• facebook
  • whatsapp
  • telegram

వాయువులు, ద్రవాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. నిర్దిష్టమైన ఆకారం, ఘనపరిమాణం ఉండే పదార్థాలు
జ‌: వాయు పదార్థాలు

 

2. నిర్దిష్ట ఘనపరిమాణం ఉండి ఆకారం లేని పదార్థాలు
జ‌: ద్రవ పదార్థాలు

 

3. నిర్దిష్ట ఘనపరిమాణం, ఆకారం లేని పదార్థాలు
జ‌: వాయు పదార్థాలు

 

4. కిందివాటిలో మూడు స్థితుల్లో లభించే పదార్థం ఏది?
 A) కిరోసిన్            B) పాలు                C) పెట్రోలు           D) నీరు
జ‌: D (నీరు)

 

5. ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర స్వరూపాన్ని పొందేవి
జ‌: ద్రవ పదార్థాలు

 

6. పాత్ర ఘనపరిమాణం ఎంత ఉన్నా వ్యాకోచించి దాన్ని పూర్తిగా ఆక్రమించే పదార్థాలు
జ‌: వాయు పదార్థాలు

 

7. వాయువుల ధర్మాలన్నింటిలోనూ మాపనం చేయడానికి వీలైన ముఖ్య ధర్మాలు
A) ఘనపరిమాణం     B) పీడనం        C) ద్రవ్యరాశి         D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

8. ఘనపదార్థం ద్రవస్థితిలోకి మారకుండానే నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఏమంటారు?
జ‌: ఉత్పతనం

 

9. కిందివాటిలో సంపీడ్యం చెందేది
A) ఇనుము        B) నీరు           C) గాలి          D) కర్రముక్క
జ‌: C (గాలి)

 

10. కిందివాటిలో వ్యాపనం చెందేది
 A) రాగి              B) పాదరసం     C) బ్రోమిన్      D) మైనం
జ‌: C (బ్రోమిన్ )

 

11. వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించే వాయువు
జ‌: సీఎన్‌జీ

 

12. గృహాల్లో వంటకు వినియోగించే వాయువు
జ‌: ఎల్‌పీజీ

 

13. కిందివాటిలో అత్యధిక వ్యాపన వేగం ఉండే వాయువు ఏది?
A) CO2        B) HCl            C) NH3         D) H2
జ‌: D (H2)

 

14. కిందివాటిలో ఏ పదార్థ కణాల మధ్య ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది?
A) ఘన పదార్థాలు      B) ద్రవ పదార్థాలు      C) వాయు పదార్థాలు     D) అన్నీ
జ‌: A (ఘన పదార్థాలు)

 

15. సీఎన్‌జీ (CNG) ఏ స్థితిలో ఉంటుంది?
జ‌: వాయుస్థితి

 

16. ఒక వాయువుపై పీడనాన్ని పెంచితే దాని ఘనపరిమాణం
జ‌: త‌గ్గుతుంది
17. నాఫ్తలిన్, హారతి కర్పూరాన్ని గాలిలో ఉంచితే కొన్ని రోజులకు అవి ఏ స్థితిలోకి మారతాయి?
A) ఘనస్థితి               B) ద్రవస్థితి                   C) వాయుస్థితి            D) ఏదీకాదు
జ‌: D (ఏదీకాదు)

 

18. ద్రవాల్లో వ్యాపనం చెందే పదార్థాలు
A) ఘన పదార్థాలు     B) ద్రవ పదార్థాలు       C) వాయు పదార్థాలు    D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

19. కిందివాటిలో వాయుధర్మం
A) వాయువు ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది.     B) వాయువు అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది.
C) వాయువు పీడనాన్ని కలగజేస్తుంది.          D) అన్నీ
జ‌: D (అన్నీ)

20. వాతావరణ పీడనాన్ని మాపనం చేయడానికి ఉపయోగించే పరికరం ఏది?
జ‌: బారోమీటర్

 

21. సాధారణ పరిస్థితుల్లో సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనం ఎంత ఉంటుంది?
జ‌: 76 సెం.మీ.

 

22. ఒక అట్మాస్ఫియర్ విలువ
A) 760 మి.మీ.       B) 76 సెం.మీ.          C) 1 టార్            D) అన్నీ
జ‌: D (అన్నీ)

 

23. ఒక సెం.మీ.3 విలువ
జ‌: 1 మి.లీ.

