• facebook
  • whatsapp
  • telegram

ప‌దార్థాల యాంత్రిక‌‌ ధ‌ర్మాలు

1. పాస్కల్‌ నియమం ఆధారంగా పనిచేసేది?

    1) పవర్‌ స్టీరింగ్‌         2) భ్రామా ఫ్రెస్‌         3) హైడ్రాలిక్‌ లిఫ్ట్‌     4) పైవన్నీ


2. వస్తువు భారం దేనిలో గరిష్ఠంగా ఉంటుంది?

    1) నీటిలో         2) శూన్యంలో

    3) గాలిలో         4) హైడ్రోజన్‌లో


3. వస్తువు సాంద్రత, నీటి సాంద్రతకు సమానం. అయితే అది నీటిలో..

    1) పూర్తిగా మునుగుతుంది.        2) పాక్షికంగా మునుగుతుంది. 

    3) పూర్తిగా తేలుతుంది.             4) ఏదీకాదు


4. ఆర్కిమెడిస్‌ సూత్రం ఆధారంగా.. 

    1) సబ్‌మెరైన్‌లు, పడవలను నిర్మిస్తారు     

    2) హైడ్రోమీటర్‌ పనిచేస్తుంది.

    3) లాక్టోమీటర్‌ పనిచేస్తుంది.      4) పైవన్నీ


5. నీటిపై పడవ తేలుతుంది కానీ గుండుసూది మునుగుతుంది. కారణం ఏమిటి?

    1) సూది ఉపరితల వైశాల్యం తక్కువ       2) సూది ద్రవ్యరాశి (భారం) తక్కువ

    3) సూది అధిక పీడనాన్ని కలిగిస్తుంది       4) 1, 3


6. ప్రవాహి ్బనీః్యi్ట్శ స్తరీయ, ధారావాహిక ప్రవాహాన్ని కలిగి ఉండాలంటే, దాని రేనాల్డ్స్‌ సంఖ్య విలువ సుమారు ఎంత ఉండాలి?

    1) 2000 కు సమానంగా ఉండాలి        2) 2000  కంటే ఎక్కువగా ఉండాలి

    3) 2000 కంటే తక్కువగా ఉండాలి      4) ఏదీకాదు


7. ఒక రాయి సాంద్రతని తెలుసుకోవాలంటే ఉపయోగించాల్సింది?

1) నీటితొట్టె, సాధారణ త్రాసు 

2) నీటితొట్టె, స్ప్రింగ్‌ త్రాసు

3) నిండుగా ఉండే నీటితొట్టె, కొలజాడీ, సాధారణ త్రాసు 

4) ఏదీకాదు 


8. బెర్నౌలీ సిద్ధాంతం దేన్ని సూచిస్తుంది?

    1) శక్తి నిత్యత్వ నియమం       2) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం

    3) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం      4) పైవన్నీ


9. బెర్నౌలీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేది?

   A) స్టవ్‌ బర్నర్‌           

 B) సెంట్‌ స్ప్రేయర్   

 C) వాహనాల్లోని కార్బ్యూరేటర్‌            D) రాకెట్‌ పైకి ఎగరడం

  1) A, C, D        2) A, B, D         3) A, B, C          4) A, B, C, D 


10. ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం..

    1) తగ్గుతుంది         2) పెరుగుతుంది         3) మారదు         4) పెరిగి, తగ్గుతుంది


11. దీపపు వత్తిలో నూనె పైకి రావడానికి కారణమేంటి?

    1) నూనె తేలికగా ఉండటం       2) వత్తి ద్వారా నూనె వ్యాపనం చెందడం

    3) నూనె తలతన్యత ధర్మం       4) కేశనాళికీయత ధర్మం


12. కింది దేనిలో స్నిగ్ధత ధర్మాన్ని గమనించవచ్చు?

    1) ద్రవాలు         2) వాయువులు         3) 1, 2         4) ఘనపదార్థాలు


13. అధిక స్థితిస్థాపకతను కలిగిఉండేది?

 1) ఉక్కు     2) రబ్బరు     3) ప్లాస్టిక్‌     4) కలప


14. కాలక్రమంలో వంతెనలు కూలిపోవడానికి కారణం?

    1) స్థితిస్థాపక ధర్మాన్ని కోల్పోవడం        2) స్థితిస్థాపకత పెరగడం 

    3) అణు ఆకర్షణ బాలాలు తగ్గడం        4) ఏదీకాదు


15. గాజు పలకపై వేసిన నీటి బిందువు పరుచుకుంటుంది కానీ, పాదరస బిందువు దాదాపు గోళాకారంగానే ఉంటుంది. కారణం ఏమిటి?

    1) పాదరసం లోహం కాబట్టి 

    2) నీటి కంటే పాదరసానికి సాంద్రత అధికం

    3) పాదరసం అణువుల మధ్య సంసంజన జలాలు ఎక్కువ 

    4) నీటి అణువుల మధ్య సంసంజన జలాలు ఎక్కువ


16. వస్తువును ద్రవంలో ముంచితే తడుస్తుంది. ఆ ధర్మాన్ని వివరించేది ఏది?

