• facebook
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ

                సజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడిన పదార్థాన్ని మూలకం అంటారు. మూలకం (Element) అనే పదాన్ని మొదట నిర్దేశించిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్. ఒకే రకమైన ధర్మాలున్న మూలకాలను ఒకేచోట చేర్చడాన్ని వర్గీకరణం అంటారు. దీని వల్ల వాటి ధర్మాలను తేలిగ్గా అధ్యయనం చేయవచ్చు.
* నేడు మనకు అందుబాటులో ఉన్న ఆవర్తన పట్టికలోని 109 మూలకాలను స్థూలంగా లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు, వాయుమూలకాలు, జడవాయువులు, రేడియోధార్మిక మూలకాలుగా అధ్యయనం చేయవచ్చు.
* సంకేతం: మూలకం నామాన్ని తెలియజేసే సంక్షిప్త రూపాన్ని సంకేతం అంటారు. సంకేతాలను మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త బెర్జీలియస్.
a) కొన్ని మూలకాలకు వాటి ఇంగ్లిష్ నామాల మొదటి అక్షరాన్ని సంకేతంగా నిర్ణయించారు.
     ఉదా: హైడ్రోజన్ H, బోరాన్ B, కార్బన్ C, నైట్రోజన్ N, ఆక్సిజన్ O, ఫ్లోరిన్ F.
b) కొన్ని మూలకాలకు వాటి ఇంగ్లిష్ నామాల మొదటి రెండు అక్షరాలను సంకేతాలుగా పేర్కొన్నారు.
     ఉదా: హీలియం He, లిథియం Li, బెరీలియం Be, నియాన్ Ne, కాల్షియం Ca, అల్యూమినియం Al.
c) కొన్ని మూలకాలకు వాటి లాటిన్ నామాల్లోని అక్షరాలను సంకేతాలుగా నిర్ణయించారు.

   ఉదా:
                      

d) కొన్ని మూలకాలకు గ్రహాల పేర్లలోని అక్షరాలను సంకేతాలుగా నిర్ణయించారు.


                
e) కొన్ని మూలకాలకు వాటిని కనుక్కున్న ప్రదేశాల పేర్లలోని అక్షరాలను సంకేతాలుగా నిర్ణయించారు.
                

f) కొన్ని మూలకాలకు శాస్త్రవేత్తల పేర్లలోని అక్షరాలను సంకేతాలుగా నిర్ణయించారు.

               
మూలకాలు - వర్గీకరణ: మూలకాలను మొదట వర్గీక రించిన శాస్త్రవేత్త డోబరైనర్. ఆయన మూలకాలను త్రికాలుగా వర్గీకరించి త్రిక సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఈ త్రికాలలో మధ్య మూలకం పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సగటుకు సమానం. డోబరైనర్ త్రికాలలో ముఖ్యమైనవి 1) Li, Na, K
2) Cl, Br, I 3) S, Se, Te 4) Fe, Co, Ni. అన్ని మూలకాలను త్రికాలుగా వర్గీకరించడం ఆయనకు సాధ్యం  కాలేదు.

న్యూలాండ్స్ వర్గీకరణం: మూలకాలను అష్టకాలుగా వర్గీకరించి అష్టక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జాన్ న్యూలాండ్స్. ఈ సిద్ధాంతం ప్రకారం మూలకాలను వాటి పరమాణు భారాలు పెరిగే క్రమంలో అమర్చినప్పుడు, ప్రతి 8వ మూలకం ధర్మాల్లో దాని 1వ మూలకంతో పోలి ఉంటుంది.
ఉదా:

Li

Be B C N O F
Na Mg Al Si P S   Cl
K Ca          

ఈ వర్గీకరణం పరమాణు భారం 40 (Ca) తర్వాత ఉన్న భారయుతమైన మూలకాలకు వర్తించలేదు.

మెండలీఫ్ వర్గీకరణం: మూలకాలను వాటి పరమాణు భారాల ఆధారంగా మెండలీఫ్ వర్గీకరించాడు. మెండలీఫ్ ఆవర్తన నియమం ప్రకారం మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. మెండలీఫ్ కాలం నాటికి మనకు తెలిసిన మూలకాల సంఖ్య 63. ఆయన మొదట మూలకాలను గ్రూపులు, పీరియడ్లుగా వర్గీకరించాడు. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు, 8 గ్రూపులు ఉన్నాయి. I నుంచి VII వరకు గ్రూపులకు A, B అనే ఉప గ్రూపులుగా వర్గీకరించాడు. ఈ ఉపగ్రూపుల్లోని మూలకాల ధర్మాల్లో ఎక్కువ పోలికలున్నాయి. VIII గ్రూపులో పరివర్తన త్రికాలు అమరి ఉన్నాయి. మెండలీఫ్ పట్టికలో కొన్ని కనుక్కోవలసిన మూలకాలకు ఖాళీలను వదిలారు. ఆ మూలకాలను తర్వాత కాలంలో కనుక్కున్నారు.
ఉదా: ఎకాబోరాన్ స్కాండియం (Sc) గా, ఎకా అల్యూమినియం గాలియం (Ga) గా, ఎకాసిలికాన్ జర్మేనియం (Ge) గా కనుక్కున్నారు. 
           మెండలీఫ్ పట్టికలో కొన్ని మూలకాల జంటల్లో పరమాణు భారాలు పెరిగే క్రమాన్ని పాటించలేదు. ఈ మూలకాలను అసాధారణ జంటలు లేదా తలకిందుల జంటలు అంటారు. అవి ) Ar, K 2) Co, Ni 3) Te, I.