 

24. వివిధ వాయువులు కలగజేసే పీడనాన్ని మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది?
జ‌: మానోమీటర్

 

25. వాయు ఘనపరిమాణం, దాని పీడనానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసే నియమం ఏది?
జ‌: బాయిల్ నియమం

 

26. PV = k (స్థిరాంకం) అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: బాయిల్

27. స్థిర ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి గల వాయువు ఆక్రమించే ఘనపరిమాణం, పీడనాల లబ్ధం ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుంది?
జ‌: స్థిరం

 

28. బాయిల్ నియమాన్ని గ్రాఫ్ రూపంలో గీసినప్పుడు, స్థిర ఉష్ణోగ్రత వద్ద గీసే వక్రరేఖలను ఏమంటారు?
జ‌: సమోష్ణోగ్రత వక్రాలు

 

29. వాయువులు అధికంగా సంపీడనానికి లోనవుతాయని నిరూపించిన నియమం ఏది?
జ‌: బాయిల్ నియమం

 

30. వాయువులు ఏ సందర్భంలో బాయిల్ నియమాన్ని పాటించవు?
జ‌: అధిక పీడనం

 

31. బాయిల్ నియమం ప్రకారం సాంద్రత, పీడనానికి మధ్య సంబంధాన్ని సూచించే సమీకరణం ఏది?
జ‌:  

 

32. స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు పీడనం దాని సాంద్రతకు ఏ విధంగా ఉంటుంది?
జ‌: అనులోమానుపాతంలో

 

33. అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద బాయిల్ నియమాన్ని పాటించే వాయువు
జ‌: ఆదర్శ వాయువు

 

34. నిర్దిష్ట ద్రవ్యరాశి గల వాయువు 760 మి.మీ. పీడనం వద్ద 250 మి.లీ. ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. అదే ఉష్ణోగ్రత వద్ద 1520 మి.మీ. పీడనం వద్ద వాయువు ఆక్రమించే ఘనపరిమాణాన్ని కనుక్కోండి.
జ‌: 125 మి.లీ.

 

35. నిర్దిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు సాధారణ పీడనాన్ని (1.0 అట్మాస్ఫియర్) ఉపయోగించినప్పుడు 2.0 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమించింది. అదే ఉష్ణోగ్రత వద్ద 5.0 అట్మాస్ఫియర్ల పీడనంతో వాయువు ఎంత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది?
జ‌: 0.4 లీ.

 

36. స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఘనపరిమాణం ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుందని, తగ్గిస్తే తగ్గుతుందని నిరూపించిన శాస్త్రవేత్తలు?
జ‌: చార్లెస్, గెలూసాక్

 

37.  = k (స్థిరాంకం) అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
జ‌: చార్లెస్

 

38. చార్లెస్ నియమం ప్రకారం  toC వద్ద వాయు ఘనపరిమాణం (Vt)కు సమీకరణం
జ‌:  

39. సెల్సియస్‌మానంలో 0 oC కెల్విన్ మానంలో ఎన్ని కెల్విన్‌లకు సమానం
జ‌: 273 K

 

40. 10 oC ఎన్ని కెల్విన్‌లకు సమానం?
జ‌: 283 K

 

41. 300 K ను సెల్సియస్‌లోకి మారిస్తే
జ‌: 27 oC

 

42. స్థిర పీడనం వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు 0oC వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి 1oC ఉష్ణోగ్రత తగ్గుదలకు ఎన్నిరెట్లు తగ్గుతుంది?
జ‌: 

 

43. కిందివాటిలో చార్లెస్ నియమాన్ని సూచించే సమీకరణం 
    
జ‌: 

 

44. పరమశూన్య ఉష్ణోగ్రత విలువ
జ‌: 0 K, - 273.15 oC

 

45. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద వాయువుల ఘనపరిమాణం
జ‌: శూన్యం

 

46. స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఘనపరిమాణం పరమఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉంటుంది?
జ‌: అనులోమానుపాతం

 

47. గణితాత్మకంగా చార్లెస్ నియమాన్ని ఏ విధంగా సూచిస్తారు?
జ‌: V = k2T

 

48. చార్లెస్ నియమం
జ‌: స్థిర పీడనం వద్ద వాయువు ఘనపరిమాణం ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

