• facebook
  • whatsapp
  • telegram

యాంత్రిక శాస్త్రం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. గుర్రపు బండిని లాగుతున్నప్పుడు శక్తి ఏ విధంగా రూపాంతరం చెందుతుంది?

జ: కండర శక్తి గతిజ శక్తిగా


2. తిరుగుతున్న సీలింగ్‌ఫ్యాన్ రెక్కలకు ఉండే శక్తి

జ: భ్రమణ, స్థితి శక్తులు
 

3. ఎగురుతున్న పక్షికి ఉండే శక్తి
జ: యాంత్రికశక్తి

 

4. కదులుతున్న రైలుపెట్టెలో నుంచి ఒక వస్తువును బయటకు జారవిడిచినప్పుడు అది ప్రయాణించే మార్గం
జ: పరావలయం

 

5. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది
జ: డైనమో

 

6. పుటాకారంలో ఉన్న రోడ్డుపై ఒక బంతి చేసే చలనం
జ: సరళ హరాత్మక

 

7. బలానికి అంతర్జాతీయ ప్రమాణం
జ: న్యూటన్

 

8. భ్రమణ చలనంలోని వస్తువుకు ఉండే నిజమైన బలం
జ: అభికేంద్ర బలం

 

9. విరామంలోని వస్తువు కిందివాటిలో దేన్ని కలిగి ఉంటుంది?
1) జడత్వం      2) బలం        3) వేగం      4) ద్రవ్యవేగం
జ: 1(జడత్వం)

 

10. అపకేంద్రబలంపై ఆధారపడి పనిచేసేది
జ: వాషింగ్‌మెషీన్

 

11. మజ్జిగను చిలికినప్పుడు వెన్న వేరవడానికి కారణం
జ: అపకేంద్రబలం

 

12. సంధించడానికి సిధ్దంగా ఉన్న ధనస్సులో బాణం ఏ శక్తిని కలిగి ఉంటుంది?
జ: స్థితిశక్తి

 

13. ప్రచోదనం ప్రమాణం
జ: న్యూ-సెకను

 

14. 80 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉన్న ఒక వ్యక్తి ప్రయాణిస్తున్న లిఫ్ట్ తీగలు తెగితే అతడి భారం
జ: శూన్యం

 

15. గమన నియమాలను ఎవరు ప్రతిపాదించారు?
జ: న్యూటన్

 

16. కిందివాటిలో శక్తికి ప్రమాణం
1) ఎర్గ్            2) జౌల్            3) ఎలక్ట్రాన్ ఓల్ట్          4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

17. ఒక వ్యక్తి బరువు భూమిపై 36 కిలోలు అయితే చంద్రుడిపై అతడి బరువు
జ: 6 కి.గ్రా.

 

18. లిఫ్ట్‌ను ఎవరు కనుక్కున్నారు?
జ: ఓటిస్

 

19. కిందివాటిలో మిథ్యాబలం ఏది?
1) ఘర్షణ బలం         2) అపకేంద్ర బలం         3) అభికేంద్ర బలం         4) గురుత్వ బలం
జ: 2 (అపకేంద్రబలం)

 

20.  
జ:  

 

21. కోణీయ వేగానికి ప్రమాణాలు
జ: రేడియన్/సెకన్

 

22. సెకన్ల లోలకం డోలనావర్తన కాలం ఎన్ని సెకన్లు?
జ: 2

 

23. ఒక బంతిని నిలువుగా 40 మీ./సె. వేగంతో విసిరితే అది గరిష్ఠ ఎత్తు 80 మీ. చేరడానికి ఎంత సమయం పడుతుంది? (సెకన్లలో)
జ: 4

 

24. వృత్తాకార మార్గంలో ఒక పూర్తి భ్రమణం చేసిన వస్తువు స్థానభ్రంశం
జ: శూన్యం

 

25. ఘర్షణను తగ్గించే పద్ధతి

1) పాలిష్ చేయడం     2) స్నేహకాలు వాడటం    3) బాల్‌బేరింగ్ వాడటం     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

26. 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉండే వస్తువు భారం (న్యూటన్లలో)
జ: 19.6

 

27. భూమి చుట్టూ చంద్రుడు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టే సమయం ఎంత?
1) 27.3 రోజులు        2) 27 రోజుల 4 గంటలు      3) 2.35 × 106 సె.      4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

28. చంద్రుడిపై గురుత్వ త్వరణం విలువ
జ: 1.67 మీ./సె.2

 

29. చంద్రుడి వ్యాసార్ధం 1740 కి.మీ., ద్రవ్యరాశి 7.4 × 1022 కి.గ్రా. అయితే చంద్రుడిపై గురుత్వ త్వరణం
జ: 1.63 మీ./సె.2

 

30. 10 మీ వ్యాసార్ధం ఉన్న వృత్తమార్గంలో 1000 కిలోల కారు 10 మీ./సె. వడితో చలిస్తుంది. దానికి కావాల్సిన అభికేంద్ర బలం ఎంత?
జ: 10,000 న్యూ.

