• facebook
  • whatsapp
  • telegram

కాంతి (సహజ దృగ్విషయాలు)

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ప్రతిబింబ పరిమాణానికి, వస్తు పరిమాణానికి మధ్య నిష్పత్తి-
జ: ఆవర్థనం
 

2. తలకిందులైన నిజ ప్రతిబింబానికి ఆవర్థనం
జ: రుణాత్మకం
 

3. అధిక దృక్‌క్షేత్రం ఉన్న దర్పణం
జ: కుంభాకార
 

4. గోళాకార దర్పణ నాభ్యంతరం, వక్రతా వ్యాసార్ధాల నిష్పత్తి
జ: 0.5
 

5. ఆవర్థనం m =
జ:  
 

6. పుటాకార దర్పణ ప్రధాన అక్షంపై C వద్ద వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?
జ: వక్రతా కేంద్రం వద్ద
 

7. కుంభాకార దర్పణ నాభి దిశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడిన కాంతి కిరణం పరావర్తనం చెందాక-
జ: ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళుతుంది
 

8. వాహనాల్లో డ్రైవర్ అద్దంగా వాడే దర్పణం ఏది?
జ: కుంభాకార
 

9. 'డాక్టర్స్ మిర్రర్' అని ఏ దర్పణాన్ని అంటారు?
జ: పుటాకార
 

10. కిందివాటిలో స్నెల్ నియమం
ఎ) n1sini = n2sinr    బి)      సి)       డి) n2sini = constant (స్థిరాంకం)
జ:  

11. గాలిపరంగా గాజు వక్రీభవన గుణకం 2. అయితే గాజు-గాలి కలిసే తలం యొక్క సందిగ్ధ కోణం
జ: 30o
 

12. గాజుదిమ్మె వల్ల కాంతి పొందే విచలన కోణం
జ: దిమ్మె, తలానికి గీసిన లంబం చేసే కోణంపై ఆధారపడుతుంది.
 

13. కిందివాటిలో సంపూర్ణాంతర పరావర్తనం ఫలితం కానిది
ఎ) వజ్రం మెరవడం      బి) దృశాతంతువు     సి) ఎండమావి      డి) ఆకాశం నీలం రంగులో ఉండటం
జ: డి(ఆకాశం నీలం రంగులో ఉండటం)

14. వక్రీభవనం వల్ల కాంతి ఏ ధర్మం మారదు?
జ: పౌనఃపున్యం
 

15. నక్షత్రాలు మెరవడానికి కారణం
జ: వక్రీభవనం
 

16. అన్ని యానకాల్లో కాంతివేగం సమానంగా ఉంటే కిందివాటిలో ఏది జరగదు?
ఎ) పరావర్తనం       బి) వక్రీభవనం       సి) విక్షేపణం       డి) ఏదీకాదు
జ: బి(వక్రీభవనం)
 

17. వజ్రం వక్రీభవన గుణకం
జ: 2.42
 

18. కింది పదార్థాల్లో కటక తయారీకి పనికిరానిది ఏది?
ఎ) నీరు       బి) గాజు       సి) ప్లాస్టిక్       డి) బంకమన్ను
జ: డి(బంకమన్ను)
 

19. n వక్రీభవన గుణకం, R వక్రతా వ్యాసార్ధం ఉన్న ఒక సమతల కుంభాకార కటక నాభ్యంతరం
జ: f = R
 

20. కిందివాటిలో కటక తయారీ సూత్రం ఏది?


 

21. కటక నాభ్యంతరం కిందివాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) వక్రతా వ్యాసార్ధం       బి) కటకం చేసిన పదార్థం     సి) యానకం     డి) అన్నీ
జ: డి(అన్నీ)
 

22. 10 సెం.మీ., 20 సెం.మీ. నాభ్యంతరాలున్న రెండు సమతల కుంభాకార కటకాలను ఒకదానినొకటి తాకేలా ఉంచితే ఫలిత నాభ్యంతరం
జ: 6.67 సెం.మీ.
 