 

49. సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల (NTP) వద్ద ఉండే వాయువు ఏ ఉష్ణోగ్రత వద్ద రెట్టింపు ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది?
జ‌: 273 oC

 

50. వాయుపీడనం, ఉష్ణోగ్రతల మధ్య సంబంధాన్ని సూచించే నియమం
జ‌: గెలూసాక్ నియమం

51. వేసవి కాలంలో వాహనాల టైర్లలోని గాలి పీడనం అనూహ్యంగా పెరిగి అవి పగిలిపోవడానికి కారణమయ్యే నియమం
జ‌: గెలూసాక్ నియమం

 

52. శీతాకాలంలో వాహనాల టైర్ల పీడనం తగ్గడానికి కారణమయ్యే నియమం
జ‌: గెలూసాక్ నియమం

 

53. స్థిర ఘనపరిమాణం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు పీడనం పరమ ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉంటుంది?
జ‌: అనులోమానుపాతం

 

54. గెలూసాక్ నియమాన్ని గణితాత్మకంగా ఏ విధంగా సూచిస్తారు?
జ‌:  

 

55. స్థిర మోలార్ ఘనపరిమాణం గల వాయువు పీడన - ఉష్ణోగ్రత రేఖలను ఏమంటారు?
జ‌: ఐసోకోర్‌లు

 

56. వాయు ఘనపరిమాణం ద్రవ్యరాశుల మధ్య సంబంధాన్ని సూచించే నియమాన్ని ప్రతిపాదించినవారు
జ‌: అవగాడ్రో

 

57. ఒక మోల్ వాయువులో ఉండే అణువుల సంఖ్య
జ‌: 6.022 × 1023

 

58. స్థిర ఉష్ణోగ్రత, పీడనాల వద్ద వాయు ఘనపరిమాణానికి, దానిలోని అణువుల సంఖ్యకు మధ్య ఉండే సంబంధం
జ‌: అనులోమానుపాతం

 

59. అవగాడ్రో నియమం గణితపరంగా
జ‌: V = k4n

 

60. 1 bar విలువ ఎంత?
జ‌: 105 పాస్కల్

 

61. STP వద్ద ఒక ఆదర్శవాయువు మోలార్ ఘనపరిమాణం
జ‌: 22.7109 L mol-1


62. ఆదర్శవాయు సమీకరణం


 

63. ప్రమాణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఒక మోల్ ఆదర్శవాయువు ఆక్రమించే ఘనపరిమాణం
జ‌: 22.71 లీ.

 

64. ఒక మోల్ వాయువుకు R విలువ ఎంత? (L atm K-1 mol-1 లలో)
జ‌: 8.20578 × 10-2

 

65. ఆదర్శవాయు సమీకరణాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు?
జ‌: స్థితి సమీకరణం

 

66. వాయువు విస్తరించి అందుబాటులో ఉన్న మొత్తం స్థలాన్ని ఆక్రమించే ధర్మాన్ని ఏమంటారు?
జ‌: వ్యాపనం

 

67. సువాసన ద్రవ్యాలు (అత్తర్లు) ఏ నియమం ఆధారంగా సువాసనను వెదజల్లుతాయి?
జ‌: గ్రాహం వాయు వ్యాపన నియమం

 

68. వాయువుల వ్యాపన వేగానికి, వాటి సాంద్రతకు మధ్య ఉండే సంబంధాన్ని వివరించిన శాస్త్రవేత్త
జ‌: గ్రాహం

 

69. 'స్థిర పీడనం, ఉష్ణోగ్రతల వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు వ్యాపనం రేటు దాని సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది' అని తెలిపే నియమం
జ‌: గ్రాహం వాయు వ్యాపన నియమం

 

70. భూమి ఆకర్షణ ప్రభావం లేకుండా వాయువులు ఒక దాంతో ఒకటి కలిసి సజాతీయ మిశ్రమం ఏర్పడటాన్ని ఏమంటారు?   
 A) సాంద్రీకరణం        B) బాష్పీభవనం           C) వ్యాపనం         D) ఏదీకాదు
జ‌: D (ఏదీకాదు)

 