 

31. ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరితే అది ఆఖరు సెకనులో ప్రయాణించే దూరం ఎంత?
(g = 10 మీ./సె.2)
జ: 5 మీ.

 

32. పలాయన కాలం T = .....
జ: 

 

33. ప్రక్షేపకం చేరే గరిష్ఠ వ్యాప్తి
జ: 

 

34. ఏ ప్రక్షిప్త కోణంతో వస్తువు గరిష్ఠ వ్యాప్తిని పొందుతుంది?
జ: 45o

మాదిరి ప్ర‌శ్న‌లు

 1. కొంత ధన త్వరణంతో ప్రయాణిస్తున్న లారీలో నిల్చున్న వ్యక్తి ఒక బంతిని పైకి విసిరితే అది..? 

 1) అతడి చేతిలోనే పడుతుంది.       2) అతడి వెనకవైపు పడుతుంది.

 3)  అతడి ముందువైపు పడుతుంది.     4) ఏదీకాదు

2. లిఫ్ట్‌లో ఉండే వ్యక్తి దృశ్యభారం శూన్యం అయితే లిఫ్ట్‌ త్వరణం(a), గురుత్వ త్వరణం (g) ల మధ్య సంబంధం ఏమిటి?

 1) a = g             2)  a > g     3)  a < g         4) a = g = 0

3.  ఒక వ్యక్తి R వ్యాసార్ధం ఉన్న వృత్తాకార పథంపై ప్రయాణిస్తున్నాడు. మూడుసార్లు చుట్టివచ్చాక అతడి స్థానభ్రంశం ఎంత?

1)  శూన్యం             2) 2R           3)2 ∏R          4)∏R

    

4.  9.8 మీ./సె. వేగంతో వస్తువును నిలువుగా విసిరితే అది చేరే గరిష్ఠ ఎత్తు ఎంత?

 1) 9.8 మీ.     2) 4.9 మీ.         3) 19.6 మీ.     4) 0.2 మీ.

5.  వస్తువు స్థానభ్రంశం శూన్యం అయితే దాని ప్రయాణ దూరం?

1) శూన్యం     2) శూన్యం కాదు      3)శూన్యం లేదా శూన్యం కాకపోవచ్చు       4)ఏదీకాదు


6. సమ వడితో వృత్తాకార మార్గంలో తిరిగే వస్తువుకు త్వరణం?

 1) ఉండదు     20 ఉంటుంది      3) ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు   4) ఏదీకాదు

7. సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తున్న వస్తువు విషయంలో సరైంది ఏది?

 A. స్థానభ్రంశం = దూరం    B. వడి = వేగం   C. స్థానభ్రంశం ¹ దూరం    D. వడి ¹ వేగం

      1) A, B     2) A, D      3)B, D      4) B, C

8. ప్రక్షేపకం గరిష్ఠ ఎత్తు వద్ద శూన్యం కానిది ఏది?

   1)  వేగం       2) ద్రవ్యవేగం       3)  గతిజశక్తి     4)పైవన్నీ

9. ప్రక్షేపకం ప్రయాణించే పథం ఏ ఆకారంలో ఉంటుంది?

   1 సరళరేఖ      2) వృత్తం     3) దీర్ఘవృత్తం     4) పరావలయం

10. ఒక వ్యక్తి తన రెండు చేతుల్లో రెండు బంతులు పట్టుకుని కొంత ఎత్తుపై నిలబడ్డాడు. ఒక బంతిని కిందికి జారవిడిచి, అదే క్షణంలో మరో బంతిని క్షితిజ సమాంతరంగా విసిరితే ఏ బంతి భూమిని త్వరగా చేరుతుంది?

 1) మొదటి బంతి       2) రెండో బంతి    3) రెండూ ఒకేసారి భూమిని చేరతాయి    4) ఏదీకాదు

11. జడత్వానికి కొలమానం ఏది?

1) ద్రవ్యరాశి        2)  బలం     3) ద్రవ్యవేగం       4) శక్తి

12. ప్రకృతిలో అత్యంత బలహీనమైన బలం ఏది?

 1)  విద్యుదయస్కాంత బలం      2) గురుత్వబలం       3) కేంద్రక బలం         4) కేంద్రీయ బలం

13. చర్య, ప్రతిచర్యలు..

