• facebook
  • whatsapp
  • telegram

బ్యాక్టీరియా

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిలో లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు ఏవి?
i) మెనింజైటిస్        ii) గనేరియా           iii) గనేరియా               iv) మలేరియా
జ‌: గనేరియా, గనేరియా మాత్రమే

 

2. కిందివాటిలో ORS (ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్) ద్వారా చికిత్స చేయదగ్గ వ్యాధి ఏది?
ఎ) క్షయ              బి) కలరా             సి) తట్టు                  డి) మెదడువాపు
జ‌: బి(కలరా)

 

3. 'హన్‌సన్' వ్యాధి అని దేనికి పేరు?
జ‌: క్షయ

 

4. ఆపిల్‌లో క్రౌన్‌గాల్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి?
జ‌: ఆగ్రో బ్యాక్టీరియం ట్యుమిఫేషియన్స్

 

5. కిందివాటిని సరిగా జతచేయండి.
జాబితా 'ఎ'               జాబితా 'బి'
i) డిఫ్తీరియా               a) ట్రిపనోసోమా పేలిడమ్
ii) పెర్టుసిస్                b) క్లాస్ట్రీడియం టెటనై
ii) టెటనస్                 c) బోర్డిటెల్లా పెర్టుసిస్
iv) సిఫిలిస్                d) కార్ని బ్యాక్టీరియా
జ‌: i-d, ii-c, iii-b, iv-a

 

6. పసిపిల్లల్లో ఏ వ్యాధి రాకుండా BCG వ్యాక్సిన్‌ను ఇస్తారు?
జ‌: క్షయ

 

7. బ్యాక్టీరియాలకు సంబంధించి సరైనవి ఏవి?
i) ఇవి ఏకకణజీవులు
ii) ఇవి కేంద్రకపూర్వ జీవులు
iii) వీటిలో ప్లాస్మిడ్లు అనే ప్రత్యేక నిర్మాణాలు కనిపిస్తాయి.
జ‌: i, ii, iii

 

8. వైడల్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని నిర్ధారించవచ్చు?
జ‌: టైఫాయిడ్

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో బ్యాక్టీరియా వల్ల మానవుడిలో సంభవించే వ్యాధులేవి?

i) న్యూమోనియా       ii) కలరా      iii)  ప్లేగు        iv) డిఫ్తీరియా 

ఎ) i, ii మాత్రమే          బి) ii, iii మాత్రమే       సి) i, ii, iii          డి) i, ii, iii, iv


2. ‘‘నియోమైసిన్‌’’ అనే సూక్ష్మజీవ నాశకం కింది ఏ బ్యాక్టీరియా ప్రజాతి నుంచి ఉత్పత్తి అవుతుంది?

ఎ) స్టెఫైలోకోకస్‌         బి) బాసిల్లస్‌    సి) స్ట్రెప్టోమైసిస్‌         డి) ఎశ్చరీషియా


3. యాంటిబయాటిక్‌ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?

ఎ) స్పైడర్‌మాన్‌       బి) వాక్స్‌మాన్‌       సి) రాబర్ట్‌ కోష్‌     డి) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌


4. మొట్టమొదటి యాంటిబయాటిక్‌ (సూక్ష్మజీవనాశకం) గా దేన్ని పేర్కొనవచ్చు?

ఎ) స్ట్రెప్టోమైసిన్‌         బి) పెన్సిలిన్‌       సి) అజిత్రోమైసిన్‌         డి) నియోమైసిన్‌


5. కిందివాటిలో సజీవ శిలాజంగా (లివింగ్‌ ఫాజిల్‌) పేర్కొనదగిన బ్యాక్టీరియా ఏది?

ఎ) ఆర్కీబ్యాక్టీరియా      బి) ఏక్టినోమైసిటిస్‌         సి) మైకోప్లాస్మా            డి) బాసిల్లస్‌ బ్యాక్టీరియా


6. కిందివాటిని సరిగా జతచేయండి.

బ్యాక్టీరియా రకం          ఆకారం

i)  కోకస్‌                    a) సర్పిలాకారం

ii)  బాసిల్లస్‌               b)కామా ఆకారం

iii)  విబ్రియో              c) దండాకారం

iv)  స్పైరిల్లమ్‌            d) గుండ్రని ఆకారం


ఎ) i-a ;     ii-b ;    iii-c    iv-d           బి) i-d ;     ii-c    iii-b  iv-a 
సి) i-c ;     ii-a     iii-b    iv-d            డి) i-c ;     ii-d     iii-a  iv-b


7. బ్యాక్టీరియాలు కింది ఏ రాజ్యానికి చెందుతాయి?

