• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిలో ఏది ఉష్ణీకరణ ప్రక్రియ?
1) బాష్పీభవనం      2) సాంద్రీకరణం       3) మరగడం        4) అన్నీ
జ‌: 2 (సాంద్రీకరణం)

 

2. ద్రవీభవనం అంటే, ఘనస్థితిలోని పదార్థం ......... లోకి మారడం.
జ‌: స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి

 

3. A, B, C అనే వస్తువులు ఉష్ణసమతాస్థితిలో ఉన్నాయి. B ఉష్ణోగ్రత 45oC అయితే, C ఉష్ణోగ్రత ఎంత?
జ‌: 45oC

 

4. ఒక స్టీలు కడ్డీ ఉష్ణోగ్రత 330 K అయితే దాని ఉష్ణోగ్రత oC పరంగా ఎంత?
జ‌: 57oC

 

5. విశిష్టోష్ణం S = .......
జ‌:  

 

6. సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరిగే స్థానం
జ‌: 100oC

 

7. ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత
జ‌: స్థిరంగా ఉంటుంది

 

8. ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ స్కేల్, ఫారెన్‌హీట్ స్కేల్ సమానమవుతాయి?
జ‌: -40o

 

9. ఒక ద్రవం బాష్పీభవనం కిందివాటిలో దేని మీద ఆధారపడి ఉంటుంది?
   1) ద్రవ ఉప‌రిత‌లం       2) ఉష్ణోగ్రత         3) ప‌రిస‌రాల‌పై        4) అన్నీ
జ‌: 2 (ఉష్ణోగ్రత)

 

10. కిందివాటిలో శీతలీకరణ ప్రక్రియ
    1) బాష్పీభవనం                              2) మరగడం
    3) బాష్పీభవనం, మరగడం              4) ఏదీకాదు
జ‌: 1 (బాష్పీభవనం)

 

11. గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ..... అంటారు.
జ‌: ఆర్ద్రత

 

12. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిశక్తి ..... కు అనులోమానుపాతంలో ఉంటుంది.
జ‌: పరమ ఉష్ణోగ్రత

 

13. ఉష్ణశక్తి ప్రసారదిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత కాగా, ఆ ప్రవహించే శక్తియే
జ‌: ఉష్ణం

 

14. ఒకే ఉష్ణోగ్రత వద్ద వివిధ వాయువులున్నాయి. అయితే ఏ విలువ అన్ని వాయువులకు ఒకే విధంగా ఉంటుంది?
జ‌: సరాసరి గతిజశక్తి

 

15. ద్రవస్థితిలోని పదార్థం ఘనస్థితిలోకి మారడాన్ని ఏమంటారు?

జ‌: ఘనీభవనం
 

16. ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారే ప్రక్రియను ఏమంటారు?
జ‌: మరగడం

 

17. ఏదైనా ద్రవాన్ని వేడిచేసినప్పుడు అందులోని వాయువు ద్రావణీయత
జ‌: తగ్గుతుంది

 

18. నీరు మరిగే స్థానం ..... కెల్విన్‌లు.
జ‌: 373

 

19. నీరు మరిగే స్థానం ...... సెల్సియస్.
జ‌: 100

 

20. ద్రవీభవన గుప్తోష్ణం L = ......
జ‌:  


21. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ
జ‌: 540 కె./గ్రా.

 

22. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ
జ‌: 80 కె./గ్రా.

 

23. నీటి ఘనపరిమాణం కంటే మంచు ఘనపరిమాణం ...... గా ఉంటుంది.

జ‌: ఎక్కువ
 

24. ఘనీభవించేటప్పుడు నీరు ..... చెందుతుంది.
జ‌: వ్యాకోచం

 

25. ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతిజశక్తి ఆ పదార్థం పరమ ఉష్ణోగ్రతకు ...... ఉంటుంది.
జ‌: అనులోమానుపాతంలో

 

26. కిందివాటిలో శీతలీకరణ ప్రక్రియ ఏది?
    1) బాష్పీభవనం       2) సాంద్రీకరణం      3) మరగడం       4) అన్నీ
జ‌: 1 (బాష్పీభవనం)

 

27. పొగలా గాలిలో తేలియాడే నీటి బిందువులను ..... అంటారు.
జ‌: పొగమంచు

 

28. వేసవి రోజుల్లో ఉక్కపోతకు కారణం ఏమిటి?
జ‌: అధిక బాష్పీభవనం

 

29. కిందివాటిలో శీతలీకరణిగా వాడే పదార్థం
    1) నీరు                   2) మంచు              3) గ్రీజు             4) కిరోసిన్
జ‌: 1 (నీరు)

