• facebook
  • whatsapp
  • telegram

బారు వడ్డీ - చక్ర వడ్డీ

మాదిరి ప్ర‌శ్న‌లు

బారువడ్డీ

1. రూ.6000 పై 15% రేటు చొప్పున 3 సంవత్సరాల కాలంలో అయ్యే సాధారణ వడ్డీ ఎంత?
సాధన: P = రూ.6000, R = 15%, T = 3 సంవత్సరాలు.
           
                               = 60 × 15 × 3
                              I = రూ. 2,700

2. రూ.4000 పై ఒక సంవత్సరానికి 7 % రేటు చొప్పున 2 సంవత్సరం కాలంలో అయ్యే వడ్డీ ఎంత?
సాధన: P = రూ.4000, T = 2 = , R = 7 =  
           

              
            I = 10 × 15 × 5 = రూ.750

3. రూ.8000 పై 5% వడ్డీరేటు చొప్పున 2 సంవత్సరాల 3 నెలలకు అయ్యే బారువడ్డీ మొత్తం ఎంత?
సాధన: అసలు (P) = రూ.8000
           వడ్డీరేటు (R) = 5%
               కాలం (T) = 2 సంవత్సరాల 3 నెలలు
                            
                            

                            
                              = 80 × × 5 
                             = 20 × 5 × 9
                             = 900
                         A = P + I
                            = 8000 + 900
                            = రూ.8900

 

4. రూ.6,500 పై 2% రేటు చొప్పున ఎంతకాలంలో రూ.455 వడ్డీ వస్తుంది?
సాధన: 
           
         T = 3 సంవత్సరాలు

5. రూ.8,960 పై 3 సంవత్సరాల్లో వడ్డీ రూ.1344. అయితే వడ్డీరేటు ఎంత?
     

                వడ్డీరేటు (R) = 5%

6. రూ.4,800 లను అప్పుగా తీసుకుని సంవత్సరానికి 8  % వడ్డీరేటుతో 2 సంవత్సరాల 3 నెలలకు ఎంత వడ్డీని చెల్లించాలి?
ఎ) రూ.796                 బి) రూ.816                 సి) రూ.918                 డి) రూ.956
జవాబు: సి
సాధన:
 
       

7. రూ.12,500 లను కొంత సరళ వడ్డీకి అప్పుగా తీసుకుంటే 4 సంవత్సరాల్లో మొత్తం రూ.15,500 అయ్యింది. అయితే వడ్డీరేటు ఎంత?
ఎ) 3%              బి) 4%              సి) 5%              డి) 6%
జవాబు: డి
సాధన:

        
8. రూ.500 అప్పుగా తీసుకుంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో ఎంత కాలానికి రూ.50 వడ్డీ చెల్లించాలి?
ఎ) 2 సం.            బి) 2 12 సం.            సి) 3 సం.            డి) 4 సం.
జవాబు: ఎ
సాధన: 


9. కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటే అది 15 సంవత్సరాల్లో 4 రెట్లు అయ్యింది. అయితే వడ్డీరేటు ఎంత?
ఎ) 40%         బి) 30%         సి) 20%         డి) 10%
జవాబు: సి
సాధన: 
      
సంక్షిప్త పద్ధతి:

  
10. కొంత సొమ్మును అప్పుగా తీసుకుని సంవత్సరానికి 5% వడ్డీరేటుతో 2 సంవత్సరాలకు మొత్తం రూ.132 చెల్లిస్తే, తీసుకున్న అప్పు ఎంత?
ఎ) రూ.112         బి) రూ.118.80         సి) రూ.120         డి) రూ.122
జవాబు: సి
సాధన: 

సంక్షిప్త పద్ధతి:


11. కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటే 2 ఏళ్లలో రూ.720, 5 ఏళ్లలో రూ.1,020 అయ్యింది. అయితే తీసుకున్న అప్పు ఎంత?
ఎ) రూ.520           బి) రూ.620           సి) రూ.720           డి) రూ.710
జవాబు: ఎ
సాధన: 5 - 2 = 3 సంవత్సరాలకు వడ్డీ
          = 1020 - 720 = 300
          3 సంవత్సరాలకు ...... 300
          2 సంవత్సరాలకు ...... ?
           × 300 = 200
          అసలు = మొత్తం - వడ్డీ
          = 720 - 200 = 520


12. ఒక వ్యక్తి కొంత సొమ్మును 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ రేటు 2% పెంచడం వల్ల రూ.72 ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అయితే తీసుకున్న అప్పు ఎంత?
ఎ) రూ.1200           బి) రూ.1500           సి) రూ.1600           డి) రూ.1800
జవాబు: ఎ

సాధన: 72 అనేది పాత వడ్డీకి, కొత్త వడ్డీకి మధ్య తేడా.
 P = x, R = R%, T = 2; P = x, R = (R + 3), T = 2

సంక్షిప్త పద్ధతి:


13. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు మొత్తం రూ.6450 అయ్యింది. దీన్ని వాయిదా పద్ధతిలో చెల్లించాలంటే సంవత్సరానికి ఎంత చెల్లించాలి?
ఎ) రూ.1400             బి) రూ.1500             సి) రూ.1550             డి) రూ.1600
జవాబు: బి
సాధన: ఏడాదికి వాయిదా = x అనుకోండి.

14. రూ.1,500 లను రెండు భాగాలుగా చేసి, అందులో ఒక భాగాన్ని 6%, మరొక భాగాన్ని 5% వడ్డీరేటుతో ఒక సంవత్సరానికి అప్పుగా ఇస్తే ఇద్దరి వద్ద నుంచి రూ.85 వడ్డీ వచ్చింది. అయితే 5% వడ్డీరేటుతో అప్పుగా ఇచ్చింది ఎంత?
ఎ) రూ.1000             బి) రూ.500             సి) రూ.750             డి) రూ.850
జవాబు: బి
సాధన: 5% వడ్డీతో తీసుకున్న అప్పు x అనుకోండి. అప్పుడు 6% వడ్డీతో తీసుకున్న అప్పు (1500 - x) అవుతుంది
   
   9000 - x = 8500
  x = 9000 - 8500 = 500


15. ఒక వ్యక్తి రెండు సమాన మొత్తాలను 10% వడ్డీ రేటుతో రెండు బ్యాంకుల్లో 4, 6 సంవత్సరాలకు డిపాజిట్ చేశాడు. రెండు బ్యాంకులు ఇచ్చే వడ్డీల మధ్య తేడా రూ.840 అయితే డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత?
ఎ) రూ.4,200           బి) రూ.5,000            సి) రూ.5,200           డి) రూ.6,000
జవాబు: ఎ

సాధన: డిపాజిట్ చేసిన సొమ్ము x అనుకోండి.

సంక్షిప్త పద్ధతి:


    
16. రూ.2,000 లను 5 సంవత్సరాలకు అప్పుగా ఇస్తే రూ.2,600 అయ్యింది. వడ్డీరేటును 3% పెంచితే ప్రస్తుతం ఎంత సొమ్ము వస్తుంది?
ఎ) రూ.2,900           బి) రూ.3,200           సి) రూ.3,600           డి) ఏదీకాదు
జవాబు: 

సాధన: ముందుగా వడ్డీరేటును లెక్కించాలి.

     మొత్తం = అసలు + వడ్డీ
                = 2000 + 900 = 2900


17. రూ.1,500 లను 3 సంవత్సరాలకు రెండు వేర్వేరు వడ్డీరేట్లతో అప్పుగా ఇస్తే, వడ్డీల మధ్య తేడా రూ.13.50. రెండు వడ్డీల మధ్య తేడా ఎంత శాతం?
ఎ) 0.1%          బి) 0.2%          సి) 0.3%          డి) 0.4%
జవాబు: సి
సాధన: రెండు వడ్డీలు వరుసగా r1%, r2% అనుకోండి.


