• facebook
  • whatsapp
  • telegram

ఆఫ్రికా - ఒక చీకటి ఖండం

              ఖండాలన్నింటిలో రెండో అతి పెద్ద ఖండం ఆఫ్రికా. ఇది   37 º ఉత్తర అక్షాంశం నుంచి 35º దక్షిణ అక్షాంశం వరకు, 24º పశ్చిమ, 58º తూర్పు రేఖాంశాల మధ్య సుమారు 30.33 మిలియన్ల చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఆఫ్రికా ఖండం ఉత్తర, దక్షిణాలుగా 8 వేల కి.మీ. పొడవు, తూర్పు, పడమరలుగా 7,400 కి.మీ. వెడల్పు ఉంది. ఆఫ్రికా ఖండం మీదుగా 0º అక్షాంశరేఖ అయిన భూమధ్యరేఖ, 23 1/2º ఉత్తర అక్షాంశమైన కర్కటరేఖ, 23 1/2º దక్షిణ అక్షాంశమైన మకరరేఖలు ప్రయాణిస్తున్నాయి. 
ఆఫ్రికా యూరప్ ఖండానికి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ దాన్ని చీకటి ఖండంగా పరిగణిస్తారు. 19వ శతాబ్దం చివరి వరకూ ఆఫ్రికా ఖండం గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ఐరోపావాసులు దాన్ని చీకటి ఖండం అని పిలిచేవారు. క్రీ.శ. 1840లో స్కాటిష్ మిషనరీ అన్వేషకుడైన లివింగ్‌స్టన్ మొదటిసారిగా ఆఫ్రికా అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత 'రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ' కామెరూన్ అనే మరో అన్వేషకుడిని ఆఫ్రికాకు పంపింది.
* లివింగ్‌స్టన్ మధ్య ఆఫ్రికా, టాంగాన్యికా, నియస్సా ప్రాంతాలను ఆవిష్కరించాడు.
* కామెరూన్ కాంగో ప్రాంతాన్ని కనుక్కున్నాడు.
* బెల్జియం రాజు లియోపోల్ట్ - II క్రీ.శ. 1879లో స్టాన్లీని ఆఫ్రికాకు పంపించడంతో అతడు తూర్పు ఆఫ్రికాకు సంబంధించిన విషయాలను ప్రపంచానికి తెలియజేశాడు.
* యూరోపియన్‌లు 'నీగ్రో బానిసల' కోసం ఆఫ్రికాకు వచ్చేవారు. 19వ శతాబ్దం నాటికి ఐరోపావాసులు ఆఫ్రికా గురించి పూర్తిగా తెలుసుకున్నారు.


  
 

ఆఫ్రికాలోని ముఖ్య పర్వతాలు
* ముడత పర్వతాలైన అట్లాస్ పర్వతాలు
* ఖండ పర్వతాలైన డ్రాకెన్స్‌బర్గ్ పర్వతాలు

  

 

 ఎక్సోటిక్ నదులు
    ఉష్ణమండల ఎడారుల్లో నీటిని జీవానికి మారుపేరుగా పేర్కొంటారు. ఎడారుల మీదుగా ప్రవహించే నదులను ఎక్సోటిక్ (Exotic) / జీవనదులు అని పిలుస్తారు.
* సహారా ఎడారి మీదుగా ప్రవహించే జీవనది     - నైలు.
* కలహరి ఎడారి మీదుగా ప్రవహించే జీవనది    - ఆరెంజ్.
* ఎడారుల్లో అక్కడక్కడ ఒయాసిస్సులు ఏర్పడతాయి. ఈ ప్రాంతాల్లో ఖర్జూరపుజాతి చెట్లు, గడ్డి పెరుగుతాయి.

 

శీతోష్ణస్థితి
        ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ ఖండం ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలు రెండింటిలో వ్యాపించి ఉండటం వల్ల ఆఫ్రికా ఖండంలో వైవిధ్యమైన శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి.
* ఉత్తరార్ధ గోళంలో మే నుంచి అక్టోబరు వరకు వేసవికాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం ఉంటుంది.
* ఉత్తరార్ధ గోళంలో నవంబరు నుంచి ఏప్రిల్ వరకు చలికాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది.
* ఆఫ్రికా ఖండం సరాసరి ఉష్ణోగ్రత: 20ºC.
* ఆఫ్రికా ఖండంలో నాలుగు రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.

 

భూమధ్యరేఖా శీతోష్ణస్థితి
        ఈ ఖండంలో కాంగోనది హరివాణంలోని దేశాలు గేబన్, కాంగో, జైరే, కెమెరూన్, టాంజానియా, సెంట్రల్ రిపబ్లిక్, మొజాంబిక్, లైబీరియా, ఐవరీకోస్టు దేశాల్లో భూమధ్యరేఖా శీతోష్ణస్థితి ఉంటుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడిన అల్పపీడన మేఖలను 'డోల్డ్రమ్స్' అంటారు. డ్రోల్డమ్స్ అంటే ప్రశాంత పవనాలు. ఆఫ్రికా ఖండంలోని కెమెరూన్ శిఖరం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశాల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ప్రాంతంలో పర్వతీయ వర్షపాతం ఎక్కువగా సంభవిస్తుంది.
 

సుడాన్ రకపు శీతోష్ణస్థితి
          భూమధ్యరేఖ శీతోష్ణస్థితికి ఇరువైపుల ఉన్న పర్వతాల వెలుపల సుడాన్ రకపు శీతోష్ణస్థితి ఉంది.

 

 ఉష్ణమండల సవన్నా రకపు శీతోష్ణస్థితి
        ఆఫ్రికా ఖండంలోని సెనెగల్, గినియా, మాలి, నైజర్, ఛాడ్, సుడాన్, నైజీరియా, అంగోలా, జింబాబ్వే, ఇథియోపియా, మడగాస్కర్ ద్వీపం పశ్చిమ తీరంలో ఉష్ణమండల సవన్నారకపు శీతోష్ణస్థితి ఉంది. ఉష్ణమండల ఎడారుల నుంచి వేడిగా, పొడిగా ఉండే దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తాయి. ఈ ప్రాంతంలో సరాసరి ఉష్ణోగ్రత 32º c కంటే ఎక్కువ.      

మధ్యధరా శీతోష్ణస్థితి
          మధ్యధరా సముద్రతీర ప్రాంత దేశాలైన 1. ట్యునీషియా, 2. అల్జీరియా, 3. మొరాకో దేశాల్లో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంది. ఈప్రాంతం సరాసరి ఉష్ణోగ్రత 22ºC కంటే తక్కువ. 

 

ఆఫ్రికాలో ప్రవహించే నదులు
నైలు నది: ప్రపంచంలో పొడవైన నది నైలు. ఆఫ్రికాలోని విక్టోరియా నుంచి ప్రారంభమై సహారా ఎడారి మీదుగా ప్రయాణించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈజిప్ట్‌ను 'నైలునదీ వరప్రసాదం' అని పిలుస్తారు.
ఆరెంజ్ నది: డ్రాకన్స్‌బర్గ్ పర్వతాల్లో జన్మించి, కలహరి ఎడారి మీదుగా ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.
జాంబెజీ నది: కటంగా పీఠభూమిలో జన్మించి, హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. జాంబెజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం 108 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ సందర్శకులను ఆకర్షిస్తుంది.
* ఇవేకాకుండా ఆఫ్రికా ఖండంలో కాంగోనది, నైజర్, లింపోపో నదులు ప్రవహిస్తున్నాయి.

 

ఆఫ్రికా - ఉప్పునీటి సరస్సులు 
ఆఫ్రికా ఖండంలోని ఎడారి ప్రాంతంలో సరస్సులు ఉండటం వల్ల, తక్కువ వర్షపాతం వల్ల, ఎడతెరపి లేకుండా సరస్సులోని నీరు ఆవిరై లవణాలు మిగిలిపోతున్నందువల్ల, సరస్సుల నుంచి బయటకు ప్రవాహాలు లేనందు వల్ల, నీటిలో కరిగిన లవణాల గాఢత ఎక్కువై నీటికి ఉప్పదనం ఎక్కువవుతుంది.
ఈ ఖండంలో న్యాసా, విక్టోరియా, గామి, చాద్ సరస్సులు ఉన్నాయి. వీటిలో 'చాద్, గామి' ఉప్పునీటి సరస్సులు.

 

విక్టోరియా జలపాతం

 జాంబెజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం వెడల్పు 1.7 కి.మీ. ఇది 108 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జాంబియా, జింబాబ్వే దేశాల్లోని జాతీయ పార్కుల్లో నుంచి చూస్తే విక్టోరియా ప్రకృతి సౌందర్యం సంపూర్ణంగా కనిపిస్తుంది.      
 

 ఆఫ్రికా ఖండం - జనాభా

 ఆఫ్రికా ఖండం జనాభా ప్రపంచ జనాభాలో 13 శాతం. ఆఫ్రికా ఖండం జనసాంద్రత ఒక చదరపు కిలోమీటరుకు 65 మంది మాత్రమే. భూమధ్యరేఖ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆదిమ, ఆటవిక జాతులవారు తక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.

  

 

ఆఫ్రికా ఖండం

 ఎడారులు
           భూ ఉపరితలంపై వ్యవసాయానికి ఉపయోగపడని, ప్రజలు పెద్దగా నివసించని విశాలమైన ప్రాంతాలను ఎడారులు అంటారు. 'నీరు లభించకపోవడం' ఎడారుల ప్రత్యేక లక్షణం. ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా రెండు ఎడారులు విస్తరించి ఉన్నాయి. అవి
1) సహారా
2) కలహరి. 

 

  సహారా ఎడారి
        సహారా ఎడారి ఆఫ్రికా ఖండం పశ్చిమ తీరం నుంచి, తూర్పుతీరం వరకు విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం అమెరికా సంయుక్త రాష్ట్రాల కంటే రెట్టింపు. అరబ్బుల భాషలో 'సహారా' అంటే ఎడారి అని అర్థం. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి - సహారా ఎడారి. భూ ఉపరితలంపై 1922 సెప్టెంబరు 13న సహారా ఎడారిలోని లిబియా దేశంలోని అజీజియా ప్రాంతంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 58º నమోదైంది. ఇప్పటివరకూ భూ ఉపరితలం మీద నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే.    

 

కలహరి ఎడారి 
ఆఫ్రికా ఖండం నైరుతి ప్రాంతంలో ఉన్న కలహరి ఎడారి నమీబియా, బోట్స్‌వానా, అంగోలా, దక్షిణాఫ్రికా దేశాల్లో విస్తరించి ఉంది. ఇది హమడాకి మంచి ఉదాహరణ

యూరప్

 ఉనికి - విస్తీర్ణం:
* ఖండాలన్నింటిలో రెండో చిన్న ఖండం యూరప్.
* ఇది 1,01,80,000 చ.కి.మీ.లు విస్తరించి ఉంది.
* ప్రపంచ భూ విస్తీర్ణంలో ఇది 6.8 శాతం.
* ఈ ఖండపు జనాభా 731 మిలియన్లు. ప్రపంచ జనాభాలో ఇది 11 శాతం.
* యూరప్ 35º - 72º ఉత్తర అక్షాంశ రేఖల మధ్య, 10º పశ్చిమ రేఖాంశం నుంచి 60º తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది.
* 0º ల గ్రీనిచ్ రేఖాంశం ఈ ఖండంలోని లండన్ నగరం మీదుగా వెళ్తోంది.
* మధ్యధరా సముద్రం యూరప్‌ను ఆఫ్రికా నుంచి వేరు చేస్తుండగా, యూరల్ పర్వతాలు ఆసియా నుంచి ఈ ఖండాన్ని వేరు చేస్తున్నాయి.
* ఈ ఖండంలో సుమారు 50 దేశాలు ఉన్నాయి.
* విస్తీర్ణంలో రష్యా పెద్ద దేశం, వాటికన్ సిటీ చిన్నది.
 

సరిహద్దులు:
* ఉత్తరాన - ఆర్కిటిక్ మహాసముద్రం
* దక్షిణాన - మధ్యధరా సముద్రం
* తూర్పున - యూరల్ పర్వతాలు
* పశ్చిమాన - అట్లాంటిక్ మహాసముద్రం
 

 ముఖ్యదేశాలు:
* యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ యూరప్‌లోని ప్రముఖ దేశాలు.
 

ఎత్తైన ప్రాంతం:
* ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్, కాకసస్ పర్వతాల్లో బ్లాంక్ శిఖరం (4,807 మీ.) ఎత్తైనది.
 

ముఖ్య నదులు:
* వోల్గా, డాన్యూబ్, రైన్, సెయిన్, గరోన్, పో.
* యూరప్‌లో పొడవైన నది వోల్గా.
* దాని తర్వాత స్థానంలో ఉన్న డాన్యూబ్ నది 2,960 కి.మీ. ఇది ఏడుదేశాల్లో ప్రవహిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
* నైపర్, నీస్టర్, డాస్ నదులు - రష్యా; రైన్, ఎల్బ్, ఓడర్ - జర్మనీ; విస్టులా - పోలెండ్; సెయిన్, లోయిల్, గరోన్, రోన్ - ఫ్రాన్స్; థేమ్స్ - ఇంగ్లండ్; పో నది ఇటలీలో ఉన్నాయి.
* దీవులు: గ్రేట్‌బిటన్, ఐర్లాండ్.
 

సహజ వనరులు:
* యూరప్‌లో దాదాపు అన్ని ఖనిజాలు లభిస్తున్నాయి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం ఇనుప ఖనిజంలో 1/4వ వంతు ఈ ఖండంలోనిదే.
* ప్రపంచంలోని మొత్తం ముడిచమురు నిక్షేపాల్లో 16 శాతం రష్యాలో ఉన్నాయి.
 