23. ఒక వ్యక్తి ఒడ్డుపై నిలబడి ఉన్నాడు. నీటిలోని చేపకు అతడు
జ: పొడవుగా కనిపిస్తాడు
 

24. సమతల కుంభాకార కటక వక్రతా వ్యాసార్ధాన్ని రెట్టింపు చేస్తే నాభ్యంతరం
జ: రెట్టింపు అవుతుంది
 

25. కటక సామర్థ్యానికి SI ప్రమాణాలు
జ: డై ఆప్టర్లు
 

26. 50 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కుంభాకార కటక సామర్థ్యం
జ: +2D
 

27. నీటిలో ఉంచితే కుంభాకార కటక నాభ్యంతరం
జ: పెరుగుతుంది
 

28. మధ్యాహ్నం సూర్యుడు తెల్లగా కనిపించడానికి కారణం
జ: పరిక్షేపణం
 

29. కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని ఏమంటారు?
జ: సర్దుబాటు
 

30. సాధారణ మానవుడి స్పష్టదృష్టి కనీస దూరం
జ: 25 సెం.మీ.
 

31. సూర్యకాంతిని శోషించుకున్న అణువు వివిధ కాంతి తీవ్రతలతో అన్ని దిశల్లో కాంతిని విడుదల చేయడాన్ని ఏమంటారు?
జ: వక్రీభవనం
 

32. హ్రస్వదృష్టితో బాధపడే వ్యక్తి గరిష్ఠ దూరం 5 మీ. దీన్ని నివారించి సాధారణ దృష్టి వచ్చేలా చేయాలంటే ఏ కటకాన్ని వినియోగించాలి?
జ: 5 మీ. నాభ్యంతర పుటాకార కటకం
 

33. మానవుడి కన్ను గ్రహించే వస్తు పరిమాణం ప్రాథమికంగా దేనిపై ఆధారపడుతుంది?
జ: కన్ను నుంచి వస్తువుకు ఉన్న దూరం
 

34. చత్వారాన్ని ఏ కటకంతో నివారించవచ్చు?
జ: ద్వినాభి
 

35. గ్రహణాలు ఏర్పడటానికి కాంతి ఏ ధర్మం కారణం?
జ: రుజుమార్గ ప్రయాణం
 

36. ధ్వని తరంగాలు ప్రదర్శించని ఏ ధర్మాన్ని కాంతి ప్రదర్శిస్తుంది?
జ: ధ్రువణం
 

37. మానవుడి కంటికి ఆహ్లాదాన్ని కలిగించే రంగు
జ: ఆకుపచ్చ
 

38. కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం-
జ: కేండిలా

39. ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం
ఎ) విశ్లేషణం       బి) వక్రీభవనం       సి) సంపూర్ణాంతర పరావర్తనం       డి) అన్నీ
జ: డి(అన్నీ)
 

40. ఆప్తమాలజీ ఏ జ్ఞానానికి సంబంధించింది?
జ: దృష్టి
 

41. జలాశయాల్లో లోతు తక్కువగా అనిపించడానికి కారణం
జ: వక్రీభవనం
 

42. నీటిలోని గాలి బుడగ దేనిలా ప్రవర్తిస్తుంది?
జ: పుటాకార కటకం
 

43. కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి?
జ: తిర్యక్
 

44. షేవింగ్ చేయడానికి ఎలాంటి దర్పణాన్ని ఉపయోగిస్తారు?
జ: పుటాకార
 

45. మానవుడి కన్ను సెకనుకు ఎన్ని చిత్రాలను విడిగా చూడగలదు?
జ: 16

46. ఎండోస్కోప్‌లో ఇమిడి ఉన్న సూత్రం
జ: వివర్తనం
 

47. చంద్రుడి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది?
జ: సెకను
 

48. ఆప్టికల్ ఫైబర్స్‌ను కిందివాటిలో దేనిలో వాడతారు?
జ: ప్రసారం
 

49. కెమెరాలో ఉండే కటకం
జ: కుంభాకార
 

50. సమతల దర్పణం నుంచి ఒక వ్యక్తి 3 మీటర్ల దూరంలో నిలబడితే అతడికి, ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత?
జ: 6 మీ.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