    1) కేశనాళికీయత           2) స్పర్శకోణం       3) స్నిగ్ధత            4) పైవన్నీ


17. వర్షపు నీటి బిందువులు గోళాకారంగా ఉండటానికి కారణం...

    1) స్నిగ్ధత            2) వాతావరణ పీడనం       3) తక్కువ పరిమాణం     4) తలతన్యత


18. ద్రవ ఉపరితలాలు సాగదీసిన రబ్బరు పొరలా పనిచేయడానికి కారణం...

    1) అణువుల మధ్య ఉండే స్థిర విద్యుత్‌ బలాలు

    2) అణువుల మధ్య ఉండే సంసంజన బలాలు

    3) అణువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ బలాలు

    4) అణువుల మధ్య ఉండే అసంజన బలాలు


19. హైడ్రాలిక్‌ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా  పనిచేస్తాయి?

    1) ఆర్కిమెడిస్‌ సూత్రం     2) పాస్కల్‌ నియమం  

    3) బెర్నౌలీ సిద్ధాంతం      4) ఫారడే నియమాలు


20. ఒక కర్రదుంగ ద్రవ్యరాశి 5 కేజీలు. అది దాని ఘనపరిమాణంలో 60% నీటిలో మునిగి ఉంటే కర్ర విశిష్ట గురుత్వం (సాపేక్ష సాంద్రత) ఎంత?

    1) 0.83       2) 0.60    3) 0.40    4) 0.30


21. మేఘాలు గాలిలో తేలడానికి కారణం...

 1) వాటి అల్ప సాంద్రత    

  2) గాలి కలగజేసే స్నిగ్ధత

 3) అవి గాలిపై కలగజేసే అల్పపీడనం     4) పైవన్నీ


22. స్ప్రింగ్‌ త్రాసు ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది?

    1) హుక్‌ నియమం         2) బాయిల్‌ నియమం

    3) న్యూటన్‌ మూడో నియమం   4) ఏదీకాదు


23. సబ్బులు లేదా డిటర్జంట్‌ పౌడర్లు నీటి తలతన్యతను 

   1) తగ్గిస్తాయి           2) పెంచుతాయి       3) మార్చలేవు         4) ఏదీకాదు


24. అత్యుత్తమ స్థితిస్థాపక వస్తువు ఏది?

    1) ఉక్కు     2) రబ్బరు    3) క్వార్ట్జ్‌     4) స్టీలు


25.  A: స్థితిస్థాపకత అనేది ఘనపదార్థాల ధర్మం.

       R: అధికంగా సాగే గుణం గల పదార్థాలకు స్థితిస్థాపకత ఎక్కువ.

    1) A సరైంది, R సరైంది కాదు

    2)  A సరైంది కాదు R సరైంది. 

    3) A, R రెండూ సరైనవి

    4) A, R రెండూ సరైనవి కావు


26. ఒకే పరిమాణంలో ఉండే ద్రవ బిందువు, బుడగ (Bubble)ల్లోని పీడనాలు వరుసగా PA, PB  అయితే...

    1) PA = PB        2) PA > PB 

    3) PA< P       4) PA = PB = 0


27. వాతావరణ పీడనానికి ప్రమాణాలు, వాటి విలువలను జతపరచండి.

    

   1) i-D, ii-C, iii-B, iv-A

    2)i-A, ii-B, iii-C, iv-D

    3) i-A, ii-B, iii-D, iv-C

    4) i-B, ii-C, iii-A, iv-D


28. బెర్నౌలీ సిద్ధాంతం ఏ తరహా ప్రవాహులకు (Fluids) వర్తిస్తుంది?

    1) అసంపీడ్య (incompressible) 

    2) స్నిగ్ధత లేని (non viscous)

    3) భ్రమణ రహిత (irrotation)    4) పైవన్నీ


29. వేడి నీటితో దుస్తులను ఉతకడం సులువు. ఎందుకంటే...?

    1) వేడి నీటికి తలతన్యత ఎక్కువ

    2) వేడి నీటికి తలతన్యత తక్కువ

   3) వేడి నీటికి స్నిగ్ధత ఎక్కువ

    4) వేడి నీటికి స్నిగ్ధత తక్కువ


30. వాయువులను వేడిచేస్తే వాటికి.........

    1) తలతన్యత తగ్గుతుంది      2) స్నిగ్ధత తగ్గుతుంది

    3) తలతన్యత పెరుగుతుంది     4) స్నిగ్ధత పెరుగుతుంది


31. తామరాకు నీటిలో తడవదు ఎందుకంటే....

    1) నీరు, తామరాకు మధ్య స్పర్శకోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ

    2) నీరు, తామరాకు మధ్య స్పర్శకోణం 90 డిగ్రీల కంటే తక్కువ

    3) నీరు, తామరాకు మధ్య స్పర్శకోణం శూన్యం

    4) ఏదీకాదు


32. మాగ్నస్‌ ప్రభావం దేంతో ముడిపడింది?

    1) ఎగిరే విమానం

    2) గాలిలో ముందుకు వెళ్లే బంతి

    3) గాలిలో తనచుట్టూ తాను తిరుగుతూ ముందుకెళ్లే బంతి

    4) గతిక ఉత్థాపనం 


33. ద్రవంలో మునిగిన వస్తువుపై పనిచేసే ఉత్ప్లవనం ఏ దిశలో పనిచేసే బలం?

1) ఊర్థ్వ (పై) దిశలో         2) కింది దిశలో

 3) పక్కలవైపు (పార్శ్వ దిశలో)   

4)  అన్నివైపులా


34. వాయువుల్లో స్నిగ్ధత (Viscosity) దేని వల్ల ఏర్పడుతుంది?

    1) అణువుల మధ్య ఉండే సంసంజన బలాల వల్ల

    2) అణువుల మధ్య ఉండే అసంజన బలాల వల్ల

    3) అణువుల మధ్య జరిగే అభిఘాతాల వల్ల కలిగే ద్రవ్యవేగాల వినిమయం వల్ల

    4) అణువుల మధ్య జరిగే అభిఘాతాల వల్ల కలిగే గతిజశక్తుల వినిమయం వల్ల


35. స్నిగ్ధతా గుణకానికి ప్రమాణం? 

    1)N/m       2) పాయిజ్‌      3)Pa/s       4) N/s


36. స్నిగ్ధతపై పీడన ప్రభావం....

    A) ద్రవాల విషయంలో పెరుగుతుంది

  B) వాయువుల విషయంలో తగ్గుతుంది

  C) ద్రవాల విషయంలో తగ్గుతుంది

 D) వాయువుల విషయంలో పెరుగుతుంది

    1) A, D     2) B, C       3) A, B    4) C, D


37. తలతన్యత వేటి ధర్మం....

    1) నిశ్చల స్థితిలోని ద్రవాలు       2) ద్రవాల స్వేచ్ఛా ఉపరితలం

    3) నిశ్చల స్థితిలోని వాయువులు      4) 1, 2


38. ప్రవాహ వేగాన్ని కొలిచే వెంచూరిమీటర్‌ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది?

    1) ఆర్కిమెడిస్‌ సూత్రం    2) బెర్నౌలీ సిద్ధాంతం

    3) పాస్కల్‌ నియమం       4) స్టోక్స్‌ సూత్రం


39. హుక్‌ నియమం వేటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది?

    1) వికృతి, ప్రతిబలం       2) ఒత్తిడి, పీడనం

    3) విరూపణ బలం, వైశాల్యం      4) పొడవులో మార్పు, వికృతి


40. ఇసుక నేలలతో పోల్చితే, నల్లరేగడి నేలల్లో త్వరగా బురద ఏర్పడుతుంది. ఎందుకంటే...

    1) ఇసుక నేలల్లో కేశనాళాలు ఉండవు

    2) నల్లరేగడి నేలల్లో కేశనాళాలు ఉండవు

    3) ఇసుకకి అధిక ఉష్ణధారణ సామర్థ్యం ఉంటుంది

    4) నల్లరేగడి నీటిని అధికంగా శోషించుకుంటుంది


41. యంగ్‌ గుణకానికి మితి ఫార్ములా ఏది?

1) [MLT]       2్శ [ML2T3]   

3) [ML1T2]      4) [ML1T1]


42. స్ప్రింగ్‌ల తయారీలో రాగికి బదులు ఉక్కును ఉపయోగిస్తారు. ఎందుకు?

1) ఉక్కు విరివిగా లభిస్తుంది.

2) ఉక్కుకు సాంద్రత ఎక్కువ

3) ఉక్కు యంగ్‌ గుణకం రాగి కంటే అధికం

4)_ పైవన్నీ

43. మానోమీటర్‌ సాయంతో దేన్ని కొలుస్తారు?

1) గొట్టంలో ప్రవహించే ప్రవాహ వేగం   2) పీడన వ్యత్యాసం    

3) ద్రవ స్నిగ్ధత         4) ద్రవ తలతన్యత 


44. వేర్వేరు పరిమాణాల్లోని రెండు సబ్బు బుడగలను ఒక సన్నని గొట్టం ద్వారా కలిపితే, గాలి...

1) పెద్ద సబ్బు బుడగ నుంచి చిన్న బుడగలోకి ప్రయాణిస్తుంది.

2) చిన్న సబ్బు బుడగ నుంచి పెద్ద బుడగలోకి ప్రయాణిస్తుంది.

3) గాలి గొట్టంలో నిశ్చలంగా ఉంటుంది.    4)ఏదీకాదు

జవాబులు

1-4  2-2  3-2  4-4  5-4  6-3  7-3  8-1  9-3 10-1  11-4  12-3  13-1  14-1  15-3  16-2  17-4  18-2 19-2  20-2  21-4

 22-1  23-1  24-3  25-1  26-3 27-1  28-4  29-2  30-4 31-1  32-3  33-1  34-3 35-2  36-1  37-4  38-2  39-1  40-2  41-3 42-3 43-2 44-2  

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