ప్రత్యేకతలు:
* ఇటలీలోని వెసువియస్, సిసిలీలోని ఎట్నా అగ్నిపర్వతాలు.
* ఇస్తాంబుల్, ఏథెన్స్, రోమ్ ప్రాచీన నగరాలు.
* సూర్యరశ్మి, ప్రకృతి దృశ్యాలు, సముద్ర కలయిక, మధ్యధరా ప్రకృతిసిద్ధ మండలం.
 

భౌతిక స్వరూపం (భూస్వరూపాలు - నదులు):
* యూరప్‌ను స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు.
అవి: 1. ఉత్తర ఉన్నత, బాల్టిక్ షీల్డ్ ప్రాంతం
       2. మధ్య మైదాన ప్రాంతం
       3. దక్షిణ పర్వతాలు
* ఉత్తర ఉన్నత ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 1000 - 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
* ఈ ఖండంలో పురాతన పర్వతాలు, పీఠభూములు ఉన్నాయి. ఇవి కెలడోనియా శిలతో ఏర్పడ్డాయి. అందుకే వీటిని కెలడోనియా పర్వతాలు అంటారు.
* ఇవి నార్వే, స్వీడన్, గ్రేట్‌బ్రిటన్ దేశాల్లో సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయి.
* తీర ప్రాంతాల్లో హిమానీ నదాల కోత వల్ల ఏర్పడిన పయోల్ట్‌లు అనే పొడవైన, ఇరుకైన, లోత్తైన లోయలు ఉన్నాయి.
* బాల్టిక్ సముద్రం చుట్టూ వ్యాపించి ఉన్న ప్రాంతమే బాల్టిక్ షీల్డ్ ప్రాంతం.
* ఇక్కడి శిలలు కెలడోనియా శిలల కంటే పురాతనమైనవి.
* యూరప్‌లో పశ్చిమాన ఉన్న మైదాన ప్రాంతాలను పశ్చిమ యూరప్ మైదానం, తూర్పున ఉన్న వాటిని 'రష్యా ప్లాట్ ఫాం' అని అంటారు.
* ఈ ఖండం పశ్చిమాన సన్నగా, తూర్పున వెడల్పుగా, స్వల్ప వాలుతో ఎగుడు, దిగుడుగా ఉంటుంది.
* అక్కడక్కడ ఈ మైదానాన్ని చిన్న కొండలు విభజిస్తున్నాయి.
* పోలెండ్, జర్మనీ, రష్యా దేశాల్లోని మైదానాల్లో ఉత్తర ప్రాంతం మంచుతో కప్పి ఉండటం వల్ల ఇవి వ్యవసాయానికి అంత అనుకూలంగా లేవు.
* జూరా, మాసివ్, వాస్‌జెస్ పర్వతాలు ఫ్రాన్స్‌లో, బ్లాక్ ఫారెస్ట్, యూరల్ పర్వతాలు జర్మనీలో, ఆల్పైన్ ముడత పర్వతాలు దక్షిణ యూరప్‌లో ఉన్నాయి.
* స్పెయిన్‌లో పైరనీస్, ఇటలీలో సియెరా నెవడా, ఆపనైస్ బాల్కన్ ద్వీపకల్పంలో దినారిక్ ఆల్ప్స్, రష్యాలో కాకసస్ పర్వతాలు ఉన్నాయి.
 * పైరనీస్ పర్వతాలు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఏర్పడ్డాయి.
* స్కాండినేవియా ద్వీపకల్పం చుట్టూ ఏర్పడినవే స్కాండినేవియా పర్వతాలు.
* యూరప్‌లోని ఆల్ప్స్ పర్వతాలు చాలా నదులకు ఆధారం.
* నదులను ఒకదాంతో ఒకటి కాలువల ద్వారా అనుసంధానించడం వల్ల ఇవి జలరవాణాకు అనుకూలంగా ఉన్నాయి.
 

శీతోష్ణస్థితి:
* ఒక ప్రదేశం శీతోష్ణస్థితి అంటే అక్కడ ఉండే వర్షపాతం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అనార్ద్రతలను బట్టి సరాసరిగా చెప్పవచ్చు.
* యూరప్ ఖండం ఉత్తర సమశీతోష్ణ మండలంలో ఉంది.
* దక్షిణ యూరప్, మధ్యధరా సముద్రతీర ప్రాంత శీతోష్ణస్థితిలో ప్రత్యేకతలు ఉన్నాయి.
* అట్లాంటిక్ మహాసముద్ర అగాధ ప్రవాహాలు యూరప్ శీతోష్ణస్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు కారణమవుతున్నాయి.
* ఇవి యూరప్ తీర ప్రాంతాలకు వేడి సముద్ర ప్రవాహాలను తీసుకెళ్తూ, పశ్చిమ పవనాలను వేడెక్కిస్తూ అట్లాంటిక్ మహాసముద్రం నుంచి యూరప్ అంతటా వీచేందుకు కారణమవుతున్నాయి.
మధ్యధరా సముద్ర ప్రభావ ప్రాంతాల్లో జనవరి నెలలో చలి ఎక్కువగా ఉండి వేసవికాలం పొడిగాలులు వీస్తాయి.
 ఈ ప్రాంతంలో శీతకాలంలో వర్షం సంభవిస్తుంది. సుమారు 80 - 130 సెం.మీ. వర్షపాతం ఉంటుంది. వేసవిలో వర్షం ఉండదు.
* జనవరిలో సగటు ఉష్ణోగ్రత 8º - 12º సెంటిగ్రేడు, జులైలో 22º - 24º సెంటిగ్రేడు ఉంటుంది.
* అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే తుపానుల వల్ల పశ్చిమ యూరప్‌లో అధిక వర్షపాతం నమోదవుతుంది.
* పోర్చుగల్ నుంచి నార్వే వరకు సముద్ర ప్రభావ శీతోష్ణస్థితి ఉంటుంది.
* ఈ ప్రాంత వార్షిక వర్షపాతం 120 - 150 సెం.మీ. ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రతల వల్ల మార్పులకు లోనవుతుంది.
* యూరప్ తూర్పు భాగంలో ఖండాతర్గత శీతోష్ణస్థితి ఉంది.
* ఇక్కడ సంవత్సర కాలంలో 60 - 100 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది.
* జనవరిలో 5º - 10º సెం.గ్రే., జులైలో 15º - 18º సెం.గ్రే. ఉష్ణోగ్రతలు ఉంటాయి.
* ఉన్నత అక్షాంశాల్లోని ఆల్ప్స్, పైరనీస్, కాకసస్ పర్వతాల్లో పర్వతీయ వర్షపాతం ఉంటుంది.
 

సహజ వృక్షజాతులు - వన్యజీవులు
 సహజ వృక్షజాలం:

* యూరప్ ఖండంలో ఒకప్పుడు 80 - 90 శాతం భూభాగం అడవులతో కప్పి ఉండేది. ప్రస్తుతం చెట్ల నరికివేత వల్ల అడవులు అంతరించి పోతున్నాయి.
* మధ్యధరా సముద్రం నుంచి ఆర్కిటిక్ మహాసముద్రం వరకు సహజ వృక్షజాలం వ్యాపించి ఉంది.
* ఇప్పటికీ 1/4వ వంతు భూభాగంలో సహజ వృక్షసంపద ఉంది.
* అతిపెద్ద శృంగాకార అరణ్య మేఖలైన 'టైగా'లు స్కాండినేవియా మెట్ట ప్రాంతాల నుంచి స్వీడన్, ఫిన్‌లాండ్, రష్యా మీదుగా తూర్పున పసిఫిక్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి.
* స్ఫూస్, లార్డ్, ఫర్, బిర్చ్ లాంటి వృక్ష జాతులు ఇక్కడ పెరుగుతాయి.
* స్టెప్పీలు ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం నుంచి కాస్పియన్ సముద్రం మధ్య ప్రాంతంలో, స్పెయిన్ స్పానిష్ మెసెటాల్లో ఉన్నాయి.
* మధ్యధరా శీతోష్ణస్థితిలోని అడవులు యూరప్‌లోని పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ, క్రోయెషియా, యుగోస్లేవియా, అల్బేనియా, గ్రీస్, ఉక్రెయిన్ వరకు ఉన్నాయి. వీటిలో ఆలివ్ వృక్షాలు పెరుగుతాయి.
* కార్క్, ఓక్ వృక్షాలు పశ్చిమ మధ్యధరా ప్రాంతంలో ఉన్నాయి.
* ఫిన్‌లాండ్‌లో అత్యధికంగా 77 శాతం భూవిస్తీర్ణంలో సహజ వృక్షాలు ఉండగా, ఐస్‌లాండ్‌లో కేవలం ఒక శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉంది.
 

 వన్యజీవులు:
* యూరప్‌లో తోడేళ్లు, ఎలుగుబంట్లు ప్రధానంగా కన్పించే జంతువులు.
* గుంటనక్క, అడవి పిల్లి, నక్కలు, తోడేళ్లు, శివంగి లాంటి క్రూర మృగాలు కుందేళ్లు, జింకల లాంటి ఇతర జంతువులు ఉన్నాయి.
* ధృవ ప్రాంతాల్లో ధృవపు ఎలుగుబంట్లు, ధృవపు జింకలు, ధృవపు నక్కలు, లెమ్మింగ్‌లు ఉన్నాయి.
* గుంటనక్కలు, మింగ్ మృగాలను ఆర్కిటిక్ ప్రాంతాల్లోని ఫర్ క్షేత్రాల్లో పెంచుతున్నారు.
* యురేషియాలో ధృవపు జింకలను రవాణాకు ఉపయోగిస్తున్నారు.
 

ధృవ ప్రాంతాలు:
* ఉత్తర, దక్షిణ ధృవాల చుట్టూ ఉండే ప్రాంతాలు అతిశీతలంగా ఉంటాయి.  అందుకే ఇక్కడ శీతకాలంలో సూర్యుడు కనిపించడు. వసంతకాలంలో ఉదయిస్తాడు.
* ధృవాల దగ్గర 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు ఉంటుంది.
* అమెరికా, యూరప్, ఆసియా భూభాగాల చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాల పరిస్థితి ఇది.
* ఇక్కడ వాల్‌రన్, సీల్ జంతువులు, ధృవపు ఎలుగుబంట్లు ఉంటాయి.
* సదరన్ (అంటార్కిటికా) మహాసముద్రానికి అన్ని వైపుల ఆవరించి ఉన్న భూభాగమే అంటార్కిటికా ఖండం. ఇక్కడ లైకెన్, మాస్ కనిపిస్తాయి.
* ఇక్కడ సముద్రంలో సీల్, పెంగ్విన్‌లు ఉంటాయి. పెంగ్విన్‌లు సాధారణ పక్షులు. ఇవి ఎగరవు.
    ఉదా: ఎంపరర్ పెంగ్విన్.
* ఎంపరర్ పెంగ్విన్ శీతకాలంలో విపరీతమైన చల్లదనంలో అతిఘనీభవించిన సముద్రం మీదనే గుడ్లు పెడుతుంది.
 

జనాభా విస్తరణ - ప్రధాన నగరాలు
*
 ప్రపంచం మొత్తం జనాభాలో 1/5వ వంతు యూరప్‌లో ఉంది.
* జనసాంద్రత సగటున చ.కి.మీ.కి 101. ఈ ఖండం పశ్చిమ ప్రాంతంలో - 162, దక్షిణ ప్రాంతంలో - 114, తూర్పు ప్రాంతంలో - 105, ఉత్తర ప్రాంతంలో - 14 మంది నివసిస్తున్నారు.
 

అత్యల్ప జనసాంద్రత:
* ఐస్‌లాండ్, ఉత్తర యూరప్‌లోని స్కాండినేవియా, ఉత్తర రష్యాలోని టండ్రా ప్రాంతాల్లో చ.కి.మీ.కి 10 కంటే తక్కువ మంది నివసిస్తారు. వేట, మత్స్య గ్రహణం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తులు.
 

అల్పజనసాంద్రత:
* టైగా, ఎత్తైన ప్రాంతాలు, కాస్పియన్ సముద్రతీర ప్రాంతం, ఆగ్నేయ యూరప్‌లోని శుష్క ప్రాంతాల్లో జనసాంద్రత చ.కి.మీ.కి 10 నుంచి 50 ఉంటుంది.
* అనుకూలంగా లేని శీతోష్ణస్థితి, నిటారుగా ఉండే ప్రాంతాలు, నిస్సారమైన లోతు తక్కువ మృత్తికలు, జలాభావం లాంటి అనేక కారణాల వల్ల ఇక్కడ జనసాంద్రత తక్కువగా ఉంటుంది.
* ఉన్ని జంతువుల వేట, పశువులను మేపడం ఇక్కడి వారి ముఖ్యవృత్తులు.
 

అధిక జనసాంద్రత:
* ఇటలీ, ఫ్రాన్స్ నుంచి మాస్కో వరకు మధ్య మైదానాల్లో, నదీలోయ ప్రాంతాల్లో చ.కి.మీ.కి 50 నుంచి 100 మంది జనాభా నివసిస్తున్నారు. వ్యవసాయం, పశుపోషణ ఇక్కడి ముఖ్య వృత్తులు.
 

అత్యధిక జనసాంద్రత:
* బొగ్గు క్షేత్రాల వెంబడి జర్మనీ నుంచి జెకోస్లావకియా, పోలెండ్ మీదుగా ఉక్రెయిన్ వరకు, ఉత్తర ఇటలీలో లాంబార్డి మైదానంలోని రోమ్, జెనీవా, లిస్టెయిన్, వియన్నా, బెల్‌గ్రేడ్ లాంటి పెద్ద నగరాలు చ.కి.మీ.కి అత్యధికంగా 100 కంటే ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉన్నాయి.
* దీనికి కారణం బొగ్గుక్షేత్రాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రధాన ఓడరేవు ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించడమే.
* ఇంగ్లండ్‌లో అత్యధిక ప్రాంతం, నెదర్లాండ్స్, రైన్ నదీ డెల్టా నుంచి స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వరకు ఉన్న పారిశ్రామిక ప్రాంతం అత్యధిక జనసాంద్రతను కలిగి ఉంది.
 