మోస్లే వర్గీకరణం: మోస్లే వల్ల మూలకాల వర్గీకరణం కొత్త మలుపు తిరిగింది. ఆయన పరమాణు భారం కంటే పరమాణు సంఖ్యే మూలకాల ప్రాథమిక ధర్మమని తేల్చి చెప్పాడు. దీంతో ఆధునిక ఆవర్తన పట్టికలో మూలకాలను వాటి పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో అమర్చారు. ఈ పట్టికలో మూలకాల అమరిక చాలా విశిష్టంగా ఉంది. ఎడమవైపు లోహాలు, కుడివైపు చివర జడవాయువులు, వాటికి ఎడమవైపున అలోహాలు, వాటి అంతరాల్లో అర్ధలోహాలు, పట్టిక అడుగుభాగంలో రేడియో ధార్మిక మూలకాలను అమర్చారు. దీంతో ఆవర్తన పట్టికకు విస్తృత రూపం ఏర్పడింది.

పీరియడ్లు: ఆధునిక ఆవర్తన పట్టికను ఏడంతస్తుల మేడగా భావించవచ్చు. ఒక్కో అంతస్తు ఒక పీరియడ్. ఈ పీరియడ్లు పట్టికలో అడ్డంగా అమరి ఉంటాయి. ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు ఉన్నాయి. ఆధునిక ఆవర్తన పట్టికలో అతిపెద్దది 6వ పీరియడ్. దీనిలో 32 మూలకాలు అమరి ఉన్నాయి.            
 

  

గ్రూపులు: ఆవర్తన పట్టికలో నిలువుగా ఉండే గడులను గ్రూపులు లేదా కుటుంబాలు అంటారు. ఈ పట్టికలో 18 నిలువు గడులను 16 గ్రూపులుగా వర్గీకరించారు. VIII గ్రూపులో పరివర్తన త్రికాలు ఉంటాయి. ఈ గ్రూపు మూడు నిలువు గడులతో ఉంటుంది. ఒక గ్రూపులోని మూలకాలన్నీ ఒకే బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. అందువల్ల ఒక్కో గ్రూపు మూలకాలన్నీ ఒకే ధర్మాలను ప్రదర్శిస్తాయి. దీన్ని బట్టి మనం ఆధునిక ఆవర్తన పట్టికకు మూలప్రాతిపదిక మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం అని భావించవచ్చు. ఒక గ్రూపులోని మూలకాలన్నీ ఒకే బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండటంతో ఒకే ధర్మాలను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
                I A గ్రూపులో లిథియం (Li), సోడియం (Na), పొటాషియం (K), రుబీడియం (Rb), సీజియం (Cs), ఫ్రాన్షియం (Fr) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns1.
                II A గ్రూపులో బెరీలియం (Be), మెగ్నీషియం (Mg), కాల్షియం (Ca), స్ట్రాన్షియం (Sr), బేరియం (Ba), రేడియం (Ra) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2
                III A గ్రూపులో బోరాన్ (B) అల్యూమినియం (Al), గాలియం (Ga), ఇండియం (In), థాలియం (Tl) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np1
                IV A గ్రూపులో కార్బన్ (C), సిలికాన్ (Si), జర్మేనియం (Ge), టిన్ (Sn), లెడ్ (Pb) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np2
                V A గ్రూపులో నైట్రోజన్ (N), ఫాస్ఫరస్ (P), ఆర్సినిక్ (As), ఆంటిమొని (Sb), బిస్మత్ (Bi) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np3.
                VI A గ్రూపులో ఆక్సిజన్ (O), సల్ఫర్ (S), సిలీనియం (Se), టెల్లూరియం (Te), పొలోనియం (Po) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np4.
                VII A గ్రూపులో ఫ్లోరిన్ (F), క్లోరిన్ (Cl), బ్రోమిన్ (Br), అయోడిన్ (I), ఆస్టటైన్ (At) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np5.
                 సున్నా గ్రూపులో హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), గ్జీనాన్ (Xe), రేడాన్ (Rn) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np6 (He తప్ప).
                 ఆవర్తన పట్టికలో అన్నిటి కంటే పెద్ద గ్రూపు III B. ఈ గ్రూపులో 32 మూలకాలు ఉంటాయి.
ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా వర్గీకరణం: ఎలక్ట్రాన్ విన్యాసం, రసాయన ధర్మాల ఆధారంగా మూలకాలను కింది నాలుగు రకాలుగా వర్గీకరించారు.
1) జడవాయువులు: వీటి బాహ్యకక్ష్య పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉంటుంది. వీటి చివరి కక్ష్యలో ఎలక్ట్రాన్ అష్టకం (8 ఎలక్ట్రాన్‌లు) ఉంటాయి. అందువల్ల ఇవి రసాయన చర్యల్లో పాల్గొనవు. ఈ మూలకాలను నోబుల్ వాయువులు, ఏరోజన్‌లు, సున్నా గ్రూపు మూలకాలు అని కూడా పిలుస్తారు. జడవాయువుల సాధారణ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np6.
                V A గ్రూపులో నైట్రోజన్ (N), ఫాస్ఫరస్ (P), ఆర్సినిక్ (As), ఆంటిమొని (Sb), బిస్మత్ (Bi) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np3.
                VI A గ్రూపులో ఆక్సిజన్ (O), సల్ఫర్ (S), సిలీనియం (Se), టెల్లూరియం (Te), పొలోనియం (Po) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np4.
                VII A గ్రూపులో ఫ్లోరిన్ (F), క్లోరిన్ (Cl), బ్రోమిన్ (Br), అయోడిన్ (I), ఆస్టటైన్ (At) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np5.
                 సున్నా గ్రూపులో హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), గ్జీనాన్ (Xe), రేడాన్ (Rn) మూలకాలున్నాయి. వీటి బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np6 (He తప్ప).
                 ఆవర్తన పట్టికలో అన్నిటి కంటే పెద్ద గ్రూపు III B. ఈ గ్రూపులో 32 మూలకాలు ఉంటాయి.

ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా వర్గీకరణం: ఎలక్ట్రాన్ విన్యాసం, రసాయన ధర్మాల ఆధారంగా మూలకాలను కింది నాలుగు రకాలుగా వర్గీకరించారు.
1) జడవాయువులు: వీటి బాహ్యకక్ష్య పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉంటుంది. వీటి చివరి కక్ష్యలో ఎలక్ట్రాన్ అష్టకం (8 ఎలక్ట్రాన్‌లు) ఉంటాయి. అందువల్ల ఇవి రసాయన చర్యల్లో పాల్గొనవు. ఈ మూలకాలను నోబుల్ వాయువులు, ఏరోజన్‌లు, సున్నా గ్రూపు మూలకాలు అని కూడా పిలుస్తారు. జడవాయువుల సాధారణ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np6

2) పాత్రినిధ్య మూలకాలు: వీటిలో చివరి కక్ష్యలో ఎలక్ట్రాన్లు అసంపూర్ణంగా నిండి ఉంటాయి. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns1 నుంచి ns2np5 వరకు ఉంటుంది. ఈ మూలకాల్లో లోహాలు, అలోహాలు, అర్ధ లోహాలు అమరి ఉంటాయి.

3) పరివర్తన మూలకాలు: వీటిలో చివరి రెండు కక్ష్యల్లో ఎలక్ట్రాన్లు అసంపూర్ణంగా నిండి ఉంటాయి. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం (n-1)d1-10 ns1-2 ఈ మూలకాలు ముఖ్యంగా లోహాలు. ఇవి ఆవర్తన పట్టికలో మధ్య భాగంలో అమరి ఉంటాయి.

4) అంతర పరివర్తన మూలకాలు: వీటిలో చివరి 3 కక్ష్యల్లో ఎలక్ట్రాన్లు అసంపూర్ణంగా నిండి ఉంటాయి. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం (n-2) f1-14(n-1)d0-1 ns2 ఇవి ఆవర్తనపట్టిక అడుగుభాగంలో అమరి ఉంటాయి. వీటిలో లాంధనైడ్లు, ఆక్టినైడ్లు ఉంటాయి.

లాంథనైడ్లు: లాంథనం తర్వాత ఉండే సీరియం (Ce-58) నుంచి లుటీషియం (Lu-71) వరకు ఉన్న 14 మూలకాలు ధర్మాల్లో లాంథనంను పోలి ఉంటాయి. అందుకే ఈ మూలకాలను లాంథనైడ్లు అని పిలుస్తారు. వీటికి విరళ మృత్తికలు అనే పేరు కూడా ఉంది.

ఆక్టినైడ్లు: ఆక్టీనియం తర్వాత ఉండే థోరియం (Th-90) నుంచి లారెన్షియం (Lr-103) వరకు ఉన్న 14 మూలకాలను ఆక్టినైడ్లు అంటారు. వీటిలో అధికభాగం రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి. యురేనియం తర్వాత ఉండే మూలకాలను ట్రాన్స్‌యురేనిక్ మూలకాలు అంటారు. ఈ మూలకాలు ప్రకృతిలో లభించవు. ఇవన్నీ రేడియోధార్మికతతో ఉంటాయి.
            
   
* మానవుడు మొదట తయారు చేసిన కృత్రిమ లోహం టెక్నీషియం. దాని తర్వాత తయారు చేసిన కృత్రిమ లోహం ప్రోమీథియం.

