• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యం

* ద్రవ్యం అనే పదం 'మానేటా' అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. రోమన్ దేవత 'మనేటా' ఆలయంలో నాణేలు ముద్రించడం వల్ల ఈ పదం వచ్చింది.
* క్రౌథర్ ప్రకారం మానవ కల్పనల్లో ద్రవ్యం అతి ముఖ్యమైంది.

 

నిర్వచనాలు
* 'ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో అదే ద్రవ్యం' - వాకర్
* 'విలువల కొలమానం, వినిమయ సాధనంగా ఉండేది' - క్రౌథర్
* 'సర్వాంగీకారం పొందింది'  - సెలీగ్మన్

ద్రవ్యం లక్షణాలు
* సర్వాంగీకారం
* విభాజ్యత
* సజాతీయత
* వ్యాకోచత్వం
* మూల్య స్థిరత్వం
* గుర్తింపు
* మన్నిక

 

 వస్తు వినిమయ పద్ధతి (Barter System)
* ద్రవ్యం లేని కాలంలో ప్రజలు వస్తు వినిమయ పద్ధతిని పాటించేవారు. వస్తువును ఇచ్చి దానికి బదులు మరో వస్తువును పొందడాన్నే వస్తుమార్పిడి పద్ధతి అంటారు. ఆర్థిక వ్యవహారాలు పెరిగే కొద్దీ ఈ విధానంలో అనేక సమస్యలు వచ్చాయి.
వస్తుమార్పిడి పద్ధతి సమస్యలు
    1. వస్తు విలువల్లో తేడా
    2. కోరికల్లో తేడాలు
    3. విలువల కొలమానంలో తేడా
    4. వస్తువుల అవిభాజ్యత
    5. సంపదను నిల్వ చేయలేకపోవడం
    6. సేవల మార్పిడి కష్టం
    7. వాయిదాల చెల్లింపులు
    8. రవాణా కష్టం

 

ద్రవ్య పరిణామ క్రమం
* వస్తువు
* లోహం
* కాగితం
* పరపతి ద్రవ్యం (చెక్‌లు, క్రెడిట్ కార్డులు)

 

ద్రవ్యం రకాలు
ప్రమాణ ద్రవ్యం: అంతర్గత, బహిర్గత విలువలు సమానంగా ఉంటాయి.
టోకెన్ ద్రవ్యం: బహిర్గత విలువ ఎక్కువగా ఉంటుంది.
ప్రాతినిధ్య ద్రవ్యం: పూర్తిగా బంగారం, వెండికి మారేవి.
పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: 50 పైసల నాణేలను రూ.25 వరకు మాత్రమే అంగీకరించడం.
సమీప ద్రవ్యం: ద్రవ్యానికి దగ్గరగా ఉండేవి.
ఉదా: బాండ్లు, డిబెంచర్లు, చెక్కులు, డీడీలు, ట్రెజరీ బిల్లులు.
పరపతి ద్రవ్యం: బ్యాంకులు సృష్టించే ద్రవ్యం.
చట్టబద్ధ ద్రవ్యం/పియటో ద్రవ్యం: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమల్లో ఉండేవి.
బ్యాంకు ద్రవ్యం: చెక్కులు, డీడీలు
చీఫ్ మనీ: ఆర్థిక వ్యవస్థలో అల్పవడ్డీకి సులభంగా లభించే ద్రవ్యం.
డియర్ మనీ: ఆర్థిక వ్యవస్థలో అధిక వడ్డీకి లభించే ద్రవ్యం.
హాట్ మనీ: దేశంలోకి వచ్చే విదేశి సంస్థాగత పెట్టుబడులు (FII).

ద్రవ్యం విధులు
* ద్రవ్య విధులను కిన్లే 3 రకాలుగా వర్గీకరించాడు.
అవి: 1) ప్రాథమిక
       2) ద్వితీయ
       3) అనుషంగిక

 

ప్రాథమిక విధులు:

a) వినిమయ మాధ్యమం
* వస్తుసేవల క్రయ విక్రయాలకు ద్రవ్యం ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది.
b) విలువల కొలమానం
* అన్ని వస్తుసేవల విలువలను కొలిచే సాధనంగా ద్రవ్యం ఉపయోగపడుతుంది.