పర్యటక ప్రాంతం:
యూరప్ ఖండంలో ఈ కింది దేశాలు ప్రపంచంలో వివిధ అన్వర్థ నామాలతో విరాజిల్లుతున్న గొప్ప పర్యటక ప్రాంతాలు
  


* ఫ్రాన్స్, ఇటలీ దేశాల సన్నని తీరమైదానాలు, పూర్వపు యుగోస్లేవియాకు చెందిన డాల్మిషియా తీరం, క్రిమియాలను యూరప్ ఖండ క్రీడా ప్రాంగణాలు అంటారు.
* ఫ్రాన్స్ తీరంలోని చిన్న దేశం మొనాకో 'కాసినో'లకు ప్రసిద్ధి చెందింది.
* శీతకాలంలో వెచ్చని శీతోష్ణస్థితి, మనోహరమైన సముద్రతీరాలు, అభివృద్ధి చెందిన మౌలిక సౌకర్యాలు, సొగసైన దృశ్యాలు యాత్రికులను ఆకర్షిస్తూ విదేశీ ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి.
* మధ్యధరా ప్రకృతి సిద్ధ మండలంలో ఇస్తాంబుల్, ఏథెన్స్, రోమ్‌లాంటి ప్రాచీన నగరాలు ఉన్నాయి.
* ఇస్తాంబుల్, ఏథెన్స్, నేపుల్స్, రోమ్, జెనీవాలు, ప్లావెన్స్ తీర ప్రాంతపు ముఖ్య విహారయాత్ర స్థలాలు.
 

వ్యవసాయం
* యూరప్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన వ్యవసాయం, పశుపోషణ ముఖ్యమైన ఆర్థిక కార్యక్రమంగా చెప్పవచ్చు.
* ఇక్కడి భూభాగంలో 30 శాతం వ్యవసాయానికి యోగ్యమైన జలవనరులు, మృత్తికలను కలిగి ఉంది.
* ఇక్కడ ఎక్కువగా మిశ్రమ వ్యవసాయాన్ని చేస్తారు. ఇది ఇంగ్లండ్, ఇతర యూరప్ దేశాల్లో పురాతన కాలం నుంచి అమల్లో ఉంది.
* దక్షిణ, పశ్చిమ యూరప్‌లోని ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, యుగోస్లేవియా, పోలెండ్, యునైటెడ్ కింగ్‌డం, హంగరీ దేశాలు గోధుమను విస్తృతంగా పండిస్తున్నాయి.
* మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతం గోధుమ పంటకు అనుకూలమైంది.
* రష్యా, రుమేనియా, యుగోస్లేవియా, హంగరీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో, ఈశాన్య పశ్చిమ నల్లసముద్రం, కాస్పియన్ సముద్ర తూర్పు తీర ప్రాంతాల్లో మొక్కజొన్నను అధికంగా పండిస్తున్నారు.
* రై ధాన్యం ప్రధానంగా శీతల శీతోష్ణ ప్రాంత పంట. దీన్ని రొట్టెలు, మద్యం తయారీలో ఉపయోగిస్తారు.
* ప్రపంచం మొత్తంలో 91 శాతం 'రై' ఇక్కడే ఉత్పత్తి అవుతోంది.
* పోలెండ్, రష్యా, ఉక్రెయిన్, కజికిస్థాన్, జర్మనీలు ఈ పంటలను అధికంగా పండిస్తున్నాయి.
 * యూరప్ దేశాల్లో ప్రధానంగా పండించే పంట బార్లీ. మొత్తం బార్లీ ఉత్పత్తిలో సుమారు 42 శాతం ఇక్కడే పండిస్తున్నారు.
* రష్యా, యూకే, ఫ్రాన్స్, డెన్మార్క్, జర్మనీ, పోలెండ్, స్పెయిన్ దేశాలు బార్లీని అధికంగా పండిస్తున్నాయి.
* మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతం ఆలివ్ నూనె ఉత్పత్తికి అనుకూలమైంది. దీన్ని ఆహార పదార్థాల్లో, సబ్బుల తయారీలో, నూలు, వస్త్ర పరిశ్రమల్లో వినియోగిస్తారు.
* ఆలివ్ నూనెను స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలు ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
* బల్గేరియా, గ్రీసు, ఇటలీ, పోలెండ్ దేశాలు పొగాకును ప్రధానంగా పండిస్తున్నాయి.
* ఉన్నత అక్షాంశాల్లో పండించే పంట ఓట్స్. దీనికి శీతల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వీటిని యూరప్‌లోని రష్యా, పోలెండ్, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, యూకేలలో ప్రధానంగా పండిస్తున్నారు.
* మధ్యధరా శీతోష్ణస్థితి పండ్ల తోటలకు అనుకూలం. ఈ ప్రాంతాల్లో ఆపిల్, పియర్, పీచెస్, ద్రాక్ష, నారింజ, ప్లేమ్ తోటలను సాగు చేస్తున్నారు.
* యూరప్ ప్రజల ముఖ్య వృత్తి పశుపోషణ. వీరు పాలు, మాంసం, గుడ్లు, ఉన్ని జంతువులు, కోళ్లను పెంచుతారు.
* స్పెయిన్‌లో మేలిరకం ఉన్నిని ఇచ్చే గొర్రెలను పెంచుతారు.
* డెన్మార్క్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో వెన్న, జున్నును వాణిజ్యపరంగా తయారుచేస్తారు.
* పశ్చిమ, దక్షిణ యూరప్‌లోని పర్వత, కొండ ప్రాంతాలు, పచ్చిక బయళ్లలో ఉన్ని, మాంసం కోసం గొర్రెలను పెంచుతారు.
* అట్లాంటిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు చేపలు పట్టడానికి అనుకూలం.
* చేపలు పట్టడం బ్రిటన్, నార్వే, ఐస్‌లాండ్ దేశాల ప్రజల ముఖ్య కార్యకలాపం.
 

 ఖనిజాలు - పరిశ్రమలు
 ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో ఖనిజాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
 పరిశ్రమలకు ఇనుప ఖనిజం ముఖ్యమైన ముడిపదార్థం. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో 1/4వ వంతు యూరప్‌లోనే ఉత్పత్తి అవుతుంది.
 ఇది ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, స్లోవాకియా, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, స్వీడన్ దేశాల్లో లభిస్తుంది.
 రాగి ఖనిజం ఆస్ట్రియా, స్లోవాకియా, జర్మనీ, గ్రీస్, పోలెండ్, పోర్చుగల్, రొమేనియా, స్పెయిన్, స్వీడన్ దేశాల్లో ప్రధానంగా దొరుకుతుంది.
 

ఆసియా ఖండం

ఉనికి: ఆసియా ఖండం 10º దక్షిణ అంక్షాంశాల నుంచి 80º ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
* రేఖాంశాల పరంగా 28º తూర్పు రేఖాంశాల నుంచి 170º పశ్చిమ రేఖాంశాల మధ్య ఉంది.
* ఖండాలన్నింటిలో ఆసియా పెద్దది.

 

విస్తరణ: ఆసియా ఖండం విస్తీర్ణం 44.25 మిలియన్ల చ. కి.మీ. ఇది ప్రపంచ భూ విస్తీర్ణంలో 30 శాతం ఆక్రమించి ఉంది.
 

సరిహద్దులు:
  * తూర్పు - పసిఫిక్ మహాసముద్రం
* పడమర - యూరల్ పర్వతాలు
* ఉత్తరం - ఆర్కిటిక్ మహాసముద్రం
* దక్షిణం - హిందూ మహాసముద్రం

 

ప్రధాన దేశాలు:
* ఆసియాలో అతి పెద్దదేశం - రష్యా
* అత్యధిక జనాభా కలిగిన దేశం - చైనా
* అత్యంత చిన్న దేశం - మాల్దీవులు
* ఆసియాలో సూర్యుడు మొదట ఉదయించే దేశం - జపాన్

 

  ఎత్తైన ప్రాంతం: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఈ ఖండంలోనే ఉంది.

పీఠభూమి: ప్రపంచ పై కప్పు అని పిలిచే 'టిబెట్ పీఠభూమి' ఆసియాలోనే ఉంది.

ముఖ్యమైన నదులు: గంగా, సింధు, బ్రహ్మపుత్ర, హూ యాంగ్ హూ, టైగ్రిస్, యూప్రటీస్, సికియాంగ్ నదులు ఆసియాలో ఉన్నాయి.

వర్షపాతం: ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే 'మాసిన్ రాం' ఆసియాలోనే ఉంది.

ముఖ్యమైన ఎడారులు: ఆసియాలో థార్, అరేబియా, గోబీ ఎడారులు ఉన్నాయి.
 

ఉనికి-విస్తరణ
* ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఖండం.
* అత్యుష్ణ మండలం నుంచి అతిశీతల మండలం వరకు ఈ ఖండం విస్తరించి ఉంది.
ఇది 10º దక్షిణ అక్షాంశాల నుంచి 80º ఉత్తర అక్షాంశాల మధ్య, 28º తూర్పు రేఖాంశం నుంచి 170º పశ్చిమ రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది.
* 66º ఉత్తర అక్షాంశ రేఖ ఆర్కిటిక్ వలయం, 23 º ఉత్తర అక్షాంశ రేఖ కర్కాటక రేఖలు, 90º తూర్పు రేఖాంశం ఆసియా ద్వారా వెళ్తున్నాయి.
* ఈ ఖండానికి దక్షిణ ఆగ్నేయంగా భూమధ్యరేఖ వెళ్తోంది.
* ఆసియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రం, పశ్చిమాన యూరల్ పర్వతాలతో పాటు యూరల్ నది, కాస్పియన్ సముద్రం ఉన్నాయి.
* దీనికి ఉత్తరంగా ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణంగా హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి.
* ఆసియా విస్తీర్ణం 44.25 మిలియన్ చ.కి.మీ.
* ప్రపంచ భూ విస్తీర్ణంలో ఇది 29.81 శాతం.
* భారతదేశ భూ విస్తీర్ణం 3.28 మిలియన్ చ.కి.మీ.
* ఆసియాలో అతిపెద్ద దేశం రష్యా(17.01 మిలియన్ చ.కి.మీ.), అతిచిన్న దేశం మాల్దీవులు (298 చ.కి.మీ).
ఆసియాలో విస్తీర్ణం పరంగా దేశాలు అవరోహణ క్రమంలో: రష్యా, చైనా, భారతదేశం, పాకిస్థాన్, మియన్మార్, అఫ్గానిస్థాన్, థాయ్‌లాండ్, జపాన్, శ్రీలంక, మాల్దీవులు.

 

  భౌతిక స్వరూపం - భూ స్వరూపాలు, నదులు
భూస్వరూపాలు

మైదానాలు: ఆసియా ఖండపు భూ విస్తీర్ణంలో 32 శాతం మైదానాలున్నాయి.
* ఉత్తర భాగంలో ఉన్న రష్యాలో సైబీరియా మైదానం యూరల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది.
* ప్రపంచంలోని అతి విశాలమైన ఒండ్రుమట్టితో కూడిన మైదానాల్లో భారతదేశంలోని గంగా, సింధు మైదానం ఒకటి.
* చైనాలోని హూ యాంగ్ హూ, యాంగ్ ట్సి యాంగ్, సికియాంగ్ నదుల మధ్య అత్యంత సారవంతమైన చైనా మైదానం ఉంది.
* ఇరాక్‌లో టైగ్రిస్, యూప్రటీస్, మయన్మార్‌లో ఐరావతి, ఆగ్నేయాసియాలో మెకాంగ్ నది మైదానాలు ముఖ్యమైనవి.

 

పర్వతాలు 
* ఆసియా భూ విస్తీర్ణంలో 20 శాతం పర్వతాలు విస్తరించి ఉన్నాయి.
* భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి.
* ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం నేపాల్‌కి చెందిన హిమాలయ పర్వతశ్రేణిలో ఉంది. దీని ఎత్తు 8,848 మీటర్లు.
* చైనాలో టియాన్ షాన్ పర్వతాలు, రష్యాలో ఆల్టాయ్, యాచ్లోనోలి పర్వతాలు, అఫ్గానిస్థాన్‌లో హిందూకుష్ పర్వతాలు, ట్రాన్స్ హిమాలయ మండలంలో కున్‌లున్ పర్వతాలు ఉన్నాయి.
*విశాలమైన గోబీ శీతల ఎడారి ఈ ప్రాంతంలోనే ఉంది.

 

పీఠభూములు
* ఇరాన్, టిబెట్, పామీరు పీఠభూములు, టర్కీలోని అనటోలియా పీఠభూమి, మంగోలియాలోని కాబ్డో పీఠభూమి ఈ ఖండంలో ఉన్నాయి.
* భారత్‌లోని దక్కన్ పీఠభూమి, చైనాలో షాన్, టియాన్ షాన్ పీఠభూములు ప్రధానమైనవి.
* ఆసియాలో టిబెట్ పీఠభూమి ఎత్తైనది. ఇది హిమాలయాల్లో కున్‌లున్ పర్వతాల మధ్య ఉంది.

 

నదులు
* భారతదేశంలోని ప్రధాన నదులు సింధు, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, కావేరి.
* ఇరాన్‌లో టైగ్రిస్, యూప్రటీస్ నదులు ఉన్నాయి.
* చైనాలోని ప్రముఖ నదులు హూ యాంగ్ హూ, యాంగ్ ట్సి యాంగ్, సికియాంగ్.
* మయన్మార్‌లో ఐరావతి, వియత్నాంలో మెకాంగ్, రష్యాలో యూరల్ నదులు ఉన్నాయి.
* రష్యాలోని అముర్ నది ఆసియా ఖండంలోని నదుల్లోకెల్లా పొడవైనది. దీని పొడవు 4,060 కి.మీ.
* వియత్నాంలోని మెకాంగ్ రెండో పొడవైన నది. దీని పొడవు 3,640 కి.మీ.

