ఆహార విష ప్రభావ వ్యాధి)
* ఆహార విష ప్రభావాన్ని కలిగించే ఒక బ్యాక్టీరియా రకం క్లాస్ట్రీడియం బొటులీనమ్.
* కలుషిత ఆహారం వల్ల ఈ బ్యాక్టీరియా వ్యాపించి, వ్యాధిని కలగజేస్తుంది.
* ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారంలో ఈ బ్యాక్టీరియా పెరిగి బొటులిన్ అనే విషపదార్థాన్ని విడుదల చేస్తుంది. ఫలితంగా ఆ ఆహారాన్ని తీసుకున్నవారు విష ప్రభావానికి లోనై, వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలతో బాధపడతారు.
జంతువుల్లో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు
* పశువుల్లో క్షయ మైకోబ్యాక్టీరియం బొవిస్.
* పశువుల్లో బ్లాక్‌లెగ్ వ్యాధి క్లాస్ట్రీడియం చావోలు బ్యాక్టీరియా.
* గొర్రెలు, మేకల్లో కలిగే బేంగ్స్ వ్యాధి (బ్రూసిల్లోసిస్) బ్రూసిల్లా బ్యాక్టీరియం.
* గొర్రెల్లో ఫుట్రాట్ వ్యాధి ప్యూజీఫార్మిస్ నోడోసస్.
మొక్కల్లో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు
* వరిలో ఎండు తెగులు (బ్లయిట్ తెగులు) జాంథో మోనాస్ ఒరైజే.
* నిమ్మలో గజ్జి తెగులు (సిట్రస్ కేంకర్) జాంథో మోనాస్ సిట్రి.
* బంగాళాదుంపల్లో సాప్ట్రాట్ వ్యాధి సూడోమోనాస్ సొలనేషియారమ్.
* క్యాబేజీలో బ్లాక్రాట్ వ్యాధి జాంథో మోనాస్ కాంపెస్ట్రిస్.
* ఆపిల్‌లో క్రౌన్‌గాల్ వ్యాధి ఆగ్రో బ్యాక్టీరియం ట్యుమిఫేషియన్స్.
* పత్తిలో కోణీయ ఆకుమచ్చ తెగులు వ్యాధి జాంథోమోనాస్ మాల్వేసియారమ్.
* చెరకులో గమ్మోసిస్ వ్యాధి జాంథోమోనాస్ వాస్కులోరమ్.
* పొగాకులో విల్ట్ తెగులు ఫైటో బ్యాక్టీరియం సొలనేషియారమ్.