• facebook
  • whatsapp
  • telegram

అనాలజీ

అనాలజీ అంటే సారూప్యత/ పోలిక అని అర్థం వస్తుంది.

ఈ విభాగంలో పదాలు/ అక్షరాలు / సంఖ్యలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతారు. దీని ఆధారంగా వీటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:

1) పద అనాలజీ

2)  అక్షర అనాలజీ

3) సంఖ్య అనాలజీ

పద అనాలజీలో జనరల్‌ నాలెడ్జ్‌పై అలాగే అనుదిన జీవితంలోని విషయాలపై కామన్‌ సెన్స్‌ను పరీక్షించేలా ప్రశ్నలు ఇస్తారు. కొన్నిసార్లు ఆంగ్ల పదజాలంపై పరిజ్ఞానం కూడా అవసరమవుతుంది. అక్షర అనాలజీలో అక్షరాల స్థానాలను గుర్తుంచుకోవాలి. ఇవి కోడింగ్‌ డీకోడింగ్‌లోని ప్రశ్నల్లాగే ఉంటాయి. సంఖ్య అనాలజీలో వర్గాలు, ఘనాలు లాంటి వాటిని అభ్యర్థి నేర్చుకోవాలి. వీటి ఆధారంగా కూడా ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు అడిగే విధానాన్ని బట్టి 5 రకాలుగా వర్గీకరించవచ్చు.  


మొదటి రకం

రెండు జతల రూపంలో పదాలు/ అక్షరాలు/ సంఖ్యలు ఇస్తారు. ఆ నాలుగింటిలో ఒక స్థానంలో ప్రశ్న గుర్తు ఉంటుంది. ఇచ్చిన జతలో మొదటిదానికి, రెండోదానికి మధ్యలో ఉన్న సంబంధాన్ని పోలిన సంబంధమే మిగిలిన జతలో ఉండేలా సరైన జవాబును గుర్తించాలి.

ఉదా:

1. ఆభరణం : గోల్డ్‌ :: ఫర్నీచర్‌ : ?

   a)  చెక్క        b)  మంచం    c) కార్పెంటర్‌      d)  చెట్టు

                                          సమాధానం: a

వివరణ: పై ఉదాహరణలో ఆభరణం అనే మొదటిది, రెండవ స్థానంలోనున్న గోల్డ్‌ నుంచి తయారవుతుంది. అదేవిధమైన సంబంధాన్ని రెండో జత పదాల్లో మొదటిదైన ఫర్నీచర్‌ దేని  నుంచి తయారవుందో దాన్ని మనం గుర్తించాలి.   ఫర్నీచర్‌ చెక్క నుంచి తయారవుతుంది.

    ముడి ఖనిజం ⇾ గోల్డ్‌ ⇾ ఆభరణం

    చెట్టు ⇾   చెక్క ⇾  ఫర్నీచర్‌

ఇక్కడ జవాబును చెట్టుగా గుర్తించకూడదు. ఎందుకంటే ఫర్నీచర్‌ నేరుగా చెట్టునుంచి తయారవ్వదు. అంటే దానికి వెంటనే ముందున్న ముడిసరకు ఏమిటో ఇచ్చిన జతలో తీసుకున్నాడు కాబట్టి అదే సంబంధాన్ని మనం గుర్తించాలి.

2.  QDXM : SFYN :: UIOZ : ?
a) WKPA   b) QNLA   c) LPWA   d) PAQM

                                     సమాధానం: a

వివరణ: 

మొదటి, రెండు అక్షరాలు రెండు స్థానాల ముందుకు కదిలాయి. మూడు, నాలుగో స్థానాల్లోని అక్షరాలు ఒక స్థానం ముందుకు జరిగాయి.

3.    42 : 56 :: 110 :   ?

a) 18     b) 132     c) 136     d) 140

                              సమాధానం: b
వివరణ:

 

 వరుస సంఖ్యల లబ్ధాన్ని తీసుకున్నారు. మొదటి దానికంటే, రెండో సంఖ్యకు ఒకస్థానం పెరిగింది. అదే సంబంధాన్ని రెండో జతకు కూడా అన్వయించాలి.


రెండో రకం

ప్రశ్నలో ఒక జత పదాలు/ అక్షరాలు/ సంఖ్యలు ఇచ్చి ఐచ్ఛికాల్లో (ఆప్షన్స్‌) కూడా జత చొప్పున ఇస్తారు.  ప్రశ్నలో ఇచ్చిన జతలో మొదటి దానితో, రెండో దానికి మధ్య ఉన్న సంబంధం అదే క్రమం ఎందులో ఉంటే అదే జవాబు.