 

ఎడారులు
* భూఉపరితలం మీద నీరు లేకపోవడం వల్ల వ్యవసాయం లేని, మానవ స్థిర నివాసాలు ఏర్పడని విశాల ప్రాంతాలను ఎడారులు అంటారు.
*భారతదేశంలో పెద్ద ఎడారి 'థార్'.
* ఆసియాలో అరేబియా, సిరియా, గోబీ ఎడారులు ఉన్నాయి.

 

  దీవుల సముదాయం
* ప్రపంచంలోనే పెద్దదీవుల సముదాయం ఇండోనేసియాలో ఉంది. దీనిలో 13,500 దీవులు ఉన్నాయి.
* జపాన్, ఫిలిప్పీన్స్, భారతదేశంలోని అండమాన్ - నికోబార్, లక్షదీవులు కూడా దీవుల సముదాయాలే.
* లోతైన ప్రాంతం మృతసముద్రం ఆసియాలోనే ఉంది.
అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ ఇక్కడే ఉంది.
* ప్రపంచంలోనే లోతైన బైకాల్ సరస్సు ఈ ఖండంలోనే ఉంది.
* ఎత్తైన పీఠభూమి టిబెట్ ఆసియాలో ఉంది.
* పొడవైన దక్షిణ సముద్రం ఈ ఖండంలోనే ఉంది.
* ఆసియా ఖండంలో లోతైన అగాధం 'మేరియానా'.
* 'కోహిన్' (లావోస్) అనే జలపాతం ఆసియాలో ఉంది.

 

శీతోష్ణస్థితి
* ఆసియా ఖండం ధృవ ప్రాంతం నుంచి భూమధ్యరేఖ ప్రాంతం వరకు 1,71,89,432 కి.మీ. విస్తరించి ఉంది. అందుకే ఈ ఖండంలో వివిధ రకాల శీతోష్ణస్థితులు ఉంటాయి.
* ఆసియా ఖండం అంతర్భాగాలు సముద్రానికి దూరంగా ఉండటం వల్ల ఖండాంతర్గత శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది.
* ఈ ఖండం మధ్యభాగంలో ఉష్ణోగ్రత 30º సెంటిగ్రేడులు ఉండడంతో వేసవిలో ఎక్కువ వేడి, చలికాలంలో ఎక్కువ చలి, తక్కువ వర్షపాతం ఉంటుంది.
* వేసవిలో హిందూ మహాసముద్రం నుంచి వీచే ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటి నైరుతి రుతుపవనాలుగా ఈ ఖండంలోకి ప్రవేశించడం వల్ల దాదాపు 200 సెం.మీ. వర్షపాతం కురుస్తుంది.
  * చలికాలంలో వీచే ఈశాన్య రుతుపవనాల వల్ల తూర్పు ఇండియా దీవుల్లో సుమారు 150 సెం.మీ వర్షపాతం నమోదవుతుంది.
* ఆసియాలో వర్షపాతం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటాయి.
* ఈ ఖండంలో వార్షిక వర్షపాతంలో వ్యత్యాసాలు ఉంటాయి.
* భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతాలు మాసిన్‌రాం, చిరపుంజి.
* థార్, అరేబియా ఎడారుల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది.
* ఆసియాలోని మధ్య నిమ్న పీఠభూముల్లో 25 సెం.మీ. వార్షిక వర్షపాతం కురుస్తుంది.
* అరేబియా సింధుశాఖ, నైరుతి ఆసియాలోని ప్రాంతాల్లో 25 సెం.మీ. కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుంది.
* భారతదేశంలోని మాసిన్‌రాంలో అత్యధికంగా 1141 సెం.మీ. వర్షపాతం కురుస్తుంది.

 

సహజ వృక్షజాలం - వన్యజీవులు
* ఒక ప్రదేశంలో పెరిగే సహజ వృక్షజాలం ఆ ప్రాంతంలోని శీతోష్ణస్థితిగతులపై తగిన ప్రభావాన్ని కల్గిస్తాయి.
* ఆసియా ఖండం ఉత్తరభాగం పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది. దీన్నే 'టండ్రా' అంటారు.
* టండ్రా ప్రాంతాల్లో ఎక్కువ మంచు, అత్యల్ప వర్షపాతం కారణంగా తృణజాతులు అధికంగా పెరుగుతాయి.
* ఇక్కడి ప్రధాన జంతువు 'రేన్‌డీర్'.
* టండ్రాలకు దక్షిణంగా ఉండే టైగా మండలంలో శృంగాకారపు అడవులు ఉంటాయి.
* ఫైన్, ఫర్, స్ఫూల్స్, లార్చీబిల్బ్ ఈ అడవుల్లో పెరిగే ముఖ్య వృక్షజాతులు.
* ఈ వృక్షాల నుంచి వచ్చే మెత్తని కలపను అగ్గిపెట్టెలు, రేయాన్, ప్త్లెవుడ్, కాగితం తయారీకి ఉపయోగిస్తారు.
* టైగా ప్రాంతాల్లో నక్క, స్కేబుల్, మింక్, లేళ్లు, ఒంటెలు, గాడిదలు ఎక్కువగా ఉంటాయి.
* ఆగ్నేయాసియా దేశాలైన మలేసియా, ఇండోనేషియా, న్యూగినియా, భారతదేశం, మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో ఉష్ణమండల రుతుపవన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఏనుగు ఇక్కడి పెద్ద జంతువు.
* తూర్పు ఆసియాలోని అడవులను సమశీతోష్ణ అడవులు అంటారు.
* ఆసియా ఖండానికి దక్షిణాన భూమధ్యరేఖ ప్రాంతంలో పెరిగే అడవులను 'సతత హరిత అరణ్యాలు' లేక 'భూమధ్య రేఖ అరణ్యాలు' అంటారు.
* టేకు, మద్ది, మంచి గంధం ఇక్కడి ప్రధాన వృక్ష సంపద.
  టేకు, సాల్, ఎబోని, మహగని, రోజ్‌వుడ్ మొదలైన వృక్షజాతులు ఈ అరణ్యాల్లో విస్తారంగా పెరుగుతాయి. ఇవి మలేసియా, బోర్నియా, ఇండోనేషియా దీవుల్లో ఉన్నాయి.
* ఈ ప్రాంతంలో కోతులు, పాములు, ఏనుగులు, రకరకాల పక్షి జాతులు నివసిస్తాయి.

 

జనాభా విస్తరణ - ప్రధాన నగరాలు
* ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఖండం ఆసియా. దీని జనాభా దాదాపు 3900 మిలియన్లు. ప్రపంచ జనాభాలో సుమారు 65 శాతం ఈ ఖండంలోనే నివసిస్తున్నారు.
* ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. దీని జనాభా 1,397 మిలియన్లు.
* భారతదేశం సుమారు 1,324 మిలియన్ల జనాభాతో చైనా తర్వాతి స్థానంలో ఉంది.
* నదీ తీర ప్రాంతాలు, మైదానాలు, డెల్టా, నగరాల్లో జనాభా విస్తరించి ఉంది.
* వ్యవసాయానుకూల, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, రవాణా సౌకర్యాలున్న ప్రాంతాల్లో జనాభా అధికంగా నివసిస్తోంది.
* చైనా, భారతదేశం తర్వాత ఆసియాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు జపాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా దీవులు.
* సైబీరియా ఉత్తర, తూర్పు ప్రాంతాలు, మధ్య ఆసియా ప్రాంతాలు, అరేబియా, థార్ ఎడారుల్లో అతి తక్కువ జనాభా నివసిస్తున్నారు.
* ఒక చ.కి.మీ దూరం విస్తీర్ణంలో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు.
* బంగ్లాదేశ్‌లో జనసాంద్రత అత్యధికంగా చ.కి.మీ.కి 967 ఉండగా, మంగోలియాలో అత్యల్పంగా చ.కి.మీ.కి నలుగురు మాత్రమే నివసిస్తున్నారు.
* ఆసియా దక్షిణ భాగంలో ఉన్న భారతదేశంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు ముఖ్య నగరాలు.
* అనేక దేశాల, జాతుల ప్రజలు నివసించటం వల్ల దిల్లీని విశ్వనాగరిక పట్టణంగా పిలుస్తున్నారు.
* అత్యధిక జనాభా కలిగిన చైనాలో బీజింగ్, షాంఘై, కాంటన్, నాన్నింగ్, పాకిస్థాన్‌లో కరాచి, లాహోర్, ఇస్లామాబాద్, బంగ్లాదేశ్‌లో ఢాకా, చిట్టగాంగ్ ప్రముఖ నగరాలు.
* ఆగ్నేయాసియాలో మలేసియా రాజధాని కౌలాలంపూర్, సింగపూర్ రాజధాని నగరమైన సింగపూర్ సిటీ ముఖ్య నగరాలు.
* జపాన్‌లో టోక్యో, ఒసాకా, నాగసాకి ప్రధాన నగరాలు.
* ఆసియాలోని పెద్ద నగరాల్లో ఒకటిగా టోక్యో ప్రసిద్ధి చెందింది.

 

వ్యవసాయం
* ఆసియాలో 70 శాతం జనాభాకు వ్యవసాయమే జీవనాధారం.
* ఈ ఖండంలో సారవంతమైన నేలలు, శీతోష్ణస్థితి, తగిన నీటిపారుదల లాంటివి వ్యవసాయాభివృద్ధికి అనుకూలమైనవి.
*ఆసియాలోని వ్యవసాయ పద్ధతుల్లో ముఖ్యమైనవి విస్తాపన, సాంద్ర, విస్తృత పద్ధతులు.
* విస్తాపన వ్యవసాయ విధానంలో ఆటవిక జాతుల ప్రజలు చెట్లను నరికి నేలను చదును చేసి వ్యవసాయం చేస్తారు.
* భూసారం తగ్గిన తర్వాత దానిని వదిలి మరొక ప్రదేశంలో వ్యవసాయం కొనసాగిస్తారు. దీన్నే 'పోడు' వ్యవసాయం అంటారు.
* సాంద్ర వ్యవసాయ పద్ధతుల్లో పొలాన్ని దున్నటానికి జంతువులను ఉపయోగిస్తారు.
* దీనికి ఎక్కువ మంది పనివారు అవసరం అవుతారు.
* ఈ పద్ధతిలో భూ పరిమితి తక్కువగా ఉంటుంది.
* ఆసియాలో ఎక్కువగా సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది.
* విస్తృత వ్యవసాయంలో ఎక్కువ భూభాగాన్ని సాగు చేస్తారు.
* వ్యవసాయ పన్నులన్నింటిని యంత్రాల సహాయంతో చేస్తారు. మధ్య ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో విస్తృత వ్యవసాయం అమల్లో ఉంది.
* ఆసియాలోని ప్రధాన పంటలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఆహార, వాణిజ్య పంటలు.
* ఆహారంగా ఉపయోగించే పంటలను ఆహార పంటలు అంటారు.
ఉదా: వరి, గోధుమ, రై, ఓట్లు, చిరుధాన్యాలు (జొన్న, రాగులు, సజ్జలు) మొదలైన ఆహార పంటలు.
  * చైనా, భారత్, బంగ్లాదేశ్, జపాన్, ఆగ్నేయాసియా దేశాల్లో వరి, చైనా, ఉత్తర భారతదేశంలో గోధుమను ఎక్కువగా పండిస్తారు.
* ధన సముపార్జనే ధ్యేయంగా పండించే పంటలను నగదు పంటలు లేదా వాణిజ్య పంటలు అంటారు.
ఉదా: పత్తి, జనుము, చెరకు, పొగాకు, టీ, పసుపు, కాఫీ.

 

ఖనిజాలు - పరిశ్రమలు
* సహజంగా ప్రకృతిలో శైథిల్య క్రియ వల్ల ఏర్పడిన పదార్థాన్ని ఖనిజం అంటారు.
* గనుల తవ్వకం ద్వారా భూమి నుంచి ఖనిజాలను వెలికి తీస్తారు.
* కొన్ని ఖనిజాలు భూ అంతర్భాగంలోనూ, భూ ఉపరితలం మీద లభిస్తున్నాయి.
* గనుల తవ్వకం పారిశ్రామికీకరణకు దోహదకారి అవుతుంది.
* ఒక దేశ పారిశ్రామికాభివృద్ధి ఆ దేశ ఖనిజాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

 

ఆసియా - ఖనిజాలు
ఖనిజాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి లోహ, అలోహ, ఇంధన ఖనిజాలు

 

లోహ ఖనిజాలు
* ఇనుము, మాంగనీస్, బాక్సైట్, రాగి, సీసం, జింకు, క్రోమైట్, బంగారం, వెండి ఆసియాలోని ముఖ్య లోహ ఖనిజాలు.
* భారతదేశంలో నాణ్యమైన ఇనుప ఖనిజం, మాంగనీస్ నిక్షేపాలు ఉన్నాయి.
* ఆగ్నేయాసియా ప్రాంతాల్లో తగరం, సీసం, జింకు, రాగి ఇతర విలువైన ఖనిజాలు లభిస్తున్నాయి.
* ప్రపంచంలో ఇనుప ఖనిజం ఉత్పత్తిలో రష్యా ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం ఉత్పత్తిలో చైనా 11 శాతం వాటా కలిగి ఉంది.
* రష్యా, చైనా దేశాల్లో పాదరసం లభిస్తోంది.