ఎ) ప్రొటిస్టా         బి) ఫంగై         సి) మొనీరా         డి) అనిమేలియా


8. బ్యాక్టీరియాలో ఏ రకం రైబోజోమ్‌లు ఉంటాయి?  

ఎ) 60S        బి) 80S     సి) 90S   డి) 70S 


9. బ్యాక్టీరియా న్యూక్లియాయిడ్‌ ఎన్ని దీవితి అణువులతో నిర్మితమవుతుంది?

ఎ) 4     బి) 3    సి) 2    డి) 1


10. బ్యాక్టీరియా పేరు - కలిగించే వ్యాధిని జతచేయండి:    

i)  మైకోబ్యాక్టీరియం లెప్రె           a) టైఫాయిడ్‌

ii)  పాస్టురెల్లా పెస్టిస్‌                 b) గాంగరిన్‌

iii) క్లాస్ట్రీడియం పెర్‌ఫ్రిన్జెన్స్‌          c) ప్లేగు

iv)  సాల్మొనెల్లా టైఫోసా             d) లెప్రసీ (కుష్టు) 


ఎ) i-c ;     ii-d ;    iii-d    iv-a           బి) i-d ;     ii-c    iii-a  iv-b
సి) i-d ;     ii-b      iii-a     iv-c          డి) i-d ;     ii-c     iii-b  iv-a


11. స్వేచ్ఛగా నత్రజని స్థాపన చేస్తూ మృత్తిక సారాన్ని పెంపొందించే బ్యాక్టీరియా ఏవి?  

i)  అజటోబ్యాక్టర్‌      ii) క్లాస్ట్రీడియం   iii) రైజోబియం

ఎ) i, ii    బి) ii, iii     సి) i, iii   డి) i, ii, iii


12. కిందివాటిలో జంతువుల్లో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఏవి?

i)  ఆంథ్రాక్స్‌          ii)  బ్లాక్‌లెగ్‌ వ్యాధి         iii) క్రౌన్‌గాల్‌ 

ఎ) i, iii     బి) ii, iiii     సి) i, ii  డి) i, ii, iii


13. కింది దేన్ని గ్రిఫిత్‌ ప్రభావంగా పేర్కొనవచ్చు?  

ఎ) బ్యాక్టీరియా సంయుగ్మం      బి) బ్యాక్టీరియా జన్యుపరివర్తనం

సి) బ్యాక్టీరియా జన్యువహనం   డి) బ్యాక్టీరియోఫాజ్‌ల వల్ల బ్యాక్టీరియా విచ్ఛిత్తి


14. బ్యాక్టీరియా ప్రదర్శించే ప్రత్యుత్పత్తి విధానాలు ఏవి? 

i)  ద్విధావిచ్ఛిత్తి     ii) కోరకీభవనం  iii)  ప్లాస్మాలిసిస్‌

ఎ) i, ii   బి) ii, iii   సి) i, iii    డి) i, ii, iii


15. గ్రామ్‌ అభిరంజన విధానంలో చివరి దశలో సాఫ్రనిన్‌ ద్వారా అభిరంజనం చేసిన గ్రామ్‌నెగెటివ్‌ బ్యాక్టీరియా ఏ రంగులో కనిపిస్తుంది?

ఎ) ఊదా రంగు     బి) నీలం రంగు     సి) ఎరుపు రంగు       డి) ఎలాంటి రంగూ ప్రదర్శించదు


16. బ్యాక్టీరియాలో కశాభాలు దేనికోసం నిర్దేశించినవి?

ఎ) చలనం     బి) ప్రత్యుత్పత్తి     సి) ప్రతికృతి     డి) రక్షణ


17. ధ్రువాల వద్ద కశాభాల సమూహాన్ని కలిగి ఉండే బ్యాక్టీరియాలు?   

ఎ) పెరిట్రైకస్‌         బి) మోనోట్రైకస్‌        సి) ఏంఫీట్రైకస్‌         డి) లోఫాట్రైకస్‌


జవాబులు

1-డి  2-సి  3-బి  4-ఎ  5-ఎ  6-బి  7-సి    8-డి  9-డి  10-డి  11-ఎ  12-సి  13-బి  14-ఎ    15-సి 16-ఎ  17-డి.


 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