 

ద్వితీయ విధులు:
a) విలువల విధి
* కీన్స్ ప్రకారం ద్రవ్య విధుల్లో ముఖ్యమైంది.
* ద్రవ్యం ప్రస్తుత వినియోగం కోసమే కాకుండా భవిష్యత్ వినియోగానికి కూడా ఉపయోగపడటం దీని ముఖ్య ఉద్దేశం.
b) వాయిదా చెల్లింపులు
* రుణాల చెల్లింపులు, స్వీకారం మొదలైనవి వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు ద్రవ్యం ఉపయోగపడుతుంది.
c) విలువల బదిలీ
* ద్రవ్యం విలువను వ్యక్తులు, ప్రదేశాల మధ్య బదిలీ చేయవచ్చు.

 

అనుషంగిక విధులు:
a) జాతీయ ఆదాయ పంపిణీ, మదింపు
b) పరపతి వ్యవస్థ మూలం
c) ఉపాంత ప్రయోజనాల సమానత్వం
d) సంపదకు ద్రవ్యత్వాన్ని కల్పించడం
* 'చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణి నుంచి తరిమేస్తుంది' - గ్రేషమ్స్‌లా

 

ద్రవ్యోల్బణం
* నిరంతరం ధరలు పెరిగే ప్రక్రియను ద్రవ్యోల్బణం అంటారు. అంటే ద్రవ్యం విలువ తగ్గుదల అని చెప్పవచ్చు. సామాన్యుడు సాధారణ ధరల స్థాయి పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా భావిస్తాడు.

ద్రవ్యోల్బణం రకాలు
* ద్రవ్యోల్బణం కింది నాలుగు అంశాల ఆధారంగా వివిధ రకాలుగా ఉంటుంది. అవి:
1) ధరల పెరుగుదల శాతం
2) నియంత్రణ
3) ద్రవ్యం, ప్రసార వేగం
4) ధరల పెరుగుదల కారణం

 

ధరల పెరుగుదల శాతం ఆధారంగా రకాలు
* పాకుతున్న ద్రవ్యోల్బణం      -       2% - 3% ధరల పెరుగుదల
* నడుస్తున్న ద్రవ్యోల్బణం       -        4% - 5% ధరల పెరుగుదల
* పరిగెత్తే ద్రవ్యోల్బణం             -          5% - 10% ధరల పెరుగుదల
* ఉరకలు వేసే ద్రవ్యోల్బణం    -        10% - 100% ధరల పెరుగుదల

 

నియంత్రణ ఆధారంగా ద్రవ్యోల్బణం రకాలు
బహిరంగ ద్రవ్యోల్బణం: ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనందు వల్ల ధరలు పెరిగితే దాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటారు.
అణిచివేయబడిన ద్రవ్యోల్బణం: ప్రభుత్వ జోక్యం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని అణిచివేయబడిన ద్రవ్యోల్బణం అంటారు.

 

ద్రవ్యం, ప్రసార వేగం ఆధారంగా
ద్రవ్య ద్రవ్యోల్బణం: ద్రవ్యం పెరుగుదల వల్ల ధరలు పెరిగితే దాన్ని ద్రవ్య ద్రవ్యోల్బణం అంటారు.
ధరల ద్రవ్యోల్బణం: ద్రవ్య ప్రసార వేగం పెరుగుదల వల్ల ధరల్లో మరింత పెరుగుదల వస్తే దాన్ని ధరల ద్రవ్యోల్బణం అంటారు.

 

ద్రవ్యోల్బణానికి కారణాలు

* ఇది రెండు కారణాల వల్ల ఏర్పడుతుంది.
1) డిమాండ్ పెరుగుదల
2) సప్లయి తగ్గుదల

డిమాండ్ పెరుగుదలకు కారణాలు

* జనాభా పెరుగుదల
* ఆదాయంలో పెరుగుదల
* వినియోగంలో పెరుగుదల
* ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల
* లోటు బడ్జెట్
* ప్రభుత్వ రుణాల చెల్లింపులు
* ఎగుమతుల్లో వృద్ధి
* నల్లధనంలో వృద్ధి
* పరపతిలో వృద్ధి