     
18. ఒక వ్యక్తి తీసుకున్న అప్పులో వడ్డీ  వ వంతు ఉంది. వడ్డీరేటు, కాలం సంఖ్యాపరంగా సమానం. అయితే కాలం ఎంత?
ఎ) 5  సంవత్సరాలు               బి) 6 

 సంవత్సరాలు
సి) 7 సంవత్సరాలు                     డి) 7  సంవత్సరాలు
జవాబు: డి
సాధన:


19. రూ.8,000 రెండేళ్లలో రూ.10,000 అయ్యింది. అదే వడ్డీరేటుతో ఎంత సొమ్మును 3 సంవత్సరాలకు అప్పుగా ఇస్తే రూ.6,875 అవుతుంది?
 ఎ) రూ.4,850             బి) రూ.5,000             సి) రూ.5,500             డి) రూ.5,275
జవాబు: బి
సాధన: 

 

    
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఒక తండ్రి కొంత మొత్తాన్ని 12% సరళవడ్డీతో తన 16 సంవత్సరాల కూతురి పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. అతడి కూతురి వయసు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు మొత్తం రూ.4,30,000 వచ్చినట్లయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ చెసిన మొత్తం ఎంత?
జవాబు: రూ.2,50,000


2. బాలు సంవత్సరానికి 8% సాధారణ వడ్డీతో రూ.50,000 అప్పుగా తీసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత అప్పు తీర్చడానికి అతను ఎంత డబ్బు చెల్లించాలి?
జవాబు: రూ.66,000


3. కొంత మొత్తాన్ని బారువడ్డీకి పెట్టుబడి పెట్టారు. పది సంవత్సరాల్లో ఆ మొత్తం మూడు రెట్లయితే వడ్డీరేటు ఎంత?
జవాబు: 20%


4. కొంత అసలుపై 12% సాలీనా వడ్డీరేటుతో 6 నెలలకు బారువడ్డీతో రూ.6,360 మొత్తంగా చెల్లించాల్సి వచ్చింది. అయితే వడ్డీకి తీసుకున్న అసలు ఎంత?
జవాబు: రూ.6,000


5. కొంత సొమ్ము 15 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అదే సొమ్ము 8 రెట్లు కావాలంటే ఎంత కాలం పడుతుంది?
జవాబు: 45 సంవత్సరాలు


చక్రవడ్డీ

1. రూ.12000 లను 10% రేటు చొప్పున చక్రవడ్డీ తిరిగి లెక్కించే పద్ధతిలో అప్పు తెస్తే  1 సంవత్సర కాలంలో చెల్లించాల్సిన వడ్డీ ఎంత?

      
      = 13891.5
           I = A − P
              = 13891.5 − 12,000 
              = రూ.1891.5

 

2. రూ.5000 పై సంవత్సరానికి 8% రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి లెక్కించే పద్ధతిలో 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ ఎంత?

             

            A = 5,832
            CI = A − P
            CI = 5832 − 5000
                 = రూ.832

 

3. రూ.10,000ను 8

% చక్రవడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒక సారి వడ్డీ తిరిగి లెక్కిస్తే, ఒక సంవత్సరం 3 నెలల కాలంలో వచ్చే వడ్డీ ఎంత?
    

                 = 11080.56
                I = A − P
                 = 11080.56 − 10000
                = 1080.56

 

4. ఒక గ్రామ జనాభా 6,250. ఆ జనాభా పెరుగుదల రేటు 8%గా గుర్తిస్తే 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత?
   

   
                                   ... గ్రామ జనాభా = 7290


5. ఎంతకాలంలో 10% చక్రవడ్డీ చొప్పున రూ.1000 పై రూ.1331 మొత్తం అవుతుంది?
   

                n = 3
                T = 3 సంవత్సరాలు

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