A) రెండు బలాలు                                B) సమాన, వ్యతిరేక బలాలు

C) రెండు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయ         C) పరస్పరం రద్దు చేసుకోవు


 1) A, C    2) A, B      3)A, B, C      4) A, B, C, D

14. మిథ్యాబలానికి ఉదాహరణ ఏది?

1) ఘర్షణ బలం   2) అపకేంద్ర బలం   3) అభికేంద్ర బలం   4) విద్యుదయస్కాంత బలం

15. సైకిల్‌ తొక్కేటప్పుడు, వెనుక చక్రం, ముందు చక్రాలపై పనిచేసే ఘర్షణ బలాల దిశలు?

1) ముందు దిశ, వెనుక దిశ        2) వెనుక దిశ, ముందు దిశ

3) రెండూ ముందు దిశలో         4) రెండూ వెనుక దిశలో


16. దొర్లుడు ఘర్షణ బలం..

1) స్పర్శాతల వైశాల్యంతో పెరుగుతుంది.    2) దొర్లే వస్తువు వ్యాసార్ధం పెరిగితే తగ్గుతుంది.  

3) మిగతా వాటి కంటే తక్కువ విలువను కలిగి ఉంటుంది.      4)పైవన్నీ


17. న్యూటన్‌ నియమాలను తెలిపేది?

1) వస్తువు తన స్థితిలో వచ్చే మార్పును వ్యతిరేకిస్తుంది.

2) ద్రవ్యరాశి, త్వరణాల లబ్ధం బలానికి సమానం.

3) చర్య, ప్రతిచర్యలు రసాయన చర్యలు

4) 1, 2


18. ఏ నియమం ఆధారంగా రాకెట్‌ పనిచేస్తుంది?


1) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం          2) శక్తి నిత్యత్వ నియమం

3) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం  4) పైవన్నీ


19. స్వేచ్ఛగా కిందకు పడే వస్తువు వరుసగా 1వ, 2వ, 3వ సెకన్లలో పొందే స్థాన భ్రంశాల నిష్పత్తి ఎంత?

1) 1 : 2 : 3       2)1 : 3 : 5       3) 2 : 3 : 4       4) 1 : 3 : 7 

20. న్యూటన్‌ రెండో నియమం ఆధారంగా వేటిని నిర్వచించవచ్చు?

1) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం   2) ప్రచోదనం    3) F =- ma   4) పైవన్నీ


21. లాంగ్‌ జంప్‌ చేసే వ్యక్తి దూకడానికి ముందు కొంత దూరం పరిగెడతాడు. దానికి కారణం ఏమిటి?

1) గమన జడత్వం  2) నిశ్చల జడత్వం   3) దిశా జడత్వం   4) పైవన్నీ

22. స్థానభ్రంశం, దూరాల విషయంలో సరైంది ఏది?

1)  స్థానభ్రంశం అదిశ, దూరం సదిశ    2) దూరం ³ స్థానభ్రంశం

3) స్థానభ్రంశం ³ దూరం               4) ఏదీకాదు


23. ద్విమితీయ చలనానికి ఉదాహరణ?

1) వృత్తాకార చలనం    2) ప్రక్షేపకం  3) లోలకం ఆవర్తనాలు    4) పైవన్నీ


24. త్వరణం - కాలం మధ్య గ్రాఫ్‌ను గీస్తే, అది ఆవరించిన వైశాల్యం దేన్ని సూచిస్తుంది?

1) తక్షణవేగం    2) సగటు వేగం   3) వేగంలో మార్పు    4) ఏదీకాదు


25. 2 కి.గ్రా. ద్రవ్యరాశితో ఉండే వస్తువు నిశ్చల స్థితి నుంచి 3 మీ./సె. వేగం పొందడానికి, దానిపై ప్రయోగించిన బలం చేసిన పని ఎంత? 

1) 6      2) 9J      3) 18J       4) 5J

27. ప్రక్షేపకం వ్యాప్తి గరిష్ఠంగా ఉండాలంటే, దాన్ని క్షితిజ సమాంతరంగా ఎంత కోణంతో విసరాలి?

1) 45o     2) 30o    3) 60o    4 90o


28. ఘనరూపంలోని స్నేహకం ఏది?

1) గ్రీజు     2) కార్బన్‌   3) గ్రాఫైట్‌     4) సిలికాన్‌

29. ఒక వాహనం 18 సెకన్లలో 10 మీటర్ల దూరం ప్రయాణిస్తే గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? 

1) 1 కి.మీ.     2) 500 మీ.     3) 2000 మీ.     4)  2000 కి.మీ.


30. వేగంగా వెళ్తున్న బస్సుకి హఠాత్తుగా బ్రేకులు వేస్తే ప్రయాణికులు...