71. కిందివాటిలో ఏ నియమం ఆధారంగా బొగ్గు గనుల్లో మీథేన్ వాయువును గుర్తించి అపాయాన్ని నివారించవచ్చు?
A) బాయిల్ నియమం                     B) గ్రాహం వాయు వ్యాపన నియమం
C) గెలూసాక్ నియమం                    D) చార్లెస్ నియమం
జ‌: B (గ్రాహం వాయు వ్యాపన నియమం)

 

72. మార్ష్‌గ్యాస్ అలారం (అన్సిల్ అలారం) ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది?
జ‌: గ్రాహం వాయు వ్యాపన నియమం

 

73. అణుశక్తి అంశిక కేంద్రకాల్లో 235 U F6, 238 U F6 లను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు?
జ‌: వ్యాపనం

 

74. ఏ వాయువుల వ్యాపనం వల్ల జలచరాలు, మొక్కలు నీటిలో జీవిస్తున్నాయి?
జ‌: CO2, O2

 

75. శ్వాసక్రియలో ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి వ్యాపనం చెందే వాయువు
జ‌: O2

 

76. మన శరీరంలో రక్తం నుంచి ఊపిరితిత్తుల్లోకి వ్యాపనం చెందే వాయువు
జ‌: కార్బన్ డై ఆక్సైడ్

 

77. సన్నటి రంధ్రం ద్వారా అధిక పీడనం వద్ద ఉన్న వాయువు వ్యాపనం చెందడాన్ని ఏమంటారు?
జ‌: నిస్సరణం

 

78. ఒకే ఘనపరిమాణం (V) ఉండే రెండు వాయువులు వ్యాపనం చెందడానికి పట్టే కాలాలు వరుసగా t1, t2; వ్యాపనం రేట్లు r1, r2 అయితే గ్రాహం వాయు వ్యాపన నియమం ప్రకారం
జ‌:  

79. 'స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇచ్చిన ఘనపరిమాణం గల పాత్రలో రసాయన చర్య జరపని వాయువుల మిశ్రమం కలగజేసే మొత్తం పీడనం ఆ మిశ్రమంలోని వాయువుల వ్యక్తిగత పాక్షిక పీడనాల మొత్తానికి సమానం' అని తెలిపే నియమం
జ‌: డాల్టన్ పాక్షిక పీడనాల నియమం

 

80. ఒక వాయువు పాక్షిక పీడనం మిశ్రమంలోని ............ కు అనులోమానపాతంలో ఉంటుంది.
జ‌: మోల్ భాగం

 

81. వాయు అణుచలన సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది ఎవరు?
జ‌: రాబర్ట్‌హుక్

 

82. వాయువుల్లోని అణువులు నిరంతరం ఏ విధంగా ప్రయాణిస్తాయి?
జ‌: క్రమరాహిత్య చలనంలో

 

83. వాయు అణువుల ప్రయాణం అస్తవ్యస్థ మార్గంలో జరుగుతుంది. ఈ విధమైన చలనాన్ని ఏమంటారు?
జ‌: బ్రౌనియన్ చలనం

84. వాయు అణువుల తాడనాలు
జ‌: స్థితిస్థాపక తాడనాలు

 

85. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద వాయు అణవుల గతిజశక్తి ఏ విధంగా ఉంటుంది?
జ‌: శూన్యం

 

86. కిందివాటిలో చలద్వాయు సమీకరణం
     
జ‌: 
     
 
87. బాయిల్ నియమానికి చలద్వాయు సమీకరణం
జ‌:  PV =   K.T

 

88. వాయువులో అణువేగాల పంపిణీ దాని ఉష్ణోగ్రత, మోలార్ ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ‌: మాక్స్‌వెల్, బోల్ట్జ్‌మన్

 

89. ఒక వాయువులో N అణువులు ఉండి, అణువుల వేగాలు u1, u2, u3, ..........., un గా ఉంటే వాయు అణువుల సగటు వేగం uav ను ఏవిధంగా సూచిస్తారు?
జ:  

 

90. వాయువులోని అణువుల వేగాల వర్గాల సగటు వర్గమూలాన్ని ఏమంటారు?
జ‌: urms

 

91. ump : uav : urms ల నిష్పత్తి
జ‌: 1.000 : 1.128 : 1.224

 

92. గరిష్ఠ సంభావ్యతా వేగాన్ని (ump) లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం
జ‌:  

 

93. సగటు వేగాన్ని (uav) లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం
జ‌:  

94. RMS వేగాన్ని (urms) లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం
జ‌:  

 

