* ప్రశ్నలోని రెండు భాగాల్లో మొదటి రెండు పదాల మధ్య ఉండే సంబంధం/పోలిక ఆధారంగా సమాధానాన్ని గుర్తించాలి.
1. ఫ్యాక్టరీకి కార్మికుడిలా ల్యాబొరేటరీకి ......?
1) ఉద్యోగి 2) శాస్త్రవేత్త 3) టెస్ట్‌ట్యూబ్ 4) డాక్టర్
సమాధానం: 2
సాధన: ఫ్యాక్టరీలో పని చేసేది కార్మికుడు అయితే ల్యాబొరేటరీలో పనిచేసేది శాస్త్రవేత్త.
2. రైతు : నాగలి : : డాక్టర్ : ?
1) దుస్తులు 2) డబ్బులు 3) బిల్డింగ్ 4) స్టెతస్కోప్
సమాధానం: 4
సాధన: రైతుకు పొలం సాగు చేయడానికి నాగలి అవసరమైతే డాక్టర్‌కు రోగిని పరీక్షించడానికి స్టెతస్కోప్ అవసరం.
* దీనిలో రెండు భాగాలకు ఒకే భాగాన్ని ఇస్తారు. అదే సంబంధం గల రెండో భాగాన్ని సమాధానంగా గుర్తించాలి.
1. గాలం : చేప : : ?
1) సింపోజియం : మ్యూజిక్ 2) గ్లౌజ్ : బంతి
3) స్టేడియం : ఆటలు 4) స్థలం : సభావళి
సమాధానం: 2
సాధన: చేపను గాలంతో పట్టుకుంటారు అలాగే బంతిని పట్టుకోవడానికి గ్లౌజ్ అవసరం.
2. ప్రయోగశాల : క్రిములు : : ?
1) గ్రంథాలయం : పుస్తకాలు 2) పాఠశాల : విద్యార్థులు
3) వేదశాల : గ్రహాలు 4) ఆటస్థలం : ఆటలు
సమాధానం: 3
సాధన: క్రిముల గురించి ప్రయోగశాలలో అధ్యయనం చేస్తారు అలాగే గ్రహాల గురించి వేదశాలలో అధ్యయనం చేస్తారు.
* దీనిలో రెండు భాగాల్లో కొన్ని ఆంగ్ల అక్షరాలను ఇస్తారు. ఆ ఆంగ్ల అక్షర క్రమంలోని అంతరం ఆధారంగా సమాధానాన్ని గుర్తించాలి.
1. E : S : : C : ?
1) P 2) R 3) Q 4) S
సమాధానం: 3
2. NFX : PHM : : AXH : ?
1)BYI 2) DAK 3) CZJ 4) DAN
సమాధానం: 3
మాదిరి ప్రశ్నలు
1. డాక్టర్ : ఆసుపత్రి : : టీచర్ : ?
1) పాకశాల 2) ప్రయోగశాల 3) కళాశాల 4) కర్మాగారం
సమాధానం: 3
సాధన: డాక్టర్ పని ప్రదేశం ఆసుపత్రి అయితే టీచర్ పని ప్రదేశం కళాశాల.
2. విద్యార్థులు : తరగతి : : మంత్రులు : ?
1) సభ 2) మండలి 3) సమావేశం 4) సమితి
సమాధానం: 2
సాధన: విద్యార్థుల సమూహం తరగతి, మంత్రుల సమూహం మండలి.
3. రచయిత : కలం : : చెఫ్ : ?
1) సూది 2) చాకు 3) రంపం 4) గొడ్డలి
సమాధానం: 2
సాధన: రచయిత ఉపయోగించే సాధనం కలం అయితే చెఫ్‌కు చాకు అవసరం.
4. రచయిత : పుస్తకం : : రైతు : ?
1) పొలం 2) పంట 3) చెట్లు 4) నేల
సమాధానం: 2
సాధన: రచయిత అంతిమ ఫలితం పుస్తకం కాబట్టి రైతు అంతిమ ఫలితం పంట అవుతుంది.
5. ఫర్నిచర్ : కలప : : గోడ : ?
1) విత్తనం 2) సిమెంటు 3) ఇటుక 4) నీరు
సమాధానం: 3
సాధన: ఫర్నిచర్ తయారీకి కలప అవసరమవుతుంది అలాగే గోడ కట్టడానికి ఇటుక కావాలి.
6. పెన్సిల్ : ఎరేజర్ : : కప్ : ?
1) ఆన్సర్ 2) సాసర్ 3) బ్రౌజర్ 4) ప్లేట్
సమాధానం: 2
సాధన: పెన్సిల్ - ఎరేజర్ మాదిరి కప్ - సాసర్ కూడా జంట పదాలు.
7. వ్యాధులు : పాథాలజీ : : రాయడం : ?
1) ఆస్ట్రాలజీ 2) పెడాలజీ 3) వైరాలజీ 4) పాలియోగ్రఫీ
సమాధానం: 4
సాధన: వ్యాధి అధ్యయన శాస్త్రం పాథాలజీ, రాతలను అధ్యయనం చేసే శాస్త్రం పాలియోగ్రఫీ.
8. బోటనీ : ఫిజియోలజీ : : మొక్కలు : ?
1) మానవుడు 2) మానవ శరీరం 3) కళ్లు 4) అస్థిపంజరం
సమాధానం: 2
సాధన: మొక్కల అధ్యయన శాస్త్రం బోటనీ, మానవ శరీరం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఫిజియోలజీ.
9. డిగ్రీలు : ఆంపియర్ : : ఉష్ణోగ్రత : ?
1) ద్రవ్యరాశి 2) విద్యుత్ ప్రవాహం 3) విద్యుత్ నిరోధం 4) యాంగిల్
సమాధానం: 2
సాధన: ఉష్ణోగ్రతకు ప్రమాణం డిగ్రీలు అయితే విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఆంపియర్.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు
1. సమయం : గడియారం : : కాంతి : ?
1) దీపం 2) బుడగ 3) విత్తనం 4) భూమి
2. Engagement : Marriage : : ?
1) Success : Failure 2) Explosion : Destruction
3) Boy : Man 3) Talk : Exaggeration
3. Good : Exacellent : : ?
1) Bad : Immoral 2) Hill : Mountain
3) Caution : careless 4) Jealously : Respect
4. జర్నలిజం : న్యూస్ పేపర్ : : ?
1) కరెన్సీ : అర్థశాస్త్రం 2) భూవిజ్ఞానం : భూమి
3) ద్రవ్యం : బ్యాంకు 4) పాలు : వెన్న
5. 248 : 403 : : 594 : ?
1) 676 2) 295 3) 749 4) 711
6. 17 : 289 : : 25 : ?
1) 262 2) 306 3) 650 4) 625
7. దిగుమతి : ఎగుమతి : : ఖర్చు : ?
1) అప్పు 2) లాభం 3) ఆదాయం 4) లోటు
సమాధానాలు: 1-1; 2-2; 3-2; 4-2; 5-3; 6-4; 7-3.
రచయిత: జేవీఎస్ రావు