 

  అలోహ ఖనిజాలు
* అబ్రకం, ఆస్‌బెస్టాస్, ముత్యాలు, గ్రాఫైట్, ఉప్పు ఆసియాలో లభించే ముఖ్యమైన అలోహ ఖనిజాలు.
* అబ్రకం ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది.
భారతదేశంలోని రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు రాతినారను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.
* చైనా, రష్యా, భారతదేశాలు ఉప్పును అధికంగా సేద్యం చేస్తున్నాయి.
* జపాన్, చైనా, శ్రీలంక, భారత్, ఒమన్ దేశాల్లో ముత్యాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి.

ఇంధన ఖనిజాలు
* బొగ్గు, లిగ్నైట్, ముడిచమురు, సహజవాయువులు ఆసియాలో లభించే ముఖ్య ఇంధన ఖనిజాలు.
*ఆసియాలో చైనా, రష్యా, ఇండియా, ఉత్తర కొరియా వంటి దేశాలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. రష్యాలో లిగ్నైట్ అధికంగా లభిస్తోంది.
* ముడిచమురు నిల్వలు రష్యా, సౌదీ అరేబియా, చైనా, ఇండోనేషియాలో ఎక్కువగా ఉన్నాయి.
* రష్యా, ఇండోనేషియా, చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా, బ్రూనై, ఇరాన్, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ దేశాల్లో సహజవాయు నిక్షేపాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.

 

రవాణా - వాణిజ్యం
* తగినన్ని రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల పారిశ్రామిక, వాణిజ్యాభివృద్ధి సాధ్యం అవుతుంది.
* దేశాల అభివృద్ధిలో రవాణా కీలక పాత్ర వహిస్తోంది.

 

రోడ్లు, రైల్వేలు:
* ఆసియాలో అత్యుత్తమ రహదారులు ఉన్నాయి.
* భారత్, జపాన్ లాంటి దేశాల్లో మంచి రహదారులు ఉన్నాయి.
టర్కీలోని ఇస్తాంబుల్, సింగపూర్‌లను కలుపుతూ అంతర్జాతీయ రహదారి ఉంది.
*పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన జపాన్‌లో రహదారులు ఎక్కువగా ఉన్నాయి.
* రష్యా ఉత్తర ప్రాంతంలో తీవ్ర శీతోష్ణ పరిస్థితుల వల్ల రోడ్డు రవాణా సాధ్యం కాదు.
* సైబీరియా, మధ్య ఆసియా, ఉత్తర ఆసియా లాంటి విశాల ప్రాంతాల్లో శీతోష్ణస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల రోడ్ల అభివృద్ధి చాలా నిరాశాజనకంగా ఉంది.
* భారతదేశంలో ప్రధాన నగరాలను కలుపుతూ జాతీయ రహదారులున్నాయి. దేశం మొత్తం 3.34 మిలియన్ల కి.మీ పొడవైన రహదారులు విస్తరించి ఉన్నాయి.
* ఆసియాలో సాంద్ర రైల్వే వ్యవస్థ జపాన్‌లో ఉంది. ఈ దేశంలో మొత్తం రైలు మార్గం పొడవు 32.2 వేల కి.మీ.
* భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలోని పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి. దీని ద్వారా రోజుకు 28 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు, 15.5 లక్షల టన్నుల సరకుల రవాణా జరుగుతోంది.
* భారత్‌లో రైలు మార్గం పొడవు 67,312 కి.మీ.
* రష్యాలో రైల్వేలు ప్రధాన రవాణా సాధనాలు.
* వోల్గాగ్రాడ్ నుంచి వ్లాడివోస్టాక్ వరకు ఉన్న 8,640 కి.మీ.ల రైల్వే మార్గం ప్రపంచంలోనే అతి పొడవైనది.

 

జల రవాణా
* భారీ నౌకల నిర్మాణం వల్ల ప్రపంచ వాణిజ్యం ఎక్కువగా సముద్రమార్గాల ద్వారా జరుగుతుంది.
* భారత్‌లో గంగా, బ్రహ్మపుత్ర, చైనాలోని యాంగ్ట్సీ, మయన్మార్‌లో ఐరావతి, రష్యాలో వోల్గా, డాన్ నదులు జల రవాణాకు ఉపయోగపడుతున్నాయి.
* సముద్రయానం ద్వారా భారతదేశాన్ని చేరడానికి సూయజ్ కాలువ అతి ముఖ్యమైనది.
* దీన్ని తవ్విన తర్వాత భారతదేశానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కి మధ్య సుమారు 6,500 కి.మీ.ల దూరం తగ్గింది.
* ఈ మార్గంలో ఆసియాలో మనీలా నుంచి హాంకాంగ్, షాంఘై మీదుగా సియోటెల్ వరకు; మనీలా నుంచి నాగసాకి, కోబా, యెకోహోమా మీదుగా వాంకోవర్ వరకు ఉన్న జలరవాణా ప్రధానమైనదిగా చెప్పవచ్చు.

 

వాయు మార్గాలు
* దూర ప్రాంతాలకు అతివేగంగా వస్తువులను, ప్రయాణికులను చేరవేయడానికి వాయు రవాణా దోహదం చేస్తుంది.
* ఆసియాలో అతి ముఖ్యమైన అంతర్జాతీయ విమాన మార్గాలు ఉన్నాయి.

 

ప్రధాన వాయు మార్గాలు
* సింగపూర్ - శాన్‌ఫ్రాన్సిస్కో
* న్యూదిల్లీ - ముంబయి - కోల్‌కతా - కొలంబో
* టోక్యో - మనీలా - హాంకాంగ్ - బ్యాంకాక్ - కొలంబో - ముంబయి/దిల్లీ
*మాస్కో నుంచి బీజింగ్, న్యూదిల్లీ, కాబుల్ ముఖ్యమైన వాయు మార్గాలు.

 

అంతర్జాతీయ వ్యాపారం
* వివిధ దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటారు.
* జపాన్ ఆహార పదార్థాలను, ముడి సరకులను, పెట్రోలియం, ఇనుప ఖనిజం, బొగ్గు, పత్తిని దిగుమతి చేసుకుంటోంది. పారిశ్రామిక ఉత్పత్తులను, యంత్ర పరికరాలను ఉక్కు, ఆటోమొబైల్స్, రసాయనాలను ఎగుమతి చేస్తోంది.
* జపాన్ ఆసియాలోని ఇతర దేశాలతో పాటు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలతోనూ వ్యాపారం చేస్తోంది.
* అధిక జనాభా వల్ల చైనా అంతర్జాతీయ వ్యాపారంలో అంతగా పాలు పంచుకోవడం లేదు.
* ఆగ్నేయాసియా దేశాలు ప్రధానంగా రబ్బరు, కాఫీ, పామాయిల్, పంచదార, ఇనుప ఖనిజం, పెట్రోలియం, తగరం లాంటి వాటిని దిగుమతి చేస్తున్నాయి.
* ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ దేశాలు ప్రధానంగా పెట్రోలియంను ఎగుమతి చేస్తున్నాయి.
* భారతదేశపు ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాలు, తేయాకు, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు, రెడీమేడ్ వస్త్రాలు, యంత్రాలు, ఇనుప ఖనిజం, రసాయనాలు ప్రధానమైనవి.
భారతదేశపు దిగుమతుల్లో పెట్రోలియం, యంత్రాలు, ఆహార ధాన్యాలు, వంటనూనెలు, ఇనుము, ఉక్కు, ఎరువులు, రసాయనాలు ముఖ్యమైనవి.

ఉత్తర అమెరికా

ఉనికి - విస్తరణ:
* ఉత్తర అమెరికా ఖండం ఉత్తరార్ధ గోళంలో ఉంది. ఇది ప్రపంచంలో మూడో పెద్ద ఖండం.
* ఈ ఖండం ఎక్కువ భాగం ఆర్కిటిక్ వలయంలో ఉంది.
* ఈ ఖండానికి తూర్పున అట్లాంటిక్, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రాలు ఉన్నాయి.

 

ఉనికి:
* ఉత్తర అమెరికా 7o ఉత్తర అక్షాంశం నుంచి, 83o ఉత్తర అక్షాంశం వరకు, 20o పశ్చిమ రేఖాంశం నుంచి 
   120o పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించి ఉంది.
* ఆర్కిటిక్ వలయం  

 ఈ ఖండం ఉత్తర భాగం మీదుగా వెళ్తోంది.
* కర్కటకరేఖ   ఈ ఖండం ద్వారా వెళ్తోంది.
* వాయువ్య ఉత్తర అమెరికాకు ఆసియా ఈశాన్యపు అంచు 96 కిలోమీటర్ల దూరంలో ఉంది.
* బేరింగ్ జలసంధి ఈ రెండు ఖండాలను వేరు చేస్తోంది.
* 'అమెరిగో వెస్పుస్సి' అనే ఇటలీ దేశానికి చెందిన అన్వేషకుడి పేరు మీదుగా 'అమెరికా'కు ఆ పేరు వచ్చింది.
* పరిమాణంలో ఆసియా, ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా అతి పెద్ద ఖండం.
* ఉత్తర అమెరికా భారతదేశంతో పోలిస్తే సుమారుగా 8 రెట్లు అధికంగా ఉంటుంది.
* ఈ ఖండం ఐరోపా, ఆసియాలతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉంది.

భౌతిక స్వరూపం:
* ఈ ఖండ భౌతిక స్వరూపాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు.
అవి: *  పశ్చిమ 'కార్డిలెరా' అని పిలిచే పశ్చిమపర్వత ప్రాంతం.
     * తూర్పు మెట్టభూములు.
     * విశాల మధ్య మైదానాలు.

 

పశ్చిమ కార్డిలెరా:
* ఉత్తర అమెరికా పశ్చిమ భాగంలోని విశాలమైన పర్వత ప్రాంతాన్ని పశ్చిమ కార్డిలెరాగా పిలుస్తారు.
* ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి.
* ఉత్తర అమెరికాలోని నదులకు పశ్చిమ కార్డిలెరా జన్మస్థానం.
* అలస్కాలోని 'మెకిన్‌లే' శిఖరం ఎత్తయినది.
* దీని ఎత్తు సముద్రమట్టం నుంచి 6,187 మీటర్లు.
* పశ్చిమ కార్డిలెరా అనేక సమాంతర పర్వత శ్రేణులు కలిగి ఉంది.
* 'సిర్రా నవాడా' అనే పర్వత శ్రేణి ఈ ఖండంలో ఉంది.
* సహజ సౌందర్యానికి ఈ ఖండం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.

 

తూర్పు మెట్టభూములు:
* లేబ్రడార్ నుంచి న్యూఫౌండ్ లాండ్ వరకు విస్తరించి ఉన్న అప్పలేషియాన్ పర్వతాలు ఈ మెట్టభూముల్లో ఉన్నాయి.
* ఈ పర్వతాలు పశ్చిమ కార్డిలెరాల కంటే పురాతనమైనవి.
* ఇవి శిథిలం కావడంతో పర్వతాల ఎత్తు తగ్గింది.

విశాల మధ్య మైదానాలు:
* విశాల మధ్య మైదానాలు పశ్చిమ కార్డిలెరా, తూర్పు మెట్ట భూములకు మధ్య విస్తరించి ఉన్నాయి.
* ఈ మైదానంలో మధ్య, దక్షిణ ప్రాంతాల్లో ఉన్న విశాల, సమతల ప్రాంతంలో మిసిసిప్పి నది ప్రవహిస్తోంది.
* ఇక్కడి సుపీరియర్ సరస్సు ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు.
* ఇరీ, ఒంటారియో సరస్సుల మధ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నయాగరా జలపాతం ఉంది.
* ఈ ప్రాంతంలో మిసిసిప్పి, సెయింట్ లారెన్స్ నదులు ముఖ్యమైనవి.

 

శీతోష్ణస్థితి:
* ఉత్తర అమెరికా, ఉత్తరాన ధృవప్రాంతం నుంచి దక్షిణాన ఉష్ణమండలం వరకు విస్తరించి ఉంది.
* ఎత్తయిన రాఖీ పర్వతాలు, తూర్పు మెట్టభూములు రెండూ ఉత్తర, దక్షిణ దిశల్లో విస్తరించి ఉన్నాయి.
* ఉత్తర దిశ నుంచి అతిశీతల పవనాలు, దక్షిణ దిశ నుంచి ఉష్ణపవనాలు మధ్య మైదానం వైపుకు వీస్తాయి.
* పశ్చిమ తీరంలో 30o - 40o ఉత్తర అక్షాంశాల మధ్య, మధ్యధరా శీతోష్ణస్థితి ఉంటుంది.

ఉష్ణోగ్రత:
* ఉత్తర పవనాల వల్ల శీతకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది.
* ఉత్తర అమెరికా మధ్య మైదాన భాగం ఉష్ణోగ్రత శీతకాలంలో ఘనీభవనస్థానం కంటే తక్కువగా ఉంటుంది.
* వేసవిలో సముద్ర సామీప్యం వల్ల పశ్చిమతీరం చల్లగా, ఖండ మధ్యభాగం వేడిగా ఉంటుంది.

 

వర్షపాతం:
* ఈ ఖండంలోని చాలా భాగాల్లో వర్షపాతం సమృద్ధిగా ఉంటుంది.
* కెనడా పశ్చిమతీరం, మెక్సికో తూర్పుభాగం, మధ్య అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పుభాగం, తూర్పు కెనడాల్లో వర్షపాతం సమృద్ధిగా ఉంటుంది.
* తీరానికి దూరంగా ఉన్న ఖండాంతర్గత ప్రాంతంలో వర్షపాతం తక్కువ.
* అమెరికా సంయుక్త రాష్ట్రాలకు నైరుతి ప్రాంతంలో, మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ.
* ఈ ప్రాంతాల్లో ఎడారులు ఉన్నాయి.
* నైసర్గిక స్వరూపం, పవనాల దిశ, సముద్ర ప్రవాహాలు, వర్షపాతంపై ప్రభావాన్ని చూపుతాయి.
* ఉత్తర అమెరికాలో అన్ని రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.
* కొన్ని ప్రాంతాల్లో శీతకాల ఉష్ణోగ్రత ఘనీభవనస్థానం కంటే తక్కువుగా ఉంటుంది.

