ముఖ్యాంశాలు
వేగం =
లేదా దూరం = వేగం X కాలం
లేదా కాలం =
ఒక వాహనం రెండు సమాన దూరాలను V1, V2 వేగాలతో
ప్రయాణించిన ఆ వాహన సగటు వేగం =
ఒక వాహనం తన ప్రయాణ దూరంలో సగం దూరాన్ని V1 వేగంతోనూ, మిగిలిన సగం దూరాన్ని V2 వేగంతోనూ
ప్రయాణిస్తే ఆ వాహన సగటు వేగం =
1. ఒక రైలు సాధారణ వేగంతో స్టేషన్ A నుంచి Bని 45 నిమిషాల్లో చేరుకోగలదు. అలా కాకుండా దాని వేగాన్ని 5 కి.మీ./గం. తగ్గిస్తే ఆ దూరాన్ని 48 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. అయితే A,B స్టేషన్ల మధ్య దూరమెంత?
1) 20 కి.మీ. 2) 30 కి.మీ. 3) 50 కి.మీ. 4) 60 కి.మీ.
సాధన: A,B ల మధ్య దూరం = X కి.మీ. అనుకోండి.
రైలు సాధారణ వేగం =
లెక్క ప్రకారం, రైలు వేగాన్ని తగ్గించిన తరువాత, A నుంచి Bకి ప్రయాణించడానికి పట్టిన కాలం = 48 నిమిషాలు.
లేదా
రైలు వేగం = V కి.మీ./గంట. అనుకోండి.
2. ఒక రైలు సాధారణ వేగంతో 10 కి.మీ. దూరాన్ని 12 నిమిషాల్లో ప్రయాణించగలదు. దాని వేగాన్ని 5 కి.మీ./గం. తగ్గిస్తే ఆ దూరాన్ని ప్రయాణించడానికి పట్టే కాలమెంత?
1) 12 ని.30 సె. 2) 13 ని.20 సె.
3) 13 ని.45 సె. 4) 13 ని.15 సె.
సాధన: రైలు సాధారణ వేగం =
సమాధానం: 2
3. ఒక రైలు స్టేషన్ A నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి స్టేషన్ Bని అదేరోజు సాయంత్రం 4:30 ని.లకు చేరింది. రైలు సాధారణ వేగం 40 కి.మీ./గంట. అయితే A,B స్టేషన్ల మధ్య దూరమెంత?
1) 420 కి.మీ. 2) 360 కి.మీ. 3) 320 కి.మీ. 4) 280 కి.మీ.
సాధన: రైలు వేగం = 40 కి.మీ./గంట.
రైలు స్టేషన్ A నుంచి స్టేషన్ Bకి చేరడానికి పట్టిన కాలం
= సాయంత్రం 4 : 30 - ఉదయం 6 : 00
= 16 : 30 - 6 : 00 = 10 : 30 గంట.
= 20 X 21 = 420 కి.మీ.
సమాధానం: 1
4. 72 కి.మీ./గంట. వేగంతో ప్రయాణించే ఒక బస్సు 10 సెకన్లలో ఎంత దూరం ప్రయాణిస్తుంది?
1) 160 మీ. 2) 240 మీ. 3) 180 మీ. 4) 200 మీ.
సాధన: బస్సు వేగం = 72 కి.మీ./గంట.
10 సెకన్లల్లో బస్సు ప్రయాణించే దూరం = వేగం X కాలం
= 20 X 10 = 200 మీ.
సమాధానం: 4
5. రాకేష్ 4 కి.మీ./గంట. వేగంతో కొంత నిర్దిష్ట దూరాన్ని 3గం.45ని.ల్లో నడిచాడు. అయితే అతడు అదే దూరాన్ని 18 కి.మీ./గంట. వేగంతో సైకిల్‌పై ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుంది?
1) 45 ని. 2) 50 ని. 3) 48 ని. 4) 52 ని.
సాధన: నడక వేగం = 4 కి.మీ./గంట.,
నడిచిన కాలం = 3 గంట.45 ని ⇒
నడిచిన దూరం =
సైకిల్‌పై అదే దూరాన్ని ప్రయాణించడానికి పట్టే కాలం =
సమాధానం: 2
6. 100 మీ. పరుగు పందెంలో నరేంద్ర, శ్రీధర్ని 5సెకన్ల తేడాతో ఓడించాడు. నరేంద్ర వేగం 18 కి.మీ./గంట. అయితే శ్రీధర్ వేగమెంత?(కి.మీ./గంటల్లో)
1) 12.4 2) 13.4 3) 14.4 4) 15.4
సాధన: పరుగు పందెంలో నరేంద్ర తీసుకున్న సమయం
సమాధానం: 3
రచయిత : సీ .హెచ్. రాధాకృష్ణ