95. ఉష్ణోగ్రత, అణుభారం తెలిసినప్పుడు RMS వేగాన్ని లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం
జ‌:  

96. పీడనం, ఘనపరిమాణం తెలిసినప్పుడు RMS వేగం ఎంత?
జ‌:  

 

97. సాంద్రత తెలిసినప్పుడు RMS వేగం
జ‌:  

 

98. ఒక మోల్ వాయువు గతిజశక్తి (KE) ఎంతకు సమానం?
జ‌:  

 

99. 'n' మోల్‌ల వాయువుకు ఉండే గతిజశక్తి (Ek) =
జ‌:  

 

100. ఒక అణువు గతిజశక్తి ఎంతకు సమానం?
జ‌:  

 

101. బోల్ట్జ్‌మన్ స్థిరాంకం విలువ ఎంత?
జ‌:  1.38 × 10-16 erg K-1 mol-1 , 1.38 × 10-23 J /K-1 mol-1


102. వాయుస్థిరాంకం, అవగాడ్రో సంఖ్యల నిష్పత్తిని ఏమంటారు?
జ‌: బోల్ట్జ్‌మన్ స్థిరాంకం

 

103. ప్రతి వాయువు ఒక ఉష్ణోగ్రత వద్ద వ్యాకోచానికిలోనై చల్లగా మారుతుంది. ఆ ఉష్ణోగ్రత
జ‌: విలోమ ఉష్ణోగ్రత

 

104. ఎంత పీడనాన్ని ఉపయోగించయినా ఒక వాయువును ద్రవంగా మార్చగల అత్యధిక ఉష్ణోగ్రత?
జ‌: సందిగ్ధ ఉష్ణోగ్రత

 

105. SO2, CO2, NO2, ClO2లలో అత్యల్ప వ్యాపన రేటు ఉన్న వాయువు ఏది?
జ‌: ClO2

 

106. SO2, N2, O2, Cl2లలో ఏ వాయువుకు 25 oC వద్ద అత్యల్ప RMS వేగం ఉంటుంది?
జ‌: Cl2

 

107. వాయువులను మొదటగా ద్రవీకరించిన శాస్త్రవేత్త
జ‌: క్లౌడి

108. ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న 4 గ్రాముల O2, 3 గ్రాముల H2 వాయువుల గతిజశక్తి నిష్పత్తిని లెక్కించండి.
జ‌: 1 : 12

 

109. ఒక సన్నటి రంధ్రం ద్వారా అమ్మోనియా వాయువు వ్యాపనం రేటు 0.5 lit. min-1. అదే పరిస్థితుల్లో క్లోరిన్ వాయువు వ్యాపనం రేటును కనుక్కోండి.
జ‌: 0.245 lit. min-1

 

110. 3.32 బార్ పీడనం వద్ద 4.0 మోల్‌ల వాయువు 5 dm3 ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తే ఆ వాయువు ఉష్ణోగ్రతను లెక్కించండి. (R = 0.083 bar dm3 K-1 mol-1)
జ‌: 50 K

 

111. ప్రతి సెకనుకు 1010 ధాన్యపు గింజలను పంచుకుంటూ వెళ్తే అవగాడ్రో సంఖ్య ధాన్యపు గింజలను పంచడానికి ఎంత కాలం పడుతుంది? (సంవత్సరాల్లో)
జ‌: 1.90956 × 106

 

112. 27 oC వద్ద 5 dm3 పాత్రలో ఉన్న 3.5 గ్రాముల డై నైట్రోజన్, 3.0 గ్రాముల డై హైడ్రోజన్, 8.0 గ్రాముల డై ఆక్సిజన్ వాయువుల మిశ్రమం కలిగించే మొత్తం పీడనాన్ని కనుక్కోండి.
జ‌: 9.3375 bar

 

113. 27 oC వద్ద O2 RMS వేగాన్ని కనుక్కోండి.
జ‌: 4.614 × 103 ms-1

 

114. 27 oC వద్ద SO2 వాయువు గరిష్ఠ సంభావ్యతా వేగాన్ని కనుక్కోండి.
జ‌: 2.79 × 102 ms-1

 

115. గాలిని 25 oC నుంచి 0 oC కు చల్లార్చినప్పుడు అణువుల rms వేగంలో కలిగే తగ్గుదలను లెక్కించండి.
జ‌: 4%

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