 

అడవులు - వన్యజీవులు:
* ఉత్తర అమెరికాలోని వివిధ శీతోష్ణ పరిస్థితులను బట్టి అడవులు, వన్యజీవులు ఉన్నాయి.
* అతి శీతలంగా ఉండే ఉత్తరప్రాంతం ఏడాదిలో ఎక్కువ కాలం మంచుతో కప్పి ఉంటుంది.
* ఈ ప్రాంతం పొట్టి చెట్లతో, టండ్రా రకం తృణజాతులను కలిగి ఉంటుంది.
* ధృవపు ఎలుగుబంటి, కాలిబౌ, కస్తూరి మృగం, రైన్‌డీర్ ఈ ప్రాంతంలో ఉండే కొన్ని జంతువులు.
* టండ్రా ప్రాంతానికి దక్షిణాన శృంగాకార అడవులు ఉన్న విశాలమైన మేఖల ఉంటుంది.
* ఇది అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వరకు కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల మీదుగా విస్తరించి ఉంది.
* స్ప్రూస్, పైన్, ఫిర్ ఈ ప్రాంతాల్లో ముఖ్యమైన వృక్షాలు.
* కౌరిబౌ, బీవర్, మింక్ జంతువులు ఉంటాయి.
* శృంగాకార అడవులకు దక్షిణాన మిశ్రమారణ్య మేఖల ఉంది.
* మధ్య అమెరికా, మెక్సికోలోని ఉష్ణమండలారణ్యాల్లో మహాగని, తాడిజాతి చెట్లు ఉన్నాయి.
* ఉత్తర అమెరికాలోని మధ్య పల్లపు భూముల్లో, ఖండాంతర్భాగ మైదానాల్లో వృక్షాలు లేని ప్రైరీలు అనే విశాల పచ్చిక భూములు ఉన్నాయి.
* పశ్చిమ తీరాన 30o, 40o ఉత్తర అక్షాంశాల ప్రాంతంలో పొడవైన వేర్లు స్థూలాకార కాండం, దళసరి ఆకులు కలిగిన వృక్షాలు ఉన్నాయి.

 

జనాభా:
* ఉత్తర అమెరికా జనాభా, భారతదేశ జనాభాలో సగం.
* ఈ ఖండం మొత్తం జనాభా సుమారు 400 మిలియన్లు.
* జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 15 మంది మాత్రమే.
* ఈ ఖండం పశ్చిమ భాగంలోని చాలా ప్రాంతాల్లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు రెండు కంటే తక్కువ.
* మధ్య పల్లపు భూముల్లో పెద్ద నగరాలు లేనప్పటికీ మితమైన జనాభా ఉంది.
* ఈ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలమైంది.
* పశ్చిమ కార్డిలెరాలో జనాభా తక్కువ.
* ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతంలో, సరస్సుల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ.
* ఈ ప్రాంతంలో 15 పెద్ద నగరాలు ఉన్నాయి.
* తూర్పుతీర ప్రాంతంలో చల్లటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ మేలిరకపు బొగ్గు నిక్షేపాలు, తగినంత శక్తి  సంపద, అనేక పరిశ్రమలు ఉన్నాయి.
* ఈ ప్రాంతంలో మెరుగైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడికి వలస వచ్చిన ఐరోపా దేశస్థులకు ఇది మొదటి స్థావరం.
* మెక్సికో నగరం చుట్టూ జనసాంద్రత ఎక్కువ.
* పశ్చిమ ఇండీస్ దీవుల్లో జనసాంద్రత చాలా ఎక్కువ.
* కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జనాభా విస్తరణ ఒకే రకంగా లేదు.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పు భాగంలో జనాభా తక్కువ.
* ఈశాన్య ప్రాంతంలో జన సాంద్రత ఎక్కువ.
* కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెల్లవారు అధికంగా ఉంటారు.
* ఐరోపా, ఆసియా దేశస్థులు ఉత్తర అమెరికాలో ఎక్కువగా స్థిరపడ్డారు.
* విక్టోరియా, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, న్యూఓర్లిన్స్, మెక్సికో, న్యూయార్క్, బోస్టన్, చికాగో లాంటి నగరాలు ఉత్తర అమెరికాలో ముఖ్యమైనవి.

 

వ్యవసాయం:
* సారవంతమైన మైదానాలు, చక్కని నీటి సదుపాయం ఉన్న మైదానాలు ఉండటం వల్ల ఉత్తర అమెరికా వ్యవసాయ రంగంలో ఉన్నత స్థానంలో ఉంది.
* ఇక్కడ విస్తృత వ్యవసాయం ప్రధానమైంది.
* వ్యవసాయ క్షేత్రాలు పెద్దగా ఉండటం వల్ల, యంత్రాల సహాయంతో వ్యవసాయం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.
* రైతులు శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు.
* దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల మిగులు ఉత్పత్తులను ఎగుమతి చేస్తారు.
* ఉత్తర అమెరికాలో అనేక రకాల పంటలు పండిస్తారు.
* మొక్కజొన్న, గోధుమ, పత్తి, పొగాకు, ఓట్స్, బార్లీ, సోయాచిక్కుడు వీటిలో ముఖ్యమైనవి.
* తరచూ వర్షం కురిసే ఉష్ణ ప్రాంతాల్లో మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది.
* ప్రపంచంలోని జొన్న ఉత్పత్తిలో సగానికి పైగా ఉత్తర అమెరికాలోనే పండిస్తున్నారు.
* మెక్సికోలో జొన్న ప్రధాన పంట.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పండిన జొన్న పంటను ఎక్కువగా పందులు, పశువుల మేతకు ఉపయోగిస్తారు.
* ప్రపంచంలో గోధుమ ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా ముఖ్యమైనవి.
* ప్రపంచంలోని అయిదో వంతు గోధుమను ఉత్తర అమెరికాలో పండిస్తున్నారు.
* ఇక్కడ గోధుమ క్షేత్రాలు పెద్దగా ఉంటాయి.
* పంటను కోయడం, నూర్చడం లాంటి వ్యవసాయ పనులన్నీ యంత్రాలతోనే జరుగుతాయి.
* దక్షిణ మిసిసిప్పి హరివాణంలో పత్తి ఎక్కువగా పండుతుంది.
* ఇవి సారవంతమైన నేలలు. వేసవిలో వెచ్చటి వాతావరణం, తగిన వర్షపాతం ఉంటుంది.
* ఇక్కడ శీతోష్ణస్థితి మంచు లేకుండా, ఆకాశం నిర్మలంగా ఉండటం, సూర్యరశ్మి పుష్కలంగా లభించడం వల్ల పత్తికాయలు తొందరగా పక్వానికి వస్తాయి.
* ఈ ప్రాంతం పత్తి పంటకు చాలా అనుకూలమైంది.
* ఉత్తర అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మెక్సికో లాంటివి పత్తి ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు.
* ఉత్తర అమెరికా పొగాకు పంటకు ప్రసిద్ధిగాంచింది.
* ప్రపంచంలో 30 శాతం పొగాకు ఈ ఖండంలోనే పండుతోంది.
* పాలు, మాంసం కోసం పశువులను పెంచుతారు.
* మాంసం ఉత్పత్తిలో ఉత్తర అమెరికా ఖండం అగ్రస్థానంలో ఉంది.

 

ఖనిజాలు:
* ఉత్తర అమెరికా ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన ఖండం.
* ఇక్కడ ఖనిజ సంపద సమృద్ధిగా ఉంది. ఇందులో చాలా రకాల ఖనిజాలు లభిస్తాయి.
* కెనడా షీల్డు, నికెల్, ప్లాటినం, యశదం, సీసం, బంగారం, వెండి, రాగి నిక్షేపాలు ఉన్నాయి.
* రాఖీ పర్వత ప్రాంతంలో రాగి, యురేనియం, బంగారం, యశదం, సీసం నిక్షేపాలు ఉన్నాయి.
* అప్పలేషియాన్ ప్రాంతం నేలబొగ్గు క్షేత్రాలకు ప్రసిద్ధి.
* మధ్య మైదానాల గల్ఫ్ తీరాల్లో ఖనిజ, తైల, సహజ వాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ముడి ఇనుము నిక్షేపాలు చాలా ఉన్నాయి.
* ఈ నిక్షేపాలు సుపీరియర్ సరస్సు చుట్టూ ఉన్నాయి.
* ముడి ఇనుముతో ఏర్పడ్డ అనేక శిలా శ్రేణులు ఉన్నాయి.
* ఉత్తర అమెరికాలో నేలబొగ్గు, పెట్రోలియం నిక్షేపాలు చాలా ఉన్నాయి.
* ప్రపంచ ఉత్పత్తిలో నాల్గో వంతు నేలబొగ్గు, మూడో వంతు పెట్రోలియం ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి.
* పెట్రోలియం, నేలబొగ్గు, రాగి ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయి.
* ప్రపంచంలో యశదంలో మూడోవంతు, నికెల్‌లో (3/4) నాలుగింట మూడో వంతును ఉత్తర అమెరికానే ఉత్పత్తి చేస్తుంది.
 ప్రపంచంలో సగం వెండి ఉత్తర అమెరికాలోనే ఉత్పత్తి అవుతుంది.

పరిశ్రమలు:
* ఉత్తర అమెరికా ప్రపంచంలో ఎక్కువగా పారిశ్రామికీకరణ చెందిన ఖండం.
* ఈ ఖండంలో చాలా ఉత్పత్తి పరిశ్రమలు ఉన్నాయి.
* ఈ ఖండంలో సారవంతమైన వ్యవసాయ క్షేత్రాలు, ఖనిజ, జలవిద్యుత్ సంపదలు ఉండటంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.
* ఆధునిక రవాణా సౌకర్యాలు ఉండటంతో పారిశ్రామికీకరణ సులభతరం అయ్యిందని చెప్పవచ్చు.
* దాదాపు అన్ని నగరాల్లో ఉత్పాదక పరిశ్రమలు ఉన్నాయి.
* అవసరమైన మూలధనం, నైపుణ్యం ఉన్న కార్మికులు ఎక్కువగా ఉన్నారు.
* ఇనుము ఉక్కు పరిశ్రమలు ఇక్కడ ముఖ్యమైనవి. ఈ పరిశ్రమల్లో భారీ యంత్రాలు, వాహనాలు, రైలుపెట్టెలు, కార్లు ఉత్పత్తి అవుతాయి.
* అమెరికా సంయుక్త రాష్ట్రాలు తయారీలో ప్రసిద్ధి గాంచాయి. ఇక్కడ శ్రామిక శక్తిని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే యంత్రాల సహాయంతో పరిశ్రమలను నడుపుతున్నారు.
* వస్త్రాలు, కాగితం, ఆహార సంబంధ పరిశ్రమలు వీటిలో ముఖ్యమైనవి.
* అమెరికాలోని బోస్టన్, న్యూయార్క్, ఫిలదెల్ఫియా, డెట్రాయిట్, చికాగో, లాస్ ఎంజెల్స్ లాంటి నగరాల్లో ఉత్పత్తి పరిశ్రమలు ఎక్కువ.
* వార్తాపత్రికల్లో ఉపయోగించే కాగితం ఉత్పత్తికి కెనడా ప్రసిద్ధి.
* లోహశుద్ధి, విద్యుత్, కార్ల పరికరాలు, కాగిత పరిశ్రమలు కూడా ఉన్నాయి.
* పరిశ్రమలను చాలా వరకు సరస్సుల చుట్టూ స్థాపించారు.

రవాణా సౌకర్యాలు

రోడ్డు మార్గాలు:
* ఉత్తర అమెరికాలో రోడ్డు మార్గాలు ఎక్కువ.
* కెనడా దక్షిణ భాగం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నాణ్యమైన రోడ్డు రహదారులు ఉన్నాయి.
* ఇక్కడ కార్ల వాడకం ఎక్కువ.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పు భాగంలో రైలు మార్గాలు ఎక్కువగా ఉన్నాయి.
* కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అనేక రైలు మార్గాలు ఖండం మధ్య నుంచి వెళ్తూ తీరప్రాంతాలను కలుపుతున్నాయి.

 

జలమార్గాలు:
* ఉత్తర అమెరికా అట్లాంటిక్ తీరం వైపు అనేక ఓడ రేవులు ఉన్నాయి.
* ఇక్కడ వ్యాపారం చాలావరకు జలమార్గాల ద్వారానే జరుగుతోంది.
* మిసిసిప్పి, సెయింట్ లారెన్స్ నదులు, అయిదు మహా సరస్సులు 
* ప్రపంచంలోనే అత్యధిక రవాణా ఉన్న ఖండాంతర్గత జలమార్గాలు.
* అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువకు వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది.
* న్యూయార్క్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు పనామా కాలువ ద్వారా ప్రయాణించడం వల్ల 12,640 కి.మీ. దూరం తగ్గుతుంది.

 

వాయుమార్గాలు:
* ఉత్తర అమెరికాలో విమానం ముఖ్య ప్రయాణ సాధనం.
* ఇంచుమించు అన్ని నగరాలు వాయు మార్గాలతో అనుసంధానమై ఉన్నాయి.
* ఈ ఖండంలో సుమారు 9,000 విమానాశ్రయాలు ఉన్నాయి.
* న్యూయార్క్‌లోని 'కెనడీ' విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం.
* కెనడా ఉత్తర భాగంలో శీతకాలంలో విమానాలు దిగడానికి చక్రాలకు బదులు మంచుపై జారే బల్లలను ఉపయోగిస్తారు.
* వీటికి ఘనీభవించిన నదులు, సరస్సులపై కూడా దిగే సామర్థ్యం ఉంది.