మొదటిసారిగా మూలకాలను లోహాలు, అలోహాలు అనే రెండు వర్గాలుగా విభజించారు. కానీ ఈ పద్ధతి కొన్నింటికి (Limited purpose) మాత్రమే వర్తించింది. అన్ని మూలకాలను కేవలం రెండు వర్గాలుగా మాత్రమే వర్గీకరించడటం వల్ల ప్రతీ గ్రూప్‌లోనూ మూలకాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది.
         కొన్ని మూలకాలు లోహా, అలోహ ధర్మాలను రెండింటిని ప్రదర్శించాయి. దాంతో వాటిని ఏ గ్రూప్‌లోనూ చేర్చడానికి వీల్లేకపోయింది. 1949లో హెన్నింగ్ బ్రాండ్ ఫాస్ఫరస్‌ను కనుక్కోవడంతో శాస్త్రీయంగా మూలకాల ఆవిష్కరణ జరిగింది. ఇప్పటికి దాదాపు 118 మూలకాలను కనుక్కున్నారు. ఈ మూలకాలు, వీటి వల్ల ఏర్పడిన అసంఖ్యాకమైన సమ్మేళనాల ధర్మాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వర్గీకరణ అవసరమైంది. పరమాణు నిర్మాణానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలను కనుక్కోడానికి మూలకాల వర్గీకరణ తోడ్పడింది.
         ఆ ప్రయత్నంలో శాస్త్రజ్ఞులు మూలకాల ధర్మాల్లో కలిగే మార్పులను గుర్తించి, మూలకాలను వాటికి అనుగుణంగా వర్గీకరించారు. వీటిలో కొన్ని పద్ధతులను తెలుసుకుందాం.
డాబర్‌నీర్ ట్రయాడ్‌లు: 1817లో డాబర్‌నీర్ అనే జర్మన్ శాస్త్రవేత్త మొదటిసారి మూలకాల వర్గీకరణకు నాంది పలికాడు. ఈయన మూడేసి మూలకాలను ఒక గ్రూప్‌గా చేసి దానికి ట్రయాడ్ (త్రికం) అని పేరు పెట్టాడు.
ట్రయాడ్‌లోని మూడు మూలకాలకు ఒకే రకమైన ధర్మాలున్నాయి.
త్రిక సిద్ధాంతం: డాబర్‌నీర్ ట్రయాడ్‌లో మధ్య మూలకం పరమాణు భారం మొదటి, మూడో మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపుగా సమానంగా లేదా మూడు మూలకాల పరమాణు భారాలు దాదాపు సమానంగా ఉంటాయని పేర్కొన్నాడు.
న్యూలాండ్స్ అష్టక పరికల్పన: 1963లో జాన్ అలెగ్జాండర్ న్యూలాండ్స్ అనే ఇంగ్లండ్ రసాయన శాస్త్రవేత్త మూలకాలను వాటి పరమాణుభారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి, ఎనిమిదో మూలకాల ధర్మాలు ఒకే విధంగా ఉండటాన్ని గమనించాడు. న్యూలాండ్స్ రూపొందించిన ఈ ప్రతిపాదనను న్యూలాండ్స్ అష్టక పరికల్పన అంటారు. ఇది భారతీయ సంగీతంలోని స్వరాల (సప్తస్వరాల) మాదిరిగా మొదటి, ఎనిమిదో స్వరాలు (సా) ఒకేలా ఉన్నాయి. కింద చూపిన విధంగా, Li, Na, K ఒకే ధర్మాలను కలిగి ఉన్నాయి.   

          కానీ అప్పటి వరకు కనుక్కున్న 60 మూలకాల్లో కాల్షియం (Ca) పరమాణు సంఖ్య 16 వరకు మాత్రమే మూలకాలను పై విధంగా అమర్చగలిగాడు. భార మూలకాలకు వర్తింప చేసినప్పుడు సరైన పోలికలు లభించకపోవడంతో న్యూలాండ్ పరికల్పనను అన్ని మూలకాలకు వర్తింప చేయలేమని తెలిసింది.
మెండలీఫ్ ఆవర్తన నియమం: 1869లో డిమిట్రీ మెండలీఫ్ అనే రష్యన్ శాస్త్రవేత్త అప్పటి వరకు తెలిసిన మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో ఒక పట్టికలో అమర్చారు. వాటిలోని కొన్ని మూలకాల ధర్మాలు పునరావృతం (ఆవర్తనం) అవడాన్ని గమినించాడు. దీన్నే మెండలీఫ్ ఆవర్తన నియమం అంటారు.
     ఆవర్తన ప్రమేయం అంటే ఒక ప్రత్యేక అవధిలో (Certain Interval) తిరిగి పునరావృతమవడం.

ఈ రకంగానే మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు, మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు ప్రత్యేక అవధిలో తిరిగి పునరావృతమవుతాయి. దీన్ని అనుసరించి మెండలీఫ్ తన ఆవర్తన నియమాన్ని కిందివిధంగా నిర్వచించాడు.

''మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు'' 
          కొన్ని మూలకాలను అప్పటికి కనుక్కోనప్పటికీ మెండలీఫ్ వాటి ఉనికిని, ధర్మాలను ఊహించగలిగాడు. ఒకే రకమైన ధర్మాలున్న మూలకాలన్నింటినీ ఒక గ్రూప్‌లో చేర్చాడు. ఈ రకంగా మొదటి ఆవర్తన పట్టిక (First Periodic Table) ను మెండలీఫ్ తయారుచేశాడు.

పరమాణు భారం     మెండలీఫ్ ఊహించి పెట్టిన పేరు     అసలు పేరు        కనుక్కున్నవారు
       68
       44  
          ఎకా అల్యూమినియం
             ఎకా బోరాన్
    గాలియం
  స్కాండియం
డెబోస్బాడ్రన్ (De Boisbandran)
                     నిల్సన్

మెండలీఫ్ ఆవర్తన పట్టికలో లోపాలు:
1) హైడ్రోజన్ స్థానం:

     హైడ్రోజన్ రెండు వేర్వేరు గ్రూపుల లక్షణాలను ప్రదర్శిస్తుంది. అవి:
     (i) I గ్రూపులో క్షార లోహమైన Na, Naఅయాన్‌ను ఏర్పరిచినట్లే, హైడ్రోజన్, H+  అయాన్‌ను ఏర్పరచడం.
    (ii) VII వ గ్రూపులోని హాలోజన్‌ల మాదిరి Cl, Cl - అయాన్‌ను ఏర్పరచినట్లే హైడోజన్, H- అయాన్‌ను ఏర్పరచడం.
2) ఐసోటోపుల స్థానం:
     (i)  ఒకే మూలకానికి చెందిన వివిధ ఐసోటోపులు వివిధ పరమాణుభారాలు కలిగి ఉండటం వల్ల, ఆవర్తన పట్టికలో వాటి స్థానం వేర్వేరుగా ఉండాలి.
    (ii) వాటి రసాయనధర్మాలు ఒకేరకంగా ఉండటం వల్ల వాటిన్నింటిని ఒకేస్థానంలో ఉంచాలి.
3) అసంగతమైన అమరిక:
ఆవర్తన పట్టికలో ఎక్కువ పరమాణు భారం ఉన్న కొన్ని మూలకాలను, తక్కువ పరమాణుభారం ఉన్న మూలకాల కంటే ముందుగా ఉంచారు.
     ఉదా: Ar (39.91), K(39.1)
నవీన వర్గీకరణ: మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని లోపాలను సవరించి 1913లో హెన్రీమోస్లే అనే ఇంగ్లిష్ భౌతిక శాస్త్రవేత్త పరమాణు సంఖ్య ప్రాతిపదికగా నవీన లేదా విస్త్రత ఆవర్తన పట్టికను రూపొందించారు. ఈ పట్టికను 7 పీరియడ్‌లు(అడ్డంగా ఉన్న వరుసలు), 18 గ్రూపులు (నిలువు వరుసలు)గా విభజించారు.
         మూలకాలను వాటి పరమాణుసంఖ్యల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి భౌతిక, రసాయన ధర్మాలు వాటి ఎలాక్ట్రాన్ విన్యాస పరంగా ఒక క్రమమైన అంతరంలో పునరావృతమవడాన్ని మోస్లే గమనించి ఆధునిక ఆవర్తన నియమాన్ని ఈ విధంగా నిర్వచించాడు.
''మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు''
నవీన (విస్త్రత) ఆవర్తన పట్టిక లక్షణాలు:
నవీన ఆవర్తన నియమం ఆధారంగా రూపొందించిందే నవీన ఆవర్తన పట్టిక.
గ్రూపులు: విస్త్రత ఆవర్తన పట్టికలోని నిలువు వరుసలను గ్రూపులు అంటారు. దీనిలో 18 గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలతో ఉంటాయి.
ఆవర్తన పట్టికలో ఎడమవైపు చివర IA గ్రూపు మూలకాలైన క్షారలోహాలు (Li, Na, K, Rb, Cs, Fr) దాని పక్కన IIA గ్రూపు మూలకాలైన క్షారమృత్తిక లోహాలు అమరి ఉంటాయి. IA, IIA గ్రూపు మూలకాలను కలిపి s-బ్లాకు మూలకాలు అంటారు.
ఆవర్తన పట్టికలో కుడివైపున 13 నుంచి 17 వరకు గల గ్రూపులను p బ్లాకు మూలకాలు అంటారు.
ప్రాతినిథ్య మూలకాలు: s, p బ్లాకు మూలకాలను కలిపి ప్రాతినిథ్య మూలకాలు అంటారు.
జడవాయువులు: వీటినే 'O' గ్రూపు మూలకాలు అంటారు. 18వ గ్రూపులోని He, Ne, Ar, Kr, Xe, Rn లు ఎలాంటి రసాయన చర్యల్లో పాల్గొనవు కాబట్టి వీటిని జడవాయువులంటారు.
పరివర్తన మూలకాలు: ఆవర్తన పట్టిక మధ్యలో ఉన్న d-బ్లాకు మూలకాలను పరివర్తన మూలకాలు అంటారు.
అంతర పరివర్తన మూలకాలు: పరమాణుసంఖ్య 57 నుంచి 71 (La to Lu) ఉన్న 14 మూలకాలను లాంథనైడ్లు, పరమాణు సంఖ్య 89 నుంచి 103 (Ac to Lr) వరకు ఉన్న మూలకాలను ఆక్టినైడ్లు అంటారు.
ఇవి ఆవర్తన పట్టిక కిందిభాగంలో అమరి ఉంటాయి.
పీరియడ్‌లు: ఆవర్తన పట్టికలోని 7 అడ్డు వరుసలను పీరియడ్‌లు అంటారు.
మొదటి పీరియడ్‌ని అతిపొట్టి పీరియడ్ అంటారు. దీనిలో 2 మూలకాలు మాత్రమే ఉంటాయి.
   ¤ రెండు, మూడు పీరియడ్లను పొట్టి పీరియడ్‌లు అంటారు. వీటిలో ఒక్కొక్కదానిలో 8 మూలకాలుంటాయి.
   ¤ 4, 5 పీరియడ్‌లను పొడవు పీరియడ్‌లు అంటారు. వీటిలో ఒక్కొక్క పీరియడ్‌లోను 18 మూలకాలుంటాయి.
   ¤ 6వ పీరియడ్‌ను అతి పొడవు పీరియడ్ అని అంటారు. దీనిలో 32 మూలకాలు ఉంటాయి.
   ¤ 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంటుంది.
   ¤ ప్రతి పీరియడ్ క్షార లోహంతో ప్రారంభమై జడవాయువుతో అంతమవుతుంది.
పరమాణువు ముఖ్య ధర్మాలు
1) పరమాణు పరిమాణం:
వేలన్సీ ఆర్బిటాల్, కేంద్రకాల మధ్య ఉండే దూరం. దీన్ని ఆంగ్‌స్ట్రాం (Aº) ల్లో కొలుస్తారు.
2) అయనీకరణ శక్మం: వాయుస్థితిలో ఉన్న పరమాణు బాహ్య ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన కనీస శక్తిని అయనీకరణ శక్మం అంటారు. దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్ లేదా కి.కేలరీ. మోల్ లో కొలుస్తారు.
3) ఎలక్ట్రాన్ ఎఫినిటీ: వాయుస్థితిలో తటస్థ పరమాణువు భూస్థాయిలో ఉన్నపుడు ఒక ఎలక్ట్రాన్‌ను చేరిస్తే విడుదలయ్యే శక్తినే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్‌లలో కొలుస్తారు.
4) రుణ విద్యుదాత్మకత: సమయోజనీయ బంధంలోని ఒక పరమాణువు ఎలక్ట్రాన్ జంటను తనవైపు ఆకర్షించుకునే సామర్థ్యాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు. దీన్ని పాలింగ్ స్కేల్‌తో కొలుస్తారు.
5) ధన విద్యుదాత్మకత: ఎలక్ట్రాన్‌లను కోల్పోయి, ధనాత్మక అయాన్‌గా మారడాన్ని ధన విద్యుదాత్మకత అంటారు.