4.    ప్రొఫెసర్‌ : యూనివర్సిటీ

a) పండితుడు : పఠనం  

b) కాలేజీ : లెక్చరర్‌

c) పాఠశాల : టీచర్‌  

d) డాక్టర్‌ : ఆసుపత్రి

                             సమాధానం: d

వివరణ: పై ఉదాహరణలో మొదటి వ్యక్తి తరవాత అతడు పనిచేసే ప్రదేశం ఇచ్చారు. అలాంటి సంబంధం దేనిలో ఉంటుందో అదే మన సమాధానం.

a) వ్యక్తి - అతడు చేసే పని

b)  పని చేసే ప్రదేశం - వ్యక్తి

c) పనిచేసే ప్రదేశం - వ్యక్తి

d) వ్యక్తి - పనిచేసే ప్రదేశం

సరైన క్రమం d  లో ఉంది.

5. BC : FG
a) PQ : ST    b) HI : LM    c) AD : PQ   d) JK : LM

సమాధానం: b


   

  ప్రశ్నలో ఇచ్చిన దానికి సరిగ్గా పోలిన సమాధానం b ఉంది.


6.    11 : 1210

a)    8 : 448         b) 6 : 2160      c) 7 : 1029       d) 9 : 729

సమాధానం: a

వివరణ:  11 : 1210

 x : x3 − x2  సంబంధాన్ని కలిగి ఉంది.


    113 - 112 = 1331 -  121 = 1210

    అలాగే    8 : 448

 8 : 83 - 82 = 512 - 64 = 448


 

మూడో రకం

కొన్ని (సాధారణంగా 3 లేదా 4్శ పదాలు/అక్షరాలు/ సంఖ్యలు ఇస్తారు. అవన్నీ ఒక సహజ లక్షణాన్ని కలిగి ఉంటాయి. వాటిని పోలిన దాన్ని ఇచ్చినవాటిలో నుంచి ఎన్నుకోవాలి.

ఉదా:

7. ముంబయి : కలకత్తా : మంగళూరు : ?

a)  హైదరాబాద్‌     b) కొచ్చిన్‌     c) దిల్లీ     d) జైపూర్‌

                               సమాధానం: b

వివరణ: ప్రశ్నలో ఇచ్చిన అన్ని నగరాల్లో ఓడరేవులు ఉన్నాయి. ఆ విధంగా ఓడరేవును కలిగిఉన్నది కొచ్చిన్‌ మాత్రమే. అందుకే అదే సమాధానం.


8.   CEG : KMO : PRT : ?
a) STV   b) BDG    c) FJH    d) LNP

                              సమాధానం: d 

ప్రశ్నలోని    అక్షరాల మధ్యలో ఒక అక్షరం లేదు. అలాంటిది d లో మాత్రమే ఉంది.

9. 343 : 1331 : 2197 : ?

a) 2744   b) 3375   c) 125   d) 729

                           సమాధానం: c

వివరణ:     ప్రశ్నలో ఇచ్చినవన్నీ ప్రధాన సంఖ్యల ఘనాలు. 125 అనేది 5 ఘనం. కాబట్టి అదే సమాధానం.

నాలుగో రకం

కొన్ని పదాలు/ సంఖ్యలు/ అక్షరాలను ఇస్తారు. వాటన్నింటిలో ఒక సహజ లక్షణం ఉంటుంది. పరీక్షార్థి ఆ సహజ లక్షణాన్ని గుర్తించి దాన్ని సమాధానంగా ఎంచుకోవాలి.

ఉదా:  


10. రాఖీ : అపలేచియన్‌ : ఆండీస్‌

 a)  పర్వత శ్రేణులు  b) సరస్సులు  c) శిఖరాలు        d) కనుమలు

                                 సమాధానం: a

ఇచ్చినవన్నీ వివిధ దేశాల్లోని పర్వతశ్రేణులు


11. E: I : O

a)  అన్నీ అచ్చులు     b)  అన్నీ హల్లులు  c) ప్రధాన సంఖ్యల స్థానంలో ఉండేవి.   d) సరిసంఖ్యల స్థానంలో ఉండేవి.

                             సమాధానం: a

వివరణ: ప్రశ్నలో ఇచ్చిన అక్షరాలన్నీ అచ్చులే.


12. 64 : 256 : 1024 : ?

 a) 4096      b) 81     c) 1296     d)625

                             సమాధానం: a


వివరణ: ప్రశ్నలో ఇచ్చినవన్నీ 4 కు ఘాతాలే.

 64  :  256  :  1024

 43   :   44   :    45   అలాగే 46 = 4096 

అయిదో రకం

ఇది రెండోరకాన్ని పోలిఉంటుంది. కానీ ఇందులో 3 లేదా 4 పదాలు ఇస్తారు. అలాంటి సంబంధాన్ని పోలిన సమూహాన్నే ఎన్నుకోవాలి.

13. తరగతి : పాఠశాల : విద్యార్థి

a) బంతి : బ్యాట్‌ : పిచ్‌

b) సోదరి : కుటుంబం : సోదరుడు

c) చేయి : శరీరం : వేలు

d) ఆకు : చెట్టు : వేరు

సమాధానం: c

విద్యార్థి తరగతిలో భాగం. తరగతి పాఠశాలలో భాగం అవుతుంది. అదే విధమైన సంబంధాన్ని కలిగింది c లో ఉంది. 

గమనిక: పై ఐదు రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నా, మొదటి, రెండో రకాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