ఎగుమతి - దిగుమతులు:
* కెనడా ఎగుమతుల్లో ప్రసిద్ధి చెందింది. అంతేకాక ఇక్కడ మిగులు ఉత్పత్తులు కూడా ఎక్కువే.
* అంతర్జాతీయ వ్యాపారంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి.
* కెనడాలో విదేశీ వ్యాపారం ఎక్కువ.
* ఈ దేశం యంత్రాలు, మోటార్, కార్లు, రైలు ఇంజిన్లు, విమానాలు, యుద్ధ సామగ్రిని ఎగుమతి చేస్తోంది.
* విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఎగుమతి చేస్తోంది.
* అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి పత్తి, ఉన్ని, సింథటిక్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
* గోధుమపిండి, పొగాకు, వనస్పతి నూనెలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కూడా కొన్ని ముఖ్యమైన ఎగుమతులు.
* పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు, కాఫీ, కర్రగుజ్జు, కాగితం, పంచదార, రబ్బరు ముఖ్యమైన దిగుమతులు.
* మెక్సికో ప్రధాన సంపదలైన మేలిరకం ఖనిజాలు, కూరగాయలను అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడాకు ఎగుమతి చేస్తారు.

దక్షిణ అమెరికా

ఉనికి - విస్తరణ
* దక్షిణ అమెరికా దక్షిణార్ధ గోళంలోని మూడు ఖండాల్లో ఒకటి.
* దక్షిణ అమెరికాలో ఎక్కువ భాగం దక్షిణార్ధ గోళంలో ఉంది.
* ఈ ఖండంలో 2/3వ వంతు ఉష్ణ మండలంలోనే ఉంది.
* భూమధ్యరేఖ దక్షిణ అమెరికా ఉత్తరభాగం ద్వారా వెళ్తోంది.
* దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికోలను కలిపి లాటిన్ అమెరికా అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోని ప్రధాన భాషలకు లాటిన్ భాషే మూలం.
* దక్షిణ అమెరికా త్రిభుజాకారంగా ఉంది. దీని ఉత్తర భాగం విశాలంగా ఉండి, దక్షిణ భాగానికి వెళ్లేకొద్దీ సన్నబడుతుంది.
* ఈ ఖండం 12º ఉత్తర అక్షాంశం నుంచి 55º దక్షిణ అక్షాంశం వరకు, 35º పశ్చిమ రేఖాంశం నుంచి 81º పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించి ఉంది.
* ప్రపంచ పటంలో ఇది ఒక ఆకులా కనిపిస్తుంది.
* ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉంది.
* ఈ ఖండం విస్తీర్ణం సుమారు 1,78,18,000 చదరపు కిలోమీటర్లు.
* ప్రపంచంలోనే పొడవైన పర్వతశ్రేణి (ఆండిస్), పొడవైన నది (అమెజాన్), పొడవైన దేశం (చిలీ) దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నాయి.

 

భౌతిక స్వరూపం - భూస్వరూపాలు
* దక్షిణ అమెరికాను నాలుగు ప్రధాన భౌతిక విభాగాలుగా విభజించవచ్చు.
   1. పశ్చిమ తీరమైదానం
   2. పశ్చిమ పర్వత శ్రేణులు
   3. మధ్య మైదానాలు
   4. తూర్పు మెట్టభూములు

 

పశ్చిమ తీరమైదానం
* ఇది దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో ఉత్తర కొన నుంచి దక్షిణం వరకు విస్తరించి ఉన్న సన్నని తీరమైదానం

 

పశ్చిమ పర్వత శ్రేణులు
* పశ్చిమ తీరానికి సమాంతరంగా కొన్ని వేల కిలోమీటర్లు ఈ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి.
* ప్రపంచంలోని పర్వతశ్రేణుల్లో ఆండిస్ పర్వతశ్రేణులు అత్యంత పొడవైనవి.
* ఆండిస్ పర్వత శ్రేణుల్లోని చాలా శిఖరాలు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉంటాయి.
* ఈ పర్వత ప్రాంతంలో భూకంపాలు, అగ్ని పర్వతాలు ఎక్కువ.

మధ్య మైదానాలు
* ఈ మైదానాలు ఆండిస్ పర్వతాలు, తూర్పు మెట్ట భూములకు మధ్య ఉన్నాయి.


* నీటి పరిమాణం పరంగా అమెజాన్ నది ప్రపంచంలోనే పెద్దది.
* అమెజాన్ నది ఆండిస్ పర్వతాల్లో పుట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తోంది.
 

తూర్పు మెట్టభూములు
* తూర్పు మెట్టభూములు ఆండిస్ పర్వతాల కంటే పురాతనమైనవి.
* వెనిజులాలోని ఏంజెల్ జలపాతం ప్రపంచంలోనే ఎత్తైనది. విమానాల నుంచి మాత్రమే దీన్ని చూడగలం.

 

శీతోష్ణస్థితి - ఉష్ణోగ్రత - వర్షపాతం
* దక్షిణ అమెరికా శీతోష్ణస్థితి చాలా వరకు భౌతిక స్వరూపాన్ని అనుసరించి ఉంది.
* దక్షిణ అమెరికాలో చాలాభాగం ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల వేడి ఎక్కువ.
* భూమధ్యరేఖా ప్రాంతంలో ఉండే విలక్షణ శీతోష్ణస్థితి అమెజాన్ నదీ పరివాహకంలో ఉంటుంది.
* ఇది ఏడాది పొడవునా ఎక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతాన్ని కలిగి ఉంటుంది.
* దక్షిణ పెరు, చిలీలోని ఎడారి ప్రాంతంలో శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అటకామా ఎడారి అంటారు.
* మధ్య చిలీలో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంటుంది.
* ఈ ప్రాంతంలో శీతకాలంలో వర్షం సంభవిస్తుంది. వేసవిలో వేడిగా ఉండే పొడిగాలులు వీస్తాయి.
* దక్షిణ చిలీలో ఏడాది పొడవునా వర్షపాతం ఉంటుంది.
* పెటగోనియా ఎడారి ఆండిస్ పర్వతాలకు తూర్పున ఉంది.
* ఇది వర్షాచ్ఛాయ ప్రాంతంలో ఉండటం వల్ల వాతావరణం పొడిగా ఉంటుంది.
* దక్షిణ అమెరికా విషయంలో సూర్యుడిని అనుసరించి వర్షం (ఎండావాన) అనే లోకోక్తి ఉంది.
* ఈ ఖండంలో సూర్యుడు ఉత్తరాన ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతంలో, దక్షిణాన ఉన్నప్పుడు దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి.
* దక్షిణ అమెరికాలో ఇంచుమించు అన్నిరకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.
* ఉష్ణోగ్రత, ఆర్ద్రత, వర్షపాతంలో వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది.

అడవులు - వన్యజీవులు
* దక్షిణ అమెరికాలోని విస్తృతారణ్యాలు వన్యజీవులతో నిండి ఉంటాయి.
* ఈ ఖండంలోని చాలా భాగం అడవులతో ఉంటుంది.
* ప్రపంచంలోనే అత్యధికంగా గట్టి కలప అమెజాన్ నదీ ప్రాంతంలోని అరణ్యాల్లో లభిస్తుంది.
* అమెజాన్ పరివాహక ప్రాంతం రబ్బరు చెట్లకు ప్రసిద్ధి.
* బ్రెజిల్‌లోని కార్నాబా, పరానా, పైన్ చెట్ల నుంచి మైనం, కొయ్య గుజ్జు లభిస్తుంది.
* మోర్బా ఆకులను తేయాకులలాగా ఉపయోగిస్తారు.
* క్యుబిక్రో చెట్ల నుంచి తాళ్లను పదును చేయడానికి ఉపయోగించే పదార్థాలు వస్తాయి.
* వ్యవసాయం చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో అరణ్యాలను నరికివేస్తున్నారు.
* దక్షిణ అమెరికాలో అనేక రకాల 'వన్యజీవులు' అధికంగా ఉన్నాయి.
* 1500 జాతుల రంగు రంగుల పక్షులను కలిగి ఉండటం వల్ల దీన్ని 'పక్షిఖండం'గా పిలుస్తారు.
* ఇక్కడి చెట్లు రకరకాల వానరాలతో నిండి ఉంటాయి.
* ఎక్కువ ఉన్ని ఉన్న సాలీడు, ఉడత, గుడ్లగూబలను పోలిన కోతులు ఇక్కడ ఉన్నాయి.
* ఇక్కడి సరీసృపాల్లో కొండచిలువ, బోయో పాములు ముఖ్యమైనవి.
* ఆర్మాడిల్లో, పుమా ఈ ఖండంలో ఉండే వింత జీవులు.
* దక్షిణ అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో బరువులు మోయడానికి 'లామా' అనే పొడవైన మెడ ఉన్న జంతువులను ఉపయోగిస్తారు.

 

జనాభా
* దక్షిణ అమెరికా జనాభా 230 మిలియన్ల వరకు ఉంటుంది.
* జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 13 మంది ఉన్నారు. జనాభా విస్తరణలో సమతౌల్యం లేదు.
* ఈ ఖండంలోని సగం ప్రాంతాల్లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు ఇద్దరి కంటే తక్కువ.
* అమెజాన్ పల్లపు ప్రాంతాలు, గయానా మెట్ట ప్రాంతాలు, అటకామా, పెటగోనియా ఎడారుల్లోని చాలా ప్రాంతాలు నిర్జనంగా ఉంటాయి.
* ఈ ప్రాంతాలు మానవ నివాసానికి అనుకూలంగా లేవు.
* దక్షిణ అమెరికాలోని తీరప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ.
* జనాభాలో చాలావరకు రేవు పట్టణాలు, రాజధాని నగరాల్లోనే నివసిస్తున్నారు.
* దక్షిణ అమెరికా ప్రజలు అమెరికన్, ఇండియన్ నీగ్రో, యూరోపియన్ అనే మూడు ప్రధాన జాతులకు చెందినవారు. ఇప్పుడు అక్కడ అనేక మిశ్రమ జాతులవారు ఉన్నారు. ఈ జాతుల్లో మెస్టిజో జాతివారు ఎక్కువ.

 

వ్యవసాయం
* దక్షిణ అమెరికాలో ప్రధానంగా మొక్కజొన్న, గోధుమ, కాఫీ, చెరకు, పత్తిని పండిస్తారు.
* దక్షిణ అమెరికాలో మొక్కజొన్న, గోధుమను ఆహార పంటలుగా పండిస్తారు.
* మొక్కజొన్న తగిన వర్షపాతం ఉన్న కవోష్ణ ప్రాంతాల్లో పండుతుంది.
* బ్రెజిల్, అర్జెంటీనా మొక్కజొన్న ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలు.
* సమశీతోష్ణ మైదానాల్లో గోధుమ పండుతుంది.
* అర్జెంటీనా ప్రధానమైన గోధుమ ఉత్పత్తి ప్రాంతం.
* కాఫీ, చెరకు దక్షిణ అమెరికాలోని ప్రధాన వాణిజ్య పంటలు.
* బ్రెజిల్ ఆర్ధిక పరిస్థితి ఈ పంటలపైనే ఆధారపడి ఉంటుంది.
* ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో, ఎగుమతుల్లో బ్రెజిల్‌కు ప్రముఖ స్థానం ఉంది.
* బ్రెజిల్‌లోని ఈశాన్య ప్రాంతం చెరకు తోటలకు ప్రసిద్ధి.
* బ్రెజిల్‌లో పత్తి కూడా ఒక ప్రధాన పంట.

ఖనిజాలు
* పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, తగరం, నైట్రేట్ దక్షిణ అమెరికాలోని ముఖ్య ఖనిజ సంపద.
* వెనిజులాలో ఖనిజ తైల నిక్షేపాలు అధికంగా ఉన్నాయి.
* ప్రపంచంలో 7వ వంతు ఖనిజతైలం దక్షిణ అమెరికాలోనే ఉత్పత్తి అవుతుంది.
* ముడి ఇనుము నిక్షేపాలు అధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి.
* దక్షిణ అమెరికాలోని ఖనిజ సంపదల్లో రాగి ఒకటిగా చెప్పవచ్చు.
* ప్రపంచంలో అయిదో వంతు రాగి ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది.
* ప్రపంచంలో తగరం ఉత్పత్తిలో బొలీవియా రెండో స్థానంలో ఉంది.
* మేలిరకం నైట్రేట్ల నిక్షేపాలు అటకామా ఎడారి ప్రాంతంలో ఉన్నాయి.
* దక్షిణ అమెరికాలో బాక్సైట్, మాంగనీస్, వెండి, ఆంటిమొని నిక్షేపాలు ఉన్నాయి.

పరిశ్రమలు
* దక్షిణ అమెరికా అపారమైన సహజ సంపద, జలవిద్యుత్ సంపద ఉన్న ఖండం.
* దక్షిణ అమెరికాలో ఇనుము - ఉక్కు, నూలు - వస్త్ర పరిశ్రమ, పంచదార, మాంస సంబంధమైన పరిశ్రమ, నూనెశుద్ధి, రాగి పరిశ్రమలు ముఖ్యమైనవి.
* బ్రెజిల్‌లో ఇనుము, ఉక్కు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ మోటారు వాహనాలు, ట్రాక్టర్లు ముఖ్య ఉత్పత్తులు.
* బ్రెజిల్‌లో నూలు, వస్త్ర పరిశ్రమలు అత్యంత ముఖ్యమైనవి.
* ప్రపంచంలో అధికంగా మాంసం ఉత్పత్తి చేసే దేశాల్లో అర్జెంటీనా ఒకటి.
* అర్జెంటీనాలో ప్రధాన పారిశ్రామిక వృత్తులు - మాంసం ఎగుమతులు, ఆహార సంబంధ పరిశ్రమ, తోళ్లను పదును చేసే పరిశ్రమలు.
* రసాయన పదార్థాలను, మందులను అర్జెంటీనా ఉత్పత్తి చేస్తోంది.
* ఇక్కడ సిమెంట్ కర్మాగారాలు, నూనెశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.
* వెనెజులాలో నూనెశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.
* దక్షిణ అమెరికాలో కాగితం, రబ్బరు, విద్యుత్ పరికరాలను తయారు చేసే పరిశ్రమలు, రాగిని శుద్ధి చేసే కర్మాగారాలు ఉన్నాయి.