                                               Technical Terms (సాంకేతిక పదజాలం)

1. పరమాణుసంఖ్య: పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య లేదా పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య (Z) అంటారు.
2. పరమాణు భారం లేదా పరమాణు ద్రవ్యరాశి సంఖ్య: పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం సంఖ్యను పరమాణు ద్రవ్యరాశి సంఖ్య (A) అంటారు.
3. వేలన్సీ: పరమాణువులో బాహ్య కక్ష్యలోని ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యను వేలన్సీ అంటారు. బంధంలో పాల్గొనే ఈ ఒంటరి ఎలక్ట్రాన్లనే వేలన్సీ ఎలక్ట్రాన్లు అంటారు.
4. ఎలక్ట్రాన్ విన్యాసం: పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏవిధంగా ఏ ఆర్బిటాళ్లలో నిండి ఉన్నాయో తెలిపేదే ఎలక్ట్రాన్ విన్యాసం.
5. ఆర్బిటాల్: కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత ఉన్న ప్రాంతాన్ని పరమాణు ఆర్బిటాల్ అంటారు.
6. ఆక్సీకరణం: ఒక సమ్మేళనానికి ఆక్సిజన్‌ను కలపడం లేదా సమ్మేళనం నుంచి హైడ్రోజన్‌ను తీసివేయటాన్ని ఆక్సీకరణం అంటారు.
7. ఆక్సీకరణి: ఒక సమ్మేళనాన్ని ఆక్సీకరణం చేయడానికి ఉపయోగించే కారకాన్ని ఆక్సీకరణి అంటారు.
8. క్షయకరణం: ఒక సమ్మేళనానికి హైడ్రోజన్‌ను కలపడం లేదా సమ్మేళనం నుంచి ఆక్సిజన్‌ను తొలగించడాన్ని క్షయకరణం అంటారు.
9. క్షయకరణి: ఒక సమ్మేళనాన్ని క్షయకరణం చేయడానికి ఉపయోగించే కారకాన్ని క్షయకరణి అంటారు.
10. పరమాణు పరిమాణం: పరమాణు కేంద్రకం నుంచి చిట్టచివరి ఆర్బిటాల్‌కు ఉన్న దూరాన్ని పరమాణు పరిమాణం అంటారు.

16 వ గ్రూప్‌ మూలకాలు 

ఆవర్తన పట్టికలో ‘16వ గ్రూప్‌’ మూలకాలు లేదా ఆక్సిజన్‌ కుటుంబం మూలకాల్లో ఆక్సిజన్‌(o),  సల్ఫర్‌(s), సెలీనియం(se), టెల్లూరియం(Te), పొలోనియం (Po), లివర్‌మోరియం (Lv) ఉంటాయి. 16వ గ్రూప్‌ మూలకాలను చాల్కోజన్‌లు అని కూడా అంటారు. చాల్కోజన్‌ అంటే ఖనిజాలను ఏర్పరిచేవి అని అర్థం.

 * 16వ గ్రూప్‌ మూలకాల్లో ఆక్సిజన్, సల్ఫర్‌లు  విరివిగా లభిస్తాయి. భూపటలంలో అత్యంత సమృద్ధిగా లభించే మూలకం ఆక్సిజన్‌. భూపటలంలో ఆక్సిజన్‌ ద్రవ్యరాశి శాతం 46.6%, వాతావరణంలో ఆక్సిజన్‌ ఘనపరిమాణాత్మక శాతం 20.95% గా ఉంటుంది.

సల్ఫర్‌: ఇది భూపటలంలో జిప్సం, ఎప్సం లవణం, బెరైట్‌ లాంటి సల్ఫేట్‌ ఖనిజాల రూపంలో; గెలీనా, జింక్‌బ్లెండ్, కాపర్‌ పైరైటీస్‌ లాంటి సల్ఫైడ్‌ ఖనిజాల రూపంలో లభిస్తుంది.

*  సెలీనియం, టెల్లూరియం మూలకాలు చాలా స్వల్పంగా లభిస్తాయి. పొలోనియం రేడియోధార్మికతను కలిగి ఉంటుంది.

* 16వ గ్రూప్‌ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసంns2np4. అన్ని 16వ గ్రూప్‌ మూలకాల బాహ్యకక్ష్యలో ఎలక్ట్రాన్‌ విన్యాసం సారూప్యంగా ఉంటుంది. దీంతో వాటి రసాయన ధర్మాలు కూడా సారూప్యంగా ఉంటాయి. ఈ మూలకాలు రెండు ఎలక్ట్రాన్లను గ్రహించి ఉత్కృష్ట వాయు విన్యాసాలను పొందుతాయి. వీటి సాధారణ ఆక్సీకరణ స్థితి - 2.


* ఆక్సిజన్‌ ప్రదర్శించే ఆక్సీకరణ స్థితులు: 

-2, +1,- 1, + 2. 

* 16వ గ్రూప్‌లో మిగిలిన మూలకాలు - 2, + 2, + 4, + 6 ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి.

* ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం అలోహాలు. టెల్లూరియం అర్ధలోహం. పొలోనియం స్పష్టమైన లోహం.

* ఆక్సిజన్‌ మినహా మిగిలిన 16 గ్రూప్‌ మూలకాలన్నీ ఘనపదార్థాలే.

*  సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఆక్సిజన్‌ ద్విపరమాణుక వాయువు ్బవీ2్శ. దీని అణువులో బలమైన వీ = వీ ద్విబంధం ఉంటుంది. అందువల్ల ఆక్సిజన్‌ అణువుల మధ్య అంతరణుక ్బఖి-్మ’౯్ఝ్నః’‘్యః్చ౯్శ ఆకర్షణ బలాలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి వీ2 అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉండి, వాయుస్థితిలో ఉంటుంది.


కాటనేషన్‌ సామర్థ్యం 

ఒక మూలకానికి చెందిన పరమాణువులు గొలుసులుగా లేదా వలయాలుగా ఏర్పడే సామర్థ్యాన్ని ‘కాటనేషన్‌’ అంటారు. కార్బన్, సిలికాన్, సల్ఫర్, ఫాస్ఫరస్‌ మొదలైన మూలకాలు కాటనేషన్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

గ్రూప్‌ -16 మూలకాల్లో సల్ఫర్, సెలీనియంలకు అష్ట పరమాణుక వలయాలను ఏర్పరిచేతత్వం ఎక్కువగా ఉంటుంది.

 

రూపాంతరత  

ఒక మూలకం రెండు లేదా అంతకంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండి, వేర్వేరు  భౌతిక ధర్మాలను ప్రదర్శించే దృగ్విషయాన్ని ‘రూపాంతరత’ ్బతిఃః్న్మ౯్న్ప్వ్శ అంటారు. గ్రూప్‌ - 16 మూలకాలన్నీ రూపాంతరతను ప్రదర్శిస్తాయి.

* ఆక్సిజన్‌కు రెండు రూపాంతరాలు ఉంటాయి. 

i) డైఆక్సిజన్‌     ii) ఓజోన్‌

* సల్ఫర్‌కు అనేక రూపాంతరాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

i) రాంబిక్‌ సల్ఫర్‌ (- సల్ఫర్‌), ii) మోనోక్లినిక్‌ సల్ఫర్‌ (beta- సల్ఫర్‌)  - ఇవి రెండూ స్పటిక రూపాంతరాలు. 

iii ప్లాస్టిక్‌ సల్ఫర్‌ (- సల్ఫర్‌) - ఇది అస్పటిక రూపాంతరం.


డైఆక్సిజన్‌

* డైఆక్సిజన్‌ రంగు, వాసన లేని వాయువు ్బవీ2్శ. ఇది స్థిరమైంది, పారా అయస్కాంత స్వభావం కలిగి ఉంటుంది.

*  ప్రయోగశాలలో క్లోరేట్‌లు, నైట్రేట్‌లు, పర్మాంగనేట్‌లు లాంటి ఆక్సిజన్‌ కలిగిన లవణాలను వేడిచేయడం ద్వారా డైఆక్సిజన్‌ (o2)ను పొందొచ్చు.

* పారిశ్రామికంగా డైఆక్సిజన్‌ను గాలిని ద్రవీకరించి, అంశిక స్వేదనానికి గురిచేసి తయారుచేస్తారు.

* డైఆక్సిజన్‌ బంగారం, ప్లాటినం లాంటి లోహాలు, ఉత్కృష్ట వాయువులతో మినహా అనేక లోహాలు, అలోహాలతో నేరుగా చర్య జరుపుతుంది.

* ఆక్సిజన్‌ మరొక మూలకంతో సంయోగం చెంది, ఏర్పరిచే యుగ్మ సమ్మేళనాన్ని ఆక్సైడ్‌ అంటారు. వీటిని ఆమ్ల, క్షార స్వభావం ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: i) ఆమ్ల ఆక్సైడ్‌  ii) క్షార ఆక్సైడ్‌  

iii)  తటస్థ ఆక్సైడ్‌  iv) ద్విస్వభావ ఆక్సైడ్‌

ఆమ్ల ఆక్సైడ్‌లు: నీటిలో కరిగి ఆమ్లాన్ని ఏర్పరిచే ఆక్సైడ్‌లను ఆమ్ల ఆక్సైడ్‌లు అంటారు. ఉదా: సల్ఫర్‌ డైఆక్సైడ్, సల్ఫర్‌ ట్రైఆక్సైడ్, కార్బన్‌డైఆక్సైడ్, డైనైట్రోజన్‌ పెంటాక్సైడ్‌

క్షార ఆక్సైడ్‌లు: నీటిలో కరిగి క్షారాన్ని ఏర్పరిచే ఆక్సైడ్‌లను క్షార ఆక్సైడ్‌లు అంటారు. ఉదా: సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్‌.

తటస్థ ఆక్సైడ్‌లు: నీటిలో కరిగి ఆమ్లం లేదా క్షారాన్ని ఏర్పరచని ఆక్సైడ్‌లను తటస్థ ఆక్సైడ్‌లు అంటారు. ఇవి ఆమ్లం, క్షారంతో చర్య జరపవు. ఉదా: నైట్రస్‌ ఆక్సైడ్, నైట్రిక్‌ ఆక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌.

ద్విస్వభావ ఆక్సైడ్‌లు: ఆమ్లం లేదా క్షారంతో చర్య జరిపే ఆక్సైడ్‌లను ద్విస్వభావ ఆక్సైడ్‌లు అంటారు. ఉదా: జింక్‌ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్‌.


డైఆక్సిజన్‌ ఉపయోగాలు

* జీవుల శ్వాసక్రియకు, పదార్థాల దహనక్రియకు ఆక్సిజన్‌ (o2) ముఖ్యం.

* మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.

*  నీటి నాణ్యతను తెలిపే ముఖ్యమైన సూచికల్లో నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ ఒకటి. సముద్రజీవులు, జలచరాల మనుగడకు నీటిలో కరిగిన ఆక్సిజన్‌ అవసరం. చల్లని, శుద్ధ నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్‌ గాఢత 6.5 - 9 ppm మధ్యలో ఉంటుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ పరిమాణం 6 ppm కంటే తగ్గితే చేపలు జీవించలేవు.

*  ప్రమాణ ఘనపరిమాణం ఉన్న నీటిలోని కర్బన, అకర్బన రసాయన పదార్థాలను ఆక్సీకరణం చెందించడానికి అవసరమయ్యే ఆక్సిజన్‌ పరిమాణాన్ని ‘రసాయనిక ఆక్సిజన్‌ అవసరం’ అంటారు. 

*  ప్రమాణ ఘనపరిమాణం ఉన్న నీటిలోని సూక్ష్మజీవులు 20ాది వద్ద అయిదు రోజుల కాల వ్యవధిలో సేంద్రీయ వ్యర్థ పదార్థాలను ఆక్సీకరణం చెందించడానికి వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణాన్ని ‘జీవ రసాయన ఆక్సిజన్‌ అవసరం’ అంటారు. శుద్ధ నీటిలో జీవ రసాయన ఆక్సిజన్‌ అవసరం విలువ 5ppm కంటే తక్కువగా ఉంటుంది. 

* ‘గ్యాస్‌ వెల్డింగ్‌’ లో ఆక్సిజన్, ఎసిటిలీన్‌ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఆక్సీఎసిటిలీన్‌ వాయువును మండించినప్పుడు వెలువడే 3500ాది ఉష్ణ జ్వాలను లోహాలను వెల్డింగ్‌ చేసేందుకు ఉపయోగిస్తారు.

*  పర్వతారోహణలో, సముద్రఅంతర్భాగంలో పరిశోధనలు చేసేటప్పుడు, వైద్యశాలల్లో ఆక్సిజన్‌ సిలిండర్లను శ్వాసక్రియకు వాడతారు.


ఓజోన్‌

ఓజోన్‌ ఆక్సిజన్‌ రూపాంతరం. దీని రసాయన ఆణుఫార్ములా o3. సముద్ర మట్టం నుంచి 20 కి.మీ. ఎత్తులో, అంటే స్ట్రాటో ఆవరణంలో, సూర్యకాంతి సమక్షంలో వాతావరణంలోని ఆక్సిజన్‌ నుంచి ఓజోన్‌ ఏర్పడుతుంది.

* సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఓజోన్‌ లేత నీలిరంగు కలిగిన వాయువు. ఇది ద్రవరూపంలో ముదురు నీలిరంగులో, ఘన స్థితిలో ఊదా-నలుపు రంగుతో ఉంటుంది.

* పాదరసం (మెర్క్యురీ) లోహద్యుతి కలిగి ఉంటుంది, గాజుపై అంటుకోదు. ఓజోన్‌ సమక్షంలో పాదరసం తన లోహద్యుతి, ద్రవ వక్రతలాన్ని  కోల్పోయి గాజు పాత్రల గోడలకు అంటుకుంటుంది. దీన్ని ‘టెయిలింగ్‌ ఆఫ్‌ మెర్క్యురీ’ అంటారు. దీనికి కారణం మెర్క్యురీ, వెండి మొదలైన లోహాలను ఓజోన్‌ ఆక్సీకరణం చేసి, వాటి అనురూప ఆక్సైడ్‌లుగా మారుస్తుంది.


ఓజోన్‌ ఉపóసెూగాలు 

*  ఓజోన్‌ను క్రిమిసంహారిణిగా ఉపయోగిస్తారు.

* నీటిని శుభ్రంచేయడం (స్టెరిలైజ్‌ చేయడం)లో ఓజోన్‌ను వాడతారు.

*  సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతి నీలలోహిత కిరణాలు భూఉపరితలాన్ని తాకకుండా ఓజోన్‌ పొర రక్షిస్తూ ఉంటుంది.

*  కర్బన సమ్మేళనాల్లో అసంతృప్తతను గుర్తించడానికి;  పిండి పదార్థాలు, దంతాలను విరంజనం చేయడానికి కూడా ఓజోన్‌ను వాడతారు.

* సూపర్‌సోనిక్‌ జెట్‌ విమానాల నుంచి విడుదలయ్యే ఉద్గారాల్లోని నైట్రోజన్‌ ఆక్సైడ్‌లే వాతావరణంలో ఓజోన్‌ గాఢత తగ్గడానికి  ప్రధాన కారణం. రిఫ్రిజిరేటర్, ఎయిర్‌కండిషనర్‌ ్బతిద్శి కంప్రెషర్‌లలో శీతలీకరణ వాయువుగా ఉపయోగించే క్లోరోఫ్లోరోకార్బన్‌లు కూడా ఓజోన్‌ పొర క్షీణతకు ముఖ్య కారణం. దీని క్షీణత వల్ల కంటి శుక్లాలు ఏర్పడటం, చర్మ క్యాన్సర్, చేపల ఉత్పత్తికి నష్టం కలగడం లాంటి దుష్ప్రభావాలు చోటుచేసుకుంటాయి.


 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