 

సప్లయి తగ్గుదలకు కారణాలు
* ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, కరవులు, భూకంపాలు)
* ఉత్పత్తి కారకాల కొరత
* బ్లాక్ మార్కెటింగ్
* పన్నుల్లో పెరుగుదల
* వ్యవసాయ క్షీణత
* పారిశ్రామిక రంగ క్షీణత
* ప్రజల ముందస్తు కొనుగోళ్లు
* అంతర్జాతీయ మార్పులు

 

 ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం ప్రభావం
* వినియోగం తగ్గుతుంది.
* ఉత్పత్తి - పెట్టుబడిదారుల లాభాలు పెరుగుతాయి.
* పంపిణీ - ఆదాయ పంపిణీ అసమానతలు పెరుగుతాయి.
* దిగుమతులు పెరుగుతాయి.

 

ద్రవ్యోల్బణం వల్ల లాభం పొందే వర్గాలు
* రుణగ్రహీతలు, భూస్వాములు
* వ్యాపారస్థులు, బ్లాక్ మార్కెటర్స్
* ఉత్పత్తిదారులు, ధనిక/సంపన్న వర్గం

 

నష్టం పొందే వర్గాలు
* రుణదాతలు
* వినియోగదారులు
* స్థిర ఆదాయం పొందేవారు
* స్థిర ఆదాయం పొందేవారిలో కిందివారు ఉంటారు.
    a) పెన్షనర్లు
    b) స్థిర వడ్డీ పొందే డిపాజిటర్స్
    c) పేదలు, కూలీలు
    d) శ్రామికులు
    e) వేతన ఉద్యోగులు
    f) డిబెంచర్లు, బాండ్లలో పెట్టుబడి పెట్టేవారు

 

ద్రవ్యోల్బణం నివారణ చర్యలు
* ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని ద్రవ్యపరమైన చర్యలు, కోశ విధాన చర్యలు, ఇతర చర్యలు వంటి అంశాల ఆధారంగా నివారించవచ్చు.

 

ద్రవ్యపరమైన చర్యలు
* రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరమైన చర్యల ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని నివారిస్తుంది.
అవి: 1) బ్యాంక్ రేటును పెంచుతుంది
        2) CRRను పెంచుతుంది
        3) SLRను పెంచుతుంది
        4) మార్జిన్లను పెంచుతుంది
        5) ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది

 

కోశపరమైన చర్యలు
* కోశ విధాన చర్యలను ప్రభుత్వం తీసుకుని ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది.
1) పన్నులు పెంచుతుంది.
2) వ్యయాలను తగ్గిస్తుంది.
3) రుణాలు తీసుకుంటుంది.
4) మిగులు బడ్జెట్‌ను అనుసరిస్తుంది.

 

ఇతర చర్యలు
1) కొరతగా ఉన్న వస్తువుల ఎగుమతుల్ని నిషేధిస్తుంది.
2) వేతనాలను క్రమబద్ధం చేస్తుంది.
3) ధరలకు గరిష్ఠ పరిమితిని విధించడం.
4) వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తుల పెంపుకు చర్యలు తీసుకోవడం

 

ఇతర అంశాలు
1) ప్రతి ద్రవ్యోల్బణం (Deflation) - ధరల్లో తగ్గుదల
2) ప్రతి ద్రవ్యోల్బణం పంథా (Reflation) - ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ధరలను పెంచే చర్యలు తీసుకోవడం.
3) ద్రవ్యోల్బణం పంథా (Dis-Inflation) - ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ధరలను తగ్గించే చర్యలు తీసుకోవడం.
4) ద్రవ్యోల్బణం స్తంభన (Stagflation) - దీన్ని శామ్యులోనన్ తెలిపారు. ఇది స్టాగ్‌నేషన్, ఇన్‌ఫ్లేషన్ అనే రెండు పదాల వల్ల ఏర్పడింది. ఇది ఉత్పత్తి స్తబ్ధత (నిరుద్యోగ పెరుగుదల) ధరల పెరుగుదల స్థితిని తెలియజేస్తుంది.
5) ఫిలిప్స్ వక్రరేఖ ధరల పెరుగుదల, నిరుద్యోగిత మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