• facebook
  • whatsapp
  • telegram

మూలకాలు - పరమాణు సంఖ్యలు

            ఒకే రకమైన పరమాణువులతో నిర్మితమైన పదార్థాన్ని మూలకం అంటారు. 'మూలకం' అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్. మూలకాన్ని దాని సంకేతంతో సూచిస్తారు. ఉదా: హైడ్రోజన్: H. ప్రస్తుతం మనం ఉపయోగించే మూలకాల సంకేతాలను మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త బెర్జీలియస్. పరమాణు సంఖ్య మూలకం పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యను తెలియజేస్తుంది. ఇది ఎలక్ట్రాన్ల సంఖ్యకు కూడా సమానం.     పరమాణు కేంద్రంకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల మొత్తం సంఖ్యను పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటారు. 
          పరమాణు సంఖ్యను 'Z' తో, పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను 'A' తో సూచిస్తారు. పరమాణువులోని న్యూట్రాన్ల సంఖ్య దాని (A-Z) విలువకు సమానం.

ఐసోటోప్‌లు, ఐసోబార్‌లు, ఐసోటోన్‌లు
    ఐసోటోప్‌లు:
ఒకే పరమాణు సంఖ్య, భిన్న ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్న ఒకే మూలక పరమాణువులను ఐసోటోప్‌లు అంటారు. ఐసోటోప్‌లు వాటి న్యూట్రాన్ల సంఖ్యలతో భేదిస్తాయి. 
    ఐసోబార్‌లు: భిన్న పరమాణు సంఖ్యలు, ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉన్న భిన్న మూలకాల పరమాణువులను ఐసో బార్‌లు అంటారు. ఐసోబార్‌లలో ఒకే సంఖ్యలో న్యూక్లియాన్లు లేదా కేంద్రక కణాలు ఉంటాయి. 
     ఐసోటోన్‌లు: భిన్న పరమాణు సంఖ్యలు, ఒకే న్యూట్రాన్ల సంఖ్యలున్న భిన్న మూలకాల పరమాణువులను ఐసోటోన్‌లు అంటారు. ఇవి ఒకే (A-Z) విలువతో ఉంటాయి.


పరమాణువు - ప్రాథమిక కణాలు 
   పరమాణువులోని ప్రాథమిక కణాలు: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త జె.జె.థామ్సన్. ఎలక్ట్రాన్లను రుణ కిరణాల ప్రయోగంలో కనుక్కున్నారు. ప్రోటాన్‌ను మొదట గుర్తించిన శాస్త్రవేత్త గోల్డ్‌స్టీన్. ధన కిరణాల ప్రయోగంలో ప్రోటాన్లను గుర్తించారు. న్యూట్రాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ చాడ్విక్. బెరీలియంపై ఆల్ఫా కణాలను తాడించి జరిపిన ప్రయోగంలో న్యూట్రాన్లను కనుక్కున్నారు. పరమాణు కేంద్రకం ఆల్ఫా కిరణ ప్రయోగం లేదా బంగారు రేకు ప్రయోగం ద్వారా కనుక్కున్నారు. పరమాణు పరిమాణాన్ని ఆంగ్‌స్ట్రామ్ యూనిట్లలో కొలుస్తారు. (1AO=10-8 సెం.మీ). పరమాణు కేంద్రక పరిమాణాన్ని ఫెర్మి యూనిట్లలో కొలుస్తారు. (1 FM = 10-13 సెం.మీ)

క్యాంటం సంఖ్యలు
      క్వాంటం సంఖ్యలు పరమాణువులోని ఎలక్ట్రాన్ స్థానాన్ని, స్థితిని తెలియజేస్తాయి. ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్‌బోర్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. ఇది పరమాణువులో ఎలాక్ట్రాన్ ఉండే క్షక్ష్య పరిమాణం, శక్తి విలువను తెలియజేస్తుంది. ఎజిముతల్ క్వాంటం సంఖ్యను సోమర్ ఫీల్డ్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. ఇది ఆర్బిటాల్ ఆకృతిని తెలియజేస్తుంది. అయస్కాంత క్వాంటం సంఖ్యను లాండే అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. ఇది ఆర్బిటాల్‌లోని ఎలక్ట్రాన్ ద్విగ్విన్యాసాన్ని తెలుపుతుంది. స్పిన్ కాంటం సంఖ్యను ఉలెన్ బెక్, గౌడ్ ష్మీట్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఇది ఒక ఆర్బిటాల్‌లోని ఎలక్ట్రాన్ ఆత్మభ్రమణాన్ని తెలుపుతుంది.


కాటయాన్, ఆనయాన్
         కాటయాన్ అంటే ధనావేశం ఉన్న అయాన్. (పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు కాటయాన్ ఏర్పడుతుంది. సాధారణంగా లోహ పరమాణువులు కాటయాన్లను ఏర్పరుస్తాయి. కాటయాన్ దాని పరమాణువు కంటే చిన్నది. ఆనయాన్ అంటే రుణావేశం ఉన్న అయాన్. (పరమాణువు ఎలక్ట్రాన్లను గ్రహించినప్పుడు ఆనయాన్ ఏర్పడుతుంది.) సాధారణంగా అలోహ పరమాణువులు ఆనయాన్లను ఏర్పరుస్తాయి. ఆనయాన్ దాని పరమాణువు కంటే పెద్దది.

       ఆవిష్కరణలు                             శాస్త్రవేత్తలు
      పరమాణు సిద్ధాంతం                     జాన్ డాల్టన్
      ఎలక్ట్రాన్                                      జె.జె. థామ్సన్
      ప్రోటాన్                                       గోల్డ్ స్టీన్
      న్యూట్రాన్                                     జేమ్స్ చాడ్విక్
      పరమాణు కేంద్రకం                         రూథర్ ఫర్డ్
      పరమాణు పుచ్చకాయ నమూనా      జె.జె. థామ్సన్
      పరమాణు స్థిరకక్ష్యలు                     నీల్స్ బోర్
      పరమాణు దీర్ఘవృత్తాకార కక్ష్యలు       సోమర్ ఫీల్డ్
      క్వాంటం సిద్దాంతం                        మాక్స్ ఫ్లాంక్
      ద్రవ్య శక్తినిత్యత్వ నియమం              ఐన్ స్టీన్
      ప్రధాన క్వాంటం సంఖ్య                    నీల్ బోర్
      ఎజిముతల్ క్వాంటం సంఖ్య              సోమర్ ఫీల్డ్
      అయస్కాంత క్వాంటం సంఖ్య            లాండే
      స్పిన్ క్వాంటం సంఖ్య                     ఉలెన్ బెక్-గౌడ్ ష్మీ

 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