 

30. గాలిలో నీటి ఆవిరి ..... స్థితిలో ఉన్నప్పుడు గాలి సాంద్రీకరణం చెందుతుంది.
జ‌: సంతృప్త

 

31. ఉష్ణానికి SI ప్రమాణం
జ‌: జౌల్

 

32. ప్రమాణ ద్రవ్యరాశి ఉండే పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని ..... అంటారు.
జ‌: విశిష్టోష్ణం

 

33. నీటిపై మంచు తేలడానికి కారణం
జ‌: మంచు సాంద్రత తక్కువ

 

34. చల్లదనం లేదా వెచ్చదనం తీవ్రతను ...... అంటారు
జ‌: ఉష్ణోగ్రత

 

35. విశిష్టోష్ణానికి SI ప్రమాణం....
జ‌: J/Kg.K

 

36. అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉండే వస్తువుకు ....... ప్రవహిస్తుంది.
జ‌: కాంతి

 

37. రెండు వస్తువుల మధ్య సమతాస్థితిని సాధించాలంటే ఆ రెండు వస్తువులు ......
జ‌: ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉండాలి

38. ........ అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ.
జ‌: బాష్పీభవనం
39. 10oC వద్ద ఉండే A అనే వస్తువును 10 K వద్ద ఉండే B అనే వస్తువుతో ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణం ప్రవహించే దిశ
జ‌: A నుంచి B

 

40. ఉష్ణానికి CGS ప్రమాణం
జ‌: కెలోరీ

 

41. వస్తువు ఉష్ణోగ్రత .....కు అనులోమానుపాతంలో ఉంటుంది.
జ‌: కణాల సరాసరి గతిజశక్తి

 

42. 1 కెలోరీ = ...... జౌళ్లు.
జ‌: 4.186

 

43. ఉష్ణసమతాస్థితి వద్ద, థర్మామీటరు రీడింగ్ ......... ను సూచిస్తుంది.
జ‌: ఉష్ణోగ్రత

 

44. మిశ్రమాల పద్ధతి ప్రకారం వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = ..........
జ‌: చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం

45. 30oC ను కెల్విన్‌లోకి మార్చగా
జ‌: -243

 

46. ఉష్ణం ..... వస్తువు నుంచి ..... వస్తువుకు ప్రవహిస్తుంది.
జ‌: వేడి, చల్లని

 

47. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ .......
జ‌: 540 కె./గ్రా.

 

48. Q = msΔΔt లో s ను .... అంటారు.
జ‌: విశిష్టోష్ణం

 

49. ఘనపదార్థం, ద్రవపదార్థంగా మారే ప్రక్రియను ..... అంటారు.
జ‌: ద్రవీభవనం

 

50. ద్రవస్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియను ..... అంటారు.
జ‌: ఘనీభవనం

 

51. ఏకాంక ద్రవ్యరాశి ఉండే పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని ఆ పదార్థ ...... అంటారు.
జ‌: విశిష్టోష్ణం

 

52. కిందివాటిలో అధిక విశిష్టోష్ణం ఉన్న పదార్థం
    1) కిరోసిన్           2) నీరు        3) మంచు         4) సీసం
జ‌: 2 (నీరు )

 

53. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది?
    1) 32oC         2) 0oC        3) 273 K      4) అన్నీ
జ‌: 4 (అన్నీ)

 

54. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం
జ‌: కెల్విన్

 

55. ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం, వాయువుగా స్థితి మార్పు చెందడమే
జ‌: బాష్పీభవనం

 

56. వాయువు, ద్రవంగా స్థితి మార్పు చెందడాన్ని ..... అంటారు.
జ‌: సాంద్రీకరణం

 

57. 0oC ...... కెల్విన్‌లు.
జ‌: 273

 

58. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత = ...... + సెల్సియస్‌లో ఉష్ణోగ్రత
జ‌: -273

 

59. కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను ..... అంటారు.
జ‌: పరమ ఉష్ణోగ్రత

 

60. ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతిజశక్తి, ఆ పదార్థం ..... కు అనులోమానుపాతంలో ఉంటుంది.
జ‌: పరమ ఉష్ణోగ్రత

 

61. ఏదైనా పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని .... అంటారు.
జ‌: మరగడం

 

62. ఒక వస్తువు ఉష్ణోగ్రతలోని పెరుగుదల, పదార్థం ..... పై ఆధారపడి ఉంటుంది.
జ‌: స్వభావం

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