 

రవాణా సౌకర్యాలు
* దక్షిణ అమెరికాలో రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందలేదు.
* ఇక్కడ విస్తృతమైన అరణ్యాలు, ఎత్తైన పర్వత శ్రేణులు రవాణా సౌకర్యాల అభివృద్ధికి అవరోధాలుగా ఉన్నాయి.
* ప్రధాన రైలు, రోడ్డు మార్గాలు అర్జెంటీనా, బ్రెజిల్‌లో ఉన్నాయి.
* ఈ మార్గాలు చాలా వరకు తూర్పు పడమరగా ఉన్నాయి.
* ప్రపంచంలోని ఎత్తైన రైలు మార్గాలు చిలీలోని ఆండిస్ పర్వతాల మీదుగా వెళ్తున్నాయి.
* దక్షిణ అమెరికాలో వాయు మార్గాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
* బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ దేశాల రాజధానులను కలుపుతూ కొన్ని అంతర్జాతీయ వాయు మార్గాలుఉన్నాయి.

 

వాణిజ్యం - ఎగుమతి - దిగుమతులు
* దక్షిణ అమెరికాలో ఆర్ధికస్థితి అంతర్జాతీయ వ్యాపారంపై ఆధారపడి ఉంది.
* వ్యవసాయ, ఖనిజ, అటవీ ఉత్పత్తులు దక్షిణ అమెరికా ప్రధాన ఎగుమతులు.
* దిగుమతుల్లో తయారైన వస్తువులు ముఖ్యమైనవి.
* కాఫీని ఎగుమతి చేసే దేశాల్లో బ్రెజిల్ ముఖ్యమైంది.
* మాంసం ఉత్పత్తులు, గోధుమ అర్జెంటీనా ప్రధాన ఎగుమతులు.

అంటార్కిటికా ఖండం

దక్షిణార్ధ గోళంలో 'అంటార్కిటిక్' వలయం లోపల దక్షిణ ధృవాన్ని ఆవరించి ఉన్న విశాల ప్రదేశాన్ని 'అంటార్కిటికా' ఖండం అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అయిదో పెద్ద ఖండం.
* ఈ ఖండంలో ప్రపంచంలోని అత్యల్ప ఉష్ణోగ్రత, వర్షపాతం నమోదు అవుతుంది.
* ప్రపంచంలో కెల్లా అతి తీవ్రమైన తుపానులు ఈ ఖండంలోనే సంభవిస్తాయి. ఈ ఖండం సగటు ఎత్తు మిగిలిన అన్ని ఖండాల కంటే ఎక్కువ.
 

స్థలాకృతి
* అంటార్కిటికా ఖండంలో సుమారు 98 శాతం ప్రాంతం దళసరి మంచు పొరతో కప్పి ఉంటుంది. ప్రపంచంలోని 90 శాతం మంచును, 75 శాతం మంచినీటిని కలిగి ఉంది.
* ఈ ఖండంలో మంచు కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు 55 మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది.
* ఇదే జరిగితే సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు నీట మునుగుతాయి.
* ఈ ఖండంలో మంచుపొరల ఎత్తు గరిష్ఠంగా 4,500 మీటర్లు, కనిష్ఠంగా 3,000 మీటర్లు ఉంటుంది.
* ప్రపంచంలో అతిపెద్ద హిమానీనదాలైన 'లాంబార్డ్', 'బియర్డ్ మోల్' ఈ ఖండంలోనే ఉన్నాయి.
* ఈ ఖండంలోని పలుచని మంచుపొరలు సముద్ర జలాల్లోకి విస్తరిస్తాయి.
* మంచుతీర అంచులు సుమారు 200 మీటర్ల మందాన్ని కలిగి ఉంటాయి.
* సమతలంగా ఉండే ఈ అంచుల్లోని విశాల భాగాలు తీరం నుంచి దూరంగా కొట్టుకుపోతాయి. వీటిని మంచు కొండలు అంటారు.
* ప్రపంచంలో అతిపెద్ద మంచు కొండను 1956లో పసిఫిక్ మహాసముద్ర దక్షిణ ప్రాంతంలో గుర్తించారు.
* ఈ మంచుకొండ 31,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి, పరిమాణంలో ఐరోపా ఖండంలోని బెల్జియం దేశం కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది.
* ఇది సముద్ర మట్టం నుంచి సుమారు 2,250 మీటర్ల సగటు ఎత్తు కలిగి, ఖండాలన్నింటిలో కెల్లా ఎత్తుగా ఉంటుంది.
* 5,140 మీ. ఎత్తు కలిగిన 'విన్‌సన్ రైజింగ్' అనే పర్వత శిఖరం ఈ ఖండంలోనే ఎత్తయిన ప్రదేశం.
* 3,050 కిలోమీటర్ల పొడవైన ట్రాన్స్ అంటార్కిటిక్ పర్వతాలు ఈ ఖండాన్ని తూర్పు అంటార్కిటికా, పశ్చిమ అంటార్కిటికా అని పిలిచే రెండు నైసర్గిక మండలాలుగా విభజిస్తున్నాయి.
 

శీతోష్ణస్థితి
* అంటార్కిటికా అతి శీతల ఖండం.
* చలికాలం (ఆగస్టు ఆఖరు)లో ప్రపంచంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
* తీర ప్రాంతాల్లో -20oC ఖండాంతర్గత ప్రాంతాల్లో -70oC ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.
* 1983, జులైలో వోస్టక్ స్టేషన్ వద్ద -89.2oC ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ప్రపంచంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత.
* వేసవి కాలంలో 0oC నుంచి 17oC ఉష్ణోగ్రత ఉంటుంది.
* అంటార్కిటికా తీర ప్రాంతాల్లో అతి తీవ్రమైన, దట్టమైన చలి గాలులు వీస్తాయి. వీటినే 'కెటబాలిక్' పవనాలు అంటారు.
* ఒక్కోసారి ఈ పవనాలు అకస్మాత్తుగా గంటకు 225 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో వీచి, మంచు తుపానులుగా ఏర్పడతాయి.
* 1960, డిసెంబరు 9న 'మౌసన్' స్టేషన్ వద్ద సంభవించిన మంచు తుపాను వల్ల విమానం ప్రమాదానికి గురై, చిన్నాభిన్నం అయ్యింది.
* అంటార్కిటికా ఖండం ప్రపంచంలో కెల్లా అత్యంత శుష్క ప్రాంతం.
* ఈ ఖండంలోని 'శుష్కలోయలు' అనే ప్రాంతంలో సుమారు 20 లక్షల సంవత్సరాల నుంచి ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు.
* ఖండాంతర్గత ప్రాంతాల్లో పొడిగా ఉండే మంచు సంభవించే అవపాతం 5 సెం.మీ.. సంవత్సర కాలాన్ని వెలుతురు, చీకటి రెండు అర్ధ భాగాలుగా విభజిస్తారు.
* దక్షిణ ధృవం వద్ద సూర్యుడు సెప్టెంబరు 23న ఉదయించి, మార్చి 21న అస్తమిస్తాడు.
* ధృవాల నుంచి భూమధ్య రేఖకు వెళ్లేకొద్దీ అక్షాంశాలను బట్టి వెలుతురు, చీకటి మారుతూ ఉంటాయి.
* ఆకాశంలో రంగుల చారలు ఏర్పడే అరోరా ఆస్ట్రాలిన్, అనేక నక్షత్రాల నుంచి ప్రసరించే మసక వెలుతురు కారణంగా సూర్యోదయం సంభవించి ఆరు నెలల వరకు చీకటి ఏర్పడదు.
 

సహజ వృక్ష సంపద
* ఇక్కడి వాతావరణం, శీతోష్ణ పరిస్థితుల కారణంగా మొక్కలు పెరగవు.
* దీనివల్ల అంటార్కిటికా 'ప్రపంచంలోనే వృక్షాలు లేని ఏకైక ఖండం'గా రికార్డులకెక్కింది.
* ఈ ప్రాంతంలో సుమారు 400 రకాల పాకుడు జాతి మొక్కలు దుర్భర పరిస్థితులను తట్టుకుని శిలలపై పెరుగుతున్నాయి.
* వీటితో పాటు నాచు, పూల మొక్కలను కూడా ఇక్కడ గుర్తించారు.
 

స్థానిక జంతు సంపద
* ఈ ఖండం ఉపరితలంపై జంతు సంపద ఎంత తక్కువుగా ఉంటుందో, దాని తీరప్రాంత సముద్ర జలాల్లో అంత ఎక్కువగా ఉంటుంది.
* అతి శీతల అంటార్కిటిక్ సముద్ర జలాల్లో జీవించే జంతుజాలానికి చర్మం దిగువన ఒక దళసరి కొవ్వు పొర ఉంటుంది.
* సీల్ మృగాలు, తిమింగలాలు ఈ జలాల్లో అనేక రకాల జంతువుల్లో ప్రధానమైనవి.
* ఇక్కడ అనేక రకాల 'పెంగ్విన్' పక్షులు ఉన్నాయి. ఇవి అంటార్కిటిక్ పక్షి సంతతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
* గుడ్లు పొదగడానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో ఈ పక్షులు వాటికి అనుకూల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సమూహాలుగా నివసిస్తాయి.
* ఇలాంటి సమూహాలను 'రూకరీలు' అంటారు.
* ఈ ఖండంలోని సముద్రజలాల్లో విరివిగా పెరిగే జంతువు 'క్రిల్'. ఇది 'రొయ్య'ను పోలి ఉంటుంది.
* ఈ జలాల్లో నివసించే అనేక రకాల జంతువులకు, భూభాగంపై నివసించే పక్షులకు 'క్రిల్' ప్రధాన ఆహారం.
* ఏడాదికి 5 నుంచి 6 కోట్ల టన్నుల 'క్రిల్' జంతువులు వేటకు గురవుతాయని కొంత మంది అంచనా.
* ఇది పర్యావరణ సమతౌల్యానికి భంగం కలిగించవచ్చు.
* ఈ ఖండంలో నిర్వహించిన శాస్త్రీయ పరిశోధనల్లో ఇవే మొదటి క్షీరదాలని తేలింది.
* అంతేకాకుండా అతిపెద్ద రాక్షస బల్లుల శిలాజాలు ఉన్నట్లు వెల్లడైంది.
* ఈ శిలాజాలు సుమారు 14 కోట్ల సంవత్సరాల క్రితానికి చెందినవనీ... అప్పట్లో ఈ ఖండం మీద వెచ్చని శీతోష్ణస్థితి ఉండేదని కనుక్కున్నారు.
 

ఖనిజ సంపద
* ఈ ఖండంలో నేలబొగ్గు, రాక్ ఫాస్ఫేట్‌లతో పాటు యాంటీమొని, క్రోమియం, రాగి, బంగారం, గెలీనా, సీసం, మాలిబ్డినం, తగరం, యశదం లాంటి ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు.
* ఇటీవల పరిశోధనల్లో అంటార్కిటికా మహాసముద్ర భూతలంపై దక్షిణ పసిఫిక్, దక్షిణ అట్లాంటిక్ ప్రాంతాల్లో ఫెర్రో మాంగనీస్ గుళికలు ఉన్నట్లు కనుక్కున్నారు.
 

శాస్త్రీయ పరిశోధనలు
* ప్రస్తుతం అమల్లో ఉన్న 'అంటార్కిటికా సంధి' అని పిలిచే అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం.. ఈ ఖండం రాబోయే 50 ఏళ్ల వరకు ప్రకృతి సాధించిన అతిపెద్ద సహజ పరిశోధనాగారంగా ఉంది.
* ఈ పరిశోధనాగారంలో భూగోళం శీతోష్ణస్థితి, అనేక ఇతర బహుళ ప్రయోజనకర రంగాల్లో భారత్‌తో పాటు, ఇతర దేశాల శాస్త్రవేత్తలు పరస్పర సహకారంతో తమ శాస్త్రీయ పరిశోధనలను కొనసాగిస్తున్నారు.
* అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఖండంలో 1957 - 1958 సంవత్సరాల నుంచి శాస్త్రీయ పరిశోధనలను చేస్తున్నప్పటికీ, మనదేశం ఈ రంగంలో 1981లో ప్రవేశించింది.
* భారతదేశ శాస్త్రజ్ఞులు అంటార్కిటికాలో నివసించి పరిశోధనలు చేసేందుకు వీలుగా 'దక్షిణ గంగోత్రి', 'మైత్రి' పరిశోధనా కేంద్రాలను ఏర్పాటుచేశారు.
 

విహారయాత్ర సామర్థ్యం
* ఈ ఖండం ఇప్పటివరకు కాలుష్యానికి గురికాని అపార దృశ్య వనరులను కలిగి ఉంది.
* ఇక్కడ ఎంతో కాలం పాటు ఆర్థికంగా, లాభసాటిగా ఉండే విధంగా విహారయాత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి.
* ప్రస్తుతానికి అంటార్కిటికా ఖండం ప్రపంచ దేశాలన్నింటికీ పరిశోధనా రంగ సత్ఫలితాలను, స్నేహాన్ని మాత్రమే ఎగుమతి చేస్తుంది.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