1)  ముందుకు పడిపోతారు   2) వెనక్కు పడిపోతారు   3) పక్కకి పడిపోతారు   4) 1 లేదా 2


31. తలపై భారాన్ని మోస్తూ, రోడ్డుపై నడిచే వ్యక్తి...

1) బలాన్ని వినియోగించడు        2) చేసిన పని శూన్యం   

3) చేసిన పని రుణాత్మకం         4) చేసిన పని ధనాత్మకం


32. ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు వాహనాల వేగాలు వరుసగా 60 కి.మీ./గం., 80 కి.మీ./గం. అయితే వాటి మధ్య సాపేక్షవేగం ఎంత?

1)  20 కి.మీ./గం  2) 140 కి.మీ./గం  3) 20 కి.మీ./గం  4) 70 కి.మీ./గం.


33. ఒక వ్యక్తి రాయిని 4.9 మీ./సె. వేగంతో నిలువుగా పైకి విసిరాడు. అది ఎంతసేపు గాలిలో ఉంటుంది?

1) 0.5 సె.   2) 1 సె.   3) 2 సె.    4) 3 సె.

34. నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు  విషయంలో... 

A) వేగం క్రమంగా తగ్గుతుంది.             B) గతిజశక్తి క్రమంగా పెరుగుతుంది. 

C) స్థితిజశక్తి క్రమంగా పెరుగుతుంది.       D) స్థితిజశక్తి క్రమంగా తగ్గుతుంది.

1)A, B, C      2) B, C   3) A, C    4) A, B, D


35. కిందివాటిలో సదిశ ఏది?

1) విద్యుత్‌ ప్రవాహం   2) కాంతి వేగం    3) కోణీయ ద్రవ్యవేగం  4) పీడనం

36. గట్టుకట్టని వక్రమార్గంలో, వాహనాలకు కావాల్సిన అభికేంద్ర బలాన్ని సమకూర్చేది ఏది?

1) అభిలంబ ప్రతిచర్య   2)  వాహనం భారం     3) అపకేంద్ర బలం   4)  ఘర్షణ బలం

37. ఉతికిన దుస్తుల నుంచి నీటిని తొలగించేందుకు ఆటోమెటిక్‌ వాషింగ్‌ మెషిన్‌కు తోడ్పడే బలం?

1) అపకేంద్ర బలం  2) అభికేంద్ర బలం    3) తన్యత బలం   4) ఘర్షణ బలం

39. త్వరణం శూన్యం అయినప్పుడు, వస్తువు... 

1) వేగం శూన్యం కావొచ్చు  2) వేగం స్థిరం కావొచ్చు  3) వడి శూన్యం కావొచ్చు   4) పైవన్నీ

40. ధ్వని శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చేది ఏది?

1) స్పీకర్‌     2) మైక్రోఫోన్‌   3) ఆంప్లిఫయర్‌    4) పైవన్నీ

41. నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు త్వరణం...  

1)  9.8 మీ./సె.2         2) 9.8 మీ./సె.2   3) 0 మీ./సె.2        4) చెప్పలేం


42. సామర్థ్యానికి ప్రమాణం ఏమిటి?

1) వాట్‌      2) J / S      3) అశ్వసామర్థ్యం      4) పైవన్నీ

43. స్వేచ్ఛగా కిందకు పడే వస్తువుకు వరుస సెకన్లలో..

1) వేగాల నిష్పత్తి 1 : 2 : 3 : 4 .....

2) దూరాల నిష్పత్తి 1 : 4 : 9 : 16 .....

3) త్వరణాల నిష్పత్తి 1 : 2 : 3 .....

4) 1, 2 

44. ఒక వ్యక్తి ఉత్తరదిశలో 3 కిలోమీటర్లు ప్రయాణించి, కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే అతడు పొందిన స్థానభ్రంశం ఎంత?

1)  7 కి.మీ.    2)  5 కి.మీ.   3) 25 కి.మీ.   4) ఏదీకాదు

45. వస్తువు ప్రయాణించిన దూరాన్ని కొలిచే పరికరం?

1) స్పీడోమీటర్‌     2) ఓడోమీటర్‌    3)  అనిమోమీటర్‌    4) పైవన్నీ

సమాధానాలు


1) 2  2) 1  3) 1  4) 2  5) 3  6) 2  7) 1  8) 4   9) 4  10) 3  11) 1  12) 2  13) 4   14) 2   15) 1  16) 4  17) 4     19) 2  20) 4   21) 1  22) 2  23) 4  24) 3 25) 2  26) 2   27) 1  28) 3  29) 3  30) 1  31) 2  32) 2   33) 2  34) 3  35) 3  36) 4  37) 1    39) 4  40) 2  41) 2  42) 4  43) 4  44) 2   45) 2   

 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